‘దేవుని చిత్తం నెరవేరును గాక’
1. 2012 సేవా సంవత్సరంలో జరగబోయే ప్రత్యేక దిన సమావేశ కార్యక్రమ ముఖ్యాంశం ఏమిటి? మనం ఆ అంశాన్ని పరిశీలించడం ఎందుకు సరైనది?
1 యెహోవా తన చిత్త ప్రకారం మనల్ని సృష్టించాడు. (ప్రక. 4:10, 11) కాబట్టి ఆయన చిత్తమేమిటో తెలుసుకొని దాన్ని చేస్తేనే మన ఉనికికున్న ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతాం. అలా చేయడం అనుకున్నంత తేలికేమీ కాదు, ఎందుకంటే మన ‘శరీరం, మనసు’ ఇష్టపడేవాటిని, ‘అన్యజనుల ఇష్టాన్ని’ నెరవేర్చాలనే కోరికతో మనం పోరాడాల్సివుంది. (ఎఫె. 2:3; 1 పేతు. 4:3; 2 పేతు. 2:9, 10) దేవుని సహాయం లేకపోతే మనం ‘సాతాను ఇష్టం చొప్పున చెరపట్టబడే’ ప్రమాదం కూడా ఉంది. (2 తిమో. 2:24-26) 2012 సేవా సంవత్సరంలో జరగబోయే ప్రత్యేక దిన సమావేశ కార్యక్రమం, మాదిరి ప్రార్థనలోని మూడు ముఖ్య విన్నపాల్లో ఒకటైన, ‘నీ చిత్తం నెరవేరును గాక’ అనేదానికి అనుగుణంగా పనిచేసేందుకు మనలో ప్రతీ ఒక్కరికి సహాయం చేస్తుంది.—మత్త. 6:9, 10.
2. ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమంలో ఏ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటాం?
2 ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటాం: మీరు కార్యక్రమం వింటున్నప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం చూడండి: మనం దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు ఇంకా ఏ ప్రాముఖ్యమైన పని చేయాలి? మన విషయంలో దేవుని చిత్తమేమిటో ఎలా తెలుసుకుంటూ ఉండవచ్చు? అన్ని రకాల ప్రజలకు సహాయం చేయడానికి మనమెందుకు సుముఖంగా ఉండాలి? మనం ప్రతిఫలదాయకమైన, సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా పొందవచ్చు? పిల్లలు, యౌవనస్థులు యెహోవాకు ఏమి నిరూపించాలి? దేవుని చిత్తం చేస్తే ఏ ఆశీర్వాదాలు వస్తాయి? ఇతరులను బలపర్చడం, ప్రోత్సహించడం ఎందుకు అత్యవసరం?
3. ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం నుండి మనమెలా పూర్తి ప్రయోజనం పొందవచ్చు?
3 సమావేశానికి తప్పకుండా హాజరయ్యేలా చూసుకోండి. కార్యక్రమాన్ని జాగ్రత్తగా వినండి. అతిథి ప్రసంగీకునిగా బెతెల్ ప్రతినిధి గానీ ప్రయాణ పర్యవేక్షకుడు గానీ రావచ్చు. కార్యక్రమం మొదలవడానికి ముందు, పూర్తయిన తర్వాత ఆయనతో, పెళ్లయితే ఆయన భార్యతో మాట్లాడడానికి సంకోచించకండి. ‘విని మరచిపోయే వారిలా’ ఉండకండి. ఇంటికి వెళ్లాక కుటుంబంతో కలిసి సమావేశ కార్యక్రమాన్ని మళ్లీ ఒకసారి పరిశీలించండి, దేవుని చిత్త ప్రకారం ఇంకా ఎక్కువగా ఎలా జీవించవచ్చో చర్చించండి.—యాకో. 1:25.
4. మనం యెహోవా చిత్తానికి ప్రాధాన్యతనివ్వడం ఎందుకు ప్రాముఖ్యం?
4 తమ కోరికలకు ప్రాధాన్యతనిచ్చే వాళ్లను, తన చిత్త ప్రకారం జీవించని వాళ్లను యెహోవా అతి త్వరలోనే నాశనం చేస్తాడు. (1 యోహా. 2:17) కాబట్టి, యెహోవా చిత్తానికి ప్రాధాన్యతనిచ్చేలా ఈ సమయానుకూలమైన సమాచారం ఏర్పాటు చేసినందుకు ఆయనకు మనం ఎంతో కృతజ్ఞులం.