జ్ఞానం, ప్రేరణ, బలాన్నిచ్చే ఉపకరణాలు
1 బైబిలును గురించి, యెహోవాసాక్షులను గురించి మంచి జ్ఞానాన్నందించడానికి అవి చాలా శక్తివంతమైనవిగా ఉన్నాయి. సత్యం కోసం స్థిరమైన స్థానాన్ని తీసుకొనేందుకు అవి అనేకమందికి ప్రేరణనిచ్చాయి. అవి దేవుని సమర్పిత ప్రజల విశ్వాసాన్ని, మెప్పుదలను బలపరిచాయి. ఏమిటవి? యెహోవా సంస్థ ద్వారా రూపొందించబడిన వీడియోలు. ఆ పది వీడియోలను మీరు చూశారా? ఎంత కాలం క్రితం? వాటిని మీ పరిచర్యలో ఉపయోగిస్తారా? ఈ అద్భుతమైన ఉపకరణాల నుండి ఇంకా ఎక్కువ ప్రయోజనాన్ని మీరు ఎలా పొందగలరు?
2 జూలై 1, 1999, కావలికోటలోని, “కుటుంబమంతా కలిసి దేవుని వాక్యాన్ని క్రమంగా చదవండి” అనే శీర్షిక, “సొసైటీ ఉత్పత్తి చేసిన ఉపదేశాత్మకమైన వీడియో క్యాసెట్‌లను చూడటానికీ . . . [వాటి] గురించి చర్చించటానికీ మీ పఠన సమయంలోని కొంత భాగాన్ని వెచ్చించవచ్చు” అని సలహానిచ్చింది. ఆ చక్కని సలహాకు అనుగుణంగా, ఇప్పటి నుండి సేవా కూటంలో నెల విడిచి నెల ఒక్కొక్క క్యాసెట్ గురించిన శీర్షికలు వస్తాయి. కాబట్టి సేవా కూటంలో దాని గురించి చర్చించే ముందే, ఆయా క్యాసెట్లను ఇంటి దగ్గర చూసి రావాలని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాం.
3 ఈ నెల మేము రూపొందించిన మొదటి వీడియో క్యాసెట్ అయిన జెహోవాస్ విట్నెసెస్—ది ఆర్గనైజేషన్ బిహైండ్ ద నేమ్‌తో ప్రారంభిద్దాము. ఈ క్రింది ప్రశ్నలకు తగిన జవాబుల కోసం మీరు దాన్ని జాగ్రత్తగా చూడండి:
◼ యెహోవాసాక్షులు దేనికి ప్రఖ్యాతి గాంచారు?
◼ బేతేలులో జరగుతున్న ప్రతి కార్యకలాపము ఏ లేఖనంతో ముడిపెట్టబడివుంది?
◼ వీడియోలో మీరు చూసిన ఏ బైబిలు దృశ్యం, మన ప్రచురణల కోసం స్టేజిపై నటించి, ఫోటో తీసి, పెయింట్ చేశారు?
◼ మన సాహిత్యాలు తయారయ్యే విధానాన్ని గూర్చి ఏది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది?
◼ మన సంస్థ 1920 నుండి 1990 వరకూ ఎంత సాహిత్యాన్ని ముద్రించింది?
◼ దేవుని ప్రజలందరి మధ్య ప్రత్యేకంగా ఎవరు బేతేలు సేవకు అర్హతపొందడానికి ముందుకు రావాలి?—సామె. 20:29.
◼ యెహోవాసాక్షులందరికీ, బేతేలు కుటుంబంలోనివారు ఏయే మార్గాల్లో విశిష్టమైన మాదిరిని కలిగివున్నారు?
◼ సాధ్యమైనంత మందిని సువార్తతో చేరేలా, బేతేలులో జరుగుతున్న పని మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
◼ ప్రపంచవ్యాప్త పనికి ధనం ఎలా సమకూర్చబడుతుంది?
◼ మనం ఏ కార్యకలాపానికి ఉత్సాహవంతంగా మద్దతునివ్వగలం, ఏ స్ఫూర్తితో?—యోహాను 4:35; అపొస్తలుల కార్యములు 1:8.
◼ మన పేరు వెనుకనున్న సంస్థ గురించి మీరెలా భావిస్తున్నారు?
◼ మీరు మీ పరిచర్యలో ఈ వీడియోను ఎలా ఉపయోగించగలరు?
డిసెంబరు నెలలో మనం ద బైబిల్—అక్యురేట్ హిస్టరీ, రిలయబుల్ ప్రాఫెసీ గురించి చర్చిద్దాం.