దేవుని వాక్యంలో ఉన్న సంపద | తీతు 1-ఫిలేమోను
‘పెద్దల్ని నియమించు’
‘ఒక్కో నగరానికీ వెళ్తూ . . . పెద్దలను నియమించమని’ పౌలు తీతుకు చెప్పాడు. అలానే, నేడు కూడా ప్రాంతీయ పర్యవేక్షకులు సహోదరులను సంఘ బాధ్యతల్లో నియమిస్తారు.
పరిపాలక సభ
మొదటి శతాబ్దంలో ఉన్న పద్ధతిని పాటిస్తూ, పరిపాలక సభ ప్రాంతీయ పర్యవేక్షకులకు పెద్దలను, సంఘ పరిచారకులను నియమించే ముఖ్యమైన బాధ్యతను అప్పగించింది.
ప్రాంతీయ పర్యవేక్షకులు
ప్రతీ ప్రాంతీయ పర్యవేక్షకుడు పెద్దలు సిఫారసు చేసిన సహోదరుల గురించి జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి అర్హులైన సహోదరుల్ని నియమిస్తాడు.
పెద్దలు
పెద్దలుగా నియమించిన తర్వాత కూడా, ఆ సహోదరులు లేఖనాల్లో ఉన్న అర్హతలకు తగ్గట్టు జీవిస్తూ ఉండాలి.