కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఆగస్టు పేజీ 5
  • యౌవనులారా—‘మంచి పనులంటే ఉత్సాహం చూపించండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యౌవనులారా—‘మంచి పనులంటే ఉత్సాహం చూపించండి’
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • పయినీర్లకు మద్దతు చూపుట
    మన రాజ్య పరిచర్య—1992
  • పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • పయినీరు సేవ ద్వారా యెహోవాను స్తుతించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • పయినీర్లు పూర్తి చేయవలసిన గంటల్లో మార్పు
    మన రాజ్య పరిచర్య—1999
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఆగస్టు పేజీ 5

మన క్రైస్తవ జీవితం

యౌవనులారా—‘మంచి పనులంటే ఉత్సాహం చూపించండి’

అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన ఉత్తరంలో, “అన్ని విషయాల్లో మంచి పనులకు ఆదర్శంగా” ఉండమని తీతును, ఇతర యౌవన సహోదరుల్ని ప్రోత్సహించాడు. (తీతు 2:6, 7) యెహోవా ప్రజలు ‘మంచి పనులంటే ఉత్సాహం చూపించేలా’ యేసు వాళ్లను శుద్ధి చేశాడని కూడా పౌలు అదే అధ్యాయంలో చెప్పాడు. (తీతు 2:14) అలాంటి మంచి పనుల్లో ఒకటి, దేవుని రాజ్యం గురించి ప్రకటించడం, బోధించడం. మీరు యౌవనులైతే, మీకు ఇప్పుడున్న బలాన్ని ఉపయోగించి సహాయ పయినీరుగా లేదా క్రమ పయినీరుగా సేవ చేయగలరా?—సామె 20:29.

మీరు పయినీరుగా సేవ చేయాలనుకుంటే, అందుకు సహాయపడే మంచి ప్రణాళిక వేసుకోండి. (లూకా 14:28-30) అంటే, మీరు పూర్తికాల పరిచర్య చేసేటప్పుడు మీ ఖర్చుల విషయంలో ఏం చేస్తారు? అవసరమైన గంటలను మీరు ఎలా పూర్తి చేస్తారు? మీ పరిస్థితి గురించి యెహోవాకు ప్రార్థించండి. (కీర్త 37:5) మీ తల్లిదండ్రులతో, చక్కగా పయినీరు సేవ చేస్తున్న ఇతరులతో మీరు వేసుకున్న ప్రణాళిక గురించి మాట్లాడండి. తర్వాత, మీ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన పనులు చేయండి. యెహోవా సేవలో మీరు ఉత్సాహంగా చేసే ప్రయత్నాలను ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు!

యౌవనులు యెహోవాను ఘనపరుస్తున్నారు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • కొంతమంది పయినీరు సేవ చేయడానికి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? వాటిని ఎలా చక్కగా పరిష్కరించుకున్నారు?

  • పిల్లలు క్రమ పయినీర్లు అవ్వడానికి తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు?

  • ప్రీచింగ్‌ కోసం ఒక పట్టిక లేదా షెడ్యూల్‌ ఉండడం ఎందుకు ముఖ్యం?

  • పయినీర్లను సంఘ సభ్యులు ఎలా ప్రోత్సహించి సహాయం చేయవచ్చు?

  • పయినీర్లుగా సేవ చేసేవాళ్లకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?

ఒక యువ సహోదరి పయినీరింగ్‌ గురించి వాళ్ల నాన్నతో మాట్లాడుతుంది; ఒక యువ పయినీరు సహోదరుడు తన షెడ్యూల్‌ రాస్తున్నాడు; ఒక యువ పయినీరు సహోదరి ఇంకో సహోదరితో ప్రీచింగ్‌ చేస్తుంది; ఒక యువ పయినీరు సహోదరి బైబిలు స్టడీ చేస్తుంది

పయినీరు సేవ చేయాలనే నా లక్ష్యాన్ని నేను ఎలా చేరుకోవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి