“నేను దృఢంగా ఉన్నాను! దృఢంగా ఉన్నాను! దృఢంగా ఉన్నాను!”
1 నాజీ మారణహోమాన్ని తప్పించుకుని బ్రతికి బయటపడిన విశ్వసనీయుడైన ఒక క్రైస్తవుని మాటలవి. అవి నాజీల క్రూరత్వాన్ని సైతం లక్ష్యపెట్టకుండా తమ నమ్మకాల్ని దృఢంగా కాపాడుకున్న వేలాదిమంది జీవించివున్న, మృతులైన యెహోవాసాక్షుల కృతనిశ్చయానికి ప్రతిధ్వనిగా కూడా ఉన్నాయి. (ఎఫె. 6:11, 13) యెహోవాసాక్షులు నాజీల దౌర్జన్యానికి వ్యతిరేకంగా దృఢంగా నిలుచున్నారు (ఆంగ్లం) అనే వీడియోలో ఉత్తేజకరమైన వారి ధైర్యం, వారి విజయాల గురించి మనకు కనిపిస్తుంది. దాన్ని చూశాక, తమ మనస్సులో నాటుకున్న విషయాలను తమ భావాలను ఇతరులతో పంచుకోమని సంఘంలోని వారందరూ ప్రోత్సహించబడుతున్నారు.
2 ఈ ప్రశ్నలను ఆలోచించండి: (1) నాజీలకు విరుద్ధంగా యెహోవాసాక్షులు దృఢంగా ఎందుకు నిలబడ్డారు? (2ఎ) ఒక నినాదం సంబంధంగా ఎలాంటి వ్యతిరేకమైన అభిప్రాయాలు వెలువడ్డాయి, ఎందుకు? (2బి) అది సాక్షుల కుటుంబాల్ని ఎలా ప్రభావితం చేసింది? (3) కాన్సంట్రేషన్ క్యాంపులకు ఎంతమంది సాక్షులు పంపించబడ్డారు, వారక్కడ ఎలా గుర్తించబడ్డారు, గెస్టపో వారితో ఎలా వ్యవహరించింది? (4) విడుదల పొందడం కోసం మన సహోదరులు ఏ మూల్యాన్ని చెల్లించడానికి సిద్దంగా లేరు? (5ఎ) హిట్లర్ పరిపాలనలోని అకృత్యాలకు విరుద్ధంగా యెహోవాసాక్షులు ఎప్పుడు, ఎలా గళం విప్పారు? (5బి) హిట్లర్ ఎలా ప్రతిస్పందించాడు? (6) యెహోవా ప్రజల ఏకీభావం అటు ఆధ్యాత్మికంగాను, ఇటు శారీరకంగానూ వారికీ మరితరులకూ ఎలా జీవదాయకంగా పరిణమించింది? (7) ఒక కాన్సంట్రేషన్ క్యాంపులో ఏ రాజ్యగీతం వ్రాయబడింది. (8) ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు యెహోవాపట్ల మీ యథార్థతను కాపాడుకోవడానికి విశ్వసనీయులైన ఏ పురుషుల, స్త్రీల, యౌవనస్థుల మాదిరులు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి? (1999 వార్షికపుస్తకము, [ఆంగ్లం] 144-7 పేజీలు కూడా చూడండి.) (9) ఈ వీడియో ఒక యెహోవాసాక్షిగా మీరు లోక సంబంధి కాదన్న విషయాన్ని, మీరెలా భావించేలా చేస్తుంది?
3 దృఢంగా నిలుచున్నారు అనే వీడియోలో చిత్రీకరించబడిన యెహోవాసాక్షుల ధైర్యసాహసాలతో కూడిన మాదిరి యౌవనస్థులూ, చివరికి సాక్షులు కానివారు కూడా మత అసహనము, తోటివారి ఒత్తిడి, మనస్సాక్షి వంటి వివాదాంశాల్లో దృఢంగా నిలబడడానికి సహాయం చేయగలదు. మీరు ప్రాథమిక లేదా ఉన్నత పాఠశాలకు వెళ్తున్న విద్యార్థి అయినట్లైతే, ఈ సమాచారాన్ని మీ తరగతిలోని విద్యార్థులతో పంచుకోవడానికి అనుమతి కోసం ఉపాధ్యాయులను అడగ్గలరా? బహుశ, చరిత్రలో ఎక్కువగా తెలియని ఒక విషయమనీ, లేక నైతిక పాఠం ఉన్న ఒక డాక్యుమెంటరీ అనీ అంటూ దీని కాపీని మీరు వారికి ఇవ్వవచ్చు.
4 సరైనది చేయడంలో దృఢంగా ఉంటూ దేవుణ్ణి ప్రీతిపర్చేందుకు దైవిక బోధ ఎలా ఆధ్యాత్మిక బలాన్నిస్తుందో చూపించేందుకు దృఢంగా నిలుచున్నారు వీడియో ఒక అద్భుతమైన ఉపకరణం. (1 కొరిం. 16:13) సత్యంలో ఆసక్తిని చూపించే ప్రతి ఒక్కరితో దాన్ని పంచుకోండి.