కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/03 పేజీ 1
  • పునరుత్తేజాన్నిచ్చే పని

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పునరుత్తేజాన్నిచ్చే పని
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘మీమీద నా కాడిని ఎత్తికొనుడి’
    మన రాజ్య పరిచర్య—2008
  • “నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • “నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యేసు సేదదీర్పును ఇచ్చాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 8/03 పేజీ 1

పునరుత్తేజాన్నిచ్చే పని

1 బైబిలు సందేశాన్ని అంగీకరించి దాన్ని తమ జీవితాల్లో అన్వయించుకునే వారందరికీ అది పునరుత్తేజాన్నిస్తుంది. (కీర్త. 19:7,8) అది వారికి అబద్ధ బోధలనుండి హానికరమైన అభ్యాసాల నుండి బయటపడేందుకు సహాయపడుతుంది, భవిష్యత్తు గురించి విశ్వసనీయమైన నిరీక్షణనిస్తుంది. అయితే ఈ ప్రయోజనం పొందేది సువార్తను స్వీకరించేవారు మాత్రమే కాదు. పునరుత్తేజాన్నిచ్చే ఆ బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకునేవారు కూడా స్వయంగా పునరుత్తేజితులవుతారు.—సామె. 11:25.

2 పరిచర్య ద్వారా చైతన్యవంతులవడం: ప్రకటించేపని, శిష్యులను చేసేపని కూడా భాగమైన క్రైస్తవ శిష్యరికపు కాడిని, ఎవరు అంగీకరిస్తారో వారి “ప్రాణములకు విశ్రాంతి దొరకును” అని యేసు చెప్పాడు. (మత్త. 11:29) ఇతరులకు సాక్ష్యమివ్వడం చైతన్యవంతులను చేస్తుందని ఆయన స్వయంగా తెలుసుకున్నాడు. అది ఆయనకు ఆహారం వంటిది. (యోహా. 4:34) ప్రకటించడానికి ఆయన 70 మంది శిష్యులను పంపించినప్పుడు, యెహోవా తమ ప్రయత్నాలకు మద్దతునివ్వడం చూసి వారు సంతోషించారు.—లూకా 10:17.

3 అదేవిధంగా నేడు అనేకమంది క్రైస్తవులు ప్రకటనా పనిలో పాల్గొనడం ద్వారా చైతన్యవంతులయ్యారు. ఒక సహోదరి ఇలా అన్నది: “పరిచర్య నా జీవితానికి నిర్దిష్ట మార్గాన్ని, సంకల్పాన్ని ఇస్తుంది కాబట్టి అది పునరుత్తేజకరంగా ఉంటుంది. నేను సేవలో పాల్గొన్నప్పుడు వ్యక్తిగత సమస్యలు, దైనందిన ఆందోళనలు తెరమరుగై పోతాయి.” ఆసక్తిగల మరొక పరిచారకురాలు ఇలా అన్నది: “యెహోవా నిజమైన వ్యక్తి అని పరిచర్య నాకు ప్రతిదినం గుర్తుచేస్తుంది, అది నాకు ప్రశాంతతను, మానసిక సంతోషాన్ని ఇస్తుంది. వేరే ఏ పని చేసినా అది దొరకదు.” మనం “దేవుని జతపనివారమై” ఉండడం ఎంత మహత్తరమైన అవకాశమో కదా!—1 కొరిం. 3:9.

4 క్రీస్తు కాడి సుళువైనది: క్రైస్తవులు ‘పోరాడాలని’ ఉద్బోధించబడినప్పటికీ, మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇమ్మని యేసు అడగడు. (లూకా 13:24) వాస్తవానికి ఆయన ‘తన కాడిని ఎత్తుకొమ్మని’ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. (మత్త. 11:29) కష్ట పరిస్థితులతో పోరాడాల్సివచ్చేవారు, తమ పూర్ణాత్మ సేవ పరిమితమైనదే అయినా అది దేవునికి ఎంతో సంతోషం కలిగిస్తుందనే నమ్మకంతో ఉండవచ్చు.—మార్కు 14:6-8; కొలొ. 3:23.

5 తన నామం కోసం మనం ఎంత చేసినా దాన్ని విలువైనదిగా ఎంచే దేవుణ్ణి సేవించడం ఎంత ఉత్తేజకరమో కదా! (హెబ్రీ. 6:10) మనం ఎల్లప్పుడూ మన శాయశక్తులా కృషి చేద్దాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి