సేవా కూటాల పట్టిక
అక్టోబరు 9తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి: “నేను మరొక చోటుకు మారాలా?” ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం. మరో చోటుకు మారాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు వివేచన ఎందుకు అవసరమో వివరించండి. సామెతలు 22:3లో కనుగొనబడే సలహాను ఎలా అన్వయించుకోవాలో చర్చించండి. కావలికోట (ఆంగ్లం), ఆగస్టు 15, 1988, 22వ పేజీల్లో ఉన్న జాగ్రత్తలపై వ్యాఖ్యానించండి.
20 నిమి: కూటాలకు బాగా సిద్ధపడండి. ప్రసంగము, ప్రేక్షకులతో చర్చ. కూటాలనుండి మనం పొందే ప్రయోజనం కూటాలకు సిద్ధపడడానికి మనం ఎంత కృషిచేస్తున్నాం అన్నదానిపైనే చాలామట్టుకు ఆధారపడి ఉంది. కావలికోట, మార్చి 1, 1998, 15-16 పేజీలు, 8-11 పేరాల్లో ఇవ్వబడిన ఆచరణాత్మకమైన సలహాలను పరిశీలించండి. బాగా సిద్ధపడడానికి, కావలసిన చొరవను వారు ఎలా అభివృద్ధిచేసుకొన్నారో, కావలసిన సమయాన్ని వాళ్ళు ఎలా పొందుతున్నారో తెల్పుతూ వ్యాఖ్యానించమని ప్రేక్షకులను కోరండి.
పాట 22 (130) ముగింపు ప్రార్థన.
అక్టోబరు 16తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (143)
5 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టు.
20 నిమి: “ఆసక్తిని రేకెత్తించేందుకు ప్రస్తుత సంఘటనలను ఉపయోగించండి.” ప్రేక్షకులతో చర్చ మరియు ప్రదర్శనలు. స్థానికంగా ఆసక్తిని రేకెత్తించిన విభిన్న సంఘటనలను పేర్కొనండి. అవి భవిష్యత్తు గురించి ఎటువంటి చింతలను కలుగజేశాయి? బైబిలు చర్చకు నడిపించేలా ఉపోద్ఘాతాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో, బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను పుస్తకంలోని 3, 4 పేజీలను ఉపయోగిస్తూ కొన్ని సూచనలను ఇవ్వండి. ఆచరణాత్మకమైన, బాగా సిద్ధపడిన రెండు ప్రదర్శనలను చేయండి.
20 నిమి: మనమందరం పయినీరు స్ఫూర్తిని ప్రదర్శించగలం. కావలికోట, అక్టోబరు 15, 1997, 22-3 పేజీల ఆధారంగా ఒక పుస్తక పఠన నిర్వాహకునికీ తన సహాయకునికీ మధ్య జరిగే చర్చ. సంఘంలో ఎక్కువ మంది పయినీర్లు ఉండడం ఎందుకు ప్రోత్సాహకరమైనది, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అందరూ ఎలా సహాయపడవచ్చు అనే వాటి గురించి చర్చిస్తారు. ప్రస్తుతం పయినీరు సేవ చేస్తున్న వాళ్ళు తమ సేవను కొనసాగించేలా, అలాగే సంఘంలోని వారంతా పరిచర్యలో తమకున్న ఆసక్తిని పెంచుకొనేలా ప్రోత్సాహాన్నిచ్చే మార్గాలను కూడా వారు చర్చిస్తారు.
పాట 12 (113) ముగింపు ప్రార్థన
అక్టోబరు 23తో ప్రారంభమయ్యే వారం
పాట 20 (93)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: “జ్ఞానం, ప్రేరణ, బలాన్నిచ్చే ఉపకరణాలు” (1, 2 పేరాలు మాత్రమే.) ప్రసంగం. సంస్థ వీడియో క్యాసెట్లను ఎలా ఉత్పత్తి చేయడం ప్రారంభించిందో క్లుప్తంగా తెలియపర్చండి. (ప్రచారకులు [ఆంగ్లం] పుస్తకంలోని 600-601 పేజీలను చూడండి.) అక్టోబరు 30తో ప్రారంభమయ్యే వారపు సేవా కూటంలో జెహోవాస్ విట్నెసెస్—ది ఆర్గనైజేషన్ బిహైండ్ ద నేమ్ అనే వీడియో క్యాసెట్ గురించి చర్చించడం జరుగుతుంది కాబట్టి, దానికి సిద్ధపాటుగా అందరూ దాన్ని చూసి రావాలని ప్రోత్సహించండి. క్యాసెట్ ఉన్నవారు, లేనివారికి దాన్ని ఇవ్వడమో లేదా వారంతా కలిసి ఆ క్యాసెట్‌ను కూటానికి రాకముందు చూడడమో చేయవచ్చు.
25 నిమి: “నూతన సహస్రాబ్ది—అది మీకు ఎలాంటి భవిష్యత్తును తీసుకువస్తుంది?” సేవా పైవిచారణకర్త ద్వారా ఇవ్వబడే ఉత్సాహవంతమైన చర్చ. సంస్థ 2000, జూలై 3న పెద్దలకు పంపిన ఉత్తరంలో ఇవ్వబడిన ప్రకటనను చదివిన తర్వాత హాజరైన ప్రతి వ్యక్తికీ రాజ్య వార్త నెం. 36 ఒక్కొక్క ప్రతిని పంచండి. అటుతర్వాత, శీర్షికను ప్రశ్నాజవాబుల చర్చతో కొనసాగించండి. టెరిటరీ మొత్తాన్ని పూర్తిచేయడం కోసం స్థానికంగా మీరు చేసుకున్న ఏర్పాట్లను వివరించండి. క్రొత్తవారూ పిల్లలూ బాప్తిస్మం పొందని ప్రచారకులుగా అర్హులు కావడానికి ఎలా సహాయం చేయవచ్చో చర్చించండి. ఒక చిన్న ప్రదర్శనను చూపించండి. ఈ సాక్ష్యపు పనిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన అవసరతను నొక్కి తెల్పండి.
పాట 8 (53) ముగింపు ప్రార్థన.
అక్టోబరు 30తో ప్రారంభమయ్యే వారం
పాట 26 (212)
8 నిమి: స్థానిక ప్రకటనలు. అక్టోబరు సేవా రిపోర్టును ఇవ్వమని అందరికీ గుర్తుచేయండి. ఆ వారాంతంలో జరిగే సాక్ష్యపు పనిలో, రాజ్య వార్త నెం. 36తో పాటు కావలికోట, తేజరిల్లు! పత్రికలను అందివ్వాలని సంఘాన్ని ప్రోత్సహించండి.
12 నిమి: పాటలు—మన ఆరాధనలో ఒక ముఖ్యమైన భాగం. ఒక సంఘ పుస్తక పఠన నిర్వాహకుడు, సంఘ కూటాల్లో సరిగా పాడలేకపోతున్న ఇద్దరు ప్రచారకులను గమనించి వారిని ప్రోత్సహించడానికి వారితో చర్చిస్తాడు. కావలికోట, ఫిబ్రవరి 1, 1997, 27-8 పేజీల్లో ఉన్న కొన్ని విషయాలను ఆయన వాళ్ళతో పంచుకుంటాడు. కావలికోట, జూలై 1, 1999, 20వ పేజీ, 12వ పేరాలో సూచించిన ప్రకారం, ఆ వారపు కావలికోట పఠనంలో పాడబోయే ఒక పాటలోని పదాలను వాళ్ళు విశ్లేషిస్తారు. పాటలు పాడడాన్ని గంభీరంగా తీసుకోవడం ద్వారా మనం యెహోవాకు హృదయపూర్వకంగా చెల్లించే స్తుతుల్లో జీవం పోస్తాం.
25 నిమి: జెహోవాస్ విట్నెసెస్—ది ఆర్గనైజేషన్ బిహైండ్ ద నేమ్. ప్రేక్షకులతో చర్చ. “జ్ఞానము, ప్రేరణ, బలాన్నిచ్చే ఉపకరణాలు”లోని 3వ పేరాలో ఇవ్వబడిన ప్రశ్నలను పరిశీలించండి. మన సంస్థ గురించి ఎక్కువ తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికి ఈ వీడియో క్యాసెట్ ఎలా సహాయపడుతుందో చూపించడానికి కొన్ని సూచనలివ్వండి. ఒకటి లేక రెండు చిన్న అనుభవాలను కూడా చేర్చండి.—కావలికోట, అక్టోబరు 1, 1992, 30-1 పేజీలను చూడండి.
పాట 7 (51) ముగింపు ప్రార్థన.
నవంబరు 6తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: మన నమ్మకాలు ఏమిటి? “ఇతర మతాలనుండి వాళ్ళను ప్రత్యేకం చేసేలా యెహోవాసాక్షులు ఏమి బోధిస్తారు?” అని అడిగిన ఒక వ్యక్తితో ఒక సహోదరుడు జరిపే పునర్దర్శనం. తను ఆయనతో, కావలికోట, అక్టోబరు 1, 1998, 6వ పేజీ బాక్స్‌లో వివరించిన పాయింట్లను చర్చిస్తాడు. అన్య మతాలవారు, మనుష్యులు కల్పించిన బోధలను పాటిస్తూ ఈ ప్రధానమైన బైబిలు సత్యాలను ఎలా తిరస్కరిస్తున్నారో లేదా ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో వివరిస్తాడు.
15 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: చర్చలను ప్రారంభించడంలో ఎదురైన అనుభవాలు. పరిచర్యలో ఆసక్తిని రేకెత్తించి చర్చలను ప్రారంభించడానికి, ప్రస్తుత సంఘటనలతో కూడిన ఉపోద్ఘాతాలను ఉపయోగించమని అక్టోబరు 16తో ప్రారంభమయ్యే వారపు సేవా కూటంలో ప్రోత్సహించడం జరిగింది. ఆ సూచనలను పాటించడం ద్వారా వారు ఇప్పటివరకు సాధించిన మంచి ఫలితాలను చెప్పమని ప్రేక్షకులను కోరండి.
పాట 28 (224) ముగింపు ప్రార్థన.