కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 6/1 పేజీలు 17-19
  • గిలియడ్‌ పట్టభద్రులు—“నిజమైన మిషనరీలు!”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గిలియడ్‌ పట్టభద్రులు—“నిజమైన మిషనరీలు!”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • గిలియడ్‌ పాఠశాల—50 ఏళ్లనాటిదే, ఇంకనూ వర్థిల్లుతోంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • పట్టభద్రులౌతున్న దేవుని వాక్య విద్యార్థులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • సంసిద్ధ స్ఫూర్తి ప్రజలను గిలియడ్‌కు తీసుకువస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 6/1 పేజీలు 17-19

గిలియడ్‌ పట్టభద్రులు—“నిజమైన మిషనరీలు!”

“మిషనరీ అంటే ఏమిటి?” ఒక వార్తాపత్రిక సంపాదకీయం దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఆ ప్రశ్నను వేసింది. నిజమైన మిషనరీలు సామాజిక మరియు ఆర్థిక సంస్కరణకు ఉపకరణాలని ఆ విలేఖరి వాదించాడు. అయితే, ఆదివారం, మార్చి 5, 1995న జెర్సీ నగరంలోని యెహోవాసాక్షుల సమావేశ మందిరంలో పూర్తి భిన్నమైన జవాబు నొక్కిచెప్పబడింది. సందర్భం ఏమిటి? ప్రపంచమంతటా మిషనరీలను పంపే పాఠశాలయగు వాచ్‌టవర్‌ సొసైటీ యొక్క బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌లో 98వ తరగతిలోనివారిని పట్టభద్రులను చేయడం అన్నమాట!

ప్రారంభ గీతం మరియు ప్రార్థన తర్వాత, పరిపాలక సభలోని ఆల్బర్ట్‌ డి. ష్రోడర్‌ హాజరైన 6,430 మందినందరినీ ఆప్యాయంగా స్వాగతించాడు. తమను తామే మిషనరీలు అని పిలుచుకునేవారి నుండి గిలియడ్‌ విద్యార్థులు భిన్నంగా ఎందుకు ఉంటారో సహోదరుడు ష్రోడర్‌ తన ఉపోద్ఘాత వ్యాఖ్యానంలో వ్యక్తం చేశాడు. ఆయనిలా అన్నాడు: “గిలియడ్‌లో ముఖ్య పాఠ్య పుస్తకం బైబిలు.” గిలియడ్‌ పట్టభద్రులు సంఘ సేవకులుగా కాక, దేవుని వాక్య బోధకులుగా ఉండేందుకు తర్ఫీదును పొందారు. అలా వారు విదేశ ప్రాంతాల్లోని ప్రజల ఆత్మీయ అవసరాల ఎడల శ్రద్ధ చూపేందుకు అసమానమైన యోగ్యత పొందారు.

తాము “నిజమైన” మిషనరీలని గిలియడ్‌ పట్టభద్రులు రుజువునిచ్చే అనేక ఇతర రంగాలను గూర్చి తర్వాతి ప్రసంగీకులు చర్చించారు. “మిషనరీలుగా మంచి ఫలాలనివ్వడంలో కొనసాగండి” అనే విషయాన్ని గూర్చి చార్ల్స్‌ మాలాహన్‌ ప్రసంగించాడు. కొలొస్సయులు 1:9, 10 నందలి పౌలు మాటలవైపుకు శ్రద్ధనాకర్షిస్తూ, ‘దేవుని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని’ పెంచుకోవడానికి గిలియడ్‌లోని గత ఐదు నెలలు పట్టభద్రులకు సహాయపడ్డాయని సహోదరుడు మాల్‌హన్‌ గుర్తుచేశాడు. రెండు మార్గాల్లో ఫలాలను ఫలించేందుకు ఇది వారికి సహాయపడుతుంది: దేవుని ఆత్మ ఫలాలను ఫలించడం ద్వారా మరియు బైబిలు సత్యాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా.

పరిపాలక సభలోని డాన్యల్‌ సిడ్‌లిక్‌ “మీ జీవితంతో బేరమాడకండి” అనే గంభీరమైన అంశాన్ని చర్చించాడు. ఆయన యేసు వేసిన ఈ ప్రశ్నను పేర్కొన్నాడు: “ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?” (మత్తయి 16:26) సహోదరుడు సిడ్‌లిక్‌ ఈ విధంగా అభిప్రాయపడ్డాడు: “మానవులు మరింత సులభమైన మరియు సుఖప్రదమైన జీవిత విధానం కొరకు తమ ప్రాణాలను అమ్ముకున్నారు.” అయినను, సజీవమైన విశ్వాసం కలవారు పరీక్షలను, శోధనలను ఎదుర్కొనప్పుడు రాజీపడరు. యేసు మాటలు సూచించేదేమంటే, ఒకరు తన ప్రాణాన్ని లేదా జీవాన్ని దక్కించుకొనేందుకు “ఇవ్వడానికి” అంటే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. యెహోవాకు ఆయన సేవలో తమకున్నదంతా శ్రేష్ఠమైనదంతా ఇవ్వాలని క్రొత్త మిషనరీలు ఉద్బోధించబడ్డారు!

తర్వాత, సేవా విభాగ కమిటీలోని విలియమ్‌ వాన్‌ డీ వాల్‌ “అపొస్తలుడైన పౌలు—అనుకరించతగిన మాదిరి” అనే విషయంపై ప్రసంగించాడు. సహోదరుడు వాన్‌ డీ వాల్‌ ఈ విధంగా వివరించాడు: “మొదటి శతాబ్దంలో మిషనరీ పనికి పౌలు నాయకత్వం వహించాడు.” సముచితంగానే, నేటి మిషనరీల కొరకు అపొస్తలుడైన పౌలు మంచి మాదిరినుంచిన నాలుగు రంగాలు నొక్కి చెప్పబడ్డాయి: (1) ప్రజల ఎడల పౌలుకు గల శ్రద్ధ మరియు ప్రేమ, (2) పరిచర్యలోని ఆయన సఫలత, (3) తనను తాను సమర్థించుకోవడాన్ని సాత్వికముతో నిరాకరించడం, (4) యెహోవాయందలి ఆయన దృఢమైన విశ్వాసము.

“మీ క్రొత్త నియామకంలో యెహోవా మిమ్మల్ని పరిశోధించునుగాక” అనే అంశాన్ని పరిపాలక సభలోని లిమన్‌ ఎ. స్వింగల్‌ చర్చించాడు. ఆనాటి దిన లేఖనమైన కీర్తన 139:16ను ఉపయోగిస్తూ, క్రొత్త మిషనరీలుగా వారు తమ క్రొత్త నియామకాల్లో సమస్యను ఎదుర్కోవచ్చని, యెహోవాకు వాటి పరిష్కారాలు తెలుసని సహోదరుడు స్వింగల్‌ తెలియజేశాడు. “మీకు సమస్య ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళండి, ఆయనతో మాట్లాడండి. ఆయన చిత్తమేమిటో తెలుసుకోండి,” అని ఆయన ఉద్బోధించాడు.

“మీ విశ్వాసము బహుగా అభివృద్ధిపొందుచున్నది.” అనే అంశాన్ని గూర్చి పరిపాలక సభలోని జాన్‌ ఈ. బార్‌ మాట్లాడారు. (2 థెస్సలోనీకయులు 1:3) లూకా 17:1నందు యేసు చెప్పినట్లు, “అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము” అని చదువుతున్నాము. కొందరు సహ మిషనరీల వ్యక్తిత్వాల వల్ల అభ్యంతరపడ్డారు. అయితే సహోదరుడు బార్‌ క్షమించేవారై ఉండేందుకు కావలసినంత విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఆ మిషనరీలను ప్రోత్సహించాడు. నిజానికి, “మా విశ్వాసము వృద్ధిపొందించుమని” యేసు శిష్యులు ఈ సందర్భంలోనే యాచించారు. (లూకా 17:2-5) సంస్థయొక్క వివిధ సవరింపుల వల్ల కూడా మిషనరీల విశ్వాసము పరీక్షించబడవచ్చు. “వీటిని అంగీకరించేంతటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా లేక అవి పర్వతములవంటి ఆటంకాలుగా మారుతాయా?” అని సహోదరుడు బార్‌ అడిగాడు.

తర్వాత ఇద్దరు గిలియడ్‌ ఉపదేశకులు ఉపదేశమిచ్చారు. మిషనరీలు అనుకూల దృక్పథాన్ని కాపాడుకోవాలని జక్‌ రెడ్‌ఫార్డ్‌ బోధించాడు. సహ మిషనరీల ఎగతాళి వల్ల తన నియామకాన్ని వదులుకున్న ఒక మిషనరీ గురించి ఆయన చెప్పాడు. అయితే, అనవసరంగా కోపపడకూడదని లేఖనాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. (ప్రసంగి 7:9) “సరైన దృక్పథాన్ని కలిగి ఉండండి, మీ చుట్టూవున్న వారి తప్పిదాలను మరియు అపరిపూర్ణతలను క్షమించేవారై ఉండండి,” అని ఆయన ఉపదేశించాడు.

తర్వాత, గిలియడ్‌ రిజిస్ట్రారైన యు. వి. గ్లాస్‌ ఇలా అడిగాడు: “‘అదృష్టవశము చేతనో కాలవశము చేతనో కలుగుచున్నవాటిని’ ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?” (ప్రసంగి 9:11) “మన జీవిత విధానంలో ఎప్పుడూ మార్పులు జరుగుతూనే ఉంటాయి, కొన్ని మరీ గాయపరచేవిగా ఉంటాయి,” అని సహోదరుడు గ్లాస్‌ చెప్పాడు. కొందరు మిషనరీలు తప్పనిసరిగా తమ నియామకాలను వదిలిపెట్టేలా చేసే అనారోగ్యాన్ని, రోగాన్ని, కుటుంబ సమస్యలను అనుకోకుండా ఎదుర్కున్నారు. “అనుకోని సంభవమేదైనప్పటికీ, యెహోవాకు దాని గురించి తెలుసని, ఆయన దాని గురించి చింతిస్తున్నాడని మనకు తెలుసు. మనం ఆయనపై నమ్మకం ఉంచితే మనం జయించుతామని మనకు తెలుసు!”

“మిషనరీ సేవకు ప్రత్యేకించబడ్డారు” అనే ప్రసంగం ఉదయకాల ప్రసంగ పరంపరల్లో చివరిది. ఆరంభంలో లేవదీయబడిన “మిషనరీ అంటే ఏమిటి?” అనే ప్రశ్నను పరిపాలక సభలోని థియోడార్‌ జారస్‌ ప్రస్తావించాడు. దానికి జవాబుగా పౌలు మరియు బర్నబాల మిషనరీ పరిచర్యను గూర్చిన అపొస్తలుల కార్యములు 13 మరియు 14 అధ్యాయాలను ఆయన చర్చించాడు. సామాజిక సమస్యలపై కాకుండా, ‘సువార్తను ప్రకటించడం’పై ఆ పని శ్రద్ధ నిలిపిందన్నది స్పష్టం. (అపొస్తలుల కార్యములు 13:32) “నిజమైన మిషనరీ ఎలాగుండాలి అనే దానిని పౌలు మరియు బర్నబాలు చూపించారని మీరు అంగీకరిస్తారా?” అని సహోదరుడు జారస్‌ అడిగాడు. తర్వాత, మెక్సికోలోని అనుభవం గల మిషనరీ అయిన రాబర్ట్‌ ట్రేసీ ఒక సువార్తకునిగా తన హృదయానందకరమైన కొన్ని అనుభవాలను చెప్పేందుకు ఆహ్వానించబడ్డాడు.

సహోదరుడు ష్రోడర్‌ 48 పట్టభద్రులకు డిప్లోమాలను అందించడంతో ఉదయ కాల కార్యక్రమం ముగింపుకు చేరుకుంది. మిషనరీలు నియమించబడిన 21 దేశాల పేర్లను వినడంతో ప్రేక్షకులు పులకించి పోయారు: ఇస్టోనియా, ఈక్వటోరియల్‌ గినియా, ఈక్వెడార్‌, కోటి డి ఐవరి, కోస్టరికా, గినియా-బిస్సావ్‌, తైవాన్‌, నికరాగ్వా, పరాగ్వే, పెరూ, బార్బడోస్‌, బెనిన్‌, బొలీవియా, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌, మారిషస్‌, మొజాంబిక్‌, లాట్వియా, లీవార్డ్‌ దీవులు, వెనిజ్యులా, సెనెగల్‌, హూండూరాస్‌.

మధ్యాహ్న భోజన విరామం తర్వాత, ప్రేక్షకులు మళ్ళీ కూడుకొని, సేవా శాఖలోని రాబర్ట్‌ పి. జాన్‌సన్‌ నిర్వహించిన ఉత్సాహకరమైన కావలికోట పఠనంలో ఆనందించారు. ప్రశ్నలకు 98వ తరగతి సభ్యులు జవాబులిచ్చారు. దీని తర్వాత ఉత్తేజకరమైన అనేక ఇంటర్వ్యూలను గిలియడ్‌ సిబ్బంది సభ్యులు నిర్వహించారు. పట్టభద్రులు పరిచర్యలోని తమ అనుభవాలను, తమ విదేశ నియామకాలను గూర్చిన తమ అనుభూతులను వ్యక్తం చేసినప్పుడు ప్రేక్షకులు ఎంతగానో ప్రోత్సహించబడ్డారు.

గిలియడ్‌ ఆరున్నర సంవత్సరాలు న్యూయార్క్‌లోని వాల్‌కిల్‌నందలి వాచ్‌టవర్‌ సొసైటీ భవంతిలో ఉండినది. అయితే, ఏప్రిల్‌ 1995లో ఈ పాఠశాల న్యూయార్క్‌లోని పాటర్‌సన్‌నందలి వాచ్‌టవర్‌ విద్యాభ్యాస కేంద్రంలోకి మార్చబడింది. వాల్‌కిల్‌నందలి బేతేలు కుటుంబం ఈ మార్పును గూర్చి ఎలా భావిస్తుంది? ఈ పట్టా ఇచ్చే సమయంలో వాల్‌కిల్‌నందలి చాలా మంది ఇంటర్వ్యూ చేయబడ్డారు. గిలియడ్‌ విద్యార్థులు వారిపై చెరగని ముద్రను వేసి వెళ్ళారని హృదయాన్ని స్పర్శించే వారి మాటలు రుజువు చేశాయి. సంసిద్ధత గల ఈ స్త్రీపురుషులు నిజమైన మిషనరీలు—సాత్వికులు, స్వయంత్యాగం చేసేవారు, ఇతరులకు సహాయం చేయడంలో ఎంతో శ్రద్ధగలవారు.

పట్టాలివ్వడం ముగుస్తుండగా, గిలియడ్‌ పాఠశాల 50కన్నా ఎక్కువ సంవత్సరాలుగా చేస్తున్నదానిలో అంటే నిజమైన మిషనరీలను సృష్టించడంలో విజయవంతంగా కొనసాగుతుందని హాజరైనవారందరు నమ్మారు.

[18వ పేజీలోని బాక్సు]

తరగతి గణాంక వివరాలు:

ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 8

నియమించబడిన దేశాల సంఖ్య: 21

విద్యార్థుల సంఖ్య: 48

సరాసరి వయస్సు: 32.72

సత్యంలో ఉన్న సరాసరి సంవత్సరాలు: 15.48

పూర్తికాల పరిచర్యలో సరాసరి సంవత్సరాలు: 10.91

[18వ పేజీలోని చిత్రం]

వాచ్‌టవర్‌ గిలియడ్‌ బైబిల్‌ పాఠశాల పట్టభద్రుల 98వ తరగతి

క్రింది పట్టికలో వరుసలు ముందు నుండి వెనుకకు లెక్కించబడ్డాయి, ప్రతి వరుసలోని పేర్లు ఎడమ నుండి కుడివైపుకు ఇవ్వబడ్డాయి.

(1) ఎస్‌లిన్గర్‌, ఎ.; మాన్‌, టి.; రివెరా, జి; బార్విరో, ఎమ్‌.; వాజ్‌, ఎమ్‌.; దుర్గ, కె.; సిల్వెరాక్స్‌ హెచ్‌.; అల్వారాడో, డి. (2) టోత్‌, బి.; సెగార్రా, ఎస్‌.; హార్ట్‌, ఆర్‌.; రోర్రాక్‌, ఐ.; ఎస్కోబార్‌, పి.; ఐస్‌ట్రప్‌, జె.; స్లై, ఎల్‌.; రివెరా, ఇ. (3) ఆర్చార్డ్‌, డి.; స్నేత్‌, ఎస్‌.; మార్సీల్‌, పి.; కోల్యనన్‌, డి.; వాడెల్‌, ఎస్‌.; బ్లాక్‌బర్న్‌, ఎల్‌.; ఎస్కోబార్‌, ఎమ్‌.; ఆర్చార్డ్‌, కె. (4) హార్ట్‌, ఎమ్‌.; టోత్‌, ఎస్‌.; కోల్యనన్‌, జె.; బెర్‌మాన్‌, హెచ్‌.; మాన్‌, డి.; బ్లాక్‌బర్న్‌, జె.; పార్క్‌, డి.; వాజ్‌, ఎఫ్‌. (5) సెగార్రా, ఎస్‌.; స్లై, ఎల్‌.; లెస్లీ, ఎల్‌.; బెర్‌మాన్‌, బి.; బార్విరో, డబ్ల్యు.; అల్వారాడో, జె.; లెస్లీ, డి.; పార్క్‌, డి. (6) సిల్వెరాక్స్‌, కె.; ఎస్‌లిన్గర్‌, ఆర్‌.; వాడెల్‌, జె.; స్నేత్‌, కె.; దుర్గ, ఎ.; రోర్రాక్‌, ఎఫ్‌.; ఐస్‌ట్రప్‌, సి.; మార్సీల్‌, డి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి