కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/07 పేజీ 4
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 7/07 పేజీ 4

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోట జూలై 15

“ప్రియమైనవారి మరణం ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. వారిలో ఏదైనా ఒక భాగం జీవిస్తూనే ఉంటుందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] యేసు ప్రోత్సాహకరమైన ఈ వాగ్దానం చేశాడు. [యోహాను 5:28, 29 చదవండి.] పునరుత్థానం జరిగే ‘కాలం వస్తుంది’ అని యేసు చెప్పాడు కాబట్టి, చనిపోయినవారు ప్రస్తుతం ఎక్కడున్నారో ఈ పత్రిక బైబిల్లో నుండి వివరిస్తుంది.”

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“జీవించడానికి మనందరికీ డబ్బు అవసరం. అయితే డబ్బు సంపాదన గురించే ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉందని మీరనుకుంటారా? [ప్రతిస్పందించనివ్వండి.] డబ్బు సంపాదననే ధ్యేయంగా పెట్టుకుంటే ఏమి జరుగుతుందనే విషయాన్ని గురించి ఇక్కడ ఏమి చెబుతుందో గమనించండి. [1 తిమోతి 6:10 చదవండి.] ఈ పత్రిక, ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా నిరాడంబరంగా చేసుకోవచ్చు, తక్కువ డబ్బుతోనే ఎలా జీవించవచ్చు అనే విషయం గురించి ఆచరణాత్మక సలహాలనిస్తుంది.”

కావలికోట ఆగ. 1

“అనేకమంది ఆధ్యాత్మికత ద్వారా సంతోషం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి? [ప్రతిస్పందించనివ్వండి.] ఒక ప్రాచీన సామెత ఇలా చెబుతోంది. [సామెతలు 4:10-12 చదవండి.] నిజమైన ఆధ్యాత్మికత గురించి బైబిలు ఏమి చెబుతుందో, మనం దాన్ని ఎలా పొందవచ్చో ఈ పత్రిక వివరిస్తుంది.”

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“అనేక వివాహాలు విచ్ఛిన్నమవుతున్నాయి కాబట్టి, వ్యక్తులు తమ వివాహ భాగస్వామిని జ్ఞానయుక్తంగా ఎంపికచేసుకోవడం ప్రాముఖ్యం. సరైన ఎంపిక చేసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ ప్రాచీనకాల సామెత చాలామందికి సహాయపడింది. [సామెతలు 22:3 చదివి, 16వ పేజీలోని ఆర్టికల్‌వైపుకు తిప్పండి.] సరైన ఎంపిక చేసుకునే విషయంలో వ్యక్తులకు సహాయం చేసే జాగ్రత్తగా ఆలోచింపజేసే సమాచారాన్ని ఈ సంచిక అందిస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి