కొత్త వెబ్సైట్ కరపత్రాన్ని ఉపయోగించండి
ఆ కరపత్రం పేరు జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? కరపత్రం వెనుక మూడు ప్రశ్నలు ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడు, ఏ ప్రశ్న బాగా నచ్చిందో ప్రజలను యుక్తిగా అడగండి. వాళ్లకు ఆసక్తి ఉందని మీకనిపిస్తే, మన వెబ్సైట్లో ప్రచురణలు > పుస్తకాలు & బ్రోషుర్లు అనే టాబ్ చూపించండి. అక్కడ, దేవుడు చెబుతున్న మంచి వార్త! అనే బ్రోషుర్ 7వ పాఠంలో వాళ్లు ఈ ప్రశ్నలకు కూడా జవాబులు తెలుసుకోవచ్చు: దేవుని రాజ్యం అంటే ఏమిటి? దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?
దేవుని రాజ్యం తీసుకురాబోయే గొప్ప భవిష్యత్తు గురించి బైబిలు ఏమి చెబుతుందో తెలుసుకునేలా ప్రజలకు సహాయం చేయడానికి ఈ కరపత్రాలను ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి.