పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“నేడు మన ఆరోగ్యానికున్న అనేక ప్రమాదాల్లో కీటక సంక్రమిత వ్యాధులు కూడా ఉన్నాయి. ఈ వ్యాధులనుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తీసుకోగల కొన్ని జాగ్రత్తలున్నాయని మీకు తెలుసా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక ఆ జాగ్రత్తలేమిటో చర్చించడమే కాక, అనారోగ్యం లేని కాలం తీసుకువస్తానని దేవుడు చేసిన వాగ్దానం గురించి కూడా చర్చిస్తుంది.” యెషయా 33:24 చదివి ముగించండి.
కావలికోట జూలై 15
“ప్రజలు ఒంటరిగా ఉండడానికే మొగ్గుచూపడం ఈ మధ్య ఎక్కువైందని చాలామంది గమనించారు. అలా ఉండడం జ్ఞానయుక్తమని మీకనిపిస్తుందా? [ప్రతిస్పందించనివ్వండి.] సహచర్యం విలువను తెలియజేసే జ్ఞానవంతమైన ఈ మాటలను గమనించండి. [ప్రసంగి 4:9, 10 చదవండి.] మనందరికీ ఇతరులు ఎందుకు అవసరమో, ఒంటరిగా ఉండడమనే సమస్యను ఎలా పరిష్కరించవచ్చో ఈ పత్రిక చర్చిస్తుంది.”
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“నేడు ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఒకటి, ఇతరులతో సత్సంబంధాలు కలిగివుండడం. మనం మాట్లాడే విధానం చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, కాదంటారా? [ప్రతిస్పందించనివ్వండి. 14వ పేజీలోని చిత్రం చూపించి ఆ ఆర్టికల్ అంశం చదవండి.] తేజరిల్లు! యొక్క ఈ సంచిక కొన్ని ఆచరణాత్మకమైన సలహాలు ఇస్తుంది.” ఎఫెసీయులు 4:29 చదివి ముగించండి.
కావలికోట ఆగస్టు 1
“ఒక నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో సగంకంటే ఎక్కువమంది పేద జీవన పరిస్థితుల్లో జీవిస్తున్నారని మీకు తెలుసా? దీనిని పరిష్కరించేందుకు ఏమైనా చేయవచ్చంటారా? [ప్రతిస్పందించనివ్వండి.] కావలికోట యొక్క ఈ సంచిక బైబిలులో నివేదించబడినట్లు పేదరికానికి శాశ్వతమైన పరిష్కారాన్ని సూచిస్తోంది.”—కీర్తన 72:12, 13, 16 చదవండి.