కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • od అధ్యా. 11 పేజీలు 116-122
  • ఆరాధనా స్థలాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆరాధనా స్థలాలు
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్యమందిరం
  • రాజ్యమందిర నిర్మాణం
  • సమావేశ హాళ్లు
  • ఇది మన ఆరాధనా మందిరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • మన ఆరాధనా స్థలాలను మంచి స్థితిలో ఉంచుకుందాం
    మన రాజ్య పరిచర్య—2003
  • మీ ఆరాధనా స్థలాన్ని మీరు గౌరవిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • అసాధారణమైన పెరుగుదలవల్ల తక్షణ విస్తరణ అవసరమౌతోంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
od అధ్యా. 11 పేజీలు 116-122

11వ అధ్యాయం

ఆరాధనా స్థలాలు

యెహోవా సత్యారాధకులు, ఆయన నుండి ఉపదేశం పొందడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి సమకూడమని ఆజ్ఞాపించబడ్డారు. (హెబ్రీ. 10:23-25) దేవుడు ఎన్నుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయుల మొట్టమొదటి ఆరాధనా స్థలం, ‘గుడారం, అంటే ప్రత్యక్ష గుడారం.’ (నిర్గ. 39:32, 40) తర్వాత, దావీదు కుమారుడైన సొలొమోను, దేవుని మహిమ కోసం ఒక మందిరాన్ని లేదా ఆలయాన్ని కట్టాడు. (1 రాజు. 9:3) సా.శ.పూ. 607 లో ఆ ఆలయం నాశనమైన తర్వాత, యూదులు దేవుణ్ణి ఆరాధించడానికి సమాజమందిరాల్లో కూడుకునే ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలానికి, ఆ ఆలయం తిరిగి కట్టబడ్డాక, అది మళ్లీ సత్యారాధనకు కేంద్రంగా మారింది. యేసు సమాజమందిరాల్లో అలాగే ఆలయంలో బోధించాడు. (లూకా 4:16; యోహా. 18:20) అంతేకాదు, ఆయన ఓ సందర్భంలో కొండమీద కూడా కూటాన్ని నిర్వహించాడు.—మత్త. 5:1–7:29.

2 యేసు చనిపోయిన తర్వాత, క్రైస్తవులు బహిరంగ ప్రదేశాల్లో, ఇళ్లల్లో సమకూడుకొని లేఖనాల్ని బోధించేవాళ్లు, తోటి విశ్వాసులతో సహవసించేవాళ్లు. (అపొ. 19:8, 9; రోమా. 16:3, 5; కొలొ. 4:15; ఫిలే. 2) అయితే తొలి క్రైస్తవులు కొన్నిసార్లు, తమను హింసించేవాళ్ల కంటబడకుండా రహస్య స్థలాల్లో కూడుకోవాల్సి వచ్చేది. నిజానికి, పూర్వకాలంలోని నమ్మకమైన దేవుని సేవకులు ‘యెహోవా చేత బోధించబడడానికి’ ఆరాధనా స్థలాల్లో సమకూడాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్లు.—యెష. 54:13.

3 అదేవిధంగా నేటి క్రైస్తవులు కూడా బహిరంగ ప్రదేశాల్లో, ఇళ్లల్లో కూటాలు జరుపుకుంటారు. సాధారణంగా, ప్రచారకులు క్షేత్ర సేవ కూటం కోసం సహోదరుల ఇళ్లల్లో కలుసుకుంటారు. ఇలాంటి వాటికోసం తమ ఇళ్లను ఇచ్చే సహోదరసహోదరీలు దాన్ని ఓ గొప్ప అవకాశంగా పరిగణిస్తారు. అలా ఇచ్చిన చాలామంది, తాము ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందామని భావిస్తారు.

రాజ్యమందిరం

4 యెహోవాసాక్షుల ఆరాధన స్థలాలు ముఖ్యంగా రాజ్యమందిరాలే. సాధారణంగా ఒక స్థలాన్ని కొని, కొత్త రాజ్యమందిరాన్ని నిర్మిస్తారు, లేదా ఉన్న భవనానికి మరమ్మతులు చేసి దాన్ని కొత్తగా మారుస్తారు. అయితే ఖర్చుల్ని తగ్గించడానికి, హాళ్లను వీలైనంత బాగా ఉపయోగించుకోవడానికి, వీలైతే ఒకే రాజ్యమందిరాన్ని కొన్ని సంఘాలు కలిసి ఉపయోగించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో, ఓ హాలును అద్దెకు తీసుకోవాల్సి రావచ్చు. కొత్త రాజ్యమందిరాలకు, పెద్దపెద్ద మరమ్మతులు చేసిన రాజ్యమందిరాలకు సమర్పణ కార్యక్రమం జరుపుకోవడం సరైనది. అయితే, ఉన్న రాజ్యమందిరానికే చిన్నచిన్న మరమ్మతులు చేసుంటే, సమర్పణ కార్యక్రమం అవసరంలేదు.

5 రాజ్యమందిరాలు ఇతరుల్ని ఆకట్టుకునేలా అట్టహాసంగా ఉండకూడదు. అవి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉన్నా, వాటి ఉద్దేశం మాత్రం ఒకటే. (అపొ. 17:24) స్థానిక పరిస్థితులకు తగ్గట్టు, అవి క్రైస్తవ కూటాల్ని జరుపుకోవడానికి అనుకూలంగా, సౌకర్యవంతంగా ఉండాలి.

6 యెహోవాసాక్షుల సంఘాలు, తమకు నియమించబడిన రాజ్యమందిరాన్ని ఉపయోగించడానికి, దాని నిర్వహణ చూసుకోవడానికి, దాన్ని మంచి స్థితిలో ఉంచుకోవడానికి విరాళాలిస్తాయి. అంతేకానీ, చందాలు లేదా నిధులు సేకరించబడవు. కూటాలకు హాజరయ్యేవాళ్లు, హాలు ఉపయోగానికి సంబంధించి అయ్యే ఖర్చుల కోసం విరాళాలు ఇవ్వడానికి ఒక విరాళాల పెట్టె ఉంటుంది. వాళ్లు దాంట్లో ఇష్టంగా, మనస్ఫూర్తిగా విరాళాలు ఇస్తారు.—2 కొరిం. 9:7.

7 సంఘంలో ఉన్నవాళ్లందరూ రాజ్యమందిరానికి ఆర్థిక మద్దతివ్వడం, దాన్ని శుభ్రంగా, మంచి స్థితిలో ఉంచడానికి సహాయం చేయడం ఓ గొప్ప అవకాశంగా భావిస్తారు. సాధారణంగా ఈ పనులన్నిటి కోసం పట్టిక వేయడానికి ఒక పెద్దను లేదా సంఘ పరిచారకుణ్ణి నియమిస్తారు. మామూలుగా, ప్రచారకులు క్షేత్రసేవా గుంపులవారీగా రాజ్యమందిరాన్ని శుభ్రం చేస్తారు. గుంపు పర్యవేక్షకుడు లేదా ఆయన సహాయకుడు దానికి నాయకత్వం వహిస్తారు. రాజ్యమందిరం లోపలా బయటా యెహోవాకు, ఆయన సంస్థకు చక్కగా ప్రాతినిధ్యం వహించేలా ఉండాలి.

సంఘంలో ఉన్నవాళ్లందరూ రాజ్యమందిరానికి ఆర్థిక మద్దతివ్వడం, దాన్ని శుభ్రంగా, మంచి స్థితిలో ఉంచడానికి సహాయం చేయడం ఓ గొప్ప అవకాశంగా భావిస్తారు

8 ఒకటికన్నా ఎక్కువ సంఘాలు ఒకే రాజ్యమందిరాన్ని ఉపయోగించుకుంటుంటే, ఆ సంఘాల పెద్దలు రాజ్యమందిర నిర్వహణా కమిటీని ఏర్పాటు చేస్తారు. రాజ్యమందిరానికి, దాని స్థలానికి సంబంధించిన విషయాల్ని ఆ కమిటీ చూసుకుంటుంది. ఆ సంఘాల్లోని పెద్దల సభలన్నీ కలిసి, నిర్వహణా కమిటీ సమన్వయకర్తగా ఉండడానికి ఒక సహోదరుణ్ణి ఎంపిక చేస్తాయి. రాజ్యమందిర నిర్వహణా కమిటీ, పెద్దల సభల నిర్దేశం కింద పనిచేస్తుంది. రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడం, దాన్ని మంచి స్థితిలో ఉంచడం అలాగే శుభ్రం చేయడానికి కావాల్సిన వస్తువుల్ని పెట్టడం వంటి పనుల్ని ఆ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే, రాజ్యమందిరాన్ని ఉపయోగించుకుంటున్న సంఘాలన్నీ ఒకదానితో ఒకటి సహకరించుకోవాలి.

9 ఒకే రాజ్యమందిరాన్ని ఎక్కువ సంఘాలు ఉపయోగించుకుంటుంటే కూటాల సమయాలు మారవచ్చు. దానికి సంబంధించిన పట్టిక వేసేటప్పుడు సంఘాల్లోని పెద్దలు ఒకరినొకరు సంప్రదించుకొని, సహోదర ప్రేమతో నిర్ణయం తీసుకుంటారు. (ఫిలి. 2:2-4; 1 పేతు. 3:8) ఏ సంఘం కూడా ఇతర సంఘాల తరఫున నిర్ణయాలు తీసుకోదు. ప్రాంతీయ పర్యవేక్షకుడు ఒక సంఘాన్ని సందర్శిస్తున్నప్పుడు, అదే రాజ్యమందిరాన్ని ఉపయోగించుకుంటున్న వేరే సంఘాలు, అవసరమైతే ఆ వారంలో తమ కూటాల సమయాల్ని మార్చుకుంటాయి.

10 సంఘ సేవా కమిటీ అనుమతితో రాజ్యమందిరాన్ని వివాహాలకు, అంత్యక్రియలకు ఉపయోగించుకోవచ్చు. అప్పుడు పెద్దలు ఆ రిక్వెస్టును జాగ్రత్తగా పరిశీలించి, బ్రాంచి కార్యాలయం ఇచ్చిన నిర్దేశం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.

11 అనుమతి పొందినవాళ్లు, అలాంటి కార్యక్రమాలకు రాజ్యమందిరాన్ని ఉపయోగిస్తున్నప్పుడు, నిజక్రైస్తవులకు తగినట్లు ప్రవర్తించాలి. సంఘాన్ని అభ్యంతరపెట్టే లేదా యెహోవాకు, సంఘానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఏ పనీ రాజ్యమందిరంలో చేయకూడదు. (ఫిలి. 2:14, 15) బ్రాంచి కార్యాలయం నిర్దేశం కింద, రాజ్యమందిరాన్ని ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం, అంటే రాజ్య పరిచర్య పాఠశాల, పయినీరు సేవా పాఠశాల వంటివాటి కోసం ఉపయోగించవచ్చు.

12 సంఘంలోనివాళ్లు తాము కూడుకునే స్థలాన్ని ఎప్పుడూ గౌరవంతో చూస్తారు. వాళ్లు వేసుకునే బట్టలు, కనబడే తీరు, వాళ్ల ప్రవర్తన యెహోవా ఆరాధనకు తగ్గట్టు గౌరవప్రదంగా ఉండాలి. (ప్రసం. 5:1; 1 తిమో. 2:9, 10) ఈ విషయానికి సంబంధించిన సలహాల్ని పాటించడం ద్వారా మన క్రైస్తవ కూటాల పట్ల కృతజ్ఞత చూపిస్తాం.

13 కూటాలు జరిగేటప్పుడు మర్యాదగా నడుచుకోవడం ప్రాముఖ్యం. పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గరే కూర్చోవాలని కోరబడుతుంది. చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు, ఇతరులకు అంతగా ఇబ్బంది కలగని చోట కూర్చోవడం మంచిది. అప్పుడు వాళ్లు, పిల్లలు అల్లరి చేయకుండా కావాల్సిన క్రమశిక్షణ ఇచ్చేందుకు లేదా వాళ్ల అవసరాల్ని తీర్చేందుకు బయటికి తీసుకెళ్లడం సులువౌతుంది.

14 రాజ్యమందిరంలో జరిగే కూటాల సమయాల్లో, అటెండెంట్లుగా సేవచేయడానికి అర్హులైన సహోదరుల్ని నియమిస్తారు. వాళ్లు చురుగ్గా, స్నేహపూర్వకంగా ఉండాలి, మంచి వివేచన చూపించాలి. కొత్తవాళ్లను పలకరించి ఆహ్వానించడం, ఆలస్యంగా వచ్చినవాళ్లకు సీట్లు చూపించడం, హాజరైనవాళ్లను లెక్కించడం, రాజ్యమందిరంలో సరిపడా గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవడం వంటి పనులు వాళ్లు చేస్తారు. అవసరమైనప్పుడు, కూటాలకు ముందుగానీ తర్వాతగానీ పిల్లలు అటుఇటు పరుగెత్తకుండా, లేదా స్టేజీ మీద ఆడకుండా చూసుకోమని అటెండెంట్లు తల్లిదండ్రులకు గుర్తుచేస్తారు. ఇతరుల అవధానం ఎక్కువగా పక్కకు మళ్లకుండా ఉండడం కోసం, ఎక్కువగా అల్లరి చేసే పిల్లవాణ్ణి బయటికి తీసుకెళ్లమని అటెండెంట్లు దయగా, నేర్పుగా తల్లిదండ్రులకు చెప్పవచ్చు. అటెండెంట్లు చేసే కృషి వల్ల, అందరూ కూటాల్ని ఆస్వాదించగలుగుతారు. అటెండెంట్లుగా సంఘ పెద్దల్ని, సంఘ పరిచారకుల్ని నియమించడం మంచిది.

రాజ్యమందిర నిర్మాణం

15 మొదటి శతాబ్దంలో, కొంతమంది క్రైస్తవులు ఇతర క్రైస్తవుల కన్నా బాగా ధనవంతులు. అపొస్తలుడైన పౌలు వాళ్లకు ఇలా రాశాడు: “ఇప్పుడు మీకున్న సమృద్ధి వాళ్ల అవసరాన్ని తీర్చాలని, అలాగే వాళ్ల సమృద్ధి మీ అవసరాన్ని తీర్చాలని, అలా మీ భారాల్ని సమానం చేయాలనేది నా ఉద్దేశం.” (2 కొరిం. 8:14) నేడు కూడా అలాంటి ఏర్పాటే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు ఇచ్చే విరాళాలన్నిటినీ పోగుచేసి రాజ్యమందిరాల్ని నిర్మించడానికి, మరమ్మతులు చేయడానికి ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్త సహోదరులు చూపిస్తున్న అలాంటి ఉదారతకు సంస్థ, అలాగే ఆ విరాళాల నుండి ప్రయోజనం పొందే సంఘాలు ఎంతో కృతజ్ఞత చూపిస్తాయి.

16 ప్రాంతాన్నిబట్టి సంఘాలు ఫలానా రాజ్యమందిరాన్ని ఉపయోగించుకోవాలని బ్రాంచి కార్యాలయం నిర్ణయిస్తుంది. బ్రాంచి క్షేత్రంలో ఎప్పుడు, ఎక్కడ కొత్త రాజ్యమందిరాల్ని నిర్మించాలో, రాజ్యమందిరాలకు మరమ్మతులు చేయాలో కూడా బ్రాంచి నిర్ణయిస్తుంది. విపత్తులు సంభవించినప్పుడు పాడైన రాజ్యమందిరాలకు, ఒక్కోసారి సహోదరుల ఇళ్లకు, అవసరమైన మరమ్మతులు చేయడానికి ఏర్పాట్లు చేయబడతాయి.

17 రాజ్యమందిరాలకు స్థలాల్ని కొనడం, వాటిని డిజైన్‌ చేయడం, బిల్డింగ్‌ పర్మిట్‌లు తీసుకోవడం, రాజ్యమందిరాలు నిర్మించడం, వాటిని మంచి స్థితిలో ఉంచడం వంటివాటికి సహాయం చేసే స్వచ్ఛంద సేవకుల్ని బ్రాంచి కార్యాలయం వ్యవస్థీకరిస్తుంది. చాలాదేశాల్లో రాజ్యమందిరాల అవసరత ఎక్కువగా ఉంది, కాబట్టి ఎంతోమంది స్వచ్ఛంద సేవకులు కావాలి. సహాయం చేయాలని ఇష్టపడుతున్న, అర్హులైన బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులందరూ దరఖాస్తు నింపి స్థానిక సంఘ సేవా కమిటీకి ఇవ్వాలని ప్రోత్సహించబడుతున్నారు. బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులు కూడా, తమ సొంత రాజ్యమందిరాన్ని నిర్మించే లేదా మరమ్మతులు చేసే పనిలో సహాయం చేయవచ్చు.

సమావేశ హాళ్లు

18 తొలి క్రైస్తవులు తరచూ చిన్న గుంపులుగా కూడుకునేవాళ్లు. అయితే కొన్నిసార్లు “చాలామంది” సమావేశమయ్యారు. (అపొ. 11:26) నేడు కూడా, యెహోవా ప్రజలు ప్రాంతీయ సమావేశాల్లో, ప్రాదేశిక సమావేశాల్లో పెద్ద గుంపులుగా కూడుకుంటారు. ఆ సమావేశాల కోసం తరచూ స్థానిక హాళ్లను అద్దెకు తీసుకుంటారు. ఒకవేళ సరైన వసతులున్న హాళ్లు అందుబాటులో ఉండకపోతే లేదా అస్సలు లేకపోతే, ఆరాధన స్థలం కోసం ఓ సమావేశ హాలును నిర్మించాల్సి రావచ్చు లేదా కొనాల్సి రావచ్చు.

19 కొన్నిసార్లు ఒక భవనాన్ని కొని, దానికి మరమ్మతులు చేసి, సమావేశ హాలుగా ఉపయోగిస్తారు. కానీ చాలావరకు, స్థలాన్ని కొని ఒక కొత్త హాలును నిర్మిస్తారు. స్థానిక అవసరాల్ని బట్టి, సమావేశ హాళ్ల పరిమాణంలో తేడాలు ఉంటాయి. ఓ హాలును కొనే ముందు లేదా నిర్మించే ముందు దానికి అయ్యే ఖర్చును, దాని ఉపయోగాన్ని జాగ్రత్తగా పరిశీలించాక, బ్రాంచి కార్యాలయం నిర్ణయం తీసుకుంటుంది.

20 సమావేశ హాళ్ల నిర్వహణను చూసుకోవడానికి, వాటిని మంచి స్థితిలో ఉంచడానికి బ్రాంచి కార్యాలయం సహోదరుల్ని నియమిస్తుంది. సమావేశ కార్యక్రమం పూర్తయిన ప్రతీసారి సర్క్యూట్లలోని సంఘాలు ఆ సమావేశ హాలును శుభ్రపర్చేలా, అలాగే ప్రతీ ఆరు నెలలకు దాన్ని బాగా శుభ్రపర్చేలా, దాన్ని పాడవ్వకుండా చూసుకునేలా ఏర్పాట్లు చేయబడతాయి. ఈ పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొనడం ద్వారా సహోదరులు ప్రయోజనం పొందుతారు. కాబట్టి, ఈ ఏర్పాట్లకు మనస్ఫూర్తిగా మద్దతివ్వాలని సంఘాలు ప్రోత్సహించబడుతున్నాయి.—కీర్త. 110:3; మలా. 1:10.

21 కొన్నిసార్లు, సమావేశ హాలును ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం, అంటే బైబిలు పాఠశాలలు, ప్రాంతీయ పర్యవేక్షకులకు జరిగే ప్రత్యేక కూటాలు వంటివాటి కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. రాజ్యమందిరంలాగే, సమావేశ హాలు కూడా యెహోవాకు ప్రతిష్ఠించబడిన ఆరాధనా స్థలం. ఆరాధన కోసం రాజ్యమందిరంలో కలుసుకునేటప్పుడు మన ప్రవర్తన, వేసుకునే బట్టలు, కనబడే తీరు ఎలా గౌరవపూర్వకంగా ఉంటాయో, సమావేశ హాలులో కలుసుకుంటున్నప్పుడు కూడా అలాగే ఉండాలి.

22 చివరి రోజుల్లోని ఈ చివరి భాగంలో, చాలామంది కొత్తవాళ్లు దేవుని సంస్థలోకి తరలి వస్తున్నారు. యెహోవా ఆశీర్వాదం ఉందనడానికి ఇదొక రుజువు. (యెష. 60:8, 10, 11, 22) కాబట్టి పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన ఆరాధనా స్థలాల్ని కొనడానికి, వాటిని మంచి స్థితిలో ఉంచడానికి చేసే ఏర్పాట్లకు మద్దతివ్వాలని కోరుకుంటాం. అలా చేయడం ద్వారా, యెహోవా రోజు దగ్గరవ్వడం మనం చూసే కొద్దీ, ఇంకా ఎక్కువగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి సహాయం చేసే విషయంలో ఆరాధనా స్థలాలు పోషించే పాత్ర పట్ల కృతజ్ఞత ఉందని చూపిస్తాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి