ఒక మందగా స్థిరముగా నిలబడుట
1 1990 కేలండరు సంవత్సరమునకు గల ప్రత్యేక సమావేశ దినము “ఒక మందగా స్థిరముగా నిలబడుట” అను ముఖ్యాంశమును కలిగియుండును. ఈ ముఖ్యాంశము ఫిలిప్పీ. 1:27పై ఆధారపడియున్నది. ఉదయకాల కార్యక్రమము స్థిరముగా నిలుచు అవసరము. స్థిరముగా నిలిచిన ఉదాహరణలు, స్థిరముగా నిలుచునట్లు మనకు సహాయపడు ఏర్పాట్లు, మనలను బలహీనపరచు ప్రభావములకు వ్యతిరేకముగా మనలనెట్లు రక్షించుకొనగలము అను సమాచారముతో యుండును. ఉదయకాల కార్యక్రమ ముగింపున బాప్తిస్మము పొందుటకు ఏర్పాట్లుండును. బాప్తిస్మమును గూర్చి తలంచువారందరు ఆర్గనైజ్డ్ టు అకంప్లిష్ అవర్ మినిస్ట్రీ అను పుస్తకములోని ప్రశ్నలను పరిశీలించు ఏర్పాట్లు చేయులాగున ప్రిసైడింగ్ ఓవర్సీర్ ఈ విషయమును చాలా ముందుగా తెలుసుకొనునట్లు చేయవలెను.
2 మధ్యాహ్నము వాచ్‌టవర్ సారాంశము, ఆ తదుపరి పరిచర్యలో అనుకూలవైఖరితో యుండుటకు ప్రోత్సాహము, పరిచర్యలో యితరులకు సహాయము చేయుటకు ఉపదేశము మరియు ఒకే ఆత్మయందు స్థిరముగా నిలువబడుటకు తగిన ఆచరణయోగ్యమైన సూచన యుండును. అన్ని సమయములకంటెను, యిప్పుడు యెహోవా ముందు ఒక మందగా స్థిరముగా నిలబడు అవసరమున్నది. “సత్యరాధన కొరకు మనము ఐక్యముగా నిలబడుటయనునది సాతాను లోకమును ఆవరించుకొనియున్న విభాగిత శక్తులనుండి మనలను రక్షించి, సత్యారాధనలో మనతోపాటు చేరుటకు యితరులకు సహాయపడు బలమైన స్థానములో మనలనుంచును.
3 కార్యక్రమము ఆత్మీయంగా నిర్మాణాత్మకముగా యుండును కావున, ఆ దినమంతటికి హాజరగుటకు మనమందరము ఏర్పాట్లు చేసుకొనగోరుదుము. మీ “ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమము ఎప్పుడు ఉండునో మీ ప్రాంతీయకాపరి మీకు తెలియజేయును.