మహాగొప్ప పేరును ఆయన ఎందుకు ఉపయోగించాడు
“నన్ను విమర్శించినవారిలో ఒకరి అభిప్రాయం ప్రకారం, శతాబ్దాలుగా వాడుకగా ఉపయోగించే పదమైన ‘ప్రభువు’ అనేదానికి బదులు ‘యెహోవా’ అనే పదాన్ని ఉపయోగించడంలో నేను పాపం చేశాను.”
1864లో మొదటిసారి ప్రచురించబడిన, జె. జె. స్ట్యూవర్ట్ పరోన్ కీర్తన గ్రంథం యొక్క అనువాదపు రెండవ ముద్రణ ముందుమాటలో వ్యాఖ్యానమది. 1864, జూలై 2న సాటర్డే రివ్యూలో వ్రాస్తూ, యూదా మందిరాల్లోనో క్రైస్తవ చర్చీల్లోనో దేవుని పేరును ఇక ఏ మాత్రం ఉపయోగించడం లేదు కనుక, ఆ అనువాదంలో దాన్ని ఉపయోగించడానికి ఈ విమర్శకుడు అభ్యంతరం చెప్పాడు. యెహోవా అనే పేరు యూదులకు చాలా దగ్గర సంబంధం కలది కనుక, “ప్రభువు” లేదా “దేవుడు” వంటి “స్థానికమైనదో లేక జాతీయమైనదో” కాని మరో పదాన్ని ఉపయోగించాలని ఆయన వాదించాడు.
మానవునికి దేవుడు వెల్లడిచేసిన దానిలోని “ఒక్క అక్షరాన్ని కూడా తీసివేయడానికి” పరోన్ “ఇష్టపడ”లేదు కనుక, ఈ వాదనలను ఆయన అంగీకరించలేదు. హెబ్రీ దైవిక నామాన్ని “ప్రభువు” అని అనువాదం చేసినవారు రెండు హెబ్రీ పదాల తేడాను గ్రహించలేకపోయారు అని ఆయన సరిగ్గానే వాదించాడు.
అంతేకాక, దైవిక నామాన్ని పునరుద్ధరించాలని ఇష్టపడిన యోగ్యులైన గ్రంథకర్తలుండేవారని పరోన్ కచ్చితంగా చెప్పాడు. ప్రసిద్ధ ఆంగ్ల కవి సామ్యేల్ టేలర్ కొలరిడ్జ్ వ్రాసిన ఈ క్రింది దానిని ఆయన ఎత్తి వ్రాశాడు:
“హెబ్రీ నుండి ఆంగ్లంలోకి చేసే అనువాదాన్ని, రెండవదాని ద్వారా సెప్టవజిన్ట్ ద్వారా ఎందుకు అనువాదం చేయాలి? మనం యెహోవా అనే హెబ్రీ పదాన్ని అంగీకరించలేదా? సెప్టవజిన్ట్లోని Κύριος, లేదా ప్రభువు అనే పదం హెబ్రీలోని యెహోవా అనేదానికి లెక్కలేనన్నిసార్లు ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడలేదా? అలాంటప్పుడు, అసలు పదాన్ని తిరిగి ఎందుకు ఉపయోగించకూడదు; పాత నిబంధనలో యెహోవాను యెహోవా అనే భక్తిపూర్వకంగా ఎందుకు అనువాదం చేయకూడదు; క్రొత్త నిబంధనలో పాత నినంధనను సూచించే ప్రతి పాఠ్యాంశంలోను ఆ పాఠ్యాంశంలో సూచించబడిన ఆ హెబ్రీ పదాన్నే ఎందుకు అనువాదం చేయకూడదు?”
హెబ్రీ చతురక్షరి యొక్క సరైన ఉచ్చారణ తెలియకుండా పోయిందని పరోన్ ఒప్పుకున్నాడు, కాని ఆయనిలా తెలిపాడు: “కేవలం అంధవిశ్వాసమే యూదా చర్చీల్లో ఆ పేరు ఉపయోగించడాన్ని మానివేయడానికి కారణమైతే, గ్రీకు మరియు లాటిన్ అనువాదాల నకలు సరిగ్గా వ్రాయని కారణంగా మన స్వంత [ఆంగ్ల] అనువాదంలో ఆ పదం లేకుండా పోయినట్లయితే, ఇది మొదటి పదప్రయోగానికి తిరిగి వెళ్ళడాన్ని వ్యతిరేకించగల శక్తివంతమైన కారణాలు కావు.” “యెహోవా” అనే పదం బాగా తెలిసినది కనుక, పరోన్ దాన్నే ఇష్టపడ్డాడు. అప్పటి నుండి అనేక ఆధునిక అనువాదాలు కూడా దైవిక నామాన్ని ఉపయోగించాయి. పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదము (ఆంగ్లం) యెహోవా అనే నామాన్ని హెబ్రీ మరియు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో 7,200 సార్లకు పైగా ఉపయోగించింది.
తను అనువదించిన కీర్తనల్లో “హెబ్రీ రూపం యొక్క నుడికారంలోను మరియు పదసముదాయ నిర్మాణంలోను దగ్గరగా” ఉండేందుకు పరోన్ ప్రయత్నించాడు. 69వ కీర్తన 5, 6 వచనాలను అనువదించేటప్పుడు, “దేవుడు” (ఎలోహిమ్), “ప్రభువు” (’అదో·నాయిʹ) మరియు “యెహోవా” అనే పదాలను వేరుగా చూపించవలసిన అవసరాన్ని గుర్తించాడు: “దేవా [ఎలోహిమ్], నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా [’అదో·నాయిʹ], సైన్యముల (దేవుడైన) యెహోవా, నీకొరకు కనిపెట్టుకొనువారికి నావలన సిగ్గు కలుగనియ్యకుము ఇశ్రాయేలు దేవా.”