ఇటలీలో ఇంటింటి పరిచర్య చేస్తున్నారు
ఇలా ఇవ్వవచ్చు
భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు (T-31)
ప్రశ్న: ఆనందాన్ని, సంతృప్తినిచ్చే మంచి పని చేస్తూ, జబ్బులు బాధలు లేకుండా, కుటుంబంతో స్నేహితులతో ఎప్పటికీ బ్రతికి ఉండే మంచి భవిష్యత్తు మీకు చూడాలని ఉందా?
వచనం: కీర్త 37:11, 29
ఇలా చెప్పవచ్చు: అదెలా వస్తుందో ఈ కరపత్రంలో ఉంది.
సత్యాన్ని బోధించండి
ప్రశ్న: ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి?
వచనం: 1 యోహా 5:19
సత్యం: ఈ లోకాన్ని పరిపాలించేది అపవాది అయిన సాతాను.
బైబిలు అధ్యయనం అంటే ఏమిటి?
ఇలా చెప్పవచ్చు: ఇన్ని బాధలు ఎందుకు ఉన్నాయి? నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? లాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకునేలా యెహోవాసాక్షులు ఉచితంగా సహాయం చేస్తారు. ఎలాగో ఈ చిన్న వీడియోలో వివరించారు. [వీడియో చూపించండి.] జవాబులు తెలుసుకోడానికి ఈ పుస్తకాన్ని మనం ఉపయోగించవచ్చు. [స్టడీ చేయడానికి ఉపయోగించే ఏదైనా ఒక ప్రచురణను చూపించండి. వీలైతే, బైబిలు స్టడీ ఎలా చేస్తారో కూడా చూపించండి.]
మీరు ఎలా ఇస్తారో రాయండి
పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.