ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి?
కరపత్రం పేరు కనిపించేలా ఇంటివాళ్లకు ఇచ్చి ఇలా అనండి: “నమస్కారం. ప్రాముఖ్యమైన సందేశం ఉన్న ఈ కరపత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్నాం. ఇది మీకోసం.”
తాళంవేసి ఉన్న ఇళ్లలో కరపత్రాన్ని పెడుతుంటే, అది బయటకు కనిపించకుండా చూసుకోండి, దాన్ని అతిగా మడతపెట్టకండి.
ఇంటివాళ్లు ఆసక్తి చూపిస్తే లేదా మాట్లాడడానికి ఇష్టపడితే, కరపత్రంలో మొదటి పేజీలో ఉన్న ప్రశ్న గురించి వాళ్ల అభిప్రాయం అడగండి. జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు తెలుసుకోవడం మీకు ఇష్టమేనా? కరపత్రాన్ని తెరచి కీర్తన 119:144, 160 ఏమి చెబుతుందో చూపించండి. “బైబిలు ఎందుకు చదవాలి?” అనే వీడియో చూపించవచ్చు. వెళ్లేముందు, చివరి పేజీలోని మూడు ప్రశ్నలను చూపించి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఆ ప్రశ్నకు బైబిలు ఇచ్చే జవాబు jw.org వెబ్సైట్ ఉపయోగించి ఎలా తెలుసుకోవచ్చో మళ్లీ వచ్చినప్పుడు చూపిస్తానని చెప్పండి. మీరు మళ్లీ వెళ్లినప్పుడు తెలుగు కావలికోట ఆన్లైన్ లైబ్రరీ లేదా ఏదైనా ముద్రిత ప్రచురణ ఉపయోగించి జవాబులు చర్చించండి.
మీరు ఆ సమయంలోనే ప్రాదేశిక సమావేశ ఆహ్వానపత్రాలు కూడా ఇస్తుంటే, కరపత్రంతోపాటు ఆహ్వానపత్రం కూడా ఇచ్చి ఇలా అనవచ్చు: “త్వరలో జరగనున్న ఒక సమావేశానికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.”
జూలై – సెప్టెంబరు
వారాంతాల్లో అవకాశం ఉన్నచోట, ఇలా చెప్పి తాజా కావలికోట పత్రిక ఇవ్వవచ్చు: “మీరు చదవడానికి ఇష్టపడితే, ఒక పత్రిక కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అది, ‘పొగతాగడం తప్పా?’ అనే అంశం గురించి చర్చిస్తుంది.”