చిలీలో బైబిలు స్టడీ చేస్తున్నారు
ఇలా ఇవ్వవచ్చు
భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? (T-31)
ప్రశ్న: కుటుంబం, స్నేహితులతో ఆనందంగా ఉంటూ మంచి సంతృప్తినిచ్చే పనులు చేసుకుంటూ జబ్బులు, బాధలు లేకుండా ఎప్పుడూ అలానే ఉండే జీవితాన్ని మీరు చూడాలని అనుకుంటున్నారా?
వచనం: కీర్త 37:11, 29
ఇలా చెప్పవచ్చు: ఇది ఎలా జరుగుతుందో ఈ చిన్న పేపరు వివరిస్తుంది.
సత్యాన్ని బోధించండి
ప్రశ్న: మనం ఇప్పుడు పడే బాధలకు కారణం దేవుడా? లేదా వేరే కారణాలు ఉన్నాయా?
వచనం: యోబు 34:10
సత్యం: దేవుడు ఎప్పుడు బాధలు పెట్టడు. వాటికి కారణం ఒక దుష్ట శక్తి. కానీ మనుషులు కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లేదా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉండడం వల్ల కష్టాలు రావచ్చు. మనం బాధపడుతున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయనకు మనమీద నిజంగా శ్రద్ధ ఉంది.
బైబిలు ఎందుకు చదవాలి? (వీడియో)
ప్రశ్న: లోకాన్ని దేవుడే నియంత్రిస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? [వాళ్లను మాట్లాడనివ్వండి.] బైబిలు ఏమి చెప్తుందో మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఈ చిన్న వీడియో చూడండి. [వీడియో ప్లే చేయండి.]
ఇలా చెప్పవచ్చు: దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడో, వాటి విషయంలో ఆయన ఏమి చేయాలని అనుకుంటున్నాడో ఈ బ్రోషురులో 8వ పాఠం వివరిస్తుంది. [దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషురు ఇవ్వండి.]
మీరు ఎలా ఇస్తారో రాయండి
పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.