కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/05 పేజీ 1
  • జీవానికి నడిపించే విద్య

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జీవానికి నడిపించే విద్య
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • అదనపు విద్య విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • విద్య—యెహోవాను స్తుతించేందుకు దానిని వినియోగించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • బైబిలు విద్యాభ్యాసాన్ని నిరుత్సాహపరుస్తుందా?
    తేజరిల్లు!—1998
  • దైవిక విద్యకున్న అతిశ్రేష్ఠమైన విలువ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 12/05 పేజీ 1

జీవానికి నడిపించే విద్య

1 ప్రజలు దేవుని వాక్య సత్యాన్ని గ్రహించినప్పుడు వారి కళ్ళు మెరవడాన్ని చూడడం ఎంత సంతృప్తినిస్తుందో కదా! దేవుని గురించిన, మానవజాతిపట్ల ఆయన సంకల్పం గురించిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం నిజంగా సంతృప్తినిస్తుంది. అలాంటి విద్య సంపాదించడం ఒక వ్యక్తిని నిత్యజీవానికి నడిపిస్తుంది.—యోహా. 17:3.

2 ఆ విద్య ఎందుకు శ్రేష్ఠమైనది: నేడు విద్య దాదాపు వీలైన అన్ని పద్ధతుల ద్వారా, ఊహించదగిన అన్ని అంశాలపై అందించబడుతోంది. (ప్రసం. 12:12) అయితే “దేవుని గొప్పకార్యములకు” ఉన్న విలువతో అలాంటి జ్ఞానాన్ని పోల్చలేం. (అపొ. 2:11) లోకంలో అందించబడుతున్న విద్య, మానవజాతిని సృష్టికర్తకు సన్నిహితం చేయడానికి గానీ ఆయన సంకల్పాన్ని తెలుసుకోవడానికి గానీ సహాయం చేయగలిగిందా? మనం మరణించినప్పుడు ఏమి సంభవిస్తుంది లేక ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి వంటి విషయాలు ప్రజలు అర్థం చేసుకోవడానికి అది సహాయం చేసిందా? అది ప్రజలకు నిరీక్షణను ఇచ్చిందా? కుటుంబ ఏర్పాటును మెరుగుపరిచేందుకు అది సహాయం చేసిందా? లేదు. మనం దైవిక విద్య ద్వారా మాత్రమే జీవితంలోని అతి ప్రాముఖ్యమైన ప్రశ్నలకు వాస్తవమైన జవాబులు పొందవచ్చు.

3 నేటి లోకంలో ఎంతో కొదువగా ఉన్న నైతిక వికాసాన్ని దైవిక విద్య అందిస్తుంది. దేవుని వాక్యాన్ని అంగీకరించి దాని బోధలను అన్వయించుకునే వారి హృదయాల నుండి అది జాతి విభేదాలు, వర్గ విభేదాలు, జాతీయత వంటి విషయాలను తొలగిస్తుంది. (హెబ్రీ. 4:12) అన్ని రకాల హింసలను విడనాడి ‘నవీనస్వభావాన్ని ధరించుకోవడానికి’ అది ప్రజలను ప్రోత్సహించింది. (కొలొ. 3:9-11; మీకా 4:1-3) అంతేకాక, దైవిక విద్య లోతుగా నాటుకుపోయిన, దేవుణ్ణి నొప్పించే ఆచారాలను, లక్షణాలను అధిగమించేందుకు కావల్సిన శక్తిని లక్షలాదిమందికి ఇచ్చింది.—1 కొరిం. 6:9-11.

4 ఇప్పుడు ఎందుకు అత్యవసరం: మన మహోపదేశకుడు మనం జీవిస్తున్న కాలాలకున్న ప్రాముఖ్యత గురించి మనల్ని అప్రమత్తులను చేస్తున్నాడు. ఆయన ప్రవచనాత్మక తీర్పుల్లో ఇప్పుడు భూవ్యాప్తంగా ప్రకటించబడాల్సిన సమాచారం ఉంది. (ప్రక. 14:6, 7) క్రీస్తు పరలోకంలో పరిపాలిస్తున్నాడు, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం త్వరలో నాశనం చేయబడుతుంది, దేవుని రాజ్యం భూ ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. (దాని. 2:44; ప్రక. 11:15; 17:16) కాబట్టి దేవుని రాజుగా ఇప్పుడు పరిపాలిస్తున్న రాజును గుర్తించి, మహాబబులోను నుండి బయటికి వచ్చి, విశ్వాసంతో యెహోవా నామమునుబట్టి ప్రార్థించడం ప్రజలకు అత్యవసరం. (కీర్త. 2:11, 12; రోమా. 10:13; ప్రక. 18:4) జీవానికి నడిపించే విద్యను ఇతరులతో పంచుకోవడంలో మనం సాధ్యమైనంత పూర్తిగా భాగం వహిద్దాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి