కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 12/1 పేజీలు 24-27
  • వాచ్‌టవర్‌ విద్యా కేంద్రం మిషనరీలను పంపుతుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాచ్‌టవర్‌ విద్యా కేంద్రం మిషనరీలను పంపుతుంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పట్టభద్రులౌతున్న తరగతికి ఉపదేశం
  • విద్యార్థులను గురించి ఎక్కువగా తెలుసుకోవడం
  • గిలియడ్‌ పాఠశాల—50 ఏళ్లనాటిదే, ఇంకనూ వర్థిల్లుతోంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • గిలియడ్‌ పాఠశాల దాని 100వ తరగతి పూర్తయింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • పట్టభద్రులౌతున్న దేవుని వాక్య విద్యార్థులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 12/1 పేజీలు 24-27

వాచ్‌టవర్‌ విద్యా కేంద్రం మిషనరీలను పంపుతుంది

వాచ్‌టవర్‌ గిలియడ్‌ బైబిల్‌ స్కూల్‌ విభిన్న ప్రాంతాల్లో తరగతులను నిర్వహించింది. అమెరికానందలి న్యూయార్క్‌లోని సౌత్‌ లాన్‌సింగ్‌ భవనాల్లో 1943 నుండి 1960 వరకు, 95 దేశాలనుండి వచ్చిన విద్యార్థులుగల 35 తరగతులు, ప్రత్యేక తర్ఫీదును పొందాయి. తర్వాత పాఠశాల న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌నందున్న ప్రపంచ కార్యాలయానికి మార్చబడింది, అక్కడ ఇంచుమించు 28 సంవత్సరాలవరకు పనిచేసింది. 1988 మొదలుకొని 1995 తొలిభాగం వరకు, న్యూయార్క్‌లోని వాల్‌కిల్‌నందు గిలియడ్‌ పాఠశాల తరగతులను నిర్వహించింది.

ఈ సంవత్సరాలలో పాఠశాల తన కార్యనిర్వాహక మార్గాలను విస్తృతం చేసుకుంది. దాని నడిపింపు క్రింద, మెక్సికోలో మూడు తరగతులకు పది వారాలపాటు ఉపదేశం ఇవ్వబడింది; అలాంటి తరగతులు జర్మనీలో ఐదు, భారతదేశంలో రెండు నిర్వహించబడ్డాయి. 1987 నుండి పరిచారకుల శిక్షణా పాఠశాల అనే పేరుతో ఒక సహాయక పాఠశాల 34 దేశాల్లో తరగతులను నిర్వహించింది, అది అర్హులైన యౌవన పురుషులకు ఎనిమిది వారాల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని అందించింది. అయితే, న్యూయార్క్‌నందలి పాటర్‌సన్‌లో క్రొత్తగా నిర్మింపబడిన వాచ్‌టవర్‌ విద్యా కేంద్రమందు 99వ గిలియడ్‌ తరగతికి ఇవ్వబడిన ఉపదేశంలో, 20 వారాలు జరిగిన, పూర్తి బైబిలు యొక్క సమగ్ర పఠనం, యెహోవాసాక్షుల ఆధునికదిన చరిత్ర మరియు సంస్థను గూర్చిన చర్చ, అలాగే విదేశీ మిషనరీ పనిపై విస్తృత సలహాలు చేరి ఉన్నాయి.

సెప్టెంబరు 2న ఆ 99వ తరగతి స్నాతకోత్సవం జరిగింది. మూడు గంటల స్నాతకోత్సవ కార్యక్రమం వాచ్‌టవర్‌ విద్యా కేంద్రం వద్దనున్న క్రొత్త ఆడిటోరియంలో జరిగింది. అది పూర్తిగా నిండిపోయింది. పాటర్‌సన్‌, వాల్‌కిల్‌ మరియు బ్రూక్లిన్‌ బేతేలు భవనాలందున్న మిగతా ప్రేక్షకులు విద్యుత్‌ సంబంధిత సమాచార వ్యవస్థద్వారా ఆ కార్యక్రమాన్ని చూశారు. ఈ దినం పట్టభద్రులౌతున్న తరగతికీ వారి బంధువులకు, దగ్గరి స్నేహితులకే కాక ఈ చక్కని క్రొత్త పాఠశాల భవనాలను నిర్మించడంలో స్వచ్ఛంద సేవకులుగా భాగంవహించిన వందలాదిమందికి కూడా ఒక పర్వదినమే.

తన ప్రారంభ వ్యాఖ్యానాల్లో, పరిపాలకసభ సభ్యుడైన కారీ బార్బర్‌, జరుగుతున్న దాని ప్రాముఖ్యతవైపుకు అవధానాన్ని మళ్లించాడు. ఆయనిలా చెప్పాడు: “ఈ భూమిపై ఇంతవరకు జరిగిన అత్యంత గొప్ప దైవీక విద్యా కార్యక్రమానికి కేంద్ర స్థానం వంటిది.” స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి మధ్య జరుగుతున్న యుద్ధం పరాకాష్టకు మనం సమీపిస్తున్నామని ఆయన వివరించాడు. (ఆదికాండము 3:15) రాబోయే మహాశ్రమ సమయంలో ఉండే ఆ భయంకరమైన పరిస్థితిని తట్టుకుని నిలబడే వారు దేవుని వాక్యాన్ని గూర్చిన సరైన జ్ఞానం కల్గివుండి, దానికి విధేయత చూపే వారు మాత్రమేనని ఆయన చూపించాడు.

“సామెతలు 1:1-4నందు వర్ణింపబడిన పరిపక్వమైన చక్కని పరిస్థితిలోకి అంటే జ్ఞానాన్ని శిక్షణను తెలుసుకోవడం, అవగాహనను వివేచించడం, అంతర్దృష్టిని యథార్థతను, యుక్తాయుక్త పరిజ్ఞానము, నీతిని మరియు ఆలోచనా సామర్థ్యాన్ని ఇచ్చే శిక్షణను అందుకునేందుకు, అన్నిచోట్లా ఉన్న యెహోవా ప్రజలందరినీ తీసుకురావడం కొరకే మన ప్రస్తుత విద్యా కార్యక్రమం రూపొందించబడిందని” ఆయన చెప్పాడు. అలాంటి ఆత్మీయ సాధనాలను కలిగివుండటం ఎంతటి ఆశ్రయదుర్గం!

పట్టభద్రులౌతున్న తరగతికి ఉపదేశం

ఆ ప్రారంభ వ్యాఖ్యానాల తర్వాత పట్టభద్రులౌతున్న తరగతి కొరకు ఐదు క్లుప్త ప్రసంగాల పరంపరలు అందివ్వబడ్డాయి. పూర్వం గిలియడ్‌ ఉపదేశకుడు మరి ఇప్పుడు బ్రూక్లిన్‌లోని ముఖ్య కార్యాలయ సిబ్బందిలో ఒక సభ్యుడైన హెరాల్డ్‌ జాక్‌సన్‌, “మీ దైవీక సంతృప్తిని విడనాడకండి” అని తరగతిని పురికొల్పాడు. ఎంతోకాలం మిషనరీగా ఉండి ప్రస్తుతం పరిపాలకసభ సభ్యునిగా ఉన్న లాయిడ్‌ బారీ, “దీనత్వంతో యెహోవాను సేవించడం” గురించి మాట్లాడాడు. వారు క్రొత్త పరిస్థితుల్లో సర్దుకుపోవడానికి అలాగే తోటి మిషనరీలతో, వారు సేవ చేసే సంఘాలతో మరియు ప్రాంతీయ ప్రజలతో వారు కల్గివుండే సంబంధాల్లో ఈ లక్షణం పట్టభద్రులకు చాలా ప్రాముఖ్యమై ఉంటుందని ఆయన వివరించాడు.

ప్రస్తుతం గిలియడ్‌ బోధనా విభాగంలో సేవచేస్తున్న కార్ల్‌ ఆడమ్స్‌ “విశ్వాసం ఏమి చేసేందుకు మిమ్మల్ని నడుపుతుంది?” అనే ప్రశ్నపై తరగతితో తర్కించాడు. అరణ్యంలోని పరిస్థితులను గురించి ఫిర్యాదు చేసి మళ్లీ ఐగుప్తుకు వెళ్లాలని కోరుకున్న ఇశ్రాయేలీయుల వలె కాక, సమస్యలకు పరిష్కారంగా కల్దీయుల ఊరుకు వెళ్లేందుకు కాకుండా దేవుని రాజ్యం కొరకు ఎదురుచూసిన అబ్రాహాము వలె ఉండమని ఆయన ప్రోత్సహించాడు. (నిర్గమకాండము 16:2, 3; హెబ్రీయులు 11:10, 15, 16) పాఠశాల రిజిస్ట్రార్‌ అయిన ఉలిసీజ్‌ గ్లాస్‌, “మీ దీవెనలను లెక్కించుకోండి” అని తరగతికి చెప్పేందుకు, కీర్తన 73లో రికార్డు చేయబడిన ఆసాపు అనుభవం వైపుకు అవధానాన్ని మళ్లించాడు. పరిపాలకసభ యొక్క బోధనా కమిటిలో సభ్యుడైన ఆల్‌బర్ట్‌ స్క్రోడర్‌ “యెహోవా అందజేస్తాడు” అనే అంశంపై మాట్లాడాడు. అలాంటి ఏర్పాటుకు రుజువుగా, ప్రకటించడం, శిష్యులను చేయడం అనే గొప్ప పనిని సాధించడంలో గిలియడ్‌ పాఠశాలను, దాని పాత్రను సూచించాడు.

తర్వాత, వాచ్‌టవర్‌ సంస్థ అధ్యక్షుడైన మిల్టన్‌ హెన్‌షెల్‌ “ఒకరికొకరు చెందే సభ్యులు” అనే విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు ప్రేక్షకులు అత్యంతాసక్తితో విన్నారు. ఆయన రోమీయులు 12వ అధ్యాయాన్ని చదివి దాని గురించి విస్తృతంగా వ్యాఖ్యానించాడు. వేరే విషయాలతోపాటు ఆయనిలా చెప్పాడు: “సంఘంలోని తోటి సేవకులతో మనకు సన్నిహిత సంబంధం ఉందన్న విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి.” ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “మనమందరం యెహోవా సంపద అయివున్నామని ఒకరిని గురించి ఒకరం భావించడం మంచిది, మరి విమర్శిస్తూ ఉండటం తప్పులెన్నుతూ ఉండటం కన్నా ఎల్లప్పుడూ సహాయం చేసే వారమై ఉందాం. క్రైస్తవ సంఘం యొక్క ఆత్మీయ ఐక్యతను మనం కాపాడుకున్నప్పుడు మనకు మనం సహాయం చేసుకుంటున్నాం.” మిషనరీ గృహాలలో ఆహారాన్ని సిద్ధం చేసేటప్పుడు, అందరూ ఒకేలాంటి ఆహారాన్ని తినలేకపోవచ్చన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా అలా సహాయం చేసే స్వభావాన్ని ఎలా వ్యక్తపర్చవచ్చునో ఆయన చూపాడు. పేద వారైన తోటి క్రైస్తవులతో ప్రాంతీయ సేవలో భాగం వహిస్తున్నప్పుడు విమర్శించే బదులు సహాయం చేయాలని కూడా ఆయన ప్రోత్సహించాడు. మనం ఒకరికొకరం నిజంగా సహాయం చేసుకుంటే, నిర్మాణాత్మకమైన వారిగా ఉంటే మరియు ప్రోత్సహించుకునే వారమై ఉంటే “దాని గురించి యెహోవా మనల్ని ప్రేమిస్తాడని” సహోదరుడైన హెన్‌షెల్‌ సూచించాడు. తాము ఇప్పుడు వదలి వెళ్తున్న దేశాలనుండి చాలా భిన్నంగా ఉండే దేశాలలో సేవచేయబోతున్న ఈ మిషనరీలకు ఇది ఎంతటి మహత్తరమైన సలహానో కదా!

విద్యార్థులను గురించి ఎక్కువగా తెలుసుకోవడం

99వ తరగతిలోని 48 మంది విద్యార్థులకు సగటున 32 సంవత్సరాల వయస్సు ఉంటుంది, మరి వారు ఇప్పటికే పూర్తికాల సేవకు 11 కంటే ఎక్కువ సంవత్సరాలు అర్పించారు.

స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగమైన పరిచయాలు (ఇంటర్‌వ్యూలు), పట్టభద్రులలో కొందరిని గురించి తెలుసుకునేందుకు ప్రేక్షకులకు అవకాశాన్నిచ్చాయి. యెహోవా తమ భౌతిక అవసరాలను తీరుస్తాడన్న విషయంలో తమ విశ్వాసాన్ని పరీక్షించిన సందర్భాలను గురించి అమెరికాకు చెందిన నిక్కీ లియబల్‌ మరియు ఇంగ్లాండుకు చెందిన సైమన్‌ బోల్టన్‌ చెప్పారు. పూర్తికాల పరిచర్యకు వారు మొదటి స్థానం ఇవ్వగా యెహోవా యొక్క శ్రద్ధను వారు అనుభవించారు.

ఫ్రెంచి భాష మాట్లాడే ఈజాబెల్‌ కాజాన్‌ తన స్వదేశంలోని అరబిక్‌ మాట్లాడే ప్రజలకు సాక్ష్యమిచ్చేందుకు తాను అరబిక్‌ నేర్చుకున్నానని చెప్పింది. ఆమె 1987లో ప్రారంభించినప్పుడు, పారిస్‌లోని ఒక చిన్న గుంపులో అరబిక్‌ మాట్లాడే సహోదరులు నలుగురు మరియు ఆ భాషను నేర్చుకుంటున్న మరో సహోదరి, తను మాత్రమే ఉండేవారు. (అది అంత సులభంగా లేకుండినది. వ్యాఖ్యానించేందుకు వారు ప్రతివారం కావలికోట పాఠాన్ని సిద్ధపడటంలో ఎనిమిది గంటలు గడిపేవారు.) వారి ప్రయత్నం యోగ్యమైనదేనా? నేడు అరబిక్‌ మాట్లాడే సాక్షులను ఫ్రాన్స్‌ అంతటా ఐదు సర్క్యూట్‌లుగా ఏర్పాటు చేశారు. తాను పాఠశాలలో నేర్చుకున్న ఫ్రెంచి తన స్వదేశమైన ఫిన్‌లాండ్‌లోని ఆఫ్రికా శరణార్థులకు ప్రకటించడానికి తనకు ఎలా సహాయం చేసిందో మీకో ప్యూరో అనే మరో విద్యార్థి చెప్పాడు, మరి ఆయన మిషనరీ నియామకమైన బెనిన్‌లో కూడా ఆ భాష విలువైనదిగా ఉండగలదు. కెనడాలోని క్యుబెక్‌లో ప్రభావవంతంగా సేవ చేయడానికి ఫ్రెంచి అనర్గళంగా మాట్లాడేందుకు తాను సలిపిన పోరాటాన్ని గురించి బానీ బోజ్‌ వివరించింది. ఫారో ద్వీపాల్లో ఎన్నో సంవత్సరాల సేవాకాలంలో తనకు తన భార్యకుగల అనుభవాల గురించి డెన్మార్క్‌నుండి వచ్చిన బ్యార్‌కీ రాస్‌మాసన్‌ తెలియజేశాడు. అవును, ఈ క్రొత్త మిషనరీలు అనుభవజ్ఞులైన పూర్తికాల సేవకులు.

ఆఫ్రికా, మధ్య మరియు దక్షిణ అమెరికా, తూర్పు ఐరోపా మరియు ప్రాచ్యం, మొదలైన 19 దేశాలకు పట్టభద్రులు నియమించబడ్డారు. మునుపటి తరగతుల పట్టభద్రులు ఇప్పటికే 200 కంటే ఎక్కువ దేశాలలో సేవ చేస్తున్నారు. ఆ పట్టభద్రులలో అనేకులు ఇంకా తమ నియామకాలలో ఎంతో పనిని కలిగి ఉన్నారు. భూదిగంతాల వరకూ రాజ్య సాక్ష్యం ఇవ్వడాన్ని వ్యాప్తి చేయడంలో ఈ క్రొత్త మిషనరీలు ఇప్పుడు వారితో కలుస్తున్నారు.—అపొస్తలుల కార్యములు 1:8.

[25వ పేజీలోని చిత్రాలు]

వాచ్‌టవర్‌ విద్యా కేంద్రంలోని తరగతి గది దృశ్యాలు

[26వ పేజీలోని చిత్రం]

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క 99వ పట్టభదల తరగతి

క్రిందనున్న పట్టికలో, వరుసలు ముందునుండి వెనుకకు ఉన్నాయి, మరి ప్రతివరుసలో పేర్లు ఎడమ నుండి కుడికి ఇవ్వబడ్డాయి.

(1) హెఫీ, ఎస్‌.; రిలే, ఇ.; మోర్టన్‌సన్‌, డి.; అనాబల్‌, ఎ.; బోల్టన్‌, జె.; పూల్‌, జె.; సీమస్‌, జి.; సోజా, ఎల్‌. (2) పాష్‌నిట్‌స్కీ, బి.; షెపర్డ్‌, డి.; పాష్‌నిట్‌స్కీ, డబ్ల్యు.; యార్‌వినన్‌, జె.; పోల్‌సన్‌, కె.; రాస్‌మాసన్‌, ఇ.; స్వేవె, కీ.; ఓల్‌సన్‌, ఎల్‌. (3) పోల్‌సన్‌, ఇ.; సామ్‌సల్‌, టి.; బోజ్‌, బి.; హారిస్‌, ఇ.; కాజాన్‌, ఐ.; లియబల్‌, ఎన్‌.; సోజా, పి.; ప్యూరో, జె. (4) లాజర్‌, కె.; లాజర్‌, వి.; గోల్డన్‌, కె.; బోల్టన్‌, ఎస్‌.; జాన్‌సన్‌, ఎమ్‌.; జాన్‌సన్‌, ఎస్‌.; లియబల్‌, ఎ.; రాస్‌మాసన్‌, బి. (5) హారిస్‌, డి.; సామ్‌సల్‌, డబ్ల్యు.; స్వేవె, ఓ.; హెఫీ, ఆర్‌.; కాజాన్‌, ఎల్‌.; రిలే, టి.; యార్‌వినన్‌, ఓ.; ప్యూరో, ఎమ్‌. (6) మోర్టన్‌సన్‌, డి.; గోల్డన్‌, ఆర్‌.; అనబల్‌, ఎల్‌.; షెపర్డ్‌, ఎమ్‌.; బోజ్‌, ఆర్‌.; సీమస్‌, టి.; పూల్‌, ఇ.; ఓల్‌సన్‌, జె.

[27వ పేజీలోని చిత్రాలు]

ఇప్పటికీ తమ నియామకాల్లో ఉన్నవారు: (ఎడమ) బ్రెజిల్‌లో, తన భార్యయైన ఫెర్న్‌తోపాటు చార్ల్‌స్‌ లెత్‌కో, గిలియడ్‌ యొక్క మొదటి మరియు ఆరవ తరగతుల పట్టభద్రులు; (క్రింద) జపాన్‌లోని మార్తా హెస్‌, గిలియడ్‌ యొక్క ఏడవ తరగతి పట్టభద్రురాలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి