శుక్రవారం, అక్టోబరు 16
“నీ హృదయాన్ని ఆమె మార్గాల వైపు తిరగనివ్వకు. దారితప్పి ఆమె త్రోవల్లోకి వెళ్లకు.”—సామె. 7:25.
యెహోవాను ఆరాధించే ఎవ్వరికైనా ఏం జరగవచ్చో ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఒక వ్యక్తి ఘోరమైన పాపం చేసి ఆ తర్వాత ఇదంతా “ఉన్నట్టుండి,” “అనుకోకుండా జరిగింది” అని అనుకోవచ్చు. కానీ అతను చేసిన పాపం గురించి ఒకసారి వెనక్కెళ్లి ఆలోచిస్తే, దానికన్నా ముందు అతను కొన్ని తెలివితక్కువ పనులు చేసుండొచ్చు. అతను యెహోవాను ప్రేమించని వాళ్లతో స్నేహం చేయడం, చెడ్డ వినోదాన్ని ఎంచుకోవడం లేదా కొన్నిరకాల వెబ్సైట్లు చూడడం, క్రైస్తవులకు తగని చోట్లకు వెళ్లడం లాంటివి చేసి ఉండవచ్చు. అంతేకాదు, బహుశా అతను ప్రార్థన చేయడం, బైబిలు చదవడం, మీటింగ్స్కి-ప్రీచింగ్కి వెళ్లడం ఆపేసివుండవచ్చు. సామెతలు పుస్తకంలో చర్చించుకున్న యువకునిలాగే ఇతను చేసిన పాపం కూడా “ఉన్నట్టుండి” చేసింది కాదు. మనకేంటి పాఠం? మనం పాపాన్నే కాదు పాపానికి నడిపించే పనుల్ని కూడా చేయకుండా ఉండాలి. సొలొమోను ఆ విషయాన్నే చెప్పాడు.—మత్త. 5:29, 30. w24.07 16 ¶10-11
శనివారం, అక్టోబరు 17
“మట్టి పాత్రల్లో ఈ సంపద మాకు ఉంది.”—2 కొరిం. 4:7.
ఇంతకీ ఆ చెప్పిన సంపద ఏంటి? ప్రజల్ని కాపాడే పని. అంటే రాజ్యం గురించి ప్రకటించే పని. (2 కొరిం. 4:1) ఆ మట్టి పాత్రలు ఎవరు? మంచివార్తను ఇతరులకు చెప్పే దేవుని సేవకులు. పౌలు రోజుల్లో వ్యాపారం చేసేవాళ్లు ఆహారం, ద్రాక్షారసం, డబ్బు లాంటి విలువైనవాటిని మట్టి పాత్రల్లో పెట్టి రవాణా చేసేవాళ్లు. అదేవిధంగా మంచివార్తను ప్రకటించే విలువైన పనిని యెహోవా మనకు అప్పగించాడు. యెహోవా మన వెన్నంటే ఉంటూ ఆ సందేశాన్ని ప్రకటించడానికి కొండంత ధైర్యాన్నిస్తాడు. కొన్నిసార్లు ప్రీచింగ్లో వ్యతిరేకత వస్తుందేమో అని లేదా ప్రజలు వినరేమో అని మనం భయపడుతుండవచ్చు. మరి, అలాంటి భయాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు? ప్రీచింగ్ చేయొద్దని అపొస్తలుల్ని ఆజ్ఞాపించినప్పుడు వాళ్లు చేసిన ప్రార్థన గుర్తుతెచ్చుకోండి. వాళ్లు భయపడి ప్రీచింగ్ ఆపేసే బదులు, వాక్యాన్ని ధైర్యంతో ప్రకటిస్తూ ఉండేలా సహాయం చేయమని యెహోవాను అడిగారు. ఆ ప్రార్థనకు యెహోవా చిటికెలో జవాబిచ్చాడు. (అపొ. 4:18, 29, 31) అలాంటి భయాల వల్ల కొన్నిసార్లు మీరు బిగుసుకుపోతే, ప్రజల మీదున్న ప్రేమ ఆ భయాల్ని ఓడించేలా చేయమని యెహోవాను అడగండి. w24.04 16 ¶8-9
ఆదివారం, అక్టోబరు 18
“పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.”—మత్త. 6:9.
మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి ఆయన పేరును పవిత్రపర్చాలని కోరుకుంటాం. సాతాను యెహోవా పేరుమీద వేసిన నిందలన్నిటినీ తీసేయాలని కోరుకుంటాం. (ఆది. 3:1-5; యోబు 2:4; యోహా. 8:44) అందుకే మనం ప్రీచింగ్లో యెహోవా గురించి నిజాలు చెప్తూ ఆయన పక్షాన ఉంటాం. యెహోవాకున్న గొప్ప లక్షణం ప్రేమ అని, ఆయన పరిపాలన నీతిగా-న్యాయంగా ఉంటుందని, అతి త్వరలోనే ఆయన తన రాజ్యం ద్వారా కష్టాల్ని తీసేసి మనుషులందరికీ శాంతి-సంతోషాల్ని ఇస్తాడని మనం అందరికీ చెప్తాం. (కీర్త. 37:10, 11, 29; 1 యోహా. 4:8) అలా మనం యెహోవా గురించి చెప్పినప్పుడు ఆయన పేరును పవిత్రపరుస్తాం. అంతేకాదు, మన పేరుకు తగ్గట్టుగా జీవిస్తున్నాం అన్న తృప్తి కూడా మనకు ఉంటుంది. w24.05 18 ¶12