పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“వ్యాధులతో పోరాడడంలో వైద్యశాస్త్రం గమనార్హమైన అభివృద్ధి సాధించింది, కానీ అసలు వ్యాధులే లేని లోకాన్ని మనం చూడగలమంటారా? [ప్రతిస్పందించనివ్వండి.] త్వరలోనే ఒక రోజు భూమిపై ప్రజలందరూ ఈ వాగ్దానానికి అనుగుణంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుభవిస్తారని ఈ పత్రిక వివరిస్తోంది.” యెషయా 33:24 చదవండి.
కావలికోట జూలై 15
“నేడు ఇలాంటి సంఘటన [ముఖచిత్రంపై చూపించబడినది] గురించి వార్తల్లో వస్తే చాలామంది దానిని నమ్మకపోవచ్చు. మీరేమంటారు? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత మార్కు 4:39 చదవండి.] యేసు చేసిన అద్భుతాలు యథార్థమైనవే అనడానికి ఎలాంటి రుజువులు ఉన్నాయి? కావలికోట యొక్క ఈ సంచిక ఆ ప్రశ్నకు సమాధానం చెబుతోంది.”
తేజరిల్లు! జూలై-సెప్టెం.
ప్రజలకు తెలిసిన ఒక విషాద సంఘటనను పేర్కొన్న తర్వాత ఇలా అడగండి: “ఇలాంటివి జరగడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత యాకోబు 1:13 చదవండి.] ప్రత్యేకించి యౌవనస్థుల కోసం వ్రాయబడిన ఈ ఆర్టికల్, మానవులు అనుభవించే బాధలను నిర్మూలించడానికి మన ప్రేమపూర్వక సృష్టికర్త ఇంకా ఎందుకు చర్య తీసుకోలేదో వివరిస్తుంది.”
కావలికోట అగస్టు 1
“మానవాళి ఇంతగా విభజించబడివుంది కాబట్టి ప్రపంచ శాంతిని సాధించడానికి ప్రపంచవ్యాప్త ప్రభుత్వమే మార్గమని కొంతమంది అభిప్రాయపడతారు. అది సాధ్యమేనని మీరనుకుంటారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత దానియేలు 2:44 చదవండి.] దేవుని రాజ్యం ఇప్పుడేమి సాధిస్తోందో, అది త్వరలోనే ప్రపంచ శాంతిని ఎలా తీసుకొస్తుందో ఈ పత్రిక చర్చిస్తోంది.”