మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
ఇటీవలి కావలికోట సంచికలు మీకు ఆచరణాత్మక విలువకలవిగా మీరు కనుగొన్నారా? అలాగైతే, మీ జ్ఞాపకశక్తిని ఈ క్రింది ప్రశ్నలతో ఎందుకు పరీక్షించుకోకూడదు:
◻ అమ్మోనీయుల వినాశనం నుండి మనమే పాఠాన్ని నేర్చుకోగలం? (జెఫన్యా 2:9, 10)
యెహోవా తన దయకు బదులుగా ద్వేషం చూపడాన్ని అలక్ష్యం చేయడు, తాను పూర్వకాలంలో చేసినట్లుగానే తన నిర్ణీత సమయంలో ఆయన మరలా చర్య తీసుకుంటాడు. (కీర్తన 2:6-12 పోల్చండి.)—12/15, పేజీ 10.
◻ ముఖ్యమైన ఏ రెండు విధాల్లో క్రైస్తవులు శాంతిని కలిగి ఉన్నారు?
మొదట, వారు “ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము” కలిగియున్నారు. (రోమీయులు 5:1) రెండవదిగా, “మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది”యునైన “పైనుండివచ్చు జ్ఞానము”ను పెంపొందించుకోవడం ద్వారా వారిమధ్య వారికి సమాధానముంది. (యాకోబు 3:17)—1/1, పేజీ 11.
◻ దేవుని వాక్యంతో పోల్చబడిన కొన్ని విషయాలేవి, ఇది మనకెలా సహాయకరంగా ఉండగలదు?
దేవుని వాక్యం పోషణనిచ్చే పాలతోను బలమైన ఆహారంతోను సేదదీర్చే మరియు శుభ్రపర్చే నీళ్ళతోను ఒక అద్దంతోను మరియు పదునైన ఖడ్గంతోను పోల్చబడింది. ఈ పదాలు దేన్ని సూచిస్తున్నాయో అర్థం చేసుకోవడం బైబిలును ప్రభావవంతంగా ఉపయోగించేందుకు పరిచారకునికి సహాయపడుతుంది.—1/1, పేజీ 29.
◻ సమతూకమైన లౌకిక విద్య ఏం చేయడానికి మనకు సహాయపడాలి?
బాగా చదవడానికి, స్పష్టంగా వ్రాయడానికి, మానసికంగా నైతికంగా ఎదగడానికి, దైనందిన జీవితానికి మరియు ప్రభావవంతమైన పరిశుద్ధ సేవకు అవసరమైన ఆచరణాత్మకమైన తర్ఫీదును పొందడానికి సహాయపడాలి.—2/1, పేజీ 10.
◻ విద్యను గూర్చిన ఏ విలువైన పాఠాన్ని యేసు నుండి మనం నేర్చకోగలం?
విద్యను మన స్వకీయ మహిమ కొరకు కాక, మహాగొప్ప విద్యాబోధకుడైన యెహోవా దేవునికి స్తుతిని తెచ్చేందుకే ఉపయోగించాలి. (యోహాను 7:18)—2/1, పేజీ 10.
◻ దేవుని రాజ్యం అంటే ఏమిటి?
పాప మరణాల ప్రభావాల్ని నిర్మూలించి భూమిపై నీతియుక్తమైన పరిస్థితుల్ని పునఃస్థాపించడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చే దైవికంగా స్థాపించబడిన పరలోక ప్రభుత్వమే ఆ రాజ్యం. (దానియేలు 2:44; ప్రకటన 11:15; 12:10)—2/1, పేజీ 16.
◻ హింసను శాశ్వతంగా నిర్మూలించేందుకు అవసరమైన విద్యను బైబిలెలా ఇస్తుంది?
శాంతిని ప్రేమించేవారిగాను నీతిమంతులుగాను ఉండేందుకు యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా తన ప్రజలకు బోధిస్తాడు. (యెషయా 48:17, 18) దేవుని వాక్యం వ్యక్తి హృదయాన్ని చేరుకుని, స్పర్శించి, అతని ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చే శక్తిగలది. (హెబ్రీయులు 4:12)—2/15, పేజీ 6.
◻ యెషయా 35 వ అధ్యాయంలోని ప్రవచనం ఎలా మూడు నెరవేర్పులను కలిగివుండగలదు?
యూదులు సా.శ.పూ. 537లో బబులోను చెరనుండి తిరిగి వచ్చినప్పుడు యెషయా ప్రవచనపు మొదటి నెరవేర్పు జరిగింది. మహా బబులోను చెరనుండి ఆత్మీయ ఇశ్రాయేలు విడుదల మొదలుకొని నేటి వరకు కొనసాగుతున్న ఆత్మీయ నెరవేర్పును కలిగి ఉంది. భూమిపైని అక్షరార్థ పరదైసు పరిస్థితులను గూర్చి బైబిలు ఇచ్చిన అభయంతో ముడిపెట్టబడిన మూడవ నెరవేర్పు కూడా దానికి ఉంటుంది. (కీర్తన 37:10, 11; ప్రకటన 21:4, 5)—2/15, పేజీ 17.
◻ మానవులయందలి దేవుని వ్యక్తిగత శ్రద్ధ తన కుమారుడైన యేసు చేసిన అద్భుతాల్లో ఎలా ప్రదర్శించబడింది?
“తండ్రి యేది చేయుట” యేసు “చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు” కనుక, ఆయన చూపిన సానుభూతి యెహోవాకు తన సేవకుల్లోని ప్రతి ఒక్కరి మీద ఉన్న శ్రద్ధను ఆర్ద్రతతో చిత్రీకరిస్తుంది. (యోహాను 5:19)—3/1, పేజీ 5.
◻ యోహాను 5:28, 29 నందు ఉపయోగించబడిన ‘జ్ఞాపకార్థ సమాధి’ అని ఉపయోగించబడిన పదం దేనిని సూచిస్తుంది?
మరణించిన ఆ వ్యక్తి వారసత్వంగా పొందిన గుణాలతో సహా, ఆ వ్యక్తి యొక్క పూర్తి జ్ఞాపకాలతో సహా, అతని గురించి లేక ఆమె గురించి యెహోవా గుర్తుంచుకుంటాడు అని ఇక్కడ ఉపయోగించబడిన మ్నె·మియోʹన్ (జ్ఞాపకార్థ సమాధి) అనే గ్రీకు పదం సూచిస్తుంది. దేవుడు మానవుల గురించి వ్యక్తిగత ప్రాతిపాదిక మీద శ్రద్ధ తీసుకుంటాడనడానికి ఇది బలమైన రుజువునిస్తుంది!—3/1, పేజీ 6.
◻ జెఫన్యా ప్రవచనంలోని ఏ హెచ్చరికా సందేశం మనకు ఆచరణాత్మక సహాయంగా ఉంటుంది?
మన హృదయాల్లో సందేహాలు వ్రేళ్ళూనేందుకు అనుమతించడానికి మరియు యెహోవా దిన రాకడను మన మనస్సుల్లో లేక హృదయాల్లో వాయిదా వేయడానికి ఇది సమయం కాదు. అలాగే, ఉదాసీనత యొక్క బలహీనపరిచే ప్రభావాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. (జెఫన్యా 1:12, 13; 3:8)—3/1, పేజీ 17.
◻ యెహోవా ఎడల యథార్థంగా ఉండడం ఎందుకు ఒక సవాలుగా ఉంటుంది?
ఎందుకంటే, మన తలిదండ్రుల నుండి మనం వారసత్వంగా పొందిన స్వార్థపూరిత దృక్పథాలతో యథార్థత అనేది ఘర్షణ పడుతుంది. (ఆదికాండము 8:21; రోమీయులు 7:19) మరి ముఖ్యంగా, దేవుని ఎడల మనం యథార్థంగా ఉండకుండా చేయాలని సాతాను మరియు అతని దయ్యాలు పట్టుదల కలిగివున్నారు. (ఎఫెసీయులు 6:12; 1 పేతురు 5:8)—3/15, పేజీ 10.
◻ ఏ నాలుగు విషయాల్లో మనం యథార్థతా సవాలును ఎదుర్కోవలసి ఉంది, అలా చేయడానికి మనకేది సహాయపడుతుంది?
నాలుగు విషయాల్లో అంటే, యెహోవా ఎడల, ఆయన సంస్థ ఎడల, సంఘం ఎడల, మన వివాహ జతల ఎడల యథార్థతను చూపించాలి. ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి ఒక సహాయకమేంటంటే, యథార్థతా సవాలు యెహోవా సర్వోన్నతాధిపత్యాన్ని ఉన్నతపర్చడంతో సన్నిహిత సంబంధాన్ని కలిగివుందనేదాన్ని గుణగ్రహించడం.—3/15, పేజీ 20.
◻ నిబంధన మందసాన్ని యెరూషలేములోనికి తీసుకు వచ్చే ప్రయత్నంలో దావీదు అనుభవం నుండి మనమే పాఠాన్ని నేర్చుకోగలం? (2 సమూయేలు 6:2-7)
మందసాన్ని మోయడాన్ని గూర్చి యెహోవా ఉపదేశాలను దావీదు అలక్ష్యం చేశాడు, మరది విపత్తును తెచ్చింది. ఆయన స్పష్టమైన ఉపదేశాలను మనం అలక్ష్యం చేయడం వల్ల వచ్చే సమస్యలకు మనం యెహోవాను నిందించకూడదన్నది పాఠం. (సామెతలు 19:3)—4/1, పేజీలు 28, 29.