పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోట జూలై 15
“వేలాది సంవత్సరాల మానవ చరిత్రలో మానవజాతి ఎన్నో రకాల నమ్మకాలను వ్యాప్తిలోకి తీసుకువచ్చింది. వాటిలో ఏవి సత్యమైనవో, ఏవి అసత్యమైనవో తెలుసుకోవడం సాధ్యమేనని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] దేవుణ్ణి సంతోషపెట్టే సత్య బోధలను మీరు ఎక్కడ కనుగొనవచ్చో ఈ పత్రిక చర్చిస్తోంది.” 2 తిమోతి 3:16 చదవండి.
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“ప్రసిద్ధి చెందాలనే కోరిక ఉండడం తప్పని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] చాలామంది అభిప్రాయాలకు భిన్నంగా, బైబిలు ప్రసిద్ధి చెందాలనే కోరికను ప్రోత్సహించడం లేదు. అయితే అది వినయ స్వభావాన్ని ప్రోత్సహిస్తుంది. [యాకోబు 4:6 చదివి, 16వ పేజీలోని ఆర్టికల్‌ను చూపించండి.] ఈ ఆర్టికల్ ప్రసిద్ధి చెందాలనే కోరిక విషయంలో బైబిలు దృక్పథాన్ని వివరిస్తుంది, దానిని మనమెలా దృష్టించాలో వివరిస్తుంది.”
కావలికోట ఆగ. 1
“నేడు చాలామంది న్యూనతా భావాలతో పోరాడుతున్నారు. వారికి సహాయం చేయడానికి ఏమి చేయవచ్చని మీరు అనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] అలాంటి వారు నిజమైన ఆనందం పొందడానికి బైబిలు ఎలా సహాయం చేయగలదో ఈ పత్రిక చర్చిస్తోంది.” “మీరు ఆనందాన్ని పొందడానికి బైబిలు మీకు సహాయం చేయగలదు” అనే ఆర్టికల్‌లో ముద్దక్షరాల్లో ఉండి ఏటవాలుగా ఉన్న లేఖనాలను నొక్కి చెప్పండి.
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“తీరికలేని మన దినచర్య కారణంగా, అనేక పనులకు మనం సమయం వెచ్చించాల్సివస్తున్న కారణంగా మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం సాధారణంగా మనకు కష్టమనిపించవచ్చు. అయినా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంలో మన వంతు మనం చేయాలని లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి. [యెషయా 1:16 చదవండి.] మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి దోహదపడే కొన్ని అనుసరించదగ్గ సూచనలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?” ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత 21వ పేజీలోని ఆర్టికల్‌ను, ‘ఇంటిని శుభ్రం చేయడానికి ఆచరణాత్మకమైన కార్యక్రమం’ అనే బాక్సును చూపించండి.