కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 4/1 పేజీలు 22-23
  • యెహోవాసాక్షులు—ఆ పేరుకు తగిన సంస్థ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాసాక్షులు—ఆ పేరుకు తగిన సంస్థ
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రతిస్పందన ఎలావుంది?
  • సాక్ష్యాన్నిచ్చే వీడియోల ప్రభావం
    మన రాజ్య పరిచర్య—2002
  • జ్ఞానం, ప్రేరణ, బలాన్నిచ్చే ఉపకరణాలు
    మన రాజ్య పరిచర్య—2000
  • “ఇది చాలా కొత్తగా ఉంది”
    తేజరిల్లు!—2016
  • గంభీరంగా ఆలోచింపజేసే వీడియో
    మన రాజ్య పరిచర్య—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 4/1 పేజీలు 22-23

యెహోవాసాక్షులు—ఆ పేరుకు తగిన సంస్థ

అక్టోబరు 6, 1990న, అమెరికా, న్యూ జెర్సీనందలి జెర్సీ నగరంలో యెహోవాసాక్షుల అసెంబ్లీ హాలునందు వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి వార్షిక సమావేశానికి హాజరైన దాదాపు 5,000 మంది ఆశ్చర్యంగొల్పే సంగతిని చూశారు. ఛైర్మన్‌, జాన్‌ ఇ. బార్‌ యెహోవాసాక్షులు—ఆ పేరుకు తగిన సంస్థ అనే పేరుగల 55 నిమిషముల వీడియోను విడుదల చేస్తున్నట్లు ప్రేక్షకులకు తెలియజేసాడు. ఇది సొసైటి ఉత్పత్తిచేసిన మొట్టమొదటి వీడియో, అయితే నిశ్చయంగా ఇది చివరిది మాత్రం కాదు.

దైవిక నామమునకు సాక్ష్యమిచ్చుటకు, “రాజ్య సువార్త” ప్రకటించుటకు యెహోవా ప్రజలెట్లు సంస్థీకరింపబడిరో ఆ వీడియో చూపిస్తున్నది. (మత్తయి 24:14) న్యూయార్క్‌, బ్రూక్లిన్‌ నందలి కేంద్ర కార్యాలయము, వాచ్‌టవర్‌ ఫామ్స్‌ నందలి వసతులు అందు చూపబడ్డాయి. ఇంగ్లీషులో 5,00,000లకు పైగా దాని కాపీలు ఉత్పత్తిచేయబడ్డాయి, అది ఇప్పుడు 26 ఇతర భాషలలో లభ్యమగుచున్నది (లేదా త్వరలో లభ్యమగును).a

ప్రతిస్పందన ఎలావుంది?

ఆ వీడియో యెడల యెహోవాసాక్షులుకాని ప్రజలెలా ప్రతిస్పందించారు? ఒక వ్యాపారవేత్త ఇలా వ్రాశాడు:

“ఆ టేపు అత్యంత నాణ్యతగలదై యున్నట్లు నేను కనుగొన్నాను. ప్రత్యేకంగా దానిలోని అంశాలు, చిత్రాలు కూర్పుచేసిన (ఎడిట్‌) రీతి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. అది టేపు అనే సంగతి మర్చిపోయి, దానినొక చలనచిత్రంగా తలంచాలనే భావం నాలో కలిగింది. మీ న్యూయార్క్‌ కేంద్ర కార్యాలయపు సంకల్పాన్ని వివరించడంలో ఈ టేపు విశేషంగా ఉపయోగపడాలి. ఈ చక్కని వీడియో విషయంలో మీకు అభినందనలు.”—జె. జె.

యెహోవాసాక్షులతో బైబిలు పఠనము చేస్తున్నవారు ఈ వీడియో చూడడం ద్వారా ప్రయోజనం పొందారు. ఎందుకో ఈ క్రింద వివరించబడింది:

“స్థానిక విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న 20 సంవత్సరాల యువకునితో నేను బైబిలు పఠనం చేస్తున్నాను. క్షీణించిపోతున్న లోక పరిస్థితుల యెడల అతడు శ్రద్ధ కలిగియున్నాడు. అయితే ఆ టేపును, జీవితంలో నిజమైన సంకల్పంతో పనిచేసే యౌవనులైన ఆ చక్కని బేతేలు సహోదరులను చూసిన తర్వాత, అతని దృక్పధమే పూర్తిగా మారిపోయింది. అతను మన ప్రత్యేక దిన సమావేశానికి హాజరయ్యాడు మరియు తనకు వారంలో రెండుసార్లు బైబిలు పఠనం కావాలని అడిగాడు. మరొక బైబిలు విద్యార్థిని అనగా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయిని, తన బంధువులకు ఆ వీడియో చూపించాలని అడిగి తీసుకుంది. యెహోవాసాక్షులు కేవలం బలహీనమైన, జనసమ్మతము కాని చిన్న సంస్థయని వారనుకున్నారు. కానీ మన భౌగోళిక పని స్వభావాన్ని, మనం కలిగియున్న విజయాన్ని చూసి వారు విస్మయమొందారు, యెహోవాకు కృతజ్ఞతలు.”—జె. బి.

“ఈ వీడియోను చూసిన తర్వాత నేను బైబిలు పఠనం నిర్వహిస్తున్న స్త్రీ రాల్చిన ఆనంద బాష్పాలనుబట్టి, కనుపరచిన మెప్పుదలనుబట్టి నేను పొందిన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి మాటలు చాలవు. ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆమె ఇలా అంది: ‘ఇది సత్యదేవుడగు యెహోవా సంస్థయని ఎవరైనా ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఇలాంటి ప్రజలున్నారని నాకెన్నడూ తెలియదు.’ ఆ తర్వాత ఆమె ఇలా అంది: ‘నేను బాప్తిస్మం పొందాలని ఇష్టపడుచున్నాను.’”—కె. డి.

“బైబిలు విద్యార్థులకు ఈ వీడియో చూపించడంలో మేమెంతో విజయాన్ని సాధించాము. క్రితం రాత్రి, నా భార్యయొక్క బైబిలు విద్యార్థులలోని ఒకావిడ భర్త మా ఇంటికి వచ్చాడు. ముందు అతనెంతో వ్యతిరేకించేవాడు. ఆయన వీడియో చూశాడు. ఆ తర్వాత అతను ప్రశ్నలడిగి, ఒక బైబిలును, బైబిలు పఠనమునకు సహాయపడే మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని తనతోకూడ తీసుకెళ్లాడు. అంతకుముందయితే అతను తన భార్యకు చెందిన బైబిలు సాహిత్యాలన్నింటిని కాల్చివేశాడు!”—డి. హెచ్‌.

ఆ వీడియో ఉత్కంఠభరితంగా ఉన్నట్లు చిన్నపిల్లలు సహితం గమనించారని క్రింది వ్యాఖ్యానములు చూపిస్తున్నవి:

“నా వయస్సు ఆరున్నర సంవత్సరాలు. బైబిళ్లు, పెట్టెలు వేగంగా కదిలివెళ్లిన భాగం నాకెంతో నచ్చింది.”—కె. డబ్ల్యు.

“మా పిల్లలు టి.వి. లో చూసిన ఏ కార్యక్రమం కంటెను అది వారికెంతో నచ్చిందని చెప్పారు.”—ఆర్‌. కె.

“ఆ వీడియోను రెండవసారి చూసిన తర్వాత, దాని ఆద్యంతము శ్రద్ధగా చూసిన మా ఐదేండ్ల కుమారుడు ఇలా అడిగాడు, ‘మనం రోజూ దీన్ని చూడగలమా?’ మా మూడేండ్ల కుమార్తె, ‘నేను కూడ బేతేలుకువెళ్లి పుస్తకాలు తయారుచేస్తాను’ అని అంది.”—ఎమ్‌. ఇ.

“మా 12, 9 సంవత్సరాల అమ్మాయిలు రాబెన్‌, షానెన్‌ ఈ టేపును పదేపదే చూశారు. ఈ టేపును చూసిన తర్వాత మా చిన్నమ్మాయి ఇలా అంది, ‘ప్రాంతీయ సేవంటే నాకెంతో ఇష్టం, అదెంతో సరదాగా వుంటుంది.’ మా కుటుంబ జీవితంపై ఈ టేపు ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగివుందని మేము భావిస్తున్నాము. తిలకించడం సురక్షితమని మీరు భావించే టి.వి. కార్యక్రమాన్ని చూడడం ఎంతగా ఉపశమనాన్ని కల్గిస్తుంది!”—ఎన్‌. బి.

“నాకు 131/2 సంవత్సరాలు. యెహోవా దయచేస్తున్న అద్భుత విషయాలను నేనెంత తేలికగా ఎంచానో, ఆ క్రొత్త వీడియో నేను గ్రహించేటట్లు చేసింది. దేవుని ప్రజలలో ఒకరై యుండుట ఒక ఆధిక్యతే.”—కె. డబ్ల్యు.

“నాకు 16 సంవత్సరాలు, ఇది భూవ్యాప్తంగా జరుగుచున్న సేవయని నా మనస్సును బలపర్చుకోవడానికి ఈ వీడియో సహాయపడింది.”—ఎ. ఎమ్‌.

“నిజమైన దైవపరిపాలనా వినోదం ఎలావుండగలదో చూసిన కారణంగా రోజూవచ్చే టి.వి. కార్యక్రమాలు వారికి పేలవంగా తయారైనట్లు మా పిల్లలు చెప్పారు. పూర్తికాల సేవలో ప్రవేశించాలను వారి కోరికను ఇది బలపరచింది కూడ.”—ఎల్‌. ఎమ్‌.

అనేక సంవత్సరాలు యెహోవాసాక్షులుగా వున్నవారు సహితం వారు చూసినదాన్ని బట్టి పురికొల్పబడ్డారు.

“యెహోవా ప్రజలైన మనమీదేనే ఆ వీడియో అంత ప్రభావం చూపిందంటే, ఇక ఇతరులపై అదెంత ఎక్కువగా ప్రభావంచూపి ఉండాలి? వ్యవహరించడానికి ఎంతో కష్టంగావున్న ఈ కాలంలో, ఎంతో సుఖంగా నా గదిలోనుండే నేను ఒక గంట సమయం తీసుకుని బేతేలును సందర్శించ గలిగాను!”—కె. బి.

“ప్రతి పనికి తీసుకునే శ్రద్ధను, నాణ్యతను చూసిన తర్వాత, నా గదిలోకి వెళ్లి నా బైబిలు సాహిత్యాన్ని కౌగలించుకోవాలన్నంత భావావేశం నాలో కలిగింది.”—ఎల్‌. పి.

యెహోవాసాక్షులు ఆ పేరుకు తగిన సంస్థ అనే వీడియోను చూడడానికి సమయం తీసుకోవాలని మిమ్మును కూడ మేము ప్రోత్సహిస్తున్నాము. జీవితం యెడల ఒక భిన్నమైన అవగాహనను అది మీకిచ్చి, సురక్షితమైన భవిష్యత్తు యెడల ఒక దృఢనమ్మకం కలిగియుండడానికి అది మీకు సహాయం చేస్తుంది. (w92 10/1)

[అధస్సూచీలు]

a అమెరికన్‌ సంజ్ఞల భాష, అరబిక్‌, బాస్క్‌, కాంటొనీస్‌, కెటలాన్‌, క్రోషియన్‌, జెక్‌ (బొహెమియన్‌), డానిష్‌, డచ్‌, ఫిన్నిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, గ్రీక్‌, హంగేరియన్‌, ఇటాలియన్‌, జపనీస్‌, కొరియన్‌, మాండరిన్‌, నార్వెయన్‌, పొలీష్‌, పోర్చుగీస్‌ (బ్రెజిల్‌), పోర్చుగీస్‌ (యూరప్‌), రొమేనియన్‌, స్లోవాక్‌, స్పానీష్‌, స్వీడిష్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి