కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • hdu ఆర్టికల్‌ 30
  • రాజ్యమందిరాల్ని మంచి స్థితిలో ఉంచడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రాజ్యమందిరాల్ని మంచి స్థితిలో ఉంచడం
  • మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే ...
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్యమందిరాల్ని మంచి స్థితిలో ఉంచడానికి ఏమేం చేస్తాం?
  • వీటన్నిటికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది?
  • పెద్ద మెయింటెనెన్స్‌ ప్రాజెక్టులు
  • మంచి స్థితిలో ఉండే రాజ్యమందిరాలు యెహోవాకు మహిమ తీసుకొస్తాయి
  • మీరెలా సహాయం చేయవచ్చు?
  • ఇది మన ఆరాధనా మందిరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • మన ఆరాధనా స్థలాలను మంచి స్థితిలో ఉంచుకుందాం
    మన రాజ్య పరిచర్య—2003
  • ఆరాధనా స్థలాలు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • మన ఆరాధనా మందిరాలను జాగ్రత్తగా చూసుకుందాం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మరిన్ని
మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే ...
hdu ఆర్టికల్‌ 30
నిచ్చెనలా కట్టిన ఒకదాని మీద నిలబడి ఒక బ్రదర్‌ రాజ్యమందిరం పైకప్పు మీదున్న ఆకుల్ని శుభ్రం చేస్తున్నాడు.

మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే . . .

రాజ్యమందిరాల్ని మంచి స్థితిలో ఉంచడం

ఏప్రిల్‌ 1, 2024

కొలంబియాలో ఉంటున్న నికోల్‌ అనే సిస్టర్‌ ఇలా అంటుంది: “నాకు మా రాజ్యమందిరం అంటే చాలా ఇష్టం. అక్కడ అందరూ కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు.” మీకూ అలాగే అనిపిస్తుందా?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 63,000 రాజ్యమందిరాల్లో యెహోవాసాక్షులు కలుసుకుంటారు. రాజ్యమందిరం దేవున్ని ప్రశాంతంగా ఆరాధించే స్థలం మాత్రమే కాదు, అది మన గురించి ఇతరులకు చాలానే చెప్తుంది. కొలంబియాలో ఉంటున్న డేవిడ్‌ అనే క్రమ పయినీరు ఇలా చెప్తున్నాడు: “మనం చెప్పేదానికి తగ్గట్టే మన రాజ్యమందిరాలు శుభ్రంగా, అందంగా ఉంటాయి. రాజ్యమందిరాలు అలా ఉండటం చూసి చాలామంది బయటి వాళ్లు మనల్ని మెచ్చుకుంటారు.” అవి అలా చక్కగా ఉన్నాయంటే వాటంతట అవే అలా ఉండట్లేదు. వాటిని శుభ్రంగా ఉంచడానికి, మంచి స్థితిలో ఉంచడానికి మనం చాలా కష్టపడతాం. మరి ఆ పనంతా ఎలా జరుగుతుంది?

రాజ్యమందిరాల్ని మంచి స్థితిలో ఉంచడానికి ఏమేం చేస్తాం?

రాజ్యమందిరాన్ని మంచి స్థితిలో ఉంచే బాధ్యత, దాన్ని ఉపయోగించే అన్ని సంఘాల మీద ఉంటుంది. దాని కోసం బ్రదర్స్‌-

సిస్టర్స్‌ రాజ్యమందిరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు. ఏమైనా చిన్నచిన్న రిపేర్లు వస్తే చేస్తారు, అంతేకాదు రిపేర్లు రాకుండా ముందుజాగ్రత్త కూడా తీసుకుంటారు.సంఘాలు రాజ్యమందిరాన్ని మంచి స్థితిలో ఉంచేలా సహాయం చేయడానికి స్థానిక డిజైన్‌/నిర్మాణ డిపార్ట్మెంట్‌ (LDC) కొంతమంది బ్రదర్స్‌ని మెయింటెనెన్స్‌ ట్రైనర్స్‌గా నియమిస్తుంది. ప్రతీ మెయింటెనెన్స్‌ ట్రైనర్‌ ఆరు నుండి పది సంఘాలు చూసుకుంటాడు. మెయింటెనెన్స్‌ ట్రైనర్స్‌ సంఘాలకు వెళ్లి రాజ్యమందిరాన్ని ఎలా మంచి స్థితిలో ఉంచాలో అక్కడున్న బ్రదర్స్‌-సిస్టర్స్‌కి ట్రైనింగ్‌ ఇస్తారు. ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి రాజ్యమందిరం మంచి స్థితిలో ఉందా, ఏమైనా రిపేర్లు ఉన్నాయా అని చెక్‌ చేస్తారు.

ఒక మెయింటెనెన్స్‌ ట్రైనర్‌ రాజ్యమందిరంలోని బ్రదర్స్‌ సిస్టర్స్‌తో మాట్లాడుతున్నాడు.

రాజ్యమందిరాల్ని మంచి స్థితిలో ఉంచడానికి మెయింటెనెన్స్‌ ట్రైనర్లు మనకు సహాయం చేస్తారు

మెయింటెనెన్స్‌ ట్రైనర్స్‌ ఇచ్చే ఆ ట్రైనింగ్‌ బ్రదర్స్‌-సిస్టర్స్‌కి ఎంతో నచ్చుతుంది. ఇండియాలో ఉంటున్న ఇందుమతి అనే సిస్టర్‌ ఇలా అంటుంది: “ఈ ట్రైనింగ్‌ చాలా బాగుంది. రాజ్యమందిరాల్ని ఎలా మంచి స్థితిలో ఉంచాలో నేర్చుకోవడం సంతోషంగా ఉంది.” కెన్యాలో ఉంటున్న ఎవాన్స్‌ అనే బ్రదర్‌ ఇలా అంటున్నాడు: “ఏమైనా రిపేర్లు ఉంటే అవి చిన్నగా ఉన్నప్పుడే చేయడం ద్వారా మరీ పెద్దవి కాకుండా చూసుకోవచ్చని, చాలా డబ్బు ఆదా చేయవచ్చని ఈ ట్రైనింగ్‌ వల్ల నేర్చుకున్నాను.”

వీటన్నిటికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది?

ఒక్కో రాజ్యమందిరాన్ని ఉపయోగించడానికి, మంచి స్థితిలో ఉంచడానికి ప్రతీ సంవత్సరం కొన్ని వేలు లేదా లక్షలు ఖర్చవుతాయి. ఆ రాజ్యమందిరం ఎక్కడ ఉంది, ఎంత కాలం నాటిది, దాన్ని ఎన్ని సంఘాలు వాడుతున్నాయి అనేదాన్ని బట్టి ఖర్చు ఉంటుంది. మరి దానికి కావాల్సిన డబ్బు ఎక్కడ నుండి వస్తుంది?

రాజ్యమందిరాలు మంచి స్థితిలో ఉంచడానికి అయ్యే ఖర్చు అంతా విరాళాల ద్వారా వస్తుంది. కజక్‌స్థాన్‌లో ఉంటున్న అలెగ్సాండర్‌ అనే బ్రదర్‌ ఇలా అంటున్నాడు: “కొన్ని విరాళాల్ని నీళ్లు, కరెంటు, ఇంటర్నెట్‌ లాంటి అవసరాల కోసం ఉపయోగిస్తాం. మరికొంత డబ్బును టిష్యూలు, గ్లవ్స్‌, క్లీనింగ్‌ సామాను లాంటివి కొనడానికి ఉపయోగిస్తాం.” మిగతా విరాళాల్ని ప్రపంచవ్యాప్త పనికోసం పంపిస్తాం. వాటిని వేరువేరు చోట్ల జరిగే పెద్ద మెయింటెనెన్స్‌ ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తారు.

పెద్ద మెయింటెనెన్స్‌ ప్రాజెక్టులు

ప్రతీనెల రాజ్యమందిరం మెయింటెనెన్స్‌ కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే ఏదైనా మెయింటెనెన్స్‌ పని కోసం, సాధారణంగా రెండు-మూడు నెలలకు అయ్యే ఖర్చు కంటే ఎక్కువ అవుతుంటే పెద్దలు LDC మెయింటెనెన్స్‌ ట్రైనర్‌తో మాట్లాడతారు. ఒకవేళ LDC ఆ ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకుంటే, దానికి అయ్యే ఖర్చు ప్రపంచవ్యాప్త పని కోసం విరాళాల నుండి వస్తుంది. 2023 సేవా సంవత్సరంలో 8,793 ప్రాజెక్టులు చేయడానికి దాదాపు 640 కోట్లు ఖర్చు అయ్యింది. వాటిలో రెండు ప్రాజెక్టులు ఏంటంటే . . .

అంగోలాలో 15 సంవత్సరాల క్రితం నాటి ఒక రాజ్యమందిరానికి చాలా రిపేర్లు అవసరం అయ్యాయి. వైర్లు, స్విచ్‌లు పాతవి అయిపోవడంతో దాదాపు కరెంటు పనంతా మళ్లీ చేయాల్సి వచ్చింది. అంతేకాదు గోడలకు పగుళ్లు వచ్చాయి, రాజ్యమందిరం నుండి వర్షం నీళ్లు తమ ఇళ్లలోకి వస్తున్నాయని ఇరుగు పొరుగువాళ్లు చెప్పారు. వీటన్నిటిని బాగుచేయడానికి LDC ఒక ప్రాజెక్టు మొదలుపెట్టింది. దానికి దాదాపు 8 లక్షలు ఖర్చు అయ్యింది. మన పనితీరు ఇరుగుపొరుగు వాళ్లకు ఎంతో నచ్చింది, వాళ్లు మనకు థ్యాంక్స్‌ కూడా చెప్పారు.

అంగోలాలో బాగుచేసిన రాజ్యమందిరం

పోలండ్‌లో ఒక రాజ్యమందిరం పైకప్పు కారుతోంది, అలాగే కార్పెట్‌ బాగా పాడైపోయింది. LDC ఆ ప్రాజెక్టు తీసుకొని పైకప్పు కారకుండా రిపేరు చేసింది, కార్పెట్‌ను మార్చింది. దానికి మొత్తం దాదాపు 8.5 లక్షలు ఖర్చు అయ్యింది. దాంతో కొన్ని సంవత్సరాల వరకు పెద్ద-పెద్ద రిపేర్లు చేయాల్సిన అవసరం రాదు.

Collage: 1. క్రేన్‌ లాంటి ఒకదాని సహాయంతో ఇద్దరు బ్రదర్స్‌ పైకి ఎక్కి రాజ్యమందిరం పైకప్పును కడుగుతున్నారు. 2. అదే రాజ్యమందిరంలో బ్రదర్స్‌ పాత కార్పెట్‌ను తీసేస్తున్నారు.

పోలండ్‌లో రాజ్యమందిరాన్ని బాగుచేస్తున్నారు

మంచి స్థితిలో ఉండే రాజ్యమందిరాలు యెహోవాకు మహిమ తీసుకొస్తాయి

రాజ్యమందిరాలు మంచి స్థితిలో ఉండటం వల్ల విరాళాలు ఆదా అవుతాయి, అంతేకాదు అవి యెహోవాకు మహిమ తీసుకొస్తాయి. టోంగాలో ఉంటున్న షాన్‌ అనే బ్రదర్‌ ఇలా చెప్తున్నాడు: “రాజ్యమందిరాల్ని మంచి స్థితిలో ఉంచడం వల్ల పరిశుభ్రంగా, చక్కగా ఉన్న హాలులో యెహోవాను ఆరాధించగలుగుతున్నాం, చుట్టుపక్కల వాళ్లకు యెహోవా అంటే ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. మేము మా రాజ్యమందిరానికి ఇతరుల్ని ఆహ్వానించడానికి ఎంతో సంతోషిస్తాం.”

మీరెలా సహాయం చేయవచ్చు?

రాజ్యమందిరాల్ని శుభ్రంగా, మంచి స్థితిలో ఉంచడానికి మన వంతు సహాయం చేయవచ్చు. ఆస్ట్రేలియాలో ఉంటున్న మెరినో అనే మెయింటెనెన్స్‌ ట్రైనర్‌ ఇలా అంటున్నాడు: “రాజ్యమందిరాల్ని మంచి స్థితిలో ఉంచే చక్కని అవకాశం మనలో ప్రతీ ఒక్కరికి ఉంది. అలా చేస్తే విరాళాల్ని ఆదా చేయవచ్చు, వాటిని నిజంగా అవసరమైన చోట ఉపయోగించవచ్చు.”

రాజ్యమందిరం మెయింటెనెన్స్‌ పని అంటే ఇండియాలో ఉంటున్న జోయెల్‌ అనే బ్రదర్‌కు చాలా ఇష్టం. ఆయన ఇలా చెప్తున్నాడు: “బ్రదర్స్‌తో కలిసి పనిచేయడం వల్ల కొత్తలోకంలో ఎలా ఉంటుందో ఊహించుకోగలుగుతున్నాను.” పైన చెప్పిన నికోల్‌ అనే సిస్టర్‌ ఇలా అంటుంది: “బ్రదర్స్‌ బాత్‌రూమ్‌లో ఒక లీకేజీని బాగుచేస్తున్నప్పుడు, నేను నేల మీద తడి లేకుండా తుడిచేసాను. నేను ఏమి రిపేరు చేయకపోయినా ప్రమాదాలు జరగకుండా ఆపాను.”

ఒకవేళ మీ రాజ్యమందిరాన్ని మంచి స్థితిలో ఉంచడానికి మీరు వాలంటీరుగా పని చేయాలనుకుంటే మీ సంఘ పెద్దలతో మాట్లాడండి. మీరు ఇచ్చే విరాళాలు మీ రాజ్యమందిరాన్ని మంచి స్థితిలో ఉంచడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా రాజ్యమందిరాలను అలా ఉంచుతాయి. ఆ విరాళాలను మీ రాజ్యమందిరంలో ఉన్న విరాళాల పెట్టెలో వేయవచ్చు లేదా donate.jw.org ద్వారా పంపించవచ్చు. పెద్ద మనసుతో ఇస్తున్న మిమ్మల్ని మేము ఎంతో మెచ్చుకుంటున్నాం.

బ్రదర్స్‌-సిస్టర్స్‌ రాజ్యమందిరం థరో క్లీనింగ్‌ చేస్తున్నారు. మరో పక్క ఇంకో బ్రదర్‌ కుర్చీలు రిపేరు చేస్తున్నాడు.

రాజ్యమందిరాల్ని మంచి స్థితిలో ఉంచే అవకాశం మనలో ప్రతీ ఒక్కరికి ఉంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి