ప్రతిపాదనను పరిస్థితికి అనుగుణంగా మలచుకోవడం ద్వారా—వ్యక్తిగత ఆసక్తి చూపించడం
1 అపొస్తలుడైన పౌలు తన సువార్త ప్రతిపాదనను ఎల్లప్పుడూ తన ప్రేక్షకుల నేపథ్యానికి, మనస్తత్వానికి అనుగుణంగా మలచుకోవడంలో చక్కని మాదిరి ఉంచాడు. (1 కొరిం. 9:19-23) మనం కూడా అలాగే మలచుకోవడానికి ప్రయత్నించాలి. మనం కాస్త ముందుగానే ఆలోచిస్తే మన రాజ్య పరిచర్యలో వచ్చే మాదిరి ప్రతిపాదనలను మన క్షేత్రంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా మలచుకోవచ్చు. మనం ఒక ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు గృహస్థుని ఆసక్తిని వెల్లడిచేసే విషయాలను మనం గమనించి వాటిని మన ప్రతిపాదనలో చేర్చవచ్చు. అయితే మన పరిచర్యలో పరిస్థితికి అనుగుణంగా మలచుకోవడానికి సహాయం చేసే వేరే పద్ధతి కూడా ఉంది.
2 గృహస్థుని ప్రతిస్పందనకు అనుగుణంగా మన ప్రతిపాదనను మలచుకోవడం: మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు సాధారణంగా ఒక ప్రశ్న అడిగి ప్రత్యుత్తరమిమ్మని గృహస్థులను అడుగుతాం. మీరు ఆయన ప్రత్యుత్తరాన్ని ఎలా దృష్టిస్తారు? ఆయన ప్రత్యుత్తరాన్ని యాంత్రికంగా స్వీకరించి మీరు సిద్ధపడిన ప్రతిపాదననే చెప్పడానికి ఇష్టపడతారా? లేక మీ ప్రతిపాదన, గృహస్థుడి వ్యాఖ్యానాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు చూపిస్తుందా? మీరు ఇతరులు చెప్పే విషయాల్లో నిజమైన ఆసక్తి చూపిస్తే వారి మనసుల్లో నిజంగా ఏముందో తెలుసుకోవడానికి నేర్పుతో కూడిన మరికొన్ని ప్రశ్నలు ఉపయోగించగలుగుతారు. (సామె. 20:5) అలా మీరు శ్రోతల చింతలతో చాలా సూటిగా వ్యవహరించే రాజ్య సందేశపు అంశాలపై దృష్టి నిలపవచ్చు.
3 అలా చేయడానికి, ప్రారంభంలో మనం చర్చించాలనుకున్న అంశాలు కాక వేరే అంశాల గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య గురించి వ్యాఖ్యానిస్తూ మన ప్రతిపాదనను ప్రారంభించినప్పుడు గృహస్థుడు తనను కలవరపెడుతున్న స్థానిక లేక వ్యక్తిగత సమస్య గురించి చెప్పవచ్చు. అలాంటప్పుడు గృహస్థుని అవసరాలను తీర్చాలని మనకున్న నిజమైన ఆసక్తి, అతనికి చాలా ప్రాముఖ్యమైన విషయం మీద బైబిలు చర్చను కేంద్రీకరించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది.—ఫిలి. 2:4.
4 మన ప్రతిపాదనను మలచుకోవడం: గృహస్థుడు ఒక ప్రశ్నను లేవనెత్తినప్పుడు, ఆ విషయం మీద అదనపు సమాచారం కోసం మనం పరిశోధన చేయగలిగిన తర్వాత, వేరే సమయంలో చర్చను కొనసాగించడం ప్రయోజనకరంగా ఉన్నట్లు మనం కనుగొనవచ్చు. ఆ అంశాన్ని సమగ్రంగా చర్చించే ప్రచురణలను కూడా మనం ఇవ్వవచ్చు. ఇవన్నీ ఇతరులు యెహోవాను తెలుసుకొనేలా సహాయం చేయడంలో మనకున్న నిజమైన ఆసక్తిని ప్రతిబింబిస్తాయి.—2 కొరిం. 2:17.