గిలియడ్ పట్టభద్రులు “ఇచ్చుటలో ధన్యత” పొందుతారు
మార్చి 6, 1994 ఆదివారంనాడు, యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధానకార్యాలయ బేతేలు కుటుంబం మరియు ఆహ్వానితులు ఒక ఉత్సవ సందర్భం కొరకు అంటే వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 96వ తరగతి విద్యార్థులు పట్టభద్రులవుతున్న సందర్భంగా సమావేశమయ్యారు. యెహోవాసాక్షుల పరిపాలక సభలో దాదాపు రెండు దశాబ్దాల వరకు సేవచేసినవాడు, కార్యక్రమ అధ్యక్షుడు అయిన కార్ల్ ఎఫ్. క్లైన్ తన పరిచయ ప్రసంగంలో 46 మంది విద్యార్థులకు ఇలా చెప్పారు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుటలో ఎక్కువ ఆనందం ఉందని యేసు చెప్పాడు. కాబట్టి మీ మిషనరీ పనిలో మీరు ఎంత ఇస్తే, మీ ఆనందం అంత అధికం అవుతుంది.”—అపొస్తలుల కార్యములు 20:35.
ఉపదేశాన్నిచ్చే వీడుకోలు మాటలు
తర్వాత విద్యార్థులకు కొన్ని ప్రసంగాల పరంపర కొనసాగింది. సేవా విభాగ కమిటీ సభ్యులలో ఒకరైన లియాన్ వేవర్ “సహనం యెహోవాను మహిమపరుస్తుంది” అనే అంశాన్ని వివరించారు. మనమందరం శ్రమల నెదుర్కొంటాము. (2 కొరింథీయులు 6:3-5) సహోదరుడు వేవర్ ఇలా చెప్పారు: “మనం వత్తిడి క్రింద ఉన్నప్పుడు, చాలా సుళువుగా మనపై మనం ఆధారపడతాము.” అయినప్పటికీ, ఆయన విద్యార్థులకిలా గుర్తుచేశారు: “మానవులకు సామాన్యమైయున్న ఏ శ్రమలను మీరు ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ, యెహోవాకు దానిలో ఆసక్తి ఉంటుంది. మీరు సహింపగలిగినదాని కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు.”—1 కొరింథీయులు 10:13.
పరిపాలక సభకు చెందిన లైమన్ స్వింగెల్ ఇచ్చిన తర్వాతి ప్రసంగం యొక్క ముఖ్యాంశం “మీకు నిర్దేశించబడిన పనిని ఎల్లప్పుడు ప్రియంగా కాపాడుకొనండి.” ఎక్కడ జీవించాలి, ఏమి చేయాలి అనేది ఇశ్రాయేలీయులు ఎప్పుడూ ఎంపిక చేసుకోలేదు. ప్రతి తెగవారికి కొంతస్థలం కేటాయించబడేది, లేవీయులు చేయడానికి ప్రత్యేకమైన పనులు నియమించబడేవి. అలాగే, నేడు ప్రత్యేక పూర్తికాల సేవలో ఉన్న అనేకులు అంటే మిషనరీలు, బేతేలు కుటుంబ సభ్యులు తాము ఎక్కడ నివసిస్తాము, ఏ పని చేస్తాము అనేది తమకు తాము నిర్ణయించుకోరు. ఎవరైనా తమకు నిర్దేశించబడిన పనిని గురించి అనిశ్చయ భావాలు కలిగివుంటే అప్పుడేమిటి? సహోదరుడు స్వింగెల్ ఇలా చెప్పారు: ‘మన విశ్వాసమునకు కర్తయైన వానివైపు స్థిరంగా చూస్తూ, ఆయన మాదిరిని సన్నిహితంగా అనుసరిస్తే, మీరు అలసిపోయి విడిచిపెట్టరు.’—హెబ్రీయులు 12:2, 3.
వాచ్‌టవర్ ఫాంస్ కమిటీ సభ్యుడు లీనెర్డ్ పియర్సన్ “దృష్టినిల్పి ఉండండి” అనే అంశంతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయనిలా చెప్పారు: “మీకు శ్రేష్టమైన కెమెరా, మంచి దృశ్యము, చక్కని అనుకూలత ఉన్నప్పటికీ, మీ కెమెరాను సరిగ్గా కేంద్రీకరించకపోతే మీకు మంచి ఫోటో రాదు.” ఒక వైడ్ ఏంగిల్ లెన్స్ వలే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటన పని మన దృష్టిలో ఉండాలి. మనం ఎన్నడు విశాల దృష్టి నుండి తప్పిపోకూడదు. సహోదరుడు పియర్సన్ ఇలా చెప్పారు: “తమపనిలో తమపై తాము దృష్టి నిలుపుకొనే వారు అసంతోషంగా ఉంటారు, యెహోవాపైన, చేయుడని ఆయన వారికిచ్చిన పనిపైనా దృష్టి నిల్పేవారు విజయమొందుతారు.”
పరిపాలక సభ యొక్క మరో సభ్యుడైన జాన్ ఇ. బార్చే ఇవ్వబడిన తరువాతి ప్రసంగముఖ్యాంశం “కృతజ్ఞత కలిగివుండటానికి ఎంతో ఉంది.” “యెహోవా యెడల మీకున్న కృతజ్ఞతా భావాన్ని ఎన్నడూ వీడకండి, మీకు ఏ పని అప్పగించబడినప్పటికీ, మీరు సంతృప్తి కలిగివుండడానికి అది గొప్పమూలము” అని సహోదరుడు బార్ విద్యార్థులకు చెప్పాడు. కృతజ్ఞతా భావం దావీదును ఇలా వ్రాయటానికి పురికొల్పింది: “మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను.” (కీర్తన 16:6) “మీ ప్రతి దిన జీవితంలో యెహోవాకు సన్నిహితంగా భావించడానికి మీకు అటువంటి ఎంతో గొప్ప సంపద ఉంది. మీరు అది ఎంతో అంగీకారమైనదని, మీరు కృతజ్ఞత కలిగివుండవలసినదని దృష్టిస్తున్నంత కాలం యెహోవా మీ నుండి ఆ సంబంధాన్ని తీసివేయడు.”
ఆతర్వాత గిలియడ్ ఉపదేశకుడైన జాక్ రెడ్ఫోర్డ్ “మీరు మీ నాలుకను ఎలా ఉపయోగిస్తారు?” అనే అంశంపై మాట్లాడారు. ఆలోచన లేని మాటలు ఎంతటి నాశనాన్ని తీసుకురాగలవు! (సామెతలు 18:21) నాలుకను ఎలా అదుపులో పెట్టగలం? సహోదరుడు రెడ్ఫోర్డ్ ఇలా సమాధానమిచ్చారు: “మీరు మీ మనస్సుకు తర్ఫీదివ్వాలి, ఎందుకంటే నాలుక మన మనస్సును, హృదయాన్ని ప్రతిబింబిస్తుంది.” (మత్తయి 12:34-37) యేసు ఈ విషయంలో అద్భుతమైన మాదిరినుంచాడు; యెహోవా నామాన్ని ఘనపర్చడానికి ఆయన తన నాలుకను ఉపయోగించాడు. సహోదరుడు రెడ్ఫోర్డ్ ఆ తరగతికి ఇలా చెప్పారు: “నేడు యెహోవా మాటలు వినకపోవుటచేత కలుగు క్షామము ఉంది, యెహోవా యొక్క ఆ మాటలు మీకు తెలుసు. మీకు ‘శిష్యునికి తగిన నోరు’ ఉంది. కాబట్టి మీ నాలుకను ఎల్లప్పుడూ, యెహోవాకు సంపూర్ణంగా సమర్పించబడిన మనస్సు, హృదయాలచేత నడిపించబడేలా చూసుకోండి.”—యెషయా 50:4.
“యెహోవా సన్నిధిలో ఉన్నట్లు మీరు నడుస్తున్నారా?” అనే ప్రసంగంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నొక్కిచెప్పబడింది. స్కూలు రిజిస్ట్రారు, యులిసీజ్ గ్లాస్ ఇలా అన్నారు: “ఒక తండ్రి కుటుంబం కొరకు ఎంతో కష్టపడి పనిచేస్తూ, తన కుటుంబంతో ఎప్పుడూ మాట్లాడకుండా, వారి యెడల వాత్సల్యాన్ని వ్యక్తపర్చకుండా ఉంటే, ఆయన కష్టపడి పనిచేస్తున్నదాని ఉద్దేశం ప్రేమ కాదుగాని కర్తవ్యం నెరవేర్చుటకే అని ఆ కుటుంబం భావించవచ్చు. మన విషయంలో కూడా అది అంతే. మనం దేవుని సేవలో పనిరద్దీ కలిగివుండవచ్చు. కాని మనం ప్రార్థించకపోతే, మనం కేవలం ఒక పనికే సమర్పించబడినవారమౌతాము గాని ప్రేమగల పరలోక తండ్రికి కాదు.”
పరిపాలక సభ సభ్యుడు థియోడర్ జార్స్ “ఎందుకు లక్షలాదిమంది దేవుని ప్రజలతో సహవసిస్తున్నారు” అనే అంశంపై మాట్లాడారు. ప్రతి సంవత్సరం వేలాదిమంది యెహోవా సంస్థలోకి వస్తున్నారు. (జెకర్యా 8:23) యెహోవాసాక్షులను దేవుని ప్రజలుగా ఏది గుర్తిస్తుంది? మొదట, వారు మొత్తం బైబిలు దేవుని వాక్యమని అంగీకరిస్తారు. (2 తిమోతి 3:16) రెండవది, వారు రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉంటారు. (యోహాను 17:16) మూడవది, వారు దేవుని నామాన్ని గూర్చి సాక్ష్యమిస్తారు. (యోహాను 17:26) నాలుగవది, వారు స్వయంత్యాగ ప్రేమను కనబరుస్తారు. (యోహాను 13:35; 15:13) ఈ రుజువుల ఆధారంతో, మనం ధైర్యంగా ‘చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయవచ్చును’—1 పేతురు 2:9.
ఈ ఉత్తేజపర్చే ప్రసంగాల తర్వాత, 46 మంది విద్యార్థులు తమ యోగ్యతాపత్రాలు పొందారు. వారు భూవ్యాప్తంగావున్న 16 దేశాలకు పంపబడ్డారు.
ఒక విభిన్న తరహా మధ్యాహ్న కార్యక్రమము
బేతేలు కమిటీ సభ్యుడు డోనాల్డ్ క్రెబ్స్ మధ్యాహ్నము సంక్షిప్తంగా కావలికోట పఠనాన్ని నిర్వహించారు. తర్వాత “జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది” అనే పేరుగల కార్యక్రమాన్ని పట్టభద్రులు అందజేశారు. (సామెతలు 1:20) వీధి సాక్ష్యం మరియు వ్యాపార ప్రాంతాలలో సాక్ష్యమివ్వడంలో తమకు కలిగిన ఫలవంతమైన అనుభవాలను మరల చేసి చూపారు. తటస్థంగా సాక్ష్యమివ్వడానికి ధైర్యాన్ని కూడగట్టుకునే వారిని యెహోవా నిజంగా ఆశీర్వదిస్తాడు. ఒక పట్టభద్రుడు ఇలా చెప్పాడు: “మమ్మల్ని గురించి కోతకోసేవారైన దూతల చేతుల్లో కొడవల్లుగా భావించడం నాకు ఇష్టం. మన నైపుణ్యాలు ఎంత పదునుగా ఉంటే ఆ దూతలు మనతో అంత ఎక్కువ పనిని చేయిస్తాయి.” (ప్రకటన 14:6ను పోల్చండి.) ఈ తరగతి పట్టభద్రులు పంపబడిన మూడు ప్రదేశాలకు అంటే, బొలివియా, మాల్టా, తైవాన్ వంటి స్థలాలకు ప్రేక్షకులను విద్యాసంబంధ టూరుపై తీసుకువెళ్లిన స్లైడు ప్రదర్శన కూడా విద్యార్థుల కార్యక్రమంలో ప్రదర్శించారు.
తర్వాత, పదహేడు సంవత్సరాలుగా మిషనరీ సేవలోవున్న వాలెస్ మరియు జేన్ లివరెన్స్లను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వారు 1993 అక్టోబర్‌లో వాచ్‌టవర్ ఫాంస్కు ఆహ్వానింపబడ్డారు, ఇప్పుడు సహోదరుడు లివరెన్స్ అక్కడ గిలియడ్ ఉపదేశకునిగా సేవచేస్తున్నారు.
“అర్హులైనవారిని వారి వృద్ధవయస్సులో గౌరవించుట” అనే పేరుగల నాలుగు దృశ్యాల అందింపు ఉండినది. ప్రజలు వృద్ధులయ్యే కొలది, నిరుపయోగంగా, వదిలిపెట్టబడినట్లుగా అవుతామనే భయం వారి ఆత్మవిశ్వాసాన్ని హరించివేయవచ్చు. (కీర్తన 71:9) విశ్వాసంగల అలాంటి పెద్దవారికి సంఘంలోని అందరూ ఎలా మద్దతు ఇవ్వవచ్చో కదిలించే ఈ ప్రసంగం చూపించింది.
ముగింపు పాట, ప్రార్థన తర్వాత, జెర్సీ పట్టణ సమావేశ హాలు మరియు సాటిలైట్ హాళ్లలో హాజరైన 6,220 మంది సేదదీరినట్లు భావించారు. క్రొత నియామకాల్లోవున్న పట్టభద్రుల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఇవ్వడం ద్వారా వచ్చే గొప్ప ఆనందాన్ని వారు పొందుతూనే ఉందురుగాక.
[26వ పేజీలోని బాక్సు]
తరగతి యొక్క సంఖ్యా వివరాలు
ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 9
పని నిర్దేశించబడిన దేశాల సంఖ్య: 16
విద్యార్థుల సంఖ్య: 46
సగటు వయస్సు: 33.85
సత్యములోవున్న సగటు సంవత్సరాలు: 16.6
పూర్తికాల సేవలోవున్న సగటు సంవత్సరాలు: 12.2
[27వ పేజీలోని బాక్సు]
మాల్టాకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడింది
మాల్టాలో అనేక సంవత్సరాల వరకు క్రీస్తుమత సామ్రాజ్యం బైబిలు సత్యాలను అణిచివేసింది. ఫ్రెడరిక్ స్మిడ్లీ, పీటర్ బ్రిడ్ల్ అక్కడికి చివరగా పంపబడిన గిలియడ్ మిషనరీలు, వీరు పూర్వం 1947లో గిలియడ్ ఎనిమిదవ తరగతి నుండి పట్టభద్రులయ్యారు. అయినప్పటికీ, వారు వెళ్లిన కొద్దికాలానికే నిర్భంధించబడి, మాల్టానుండి వెళ్లగొట్టబడ్డారు. యెహోవాసాక్షుల 1948వ వార్షిక పుస్తకం ఇలా నివేదిస్తున్నది: “కేవలం రోమను కాథలిక్ అధికారక్రమం మూలంగా, ఈ ఇద్దరు మిషనరీలు తమ పరిచార పనులను నిర్వర్తించడంలో ఎంత సమయాన్ని గడిపారో, కోర్టులు, అధికారుల చుట్టూ తిరగడంలో అంత సమయాన్ని గడిపారు. మాల్టా కాథలిక్కులకు వర్తిస్తుందని, ఇతరులందరు వెళ్లిపోవాలని మతగురువులు చెబుతారు.” ఇప్పుడు, దాదాపు 45 సంవత్సరాల తర్వాత, 96వ గిలియడ్ తరగతి నుండి నలుగురు మిషనరీలు మాల్టాకు పంపబడుతున్నారు.
[26వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క పట్టభద్రులను చేసే 96వ తరగతి
క్రింది పట్టికలో వరుసలు ముందు నుండి వెనుకకు లెక్కించబడ్డాయి, పేర్లు ప్రతి వరుసలో ఎడమ నుండి కుడికి పట్టిక చేయబడ్డాయి.
(1) ఎలెర్స్, పి.; గీజీ, ఎమ్.; జెల్మెన్, ఎస్.; సూస్పరెగీ, జె.; రో, ఎస్.; జాక్సెన్, కె.; స్కాట్, టి. (2) లేయర్, టి.; గార్సియా, ఐ.; గార్సియా, జె.; ఫెర్నాన్డెజ్, ఎ.; డేవిడ్సన్, ఎల్.; లిడెమాన్, పి.; గిబ్సన్, ఎల్.; జూరెజ్, సి. (3) పూట్స్, సి.; పాస్ట్రానె, జి.; క్లాసెన్, డి.; ఫెర్నాన్డెజ్, ఎల్.; వాల్స్, ఎమ్.; డ్రెసెన్, ఎమ్.; పాస్ట్రానె, ఎఫ్.; బేర్క్స్, జె. (4) బేర్క్స్, డి.; స్కాట్, ఎస్.; జాక్సన్, ఎమ్.; మోరె, హెచ్.; జారెజ్, ఎల్.; సూస్పెరెగీ, ఎ.; బ్రూషన్, సి.; రోవ్, సి. (5) జెల్మెన్, కె.; లిడ్మాన్, పి.; డేవిడ్సన్, సి.; మోరె, ఎస్.; వాల్స్, డి.; డ్రెసెన్, డి.; స్కాఫ్స్మా, జి.; లేయర్, ఎస్. (6) క్లాసెన్, టి.; గిబ్సన్, టి.; గీజీ, సి.; ఎలెర్స్, డి.; ఫాట్స్, ఆర్.; స్కాఫ్స్మా, ఎస్.; బ్రూషన్, ఎల్.