ప్రకటనలు
◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? జూలై: దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్ గానీ ఈ 32 పేజీల బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ అందించండి: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది, మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? ఆగస్టు: జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? అనే కరపత్రంతో ఓ ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ఇంటివాళ్లకు ఇంటర్నెట్‌గురించి తెలియకపోతే, చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? అనే కరపత్రాన్ని గానీ, ఈ కరపత్రాల్లో ఒకదాన్ని గానీ ఇవ్వవచ్చు: బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? సెప్టెంబరు, అక్టోబరు: కావలికోట పత్రిక.
◼ ఈ మన రాజ్య పరిచర్య లోపలి పేజీల్లో, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరౌతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆగస్టు 3, 2013 తేదీతో సంఘాలకు పంపిన ఉత్తరాల్లో వచ్చిన సలహాలను, జ్ఞాపికలను పరిశీలించడం కోసం మీ ప్రాదేశిక సమావేశానికి ముందు వారంలో జరిగే కూటాల పట్టికలో సర్దుబాటు చేసుకోండి. సమావేశం అయిన ఒకటి లేదా రెండు నెలల తర్వాత, పరిచర్యలో ప్రచారకులకు సహాయం చేసిన సమావేశ అంశాలను పరిశీలించడం కోసం స్థానిక అవసరాలు భాగాన్ని ఉపయోగించవచ్చు.