కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 12/1 పేజీలు 28-31
  • “డబ్బు ఎక్కడనుండి వస్తుంది?”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “డబ్బు ఎక్కడనుండి వస్తుంది?”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రాచీన ఇశ్రాయేలీయులు ఉంచిన మాదిరి
  • నేడున్న అవసరత
  • ఆ డబ్బు ఎక్కడికి పోతుంది?
  • యెహోవా మీకు ప్రతిఫలమిస్తాడు
  • రాజ్య ప్రచారసేవకు కొందరెలా విరాళాలిస్తారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • “మీ విలువైనవాటితో యెహోవాను ఘనపరచండి”—ఎలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “ప్రతి శ్రేష్ఠమైన యీవియు” యిచ్చేవాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • యెహోవాకు ఎందుకివ్వాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 12/1 పేజీలు 28-31

“డబ్బు ఎక్కడనుండి వస్తుంది?”

వాచ్‌టవర్‌ సొసైటీ యొక్క “యెహోవాసాక్షులు—ఆ నామం వెనుకనున్న సంస్థ” అనే వీడియోను చూసిన వారు చాలా ప్రభావితం చెందారు. విభిన్న జాతులు మరియు పూర్వ చరిత్రలు గల చక్కని స్త్రీపురుషులు, నవ్వుతూ సామరస్యంతో కలిసి పని చేస్తుండటాన్ని వారు చూస్తారు. సంతోషంగల వేలాది మంది పనివారే కాక, సొసైటీ యొక్క బ్రూక్లిన్‌ ముఖ్యకార్యాలయంలో మరియు న్యూయార్క్‌లోని వాల్‌కిల్‌నందున్న వారి పొలాల వద్దనున్న పెద్ద నిర్మాణాల సముదాయం కూడా వారి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ నిర్మాణాల లోపల అత్యాధునిక సాంకేతికత—ప్రతినెలా అనేక లక్షల ప్రచురణలను ముద్రించి, బైండింగ్‌ చేస్తున్న అత్యంత వేగంతో పని చేసే యంత్రసామాగ్రి, కంప్యూటర్‌ వ్యవస్థల విస్తృత శ్రేణి, మరి దానికి మద్దతునిచ్చే సేవల పూర్తి హంగులు కనుగొనబడగలవని వీడియో చూపిస్తుంది.

ఇది వనరుల అత్యంత విస్తృత వ్యయాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి, “డబ్బు ఎక్కడనుండి వస్తుంది?” అని కొందరు అడుగుతారు.

సొసైటీ యొక్క ప్రపంచ ముఖ్యకార్యాలయాలకు వచ్చే సందర్శకులు కూడా అదేలా ప్రభావితం చెందుతారు. అక్కడ పని చేస్తున్న 3,000 కంటే ఎక్కువమంది స్వచ్ఛంద పరిచారకులకు నివాసాన్ని అందించేందుకు ఉపయోగింపబడే అనేక నిర్మాణాల్లో ఒకటైన, 30 అంతస్తుల క్రొత్త నివాస నిర్మాణాన్ని చూడటానికి వారు తమ తలలు పైకెత్తుతారు. బ్రూక్లిన్‌కు 110 కిలోమీటర్లు ఉత్తరాన ఉన్న క్రొత్త వాచ్‌టవర్‌ విద్యా కేంద్రాన్ని దర్శించడం కూడా అనేకులకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది. ఇంకా నిర్మాణంలో ఉన్న ఆ భవనం, 1,200 మంది పనివారికి నివాసాన్ని ఇవ్వగలదు. అక్కడ ప్రతి సంవత్సరం రెండు మిషనరీ తరగతులకు తర్ఫీదు ఇవ్వబడి, వారి నియామకాలకు విదేశాలకు పంపబడతారు. అమెరికాలోని యెహోవాసాక్షుల 10,000 కంటే ఎక్కువ సంఘాలకు నడిపింపు ఇవ్వబడే స్థలం కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా అనేక బ్రాంచీలు తమ సౌకర్యాలను ఇటీవలనే పెద్దవి చేసుకున్నారు లేక ఆ ప్రక్రియలో ఉన్నారు. ఈ కార్యాలన్నీ చేయడానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. “డబ్బు ఎక్కడనుండి వస్తుంది?” అని ప్రజలు అడుగుతారు.

అది మనలాంటి సామాన్య ప్రజలనుండే వస్తుందన్నదే దానికి జవాబు. వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న, ప్రకటించే మరియు బోధించే ప్రాముఖ్యమైన క్రైస్తవ పని ఇంకా చేయబడటానికి ఏమైనా చేసేందుకు కోరుకుంటున్న ప్రజలు. అలాంటి ఇష్టపూర్వకమైన స్ఫూర్తి పూర్వచరిత్ర లేనిదేమీ కాదు.

ప్రాచీన ఇశ్రాయేలీయులు ఉంచిన మాదిరి

3,500 సంవత్సరాలకు పూర్వం, ఉదార చందాల అవసరత ఏర్పడింది. తన ఆరాధనలో ఉపయోగించేందుకు ఒక మందసాన్ని లేక “గుడారాన్ని” నిర్మించాలని యెహోవా మోషేకు ఉపదేశించాడు. దైవికంగా ఇవ్వబడిన రూపురేఖలకు విభిన్నమైన అమూల్య వస్తువులు అవసరమయ్యాయి. యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము . . . తీసికొని రావలెను.” (నిర్గమకాండము 35:4-9) ఆ ప్రజలెలా ప్రతిస్పందించారు? “ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పని కొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి,” అని ఆ వృత్తాంతం మనకు చెబుతుంది. ఈ ‘మనఃపూర్వక అర్పణలు’ క్రమేణ ఎంత ఎక్కువ అయ్యాయంటే, ‘చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసికొని వచ్చిరి.’ (నిర్గమకాండము 35:21-29; 36:3-5) ప్రజలు ఎంతటి నిస్వార్థ, ఉదార స్ఫూర్తిని ప్రదర్శించారు!

తర్వాత, 500 సంవత్సరాలు గడవకముందే, ఇశ్రాయేలీయులు ఉదారంగా చందాలు వేయాలని మళ్లీ ఒక పిలుపు వెళ్లింది. యెరూషలేములో యెహోవా కొరకు ఒక శాశ్వత మందిరాన్ని నిర్మించాలన్న రాజైన దావీదు కోరిక ఆయన కుమారుడైన సొలొమోను ద్వారా నిజం చేయబడబోతోంది. అవసరమయ్యే దానిలో చాలా భాగాన్ని దావీదు తానే సమకూర్చాడు మరియు చందా వేశాడు. “యెహోవాకు ప్రతిష్ఠితము”ను తీసుకుని రమ్మని దావీదు పిలుపు పంపినప్పుడు ఇతరులు కూడా కలిశారు. దాని ఫలితమేమిటి? “వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదుకూడను బహుగా సంతోష”పడెను. (1 దినవృత్తాంతములు 22:14; 29:3-9) ఇవ్వబడిన వాటిలో కేవలం బంగారం మరియు వెండి విలువ, ప్రస్తుత విలువల్లో 5,000 కోట్ల డాలర్లు ఉంటుంది!—2 దినవృత్తాంతములు 5:1.

ఇవ్వాలని ఎవ్వరూ కూడా బలవంతం చేయబడలేదని ఈ ఉదాహరణలనుండి మనం గమనిస్తాము. అది పూర్తిగా ‘మనఃపూర్వకమైనది’ మరి “పూర్ణమనస్సుతో” ఇవ్వబడినది. అలాంటి చందాతో యెహోవా ఎంతో సంతోషించి ఉంటాడు. అదే విధంగా, అవసరతల్లోవున్న క్రైస్తవులకు సహాయపడేందుకు డబ్బు సేకరించవలసిన అవకాశం వచ్చినప్పుడు, దాన్ని ‘పిసినితనముగా’ ఇవ్వకూడదని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. ఆయనింకా ఇలా చెప్పాడు: “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.”—2 కొరింథీయులు 9:5, 7.

నేడున్న అవసరత

నేడు చందాల అవసరత ఉందా? తప్పకుండా ఉంది, సమయం గడుస్తున్న కొలది ఇంకా ఎక్కువే అవుతుంది. ఎందుకు?

ఈ అంత్య కాలం కొరకు క్రైస్తవులకు ప్రత్యేక సూచనలు ఇవ్వబడ్డాయి. యేసు తన శిష్యులకు ఇలా ఆజ్ఞాపించాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.”—మత్తయి 28:19, 20.

మనం “యుగసమాప్తి”కి మరింత దగ్గరపడుతుండగా ఈ గొప్ప బోధనా, ప్రకటన పనిని సాధించేందుకు చాలా సమయం, వనరులు అవసరమౌతాయి. ఎందుకు? దేవుని రాజ్యవర్తమానాన్ని “భూదిగంతముల వరకు” తీసుకు వెళ్లడంలో ఏమి ఇమిడి ఉందన్నదాని దృష్ట్యా అలా చేయాలి. (అపొస్తలుల కార్యములు 1:8) మొదటి శతాబ్దపు యూదులు లేఖనాల్లో ఎంత ప్రావీణ్యం కలిగి ఉన్నారో అనేకులు ఇప్పుడలా లేరు. వాస్తవానికి, భూనివాసుల్లో చాలామందికి బైబిలు సరిగ్గా తెలియదు మరి దాన్ని దేవుని వాక్యంగా పరిగణించరు కూడా. ప్రచారకులకు తర్ఫీదునిచ్చి, దూరప్రాంతాలకు పంపాలి. (రోమీయులు 10:13-15) ఇమిడివున్న భాషల సంఖ్యను గురించి ఆలోచించండి! ఎవరికైతే ప్రకటింపబడుతుందో వారు తమ స్వంత భాషలో చదివి, పఠించడానికి బైబిళ్లు మరియు బైబిలు ఆధారిత ప్రచురణలు అవసరం. ఓ పద్ధతి ప్రకారం అందరినీ కలుసుకోడానికి, వారు ఇంకా ఇతరులకు సహాయం చేయగల్గేలా వారిని ఆత్మీయ పరిపక్వతకు క్రమంగా తీసుకు రావడానికి పెద్ద ఎత్తులో సంస్థీకరణ కావలసి ఉంటుంది.—2 తిమోతి 2:2.

“రాజ్య సువార్త” మొదట “సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని యేసు చెప్పాడు. (మత్తయి 24:14) కాబట్టి ఆ ప్రాముఖ్యమైన పనిని చేయడానికి మనకు వీలైనదంతా చేయవలసిన సమయం ఇదే. వస్తుసంబంధమైన ఆస్తి ఎలాంటి ఆచరణ యోగ్యమైన విలువను కలిగి లేకుండా అయ్యే పరిస్థితి రాకముందే మన వనరులను శ్రేష్ఠమైన రీతిలో ఉపయోగించుకోవచ్చు.—యెహెజ్కేలు 7:19; లూకా 16:9.

ఆ డబ్బు ఎక్కడికి పోతుంది?

వాచ్‌టవర్‌ సొసైటీ 230 కంటే ఎక్కువ భాషల్లో బైబిలు ప్రచురణలను ప్రచురిస్తుంది, అంధుల కొరకు బ్రెయిలి, మరి బధిరుల కొరకు సంజ్ఞాభాషలో వీడియోలను రూపొందిస్తుంది. అందుకు ప్రతి భాషలో అనువాదకుల, అచ్చు తప్పులను దిద్దేవారి అవసరత ఉంటుంది. ఈ పనంతా చేయడాన్ని గురించి కేవలం ఆలోచిస్తేనే, మరి ప్రత్యేకంగా కావలికోట పత్రికను ప్రతినెలా 121 భాషల్లో, వాటిలో 101 భాషల్లో అన్నీ ఏకకాలంలో ప్రచురిస్తారంటే దాన్ని గురించి ఆలోచించడంతోనే మనం ఆశ్చర్యచకితులం అవుతాం. భూవ్యాప్తంగా ప్రజలందరూ అదే సమాచారాన్ని కలిగివుండి, దాన్ని చదివేందుకు అది అత్యవసరం. రాజ్యవర్తమానాన్ని శ్రవణ లేక దృశ్య రూపంలో మరి అచ్చు రూపంలో ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే కాగితం మరియు ఇతర వస్తువుల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. సహోదరులు ఇచ్చిన చందాలను ఉపయోగించి అలాంటి ఖర్చులను చెల్లించాల్సి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల 75,000 కంటే ఎక్కువ సంఘాలున్న ప్రాంతంలో ప్రకటన మరియు బోధనా పని జరుగుతుంది. వారిని ఐక్యపరచి, ప్రోత్సహించడానికి, తర్ఫీదు పొందిన ప్రయాణ కాపరులు ప్రతి సంఘాన్ని సంవత్సరానికి దాదాపు రెండుసార్లు సందర్శిస్తారు. ఉపదేశాన్ని అందించడంలో సమావేశాలు కూడా ముఖ్యపాత్ర వహిస్తాయి. విశ్వాసాన్ని ఎంతగానో పురికొల్పే సమావేశాల కొరకు పెద్ద వసతులను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంకల్పాల కొరకు కూడా మీ చందాలు ఉపయోగింపబడతాయి.

సమావేశాలు సాధారణంగా సంవత్సరానికి కేవలం మూడుసార్లే జరుపబడినప్పటికీ, ప్రాంతీయ సంఘాలు వారానికి ఐదుసార్లు కూడుకుంటాయి. (నిర్గమకాండము 34:23, 24 పోల్చండి.) సువార్తకు ప్రతిస్పందించి క్రొత్తవారు రావడమంటే, ప్రతి సంవత్సరం వేలకొలది క్రొత్త సంఘాలు చేకూరడమని దానర్థం. సొసైటీ ఇస్తున్న కోట్ల రూపాయల రుణసహాయంతో ప్రతి సంవత్సరం వందలకొలది క్రొత్త రాజ్యమందిరాలు నిర్మింపబడుతున్నాయి, మరితర అనేక రాజ్యమందిరాలు బాగు చేయబడుతున్నాయి, విస్తరించబడుతున్నాయి. అది పదే పదే ఉపయోగింపబడుతున్న రొటేటింగ్‌ ఫండ్‌ అయినప్పటికీ, దాని డిమాండు పెరుగుతూనే ఉంటుంది.

అత్యంత ఎక్కువ పెరుగుదల ఉండిన ప్రాంతాల్లో, పూర్వపు సోవియట్‌ గణతంత్ర రాజ్యానికి లోబడి ఉండిన తూర్పు ఐరోపాలోని దేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పని ప్రారంభమైనదని వస్తున్న వార్తలు ఎంత ఆనందకరమైనవో కదా! ఇప్పుడు మిషనరీలు ఆ దేశాల్లో అనేకమైన వాటికి పంపబడుతున్నారు. ప్రపంచవ్యాప్త బేతేలు కుటుంబంలో ఉన్న 15,000 మంది స్వచ్ఛంద సేవకుల సంఖ్య పెరుగుతుండగా, కొన్ని దేశాల్లో క్రొత్త బ్రాంచీలు స్థాపించబడ్డాయి. వారికి నివాసం కలిగించడానికి బ్రాంచి కట్టడాలను కొనాలి లేక నిర్మించాలన్నది వాస్తవమే. ఈ అవసరతను తీర్చడానికి మీ చందాలు సహాయం చేస్తాయి.

ఈ పనినంతటినీ కూడా సాతాను మరియు అతని దయ్యాలు గమనించకుండా పోలేదు. యెహోవా యొక్క నమ్మకస్థులైన సేవకుల ప్రయత్నాలను అడ్డగించడానికి లేక వారికి సమస్యలను సృష్టించడానికి తమకు వీలైనదంతా వాళ్లు చేస్తారు. (ప్రకటన 12:17) దాని అర్థం, దేవుని న్యాయసూత్రాలకు అనుగుణంగా ప్రకటించి, జీవించడానికి ఆయన ప్రజలకుగల హక్కులను పరిరక్షించడానికి పోరాడవలసి ఉందన్నమాట. దానికి తోడు, సాతాను దుష్ట విధానంలోని యుద్ధ విధ్వంసాలు, అలాగే ప్రకృతి వైపరీత్యాలు అంటే వాటికి గురైన మన సహోదరసహోదరీలకు వారితోపాటు ఉన్న వారికి సహాయ సామాగ్రి తరచూ అవసరమై ఉంటాయన్న మాట. ఈ అత్యవసర మద్దతును ఇచ్చేందుకు మీ చందాలు సహాయం చేస్తాయి.

యెహోవా మీకు ప్రతిఫలమిస్తాడు

ప్రభువు పనిని కొనసాగించడానికి మన సమయాన్ని, వనరులను ఉదారంగా ఉపయోగించడం మనకు గొప్ప దీవెనలను తెస్తుంది. ఎలా? అన్ని తుదకు ఎవరికి చెందుతాయో ఆ దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. “ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును,” అని సామెతలు 11:25 చెబుతుంది. ఆయన ఆరాధనను కొనసాగించడానికి మనం మన వంతు చేస్తే యెహోవా వాస్తవంగా సంతోషిస్తాడు. (హెబ్రీయులు 13:15, 16) ధర్మశాస్త్ర నిబంధన క్రింద అవసరమయ్యే చందాలను తీసుకువచ్చే ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఆయనిలా వాగ్దానం చేశాడు: “దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మలాకీ 3:10) యెహోవా సేవకులు నేడు అనుభవిస్తున్న ఆత్మీయ సంపద, దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చుతాడనడానికి ఆధారం.

రక్షణ దినమును గురించి అందరికీ ప్రకటన చేయవలసిన ఈ గొప్ప పని మరియు యథార్థ హృదయులకు జీవమార్గంపై సహాయం చేయడం ఎప్పటికీ కొనసాగదు. (మత్తయి 7:14; 2 కొరింథీయులు 6:2) అయితే ప్రభువు యొక్క “వేరే గొఱ్ఱెలు” అంతా సమకూర్చబడాలి. (యోహాను 10:16) ఆ సవాలును ఎదుర్కొనడం నేడెంత ప్రాముఖ్యమో కదా! నీతి నివసించే యథార్థమైన నూతన లోకంలోకి ప్రవేశించిన తర్వాత వెనక్కి చూసి, ‘ఆ తుది సేకరించే పనిలో నేను పూర్తి వంతు కలిగి ఉన్నాను’ అని చెప్పేందుకు మనలో ప్రతి ఒక్కరం ఎంత సంతోషంగా ఉంటామో గదా!—2 పేతురు 3:13.

[30, 31వ పేజీలోని బాక్సు]

రాజ్య ప్రచారపనికి కొందరెలా విరాళాలిస్తారు

ప్రపంచవ్యాప్త పనికి చందాలు: “సొసైటీ యొక్క ప్రపంచవ్యాప్త పనికొరకు చందాలు—మత్తయి 24:14” అని వ్రాయబడిన చందా పెట్టెలలో వేయడానికి అనేకమంది కొంత డబ్బును పక్కకు తీసిపెడతారు లేదా తమ బడ్జెట్టులో దాన్ని చేరుస్తారు. ప్రతినెలా ఈ మొత్తాలను సంఘాలు తమ దగ్గరలోని వాచ్‌టవర్‌ సొసైటీ బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి.

బహుమతులు: స్వచ్ఛంద విరాళాలను సూటిగా Watch Tower Bible and Tract Societyకి పంపించవచ్చు. ఆభరణాలను, ఇతర విలువగల నగలను సహితం విరాళంగా ఇవ్వవచ్చు. ఈ చందాతో పాటు అది పూర్తిగా ఒక బహుమతియని తెలియజేసే ఒక క్లుప్త లేఖను కూడ పంపాలి.

షరతుపై విరాళమిచ్చే ఏర్పాటు: వ్యక్తిగత అవసర కలిగినప్పుడు దాతకు ఆ డబ్బు తిరిగి ఇచ్చే ఏర్పాటుతో, దాత మరణపర్యంత వాచ్‌టవర్‌ సొసైటీ ట్రస్టుకు డబ్బు ఇవ్వవచ్చు.

భీమా: జీవిత భీమా పాలసీకి లేదా ఉద్యోగవిరమణ/పింఛను పథక యొక్క లబ్దిదారుగా వాచ్‌టవర్‌ సొసైటీ పేరును సూచించవచ్చు. అలాంటి ఏర్పాట్లను గూర్చి సొసైటీకి తెలియపర్చాలి.

బ్యాంకు ఖాతాలు: బ్యాంకు ఖాతాలను, డిపాజిట్‌ సర్టిఫికెట్లను లేదా వ్యక్తిగత ఉద్యోగవిరమణ ఖాతాలను స్థానిక బ్యాంకు నియమాలను అనుసరించి వాచ్‌టవర్‌ సొసైటీ ట్రస్టు కొరకు లేదా మరణానంతరం వాటిని ఆ సొసైటీకే చెల్లించే ఏర్పాటును చేయవచ్చు. అలాంటి ఏ ఏర్పాటునైనా సొసైటీకి తెలియజేయాలి.

స్టాక్‌లు మరియు బాండ్లు: పూర్తిగా ఒక బహుమతిగా లేదా ఆదాయాన్ని ఎప్పుడూ దాతకు చెల్లించు ఏర్పాటుతో స్టాక్‌లను మరియు బాండ్లను వాచ్‌టవర్‌ సొసైటీకి విరాళంగా ఇవ్వవచ్చు.

ఇళ్లస్థలాలు: పూర్తిగా ఒక బహుమతిగా లేక ఆమె లేదా అతడు జీవించినంత కాలం తానుండే ఆ స్థలంలో నివసించే ఏర్పాటుతో పూర్తిగా అమ్మదగిన ఇళ్లస్థలాలను వాచ్‌టవర్‌ సొసైటీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇలాంటివాటికి సంబంధించిన పత్రాలను వ్రాయకముందు సొసైటీని సంప్రదించాలి.

వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును చట్టబద్ధంగా Watch Tower Society పేర వీలునామా వ్రాయవచ్చు, లేక ఒక ట్రస్టు ఏర్పాటుయొక్క లబ్దిదారుగా సొసైటీ పేరు వ్రాయవచ్చు. ఒక మత సంస్థకు లాభం సమకూర్చే ట్రస్టుకు పన్నులు చెల్లించే విషయంలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను ఇవ్వవచ్చు. వీలునామా లేదా ట్రస్టు ఏర్పాటుకు సంబంధించిన ఒక కాపీని సొసైటీకి పంపాలి.

ఇటువంటి విషయాలలో మరింత సమాచారము కొరకు, Watch Tower Bible and Tract Society of India H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India.కు లేక మీ ప్రాంతీయ బ్రాంచి కార్యాలయానికి వ్రాయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి