కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 6/1 పేజీలు 25-28
  • గిలియడ్‌ పాఠశాల దాని 100వ తరగతి పూర్తయింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గిలియడ్‌ పాఠశాల దాని 100వ తరగతి పూర్తయింది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వృద్ధులనుండి లేఖనాధార సలహా
  • సేవా ప్రాంతంనుండి ఆచరణాత్మక వ్యాఖ్యలు
  • యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • సంసిద్ధ స్ఫూర్తి ప్రజలను గిలియడ్‌కు తీసుకువస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • విజయవంతులైన విద్యార్థుల నుండి విజయవంతులైన మిషనరీలుగా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • గిలియడ్‌ పాఠశాల—50 ఏళ్లనాటిదే, ఇంకనూ వర్థిల్లుతోంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 6/1 పేజీలు 25-28

గిలియడ్‌ పాఠశాల దాని 100వ తరగతి పూర్తయింది

ఆధునిక కాలంలో దేవుని రాజ్య సువార్తను భూ వ్యాప్తంగా ప్రకటించడంలో వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ ఒక ప్రముఖ పాత్రను నిర్వహించింది. 1943లో గిలియడ్‌ పాఠశాల శిక్షణ ఇవ్వడం ప్రారంభించిన దగ్గరనుండి, దానిద్వారా పట్టభద్రులైన వారు 200 కంటె ఎక్కువ దేశాల్లో సేవ చేశారు. 1996, మార్చి 2న 100వ తరగతి వారు పట్టభద్రులయ్యారు.

న్యూయార్క్‌లోని పాటర్సన్‌వద్దగల వాచ్‌టవర్‌ విద్యాకేంద్ర ప్రాంతంలో రెండుమీటర్లకన్నా ఎక్కువ మంచు కురిసే సమయంలో విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. కావున వారు పట్టభద్రులయ్యే రోజునకూడా మంచు కురుస్తూ ఉండటంలో ఆశ్చర్యంలేదు. అయినప్పటికి, ఆడిటోరియం పూర్తిగా నిండిపోయింది. మిగిలిన ప్రేక్షకులు పాటర్సన్‌, వాల్‌కిల్‌ మరియు బ్రూక్లిన్‌లలో ఆ కార్యక్రమం విన్నారు. మొత్తం హాజరైనవారు 2,878 మంది.

పరిపాలక సభ బోధనా కమిటీ సభ్యుడైన థియోడర్‌ జార్క్స్‌ అధ్యక్షత వహించారు. అనేక దేశాలనుండి వచ్చిన అతిథులను సాదరంగా ఆహ్వానించిన తర్వాత, అందరూ నిలువబడి 52వ పాట పాడవలసిందిగా ఆయన కోరారు. యెహోవాకు స్తుతిగీతములు పాడుడి (ఆంగ్లం) అనే పుస్తకంనుండి “మన తండ్రి నామము” అనే పాట వారు ఆలపిస్తుండగా, యెహోవా స్తుతితో ఆ ఆడిటోరియం మారుమ్రోగింది. ఆ పాట, దానితోపాటు యెహోవా స్తుతికై విద్యనుపయోగించడాన్ని గూర్చిన అధ్యక్షుని పలుకులతో జరుగవలసిన కార్యక్రమం కొరకు అక్కడి వాతావరణం అనుకూలంగా మారింది.

వృద్ధులనుండి లేఖనాధార సలహా

కార్యక్రమం మొదటిభాగంలో దీర్ఘకాలం యెహోవా సేవకులుగావున్న చాలామంది పట్టభద్రులౌతున్న తరగతి వారికి చిన్న ప్రసంగాలిచ్చారు. ప్రధాన కార్యాలయ సిబ్బంది సభ్యుడైన రిచర్డ్‌ ఏబ్రాహామ్‌సన్‌ 1940లో తన పూర్తికాల సేవను ఆరంభించాడు, “ఎడతెగక సర్దుబాటు చేసుకునేవారై ఉండండి” అని గిలియడ్‌ తరగతివారికి ఆయన ఉద్బోధించాడు. గిలియడ్‌ పాఠశాలలో తాము గడిపిన ఐదునెలలతోపాటు, క్రైస్తవులుగా తమ జీవితంలో సర్దుబాటు చేసుకున్న వివిధ సమయాలను వారప్పటికే అనుభవించారని ఆయన వారికి గుర్తుచేశాడు. కాబట్టి వారెందుకు ఎడతెగక సర్దుబాట్లు చేసుకుంటూ ఉండాలి?

అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులు 13:11లో ఉపయోగించిన మాటకు “ప్రగతిశీల విధానమని, యెహోవా రూపిస్తున్న లేదా నవీకరిస్తున్న దానికి ఎడతెగక లోబడుటని, చక్కని సవరింపు అని, అలా యెహోవా యొక్క పరిపూర్ణ కట్టడలకు ఒక వ్యక్తి మరియెక్కువ సరితూగగలడని దాని భావం” అని ప్రసంగికుడు వివరించాడు. పట్టభద్రులౌతున్న తరగతి వారు తమ విదేశ నియామకంలో, తమ విశ్వాసానికి సంబంధించి క్రొత్త సవాళ్ల నెదుర్కొవాల్సి ఉంటుంది. వారు క్రొత్త భాష నేర్చుకోవాల్సి ఉంటుంది, వివిధ సంస్కృతులకు, జీవన పరిస్థితులకు అలవాటు పడవలసి ఉంటుంది, విభిన్న ప్రాంతాలకు అనువుగా మారాల్సి ఉంటుంది. వారి మిషనరీ గృహాల్లో, వారి క్రొత్త సంఘాల్లో విభిన్న వ్యక్తిత్వాలతో కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటిలో వారు సర్దుబాటు చేసుకొనే ఇష్టతతో జాగ్రత్తగా బైబిలు సూత్రాలను అన్వయించుకుంటే, అప్పుడు అపొస్తలుడైన పౌలు వ్రాసినట్లుగానే వారుకూడా ‘ఎడతెగక సంతోషించగలరు.’

కార్యక్రమంలో భాగం వహించిన ఐదుగురు పరిపాలక సభ్యుల్లో ఒకరైన జాన్‌బార్‌ తన ముఖ్యాంశాన్ని 1 కొరింథీయులు 4:9 నుండి ఎంచుకున్నాడు. దేవదూతలకు, మనుష్యులకు క్రైస్తవులు వేడుకగా ఉన్నారని ఆయన శ్రోతలకు గుర్తుచేశాడు. “దీనినెరుగుట ఒక క్రైస్తవుని జీవన విధాన ప్రాముఖ్యతను ఎంతగానో ఇనుమడింపజేస్తుంది, ప్రాముఖ్యముగా తాను చెప్పే వాటి మూలంగా, చేసేవాటి మూలంగా అతడు దృశ్యమైన, అదృశ్యమైన వారిపై గుర్తింపదగిన ముద్ర వేయగలడని అతడు గ్రహించినప్పుడు అది ఎంతగానో ఉపకరిస్తుంది. సుదూర ప్రాంతాలవరకు మీరు వెళ్తుండగా గిలియడ్‌ 100వ తరగతిలో ప్రియ సహోదర సహోదరీలైన మీరు దీనిని గుర్తుంచుకోవడం మేలని నేను నమ్ముతున్నాను” అని ఆయన చెప్పాడు.

గొర్రెవంటి ప్రజలకు వారు సత్యము నేర్పుతుండగా “మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవునిదూతలయెదుట సంతోషము కలుగునని” తమ మనస్సులో గుర్తుంచుకోవాలని సహోదరుడు బార్‌ ఆ 48 మంది విద్యార్థులకు ఉద్బోధించాడు. (లూకా 15:10) 1 కొరింథీయులు 11:10ని ఉల్లేఖిస్తూ, దైవపరిపాలనా ఏర్పాట్లను గూర్చిన ఒకని దృకథం మనం చూసే సహోదర సహోదరీలమీదనే కాదు మనం చూడని దేవదూతలపై కూడా ప్రభావం చూపుతుందని ఆయనన్నాడు. ఈ విశాల దృక్కోణాన్ని మనస్సులో ఉంచుకోవడం ఎంత ప్రయోజనకరమో గదా!

పరిపాలక సభ్యుడును, గిలియడ్‌ పాఠశాల పట్టభద్రుడునైన మరో సహోదరుడగు జిరెట్‌ లోష్‌, యెహోవా ‘తన ప్రజలచుట్టు ఉండునని’ చూపించడానికి కీర్తన 125:1, 2; జెకర్యా 2:4, 5; కీర్తన 71:21 వంటి లేఖనములను చర్చించాడు. ప్రతి వైపునుండి ఆయన వారికి కాపుదల దయ చేస్తాడు. కేవలం మహాశ్రమలు కలుగు కాలమందే దేవుడు అట్టి కాపుదల అనుగ్రహిస్తాడా? “లేదు. యెహోవా ఇప్పటికే తన ప్రజలకు రక్షణగా, ‘అగ్ని ప్రాకారమువలె’ ఉన్నాడు. యుద్ధానంతరం, 1919వ సంవత్సరంలో రాజ్యసువార్తను సమస్త జనాంగములకు ఒక సాక్ష్యముగా ప్రకటింపవలెనని ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషము బహు ఆసక్తితో ఉన్నారు. వారు పరలోకమందలి అలంకారార్థ యెరూషలేము ప్రతినిధులై యుండిరి. యుగాంతంలో ఓ గుంపుగా ఈ ప్రతినిధులకు దైవిక కాపుదల ఉంటుందని యెహోవా హామీ ఇస్తున్నాడు. ప్రభావితముగా వారినెవరు ఆపగలరు? ఎవరూ అలా ఆపలేరు” అని ప్రసంగికుడు జవాబిచ్చాడు. దైవిక చిత్తం చేయడంలో వారితో సన్నిహితంగా సహవసించే వారందరికి అదెంత గట్టి అభయమో గదా!

పాఠశాల అధ్యాపకులలో సీనియర్‌ సభ్యుడైన యులిసిస్‌ గ్లాస్‌, ‘యెహోవా ప్రపంచ వ్యాప్త సంస్థలో వారి యోగ్యతా స్థానాన్ని పదిల పరచుకోవాలని’ తరగతి వారిని ప్రోత్సహించాడు. యోగ్యతా స్థానం అంటే ఒక వ్యక్తి సామర్థ్యానికి లేదా ప్రవర్తనా విధానానికి ప్రత్యేకంగా సరిపోయే స్థితి లేదా పనియని భావం. “యెహోవా సాక్షుల ప్రపంచ వ్యాప్త సంస్థలో భావి మిషనరీలైన మీరు యోగ్యతా స్థానం పొందారు. అయితే అదిప్పుడు ఎంతో విలువైనది, మిషనరీలుగా మీ జీవితంలో ఆ యోగ్యత కేవలం ఆరంభమే” అని ఆయన ప్రకటించాడు. వారికి యెహోవా, ఆయన సంస్థ ఇచ్చిన ప్రత్యేక నియామకంలో అమరియుండేందుకు వారు తమ సామర్థ్యములను బాగుగా ఉపయోగించడానికి ప్రయాసపడాలి.

గిలియడ్‌ అధ్యాపకులలో సభ్యుడును, బొలీవియాలో 17 సంవత్సరాలు సేవ చేసినవాడునైన వాలేస్‌ లివరెన్స్‌ కార్యక్రమంలోని ఈ భాగమందలి చివరి ప్రసంగమిచ్చాడు. “దేవుని మీరు శోధిస్తారా?” అని విద్యార్థులను ఆయన అడిగాడు. దానిని వారెలా చేయగలరు? ఇశ్రాయేలు జనాంగం దేవుణ్ణి తప్పుడు విధానంలో శోధించారు. (ద్వితీయోపదేశకాండము 6:16) “ఫిర్యాదులు చేస్తూ, లేక సణుగుతూ లేదా ఆయన వ్యవహార విధానంలో విశ్వాసలేమి చూపుతూ ఉండడం ద్వారా దేవున్ని శోధించడం నిశ్చయంగా తప్పు” అని ప్రసంగికుడు పేర్కొన్నాడు. “మీరు మీ క్రొత్త నియామకానికి వెళ్లినప్పుడు, ఆ స్వభావాన్ని ఎదిరించండి” అని ఆయన ప్రోత్సహించాడు. మరయితే దేవుని శోధించుటకు సరియైన మార్గమేది? “ఆయన చెప్పిన సమస్తము నమ్మడం ద్వారా, ఆయన చెప్పేది అలానే చేయడం ద్వారా, ఆ తర్వాత ఫలితాన్ని ఆయనకే వదిలివేయడం ద్వారా” మనం అలా చేయగలమని సహోదరుడు లివరెన్స్‌ వివరించారు. మలాకీ 3:10లో చూసే విధంగా, యెహోవా తన ప్రజలను ఇలా ఆహ్వానిస్తున్నాడు: ‘దయచేసి, నన్ను శోధించండి.’ వారు నమ్మకంగా మందిరపు నిధిలోనికి తమ దశమ భాగాలను తెచ్చినట్లయిన, ఆయన వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. “మీ మిషనరీ నియామకాన్ని మీరు అలానే ఎందుకు దృష్టించకూడదు?” అని ప్రసంగికుడు వారికి ఉద్బోధించాడు. “మీరు అందులో కృతార్థులు కావలెనని యెహోవా కోరుతున్నాడు, కనుక ఆయనను శోధించండి. మీ నియామకానికి కట్టుబడి ఉండండి. మీరు చేయాలని ఆయన కోరే సర్దుబాట్లు చేసుకోండి. సహించండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడేమో చూడండి.” యెహోవా సేవించే వారందరికి అదెంత చక్కని సలహాయో గదా!

ఒక పాట పాడిన తర్వాత, ఆ కార్యక్రమం ప్రసంగాలనుండి ఆహ్లాదకరమైన ఇంటర్వ్యూల పరంపరకు మారింది.

సేవా ప్రాంతంనుండి ఆచరణాత్మక వ్యాఖ్యలు

గిలియడ్‌ అధ్యాపకులలో క్రొత్త సభ్యుడైన మార్క్‌ నౌమెర్‌, విద్యార్థులు పాఠశాలకు హాజరౌతుండగా, సేవా ప్రాంతమందు కలిగిన అనుభవాలను వివరించాల్సిందిగా వారిని ఆహ్వానించాడు. పరిచర్యలో చొరవ తీసుకోవడంలోవున్న విలువను ఉన్నతపరుస్తూ, ప్రేక్షకులు ఉపయోగించగల ఆచరణాత్మక తలంపులను వారు వివరించారు.

తమ పాఠశాల విద్యా కాలంలో, ప్రత్యేక శిక్షణ కొరకు పాటర్సన్‌ విద్యా కేంద్రమునకు 42 దేశాలనుండి వచ్చిన బ్రాంచ్‌ కమిటీ సభ్యులతో సహవసించడం ద్వారా, ఈ గిలియడ్‌ తరగతి విద్యార్థులు ప్రత్యేకంగా ప్రయోజనం పొందారు. వారిలో అనేకులు అనేక సంవత్సరాల ముందు గిలియడ్‌ పట్టభద్రులే. కార్యక్రమంలో 3, 5, 51 మరియు 92వ తరగతుల వారిని ఆలాగే జర్మనీలోని గిలియడ్‌ ఎక్స్‌టెన్షన్‌ పాఠశాల ప్రతినిధులను ఇంటర్య్వూ చేయడం జరిగింది. వారి వ్యాఖ్యానములు ఎంత ప్రయోజనకరంగా ఉండెనో!

తమ నియామకాల్లో యెహోవా స్తుతికర్తల చిన్న సంఖ్యనుండి వేల సంఖ్యకు పెరగడం చూసిన మిషనరీలు ఎలా భావించారో వారు చెప్పారు. ఆండీస్‌ పర్వతాల్లో చెదిరియున్న గృహాలకు, అమెజాన్‌ నదీ ముఖద్వారం దగ్గర గ్రామాలకు సువార్త చేరవేయడంలో వారి వంతును గూర్చి చెప్పారు. చదువురాని ప్రజలకు సాక్ష్యమివ్వడాన్ని వారు చర్చించారు. క్రొత్త భాషలు నేర్చుకోవడానికి తాముపడ్డ శ్రమను, చైనీయుల భాషవంటి భాషల్లో త్వరగా సాక్ష్యమివ్వడానికి, ప్రసంగాలివ్వడానికి పట్టభద్రులు ఎట్టి వాస్తవిక అపేక్షను కలిగియుంటారో వారు వివరించారు. వారు స్పానిష్‌, చైనీస్‌ భాషల్లో క్లుప్త ప్రసంగాల నమూనాను కూడ ప్రదర్శించారు. మిషనరీలు భాషను మాత్రమే కాదుగాని ప్రజల ఆలోచనా సరళిని గూర్చి కూడా నేర్చుకోవడంద్వారా మరింత ఫలవంతంగా ఉండగలరని వారు నొక్కితెల్పారు. బీదదేశాల్లో తరచూవుండే కఠోరమైన జీవన పరిస్థితులను గూర్చి చెబుతూ వారిట్లన్నారు: “ప్రజలు తరచూ మోసగింపబడుతున్నందున ఈ పరిస్థితి వచ్చిందని మిషనరీలు గుర్తించాలి. ప్రజలు కాపరిలేని గొర్రెలవలే ఉన్నారని వారిమీద కనికరపడ్డ యేసు భావించినట్లే ఒక మిషనరీ భావించడం చాలా మంచిది.”

ఒక పాట పాడిన తర్వాత, పరిపాలక సభ్యుడు ఎ. డి. ష్రోడర్‌ ఇచ్చిన ప్రసంగంతో కార్యక్రమం ఇంకా కొనసాగింది. 1943లో గిలియడ్‌ పాఠశాల ఆరంభించబడినప్పుడు ఆయన దాని తొలి ఉపదేశకుల్లోవుండే ఆధిక్యత పొందాడు. కార్యక్రమంయొక్క యుక్తమైన ముగింపు ప్రసంగంలో ఆయన “సర్వాధిపతియగు ప్రభువుగా యెహోవాను సన్నుతించుట” అనే అంశంపై చర్చించాడు. 24వ కీర్తనపై సహోదరుడు ష్రోడర్‌ మనస్సునాకట్టుకునేటట్లు చేసిన చర్చ సర్వాధిపతియగు ప్రభువుగా యెహోవాను సన్నుతించుట ఎంత గొప్ప ఆధిక్యతో గ్రహించునట్లు ప్రేక్షకులపై గట్టి ముద్ర వేసింది.

పట్టాలు అందజేయబడి, ఆ పిమ్మట చివరి పాట పాడిన తర్వాత, పరిపాలక సభ్యుడగు కార్ల్‌ క్లెయిన్‌ హృదయపూర్వక ప్రార్థనతో కార్యక్రమం ముగిసింది. అదెంత ఆచరణాత్మక, ఆత్మీయ ఉత్తేజం కల్గించే కార్యక్రమమో గదా!

పట్టభద్రులైన తర్వాతి రోజుల్లో 100వ తరగతికి చెందిన 48 మంది సభ్యులు, 17 దేశాల్లో తమకు నియమింపబడిన మిషనరీ సేవకు బయల్దేరి వెళ్లనారంభించారు. అయితే వారు తమ పరిచర్యను కేవలం అప్పుడే ప్రారంభించలేదు. వారప్పటికే పూర్తి కాల క్రైస్తవ పరిచర్యలో స్థిరమైన పునాది కలిగియున్నారు. వారు గిలియడ్‌లో ప్రవేశించేసరికి వారి సగటు వయస్సు 33 సంవత్సరాలు మరియు వారు పూర్తి కాల పరిచర్యలో సగటున 12 కంటె ఎక్కువ సంవత్సరాలు గడిపారు. వారిలో కొందరు వాచ్‌ టవర్‌ సొసైటీ భూ వ్యాప్త బేతేలు కుటుంబ సభ్యులుగా ఉన్నవారే. మరితరులు ప్రయాణకాపరులుగా సేవచేశారు. విద్యార్థుల్లో చాలామంది అప్పటికే విదేశాల్లో అనగా ఆఫ్రికా, యూరప్‌, దక్షిణ అమెరికా, సముద్ర ద్వీపాలు మరియు వారి స్వదేశంలోనే పరభాషా ప్రజల గుంపుల మధ్య సేవచేసిన వారే. ప్రపంచంలో ‘మా అవసరత ఎక్కడవుందో అక్కడ మేము సేవ చేస్తాము’ అని సంతోషముతో చెప్పగల అనేకమంది మిషనరీలలో వారిప్పుడు కలుస్తున్నారు. యెహోవా మహిమార్థమై వారి జీవితాలను ఉపయోగించుటే వారి హృదయపూర్వకకోరిక.

[27వ పేజీలోని బాక్సు]

తరగతి గణాంక వివరములు:

ప్రాతినిధ్యం వహించబడిన దేశాలు: 8

నియమించబడిన దేశాలు: 17

విద్యార్థుల సంఖ్య: 48

సగటు వయస్సు: 33.75

సత్యమందు సగటు సంవత్సరాలు: 17.31

పూర్తికాల సేవలో సగటు సంవత్సరాలు: 12.06

[26వ పేజీలోని చిత్రం]

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 100వ తరగతి పట్టభద్రులు

ఈ క్రింది పట్టికలో వరుసలు ముందునుంచి వెనుకకు, పేర్లు వరుసలో ఎడమనుండి కుడికి ఇవ్వబడ్డాయి.

(1) షిర్లి, ఎమ్‌.; గ్రుండ్‌స్ట్రోమ్‌, ఎమ్‌.; జేనార్డీనీ, డి.; జైమో, జె.; షాడ్‌, డబ్ల్యు.; ఫెర్‌, పి.; బుకానన్‌, సి.; రాబిన్‌సన్‌, డి. (2) పైన్‌, సి.; క్రాస్‌, బి.; రాసికాట్‌, టి.; హాన్‌సన్‌, ఎ.; బీట్స్‌, టి.; బెర్గ్‌, జె.; గార్సీయా, ఎన్‌.; ప్లెమింగ్‌, కె. (3) వీనరీ, ఎల్‌.; వీనరీ, ఎల్‌.; హార్ప్స్‌, సి.; జైమో, సి.; బెర్గ్‌, టి.; మాన్‌, సి.; బెరీయస్‌, వి.; ప్ఫైఫర్‌, సి. (4) రాండెల్‌, ఎల్‌.; జేనార్డీనీ, ఎస్‌.; క్రాస్‌, హెచ్‌.; ప్లెమింగ్‌, ఆర్‌.; డాబాడీ, ఎస్‌.; షిర్లి, టి.; స్టీవెన్‌సన్‌, జి.; బుకానన్‌, బి. (5) రాబిన్‌సన్‌, టి.; గార్సీయా, జె.; హార్ప్స్‌, పి.; రాసికాట్‌, డి.; డాబాడీ, ఎఫ్‌.; ఫెర్‌, ఎమ్‌.; స్టీవెన్‌సన్‌, జి.; షాడ్‌, డి. (6) బీట్స్‌, ఎల్‌.; ప్ఫైఫర్‌, ఎ.; బెరీయస్‌, ఎమ్‌.; పైన్‌, జె.; మాన్‌, ఎల్‌.; రాండెల్‌, పి.; గ్రుండ్‌స్ట్రోమ్‌, జె.; హాన్‌సన్‌, జి.;

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి