కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/05 పేజీ 4
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 11/05 పేజీ 4

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోట నవం. 15

“మానవజాతిని పట్టిపీడిస్తున్న సమస్యలు విషమిస్తున్నాయే గానీ పరిష్కృతం కావడంలేదెందుకని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దానికిగల కారణమేమిటో వివరిస్తున్న ఈ లేఖనాన్ని మీరు ఎప్పుడైనా చదివారా? [ప్రకటన 12:9 చదవండి. ఆ తర్వాత ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక, మానవులను మోసగించడంలో అపవాది పన్నే పన్నాగాల గురించి, అతని ప్రభావాన్ని మనం ఎలా నిరోధించవచ్చనే విషయం గురించి చర్చిస్తుంది.”

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“మన స్నేహితులు మన మీద ప్రభావం చూపిస్తారని మీరు అనుకుంటున్నారా? [1 కొరింథీయులు 15:33 చదివి, 13వ పేజీలోని ఆర్టికల్‌ను చూపించండి.] మనం చెడు సహవాసులతో స్నేహం చేయకుండా ఉండేలా సహాయం చేసే ఆచరించదగ్గ సలహాలు ఈ ఆర్టికల్‌లో ఉన్నాయి.”

కావలికోట డిసెం. 1

“‘అర్మగిద్దోను’ అనే మాట విన్నప్పుడు చాలామంది మనసుల్లో భయంకరమైన సామూహిక విధ్వంసం మెదులుతుంది. [3వ పేజీలోని బాక్సును చూపించండి.] అర్మగిద్దోను నిజానికి మనకు సంభవించగల మంచి విషయాల్లో ఒకటని తెలుసుకోవడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుందా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక, అది ఎందుకు ఒక మంచి విషయమో వివరిస్తుంది.” 2 పేతురు 3:13 చదవండి.

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“చాలామందికి నివసించడానికి మంచి స్థలం కొనుక్కొనే స్తోమత లేదు. ప్రతి ఒక్కరికీ సరిపోయేంత గృహవసతి ఉండే రోజు వస్తుందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] తేజరిల్లు! పత్రిక గృహవసతి సంక్షోభం గురించిన తాజా సమాచారాన్ని అందజేస్తుంది. దేవుడు చేసిన ఈ వాగ్దానం నెరవేరుతుందని మనమెందుకు నమ్మకం కలిగివుండవచ్చో కూడా ఇది తెలియజేస్తుంది.” యెషయా 65:21, 22 చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి