ఆగస్టు 11తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 11తో మొదలయ్యే వారం
పాట 22, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 10వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 7-9 (10 నిమి.)
నం. 1: సంఖ్యాకాండము 9:9-23 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: ఆధ్యాత్మిక స్వస్థతకు శాశ్వత ప్రయోజనాలు ఉన్నాయి—td 45ఎ (5 నిమి.)
నం. 3: ఆకాను—దేవుని దగ్గర దొంగిలిస్తే తీవ్రమైన పర్యవసానాలు ఎదురౌతాయి—యెహో 7:4-26 (5 నిమి.)
సేవా కూటం:
5 నిమి: “1914-2014: వందేళ్ల రాజ్య పరిపాలన!” చర్చ. ఈ పేజీలో పైనున్న పేరాను చదివించండి. ఈ నెల సేవాకూటాల్లో ముఖ్యంగా రాజ్యం గురించి చూస్తాం. క్షేత్రసేవ కోసం స్థానికంగా చేసిన ఏర్పాట్లను సమీక్షించండి.
10 నిమి: “కొత్త వెబ్సైట్ కరపత్రాన్ని ఉపయోగించండి.” కరపత్రంలోని సమాచారాన్ని చర్చించండి. ప్రచారకుడు ఈ కరపత్రాన్ని అందించి, తర్వాత తన దగ్గరున్న ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉపయోగించి jw.org గురించి వివరిస్తున్నట్లు ఒక ప్రదర్శన చేయించండి.
15 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—రాజ్యం గురించి ధైర్యంగా ప్రకటిద్దాం.” చర్చ. ఇద్దరు ప్రచారకులతో ఈ సన్నివేశాన్ని ప్రదర్శింపజేయండి: ప్రచారకుడు షాప్లో డబ్బు కట్టడానికి నిలబడివుంటాడు. పక్కనున్న వ్యక్తి వార్తాపత్రిక చూస్తూ ఇలా అంటాడు: “లోకమంతా పెద్ద గందరగోళంలా తయారైంది! అందరూ మేమే సమస్యలు పరిష్కరిస్తాం అంటారు, కానీ పరిస్థితులు మాత్రం ఇంకా దారుణంగా తయారౌతున్నాయి.” ప్రచారకుడు తనలోతాను ఇలా అనుకుంటాడు: ‘ఇతనికి ఎలాగైనా రాజ్యం గురించి చెప్పాలి!’ ప్రచారకుడు ఆయనతో ఇలా అంటాడు: “అవునండి. అన్నీ చెడు వార్తలే. మీకో కరపత్రం ఇవ్వాలనుకుంటున్నాను. జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి దాని మీదున్న వెబ్సైట్ నాకు చాలా సహాయం చేసింది.” ప్రచారకుడు కరపత్రంలోని ఒక అంశాన్ని చూపిస్తాడు, ఆయన ఆసక్తి చూపిస్తాడు.
పాట 47, ప్రార్థన