కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/00 పేజీ 1
  • “నేను మరొక చోటుకు మారాలా?”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నేను మరొక చోటుకు మారాలా?”
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • మీరు “మాసిదోనియకు” వెళ్లగలరా?
    మన రాజ్య పరిచర్య—2011
  • మీ పరిచర్యను విస్తృతం చేసుకునే మార్గాలు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • మాసిదోనియకు వచ్చి సహాయం చేస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 10/00 పేజీ 1

“నేను మరొక చోటుకు మారాలా?”

1 “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అన్న యేసు ఆజ్ఞకు ప్రతిస్పందిస్తూ, సమర్పించుకున్న అనేకమంది యెహోవా సేవకులు, అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సేవచేయడానికి తరలివెళ్ళారు. (మత్త. 28:19) “నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమ”న్న పిలుపుకు ప్రతిస్పందించిన పౌలును వాళ్ళు అనుకరిస్తున్నారు. (అపొ. 16:9) ఆచరణాత్మకంగా దీన్ని మనమెలా చేయగలం?

2 ఒక్కొక్కటిగా చర్యలు తీసుకోండి: మీ సంఘ పరిధిలో చాలా తక్కువగా పని చేసిన ప్రాంతముందా? ఒకవేళ ఉంటే, అలాంటి ప్రాంతాల్లో మీరు కృషి చేయడంపై దృష్టి కేంద్రీకరించవచ్చు. మరొక చోటుకు వెళ్ళాలని నిర్ణయించుకొనేముందు, మీరు ఆ చోటుకు వెళ్ళడానికి తగిన విధంగా సిద్ధంగా ఉన్నారో లేదో అన్న విషయంలో పెద్దలు ఏమని భావిస్తున్నారో తెలుసుకొనేందుకు వాళ్ళని సంప్రదించండి. మీ పరిచర్యను విస్తృతపర్చుకొనేలా దగ్గరలోవున్న సంఘమేదైనా అవసరంలో ఉందేమో తెలుసుకోవడానికి, మీ ప్రాంతీయ పైవిచారణకర్తను కూడా అడగవచ్చు. మరొక ప్రక్క జాగ్రత్తగా తగులుబడి చూసుకున్న తర్వాత, దేశంలోని ఇతర భాగంలో సహాయం చేసేందుకు కోరుకోవచ్చు. అదే మీ కోరిక అయితే, మీరు, మీతోపాటు సంఘంలోని పెద్దలు, మీరు ఎక్కడ పనిచేయాలనుకుంటున్నారో ఆ విషయాన్ని, మీ దైవ పరిపాలనా నేపథ్యాన్ని గూర్చిన వివరాల్ని సంక్షిప్తంగా బ్రాంచి ఆఫీసుకి ఉత్తరాలు వ్రాయాలి. శాశ్వతంగా ఒక చోటికి వెళ్ళాలని నిర్ణయించుకొనే ముందు ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసి రావడం జ్ఞానయుక్తంగా ఉండవచ్చు.

3 వలస వెళ్ళే విషయంలో జాగ్రత్తగా ఉండండి: ఒక మంచి స్థాయిలో జీవించేందుకో లేక ఒత్తిడి నుండి విముక్తి పొందేందుకో మన సహోదరులు అనేకమంది ఇతర ప్రదేశాలకు వెళ్తున్నారు. అలాంటి ప్రయత్నాల్లో కొంతమంది, వేరే దేశాల్లో స్థిరపడేందుకు సహాయం చేస్తామని వాగ్దానం చేసే మోసగాళ్ళ ఉచ్చులో ఇరుక్కుపోయి, ఉన్న డబ్బు పోగొట్టుకుని, దిక్కులేనివాళ్ళవుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది మోసగాళ్ళు వలస వచ్చిన వారితో, బలవంతంగా అనైతికమైన పనులు చేయించుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. అలా చేయడానికి నిరాకరించిన వారిని, వాళ్ళు ప్రవేశించిన ఆ దేశ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే స్థితిలో వదిలేస్తారు. అలా ఆ వలస వెళ్ళినవారి పరిస్థితి, స్వంత దేశంలో కన్నా హీనస్థితికి వస్తుంది. వారి స్వంత సమస్యలతో, ఇబ్బందులతో పోరాడుతున్న క్రైస్తవ కుటుంబాలపై భారాన్ని మోపుతూ, వసతి కోసమో లేక ఇతర సహాయం కోసమో స్థానిక సహోదరులను కోరవలసిన అవసరత ఏర్పడవచ్చు. అలా, అనాలోచితంగా వలస వెళ్ళడం వలన, కొందరు కుటుంబ సభ్యులు ఒకరికొకరు దూరమయ్యారు, కొన్ని కుటుంబాలు ఆధ్యాత్మికంగా బలహీనమైయ్యాయి.​—1 తిమో. 6:8-11.

4 ఒకవేళ మీ స్వలాభం కోసం వేరొక చోటికి మీరు మారాలనుకుంటే, మీరు ఎక్కడ నివసించినప్పటికీ సమస్యలను ఎదుర్కోక తప్పదు అని మాత్రం మనసులో ఉంచుకోండి. తెలియని క్రొత్త పరిసరాలకు వెళ్ళి అక్కడ జీవితాన్ని ప్రారంభించడం కంటే, మీకు తెలిసిన భాష, సంస్కృతిగల ప్రదేశాల్లో సమస్యలను అధిగమించడం చాలా సులభం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి