మన క్రైస్తవ జీవితం
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం నేర్పించడానికి వీడియోలు ఉపయోగించండి
ఎందుకు ప్రాముఖ్యం?:
వీడియోలు అందరి మనసులను ఆకట్టుకుంటాయి. మనం చూసేవి, వినేవి మనపై చాలా ప్రభావం చూపిస్తాయి. ఏకాగ్రత నిలపడానికి, గుర్తుపెట్టుకోవడానికి వీడియోలు సహాయపడతాయి. ఏదైన చూపించి నేర్పించడంలో యెహోవా ఎంతో మంచి మాదిరి.—అపొ 10:9-16; ప్రక 1:1.
దేవునికి పేరుందా?, బైబిలుకు మూలం ఎవరు?, బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరు ఎందుకు నమ్మవచ్చు? అనే వీడియోలు మంచివార్త బ్రోషుర్‌లో 2, 3 పాఠాలకు సహాయంగా ఉంటాయి. బైబిలు స్టడీ చేయడానికి, మీటింగ్స్‌కి రావడానికి బైబిలు ఎందుకు చదవాలి?, బైబిలు అధ్యయనం అంటే ఏమిటి?, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియోలు సహాయపడతాయి. మనం స్టడీ చేస్తున్నప్పుడు ఇంకా బాగా నేర్పించడానికి పెద్ద వీడియోలు కూడా చూపించవచ్చు. —km 5/13 3.
ఎలా చేయాలి?
మీరు ఇంటివాళ్లకు చూపించాలనుకుంటున్న వీడియోను ముందే డౌన్లోడ్ చేసుకోండి
వీడియోకు సంబంధించిన ఒకటి లేదా రెండు ప్రశ్నలు తయారు చేసుకోండి
కలిసి వీడియో చూడండి
ముఖ్యమైన విషయాలను చర్చించండి
దీన్ని ప్రయత్నించండి:
కరపత్రం చివరి పేజీలో బైబిలు ఎందుకు చదవాలి? అనే వీడియోకు తీసుకెళ్లే కోడ్‌ను చూపించండి.
బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరు ఎందుకు నమ్మవచ్చు? వీడియో చూపించాక మంచివార్త బ్రోషుర్‌లో ఉన్న 3వ పాఠాన్ని చూపించి బ్రోషురు ఇవ్వండి