పయినీర్లు పూర్తి చేయవలసిన గంటల్లో మార్పు
1 సంఘంలో కష్టించి పనిచేసే క్రమ, సహాయ పయినీర్లు ఉండడాన్ని మనందరం మెచ్చుకుంటాము. పని చేయవలసిన ప్రాంతం చాలా తక్కువగా ఉండి, ఆ ప్రాంతంలోనే క్రమంగా పదే పదే పనిచేసినప్పటికీ అలాంటి ప్రాంతంలో కూడా పయినీర్లు రాజ్యసేవ పట్ల తమకున్న ఆసక్తిని బట్టి మంచి మాదిరిని ఉంచుతున్నారు. “నిత్యజీవానికి నిర్ణయింపబడిన” వారిని వెదకడంలో నిమగ్నమై ఉండమని వారు సంఘంలో ఉన్న ప్రచారకులందరినీ ప్రోత్సహిస్తున్నారు.—అపొ.13:48.
2 పయినీర్లకు అధికమౌతున్న సమస్యలను, ప్రాముఖ్యంగా తాము పూర్తికాల పరిచర్యలో కొనసాగుతూ తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకునేందుకుగానూ పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని సంపాదించుకోవడంలో వారికి ఎదురౌతున్న సమస్యలను సంస్థ గమనించింది. ఇతరులకు పయినీరు పనిలో ప్రవేశించాలన్న హృదయపూర్వక కోరిక ఉన్నప్పటికీ, అనేక దేశాల్లో ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల వల్ల అలా చేయడం కష్టతరమౌతోంది. ఇటీవలి నెలల్లో దీనినీ, ఇతర కారకాలను జాగ్రత్తగా పరిశీలించడం జరిగింది.
3 కాబట్టి పై విషయం దృష్ట్యా సంస్థ క్రమ, సహాయ పయినీర్లు పూర్తి చేయవలసిన గంటలను తగ్గించింది. 1999వ సంవత్సరం జనవరి నెల మొదలుకొని క్రమ పయినీర్లు నెలకు 70 గంటలు లేక సంవత్సరానికి 840 గంటలు పూర్తి చేస్తేచాలు. సహాయ పయినీర్లు నెలకు 50 గంటలు పూర్తి చేస్తేచాలు. ప్రత్యేక పయినీర్లు, మిషనరీలు పూర్తి చేయవలసిన గంటలలో ఎటువంటి మార్పు లేదు, ఎందుకంటే వారు తమ ప్రాథమిక వస్తుసంబంధ అవసరతలను తీర్చుకోవడానికి సంస్థ తోడ్పడుతోంది. ఆ విధంగా వారు ప్రకటించే, శిష్యులను చేసే పనిలో మరింత ఎక్కువగా శ్రద్ధ నిలుపవచ్చు.
4 పూర్తి చేయవలసిన గంటల విషయంలో చేయబడిన ఈ మార్పు ఎక్కువమంది పయినీర్లు ఈ ప్రశస్తమైన సేవాధిక్యతను అంటిపెట్టుకుని ఉండేందుకు సహాయం చేస్తుందని భావిస్తున్నాము. ఇంకా ఎక్కువమంది ప్రచారకులు క్రమ, సహాయ పయినీర్ పని చేపట్టేందుకు కూడా ఇది మార్గాన్ని తెరవాలి. సంఘంలోని ప్రతి ఒక్కరికీ ఇది ఎంతటి ఆశీర్వాదంగా ఉంటుంది!