తువాలులో మళ్లీ బతుకుతారా అనే కరపత్రాన్ని ఇస్తున్నారు
ఇలా ఇవ్వవచ్చు
చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35)
ప్రశ్న: చాలామంది భక్తిపరులు చనిపోయిన వాళ్ల గౌరవంగా వాళ్ల సంవత్సరికాలు చేస్తుంటారు. మనం చనిపోయినవాళ్లను మళ్లీ చూసే అవకాశం ఉందా?
వచనం: అపొ 24:15
ఇలా చెప్పవచ్చు: చనిపోయిన వాళ్లు మళ్లీ బ్రతుకుతారు అన్నప్పుడు మీరు దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో ఈ చిన్న పేపర్లో ఉంది. [వీలైతే చనిపోయిన వాళ్లను మళ్లీ చూసే అవకాశం ఉందా? అనే వీడియో చూపించండి.]
సత్యాన్ని బోధించండి
ప్రశ్న: మనం దేవుని మీద ప్రేమను ఎలా చూపిస్తాము?
వచనం: 1 యోహా 5:3
సత్యం: దేవుని మీద ప్రేమని ఆయన ఆజ్ఞలు పాటించడం ద్వారా చూపిస్తాము.
చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35)
ప్రశ్న: మనిషి 70 లేదా 80 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడు కానీ కొన్ని తాబేళ్లు 150 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కొన్ని చెట్లు అయితే వేల సంవత్సరాలు బ్రతుకుతాయి. మరి మనిషి ఎందుకు అంత తక్కువ కాలం జీవిస్తాడు?
వచనం: ఆది 3:17-19
ఇలా చెప్పవచ్చు: చనిపోయిన వాళ్లను మళ్లీ చూసే అవకాశం ఉందని ఈ కరపత్రం వివరిస్తుంది.]
మీరు ఎలా ఇస్తారో రాయండి
పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.