రాజ్య ప్రచారసేవకు కొందరెలా విరాళాలిస్తారు
◻ ప్రపంచవ్యాప్త పనికి చందాలిచ్చుట: “సొసైటి యొక్క ప్రపంచవ్యాప్త సేవకొరకు చందాలు—మత్తయి 24:14” అని వ్రాయబడిన చందా పెట్టెలలో వేయడానికి అనేకమంది కొంత డబ్బును ప్రక్కకు తీసిపెడ్తారు లేదా తమ బడ్జెట్టులో దాన్ని చేరుస్తారు. ప్రతినెల ఈ మొత్తాలను సంఘాలు న్యూయార్క్ బ్రూక్లిన్‌లోని ప్రపంచ ముఖ్య కార్యాలయానికి గానీ, తమ దగ్గరలోని వాచ్‌టవర్ సొసైటి బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి.
◻ బహుమతులు: స్వచ్ఛంద విరాళాలను సూటిగా Watch Tower Bible and Tract Society, లేదా ఈ పత్రిక ప్రకాశకులకు పంపించవచ్చును. ఆభరణాలు, ఇతర వెలగల నగలు సహితము విరాళముగా ఇవ్వవచ్చును. ఈ చందాతో పాటు అది పూర్తిగా ఒక విరాళమని తెలియజేసే ఒక క్లుప్త లేఖను కూడ పంపవలెను.
◻ షరతుపై విరాళమిచ్చు ఏర్పాటు: వ్యక్తిగత అవసరము కలిగినప్పుడు దాతకు ఆ డబ్బు తిరిగి ఇచ్చే ఏర్పాటుతో, దాత మరణించు పర్యంతము వాచ్‌టవర్ సొసైటి ట్రస్టుకు డబ్బు ఇవ్వవచ్చును.
◻ భీమా: జీవిత భీమా పాలసీకి లేదా ఉద్యోగవిరమణ/పింఛను పథకము యొక్క లబ్దిదారుగా వాచ్‌టవర్ సొసైటి పేరును సూచించవచ్చును. అలాంటి ఏర్పాట్లనుగూర్చి సొసైటికి తెలియపర్చాలి.
◻ బ్యాంకు ఖాతాలు: బ్యాంకు ఖాతాలను, డిపాజిట్ సర్టిఫికెట్లను లేదా వ్యక్తిగత ఉద్యోగవిరమణ ఖాతాలను స్థానిక బ్యాంకు నియమాలను అనుసరించి వాచ్‌టవర్ సొసైటి ట్రస్టు కొరకు లేదా మరణానంతరము వాటిని ఆ సొసైటికే చెల్లించే ఏర్పాటుచేయవచ్చును. అలాంటి ఏ యేర్పాటునైనను సొసైటికి తెలియజేయవలెను.
◻ స్టాక్‌లు మరియు బాండ్లు: పూర్తిగా ఒక బహుమతిగా లేదా ఆదాయాన్ని ఎప్పుడూ దాతకు చెల్లించు ఏర్పాటుతో స్టాక్లను మరియు బాండ్లను వాచ్‌టవర్ సొసైటికి విరాళముగా ఇవ్వవచ్చును.
◻ ఇళ్లస్థలాలు: పూర్తిగా ఒక బహుమతిగా లేదా ఆమె లేదా అతడు జీవించినంత కాలం తానుండే ఆ స్థలంలో నివసించే ఏర్పాటుతో పూర్తిగా అమ్మదగిన ఇళ్లస్థలాలను వాచ్‌టవర్ సొసైటికి విరాళముగా ఇవ్వవచ్చును. ఇటువంటివాటికి సంబంధించిన పత్రాలను వ్రాయకమునుపు సొసైటిని సంప్రదించాలి.
◻ వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును చట్టబద్ధముగా Watch Tower Society పేర వీలునామా వ్రాయవచ్చును, లేదా ఒక ట్రస్టు ఏర్పాటుయొక్క లబ్దిదారుగా సొసైటి పేరు వ్రాయవచ్చును. ఒక మత సంస్థకు లాభం సమకూర్చే ట్రస్టుకు పన్నులు చెల్లించే విషయంలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలివ్వవచ్చును. వీలునామా లేదా ట్రస్టు ఏర్పాటుకు సంబంధించిన ఒక కాపీని సొసైటికి పంపవలెను.
ఇటువంటి విషయాలలో మరింత సమాచారము కొరకు, Watch Tower Bible and Tract Society of India H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah.కు రాయండి.