కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఆగస్టు పేజీ 5
  • పయినీరు సేవ ద్వారా యెహోవాను స్తుతించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పయినీరు సేవ ద్వారా యెహోవాను స్తుతించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • కావలెను—4,000 మంది సహాయ పయినీర్లు
    మన రాజ్య పరిచర్య—1997
  • యెహోవాను స్తుతించడానికి మరిన్ని అవకాశాలు
    మన రాజ్య పరిచర్య—2013
  • క్రొత్త సేవా సంవత్సరంలో ఓ చక్కని లక్ష్యాన్ని పెట్టుకోండి
    మన రాజ్య పరిచర్య—2007
  • నీవు సహాయ పయినీరుగా చేయగలవా?
    మన రాజ్య పరిచర్య—1992
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఆగస్టు పేజీ 5
బీచ్‌ దగ్గర సహోదరుడు ఒకతనికి లేఖనం చదివి వినిపిస్తున్నాడు.

మన క్రైస్తవ జీవితం

పయినీరు సేవ ద్వారా యెహోవాను స్తుతించండి

యెహోవాను స్తుతించడానికి ఇశ్రాయేలీయులకు చాలా కారణాలు ఉన్నాయి. ఆయన వాళ్లను ఐగుప్తు నుండి విడిపించాడు, ఫరో సైన్యం నుండి కాపాడాడు! (నిర్గ 15:1, 2) యెహోవా తన ప్రజలకు మంచి చేస్తూనే ఉన్నాడు. మరి ఆయనకు మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?—కీర్త 116:12.

ఒక మార్గమేమిటంటే, సహాయ లేదా క్రమ పయినీరుగా సేవ చేయడం. పయినీరు సేవ చేయాలనే కోరికను, అలా సేవ చేసే శక్తిని ఇవ్వమని యెహోవాను అడగండి. (ఫిలి 2:13) చాలామంది ముందుగా, సహాయ పయినీరుగా సేవ చేస్తారు. మీరు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అలాగే ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం జరిగే నెలలో 30 లేదా 50 గంటలు చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సహాయ పయినీరు సేవలోని ఆనందాన్ని రుచి చూశాక, క్రమ పయినీరు అవ్వడానికి కృషి చేయాలని మీకు అనిపించవచ్చు. కొంతమంది పూర్తికాల ఉద్యోగం చేస్తున్నా లేదా ఆరోగ్యం సహకరించకపోయినా క్రమ పయినీర్లుగా సేవ చేయగలుగుతున్నారు. (mwb16.07 8) యెహోవాను స్తుతించడానికి మనం చేసే ఏ కృషికైనా ఆయన అర్హుడని ఖచ్చితంగా చెప్పవచ్చు.—1ది 16:25.

మంగోలియాలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ‘మంగోలియాలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు’ వీడియోలోని ఒక సన్నివేశం. ఆ ముగ్గురు పయినీరు అక్కాచెల్లెళ్లలో ఒకరైన ఉండ్రా, బస్సు ఎక్కడానికి సిద్ధమౌతోంది.

    పయినీర్లుగా సేవ చేయడానికి ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎలాంటి సవాళ్లను అధిగమించారు?

  • ‘మంగోలియాలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు’ వీడియోలోని ఒక సన్నివేశం. ఆ ముగ్గురు పయినీరు అక్కాచెల్లెళ్లలో ఒకరైన ఓయన్‌, బెతెల్‌లోని డైనింగ్‌ రూమ్‌లో పని చేస్తోంది.

    వాళ్లు ఎలాంటి దీవెనలు పొందారు?

  • ‘మంగోలియాలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు’ వీడియోలోని ఒక సన్నివేశం. ఆ ముగ్గురు పయినీరు అక్కాచెల్లెళ్లలో ఒకరైన డోర్జ్‌ఖండ్‌, క్షేత్ర పరిచర్యలో ఒకతనికి సాక్ష్యమిస్తోంది.

    క్రమ పయినీర్లుగా సేవ చేసినందుకు, యెహోవా సేవలో వాళ్లకు ఎలాంటి కొత్త అవకాశాలు వచ్చాయి?

  • ‘మంగోలియాలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు’ వీడియోలోని ఒక సన్నివేశం. ఆ ముగ్గురు పయినీరు సహోదరీలు, వాళ్ల అమ్మతో.

    వాళ్ల ఆదర్శం ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపించింది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి