“మీ విలువైనవాటితో యెహోవాను ఘనపరచండి”—ఎలా?
“మీ రాబడి అంతటిలో ప్రథమఫలముతో, మీ విలువైనవాటితో యెహోవాను ఘనపరచండి.” దాదాపు 2,600 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఈ ప్రేరేపిత జ్ఞానవాక్యంలో యెహోవా ఆశీర్వాదాలను నిరంతరం అనుభవించడానికైన కీలకం ఇమిడి ఉంది, ఎందుకంటే గ్రంథకర్త ఇంకా ఇలా సూచిస్తున్నాడు: “అప్పుడు మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. మీ గానుగులలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును.”—సామెతలు 3:9, 10, NW.
కాని దేవుని ఘనపరచడం అంటే ఏమిటి? మనం ఏ విలువైన వాటితో యెహోవాను ఘనపరచాలి? మరియు ఇది మనం ఎలా చేయవచ్చు?
“యెహోవాను ఘనపరచండి”
లేఖనాల్లో, ఘనతకు మూల హెబ్రీ పదం కవోధ్, అక్షరార్థంగా “బరువైన” అని దానికి అర్థం. కాబట్టి ఒక వ్యక్తిని ఘనపరచడమంటే అతన్ని లేక ఆమెను గౌరవంగలవారిగా, ప్రభావము గలవారిగా లేక విశేషమైన వారిగా పరిగణించడమని భావం. ఘనతకు మరొక హెబ్రీ పదము యెకర్, అది “అమూల్యం” మరియు “అమూల్యమైనవి” అని కూడా అనువదించబడుతుంది. అదే విధంగా, బైబిలులో “ఘనత” అని అనువదించబడిన గ్రీకు పదమైన టైమ్, గౌరవం, విలువ, అమూల్యత అనే భావాలను ఇస్తుంది. కాబట్టి ఒకరు ఒక వ్యక్తియెడల లోతైన గౌరవాన్ని మరియు ఆదరమును చూపడం ద్వారా ఆ వ్యక్తిని ఘనపరుస్తారు.
ఘనతనివ్వడంలో మరో అంశం కూడా ఉంది. ప్రాచీన పారసీక రాజైన అహష్వేరోషు ప్రాణము తీయవలెనని పన్నిన కుట్రను నమ్మకస్థుడైన యూదుడగు మొర్దెకై ఒక సందర్భంలో బయల్పరచడాన్ని గూర్చిన వృత్తాంతాన్ని పరిశీలించండి. తరువాత, ఆ క్రియకు ప్రతిగా మొర్దెకైను ఘనపరచడానికి ఏమి చేయబడలేదని రాజు తెలుసుకున్నప్పుడు, ఎవరియందు రాజు సంతోషించునో ఆ మనుష్యుని ఎట్లు ఘనపరచవలెనని ఆయన తన ప్రధాన మంత్రియగు హామానును అడిగాడు. హామాను ఆ ఘనత తన కొరకే అయ్యుండవచ్చునని భావించాడు, కాని అతడు ఎంత పొరపాటుపడ్డాడో కదా! అయితే కూడా, అలాంటి వ్యక్తికి “రాజ వస్త్రములను” ధరింపజేయవలెనని “రాజు ఎక్కు గుఱ్ఱమును” ఎక్కించవలెనని హామాను చెప్పాడు. ఆయన ఇలా ముగించాడు: “రాజవీధిలో అతని నడిపించుచు—రాజు ఘనపరచ నపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతనిముందర చాటింపవలెను.” (ఎస్తేరు 6:1-9) ఈ సందర్భంలో, ఒక వ్యక్తికి ఘనత ఇవ్వడంలో ప్రజలందరు ఆయనను ఎంతో ఉన్నతముగా ఎంచేలా ఆయనను బహిరంగంగా ప్రశంసించడం ఇమిడివుంది.
అలాగే, యెహోవాకు ఘనతనివ్వడంలో రెండు అంశాలున్నాయి: వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నతమైన గౌరవాన్నివ్వడం మరియు ఆయన నామం యొక్క బహిరంగ ప్రకటనకి మద్దతునివ్వడం ద్వారా, అందులో భాగం వహించడం ద్వారా ఆయనను బహిరంగంగా ఉన్నతపరచడం చేరి ఉన్నాయి.
‘మీ విలువైనవి’—అవేమిటి?
మన విలువైన వాటిలో నిస్సందేహంగా మన జీవం, సమయం, సామర్ధ్యాలు మరియు మన శక్తి ఇమిడి ఉన్నాయి. మన వస్తుదాయకమైన ఆస్తుల సంగతేమిటి? ఒక బీద విధవరాలు ఆలయంలోని కానుక పెట్టెలో రెండు కాసులు వేయడం చూసినప్పుడు యేసు అనిన మాటలను పరిశీలించండి. “ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి కానుకలు వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని” ఆయన అన్నాడు. (లూకా 21:1-4) యెహోవా ఆరాధనకు తోడ్పడడానికి తన వస్తుదాయక సంపదను ఉపయోగించినందుకు యేసు ఈ విధవరాలిని మెచ్చుకున్నాడు.
గనుక, స్పష్టంగా, సొలొమోను ప్రస్తావించిన విలువైన వాటిలో మనం కలిగియుండగల వస్తుదాయకమైన ఆస్తులన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. “మీ రాబడి అంతటిలో ప్రథమఫలము” అనే పదబంధం మన విలువైన వాటిలో శ్రేష్ఠమైన వాటిని యెహోవాకు ఇవ్వడం అనే తలంపును కల్గివుంది.
వస్తుసంబంధమైన వాటిని ఇవ్వడం దేవున్ని ఎలా ఘనపరుస్తుంది? ఇప్పటికే అన్నీ ఆయనకే చెందవా? (కీర్తన 50:10; 95:3-5) రాజైన దావీదు యెహోవాకు తానుచేసిన హృదయపూర్వక ప్రార్థనలో “సమస్తమును నీవలననే కలిగెను” అని ఒప్పుకున్నాడు. ఆలయ నిర్మాణానికి తాను, తన ప్రజలు చేసిన ఉదారమైన విరాళాల గురించి దావీదు ఇలా అన్నాడు: “నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము.” (1 దినవృత్తాంతములు 29:14) కాబట్టి యెహోవాకు కానుకలిచ్చేటప్పుడు, ఆయన తన హృదయ ఔదార్యంతో మనకిచ్చిన వాటినే మనం కేవలం తిరిగి ఆయనకు ఇస్తున్నాము. (1 కొరింథీయులు 4:7) కానీ, ముందు తెలియజేసినట్లుగా, యెహోవాను ఘనపర్చడంలో ఇతరుల దృష్టిలో ఆయనను ఉన్నతపర్చడం ఇమిడి ఉంది. మరియు సత్యారాధనను పెంపొందింపజేయడానికి ఉపయోగించబడే వస్తుసంబంధ కానుకలు దేవుని ఘనపరుస్తాయి. ఈ విధంగా యెహోవాను ఘనపర్చడాన్ని గురించిన అత్యుత్తమ మాదిరులను బైబిలు కలిగి ఉంది.
గతకాలమందలి మాదిరులు
దాదాపు 3,500 సంవత్సరాల క్రితం, యెహోవా ఇశ్రాయేలీయులకు అరణ్యంలో ఆరాధనా స్థలంగా గుడారాన్ని ఏర్పాటు చేసే సమయం వచ్చినప్పుడు, దైవికంగా ఇవ్వబడిన నమూనా కొరకు విభిన్నమైన అమూల్య వస్తువులు అవసరమయ్యాయి. ‘బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవాకు అర్పణము పోగుచేయుడి’ అని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. (నిర్గమకాండము 35:5) ఆ వృత్తాంతం ఇలా వివరిస్తుంది: “ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పని కొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్టిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి.” (నిర్గమకాండము 35:21) నిజానికి, ప్రజలు తమ స్వచ్ఛంద అర్పణను, పని కొరకు అవసరమైన దాని కంటె ఎంత విస్తారముగా తెచ్చారంటే వారు “ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించేం”తగా తెచ్చారు.—నిర్గమకాండము 36:5, 6.
మరో ఉదాహరణను పరిశీలించండి. గుడారం దాని సంకల్పాన్ని నెరవేర్చిన తరువాత ఆలయ నిర్మాణానికి సిద్ధపాట్లు జరుగుతున్నప్పుడు, తన కుమారుడైన సొలొమోను నిర్మించబోయే ఆలయం కొరకు దావీదు పెద్దమొత్తంలో వ్యక్తిగతంగా విరాళం ఇచ్చాడు. ఇతరులు కూడా కలవచ్చు అని ఆయన పిలుపునిచ్చాడు. ప్రతిస్పందనగా ప్రజలు యెహోవాకు విలువైన బహుమతులను తెచ్చారు. వెండి, బంగారం విలువే ప్రస్తుత విలువల్లో చూస్తే 5,000 కోట్ల డాలర్లు అయ్యుంటుంది. “వారు ఆలాగు మనఃపూర్వకముగా [“స్వచ్ఛందార్పణలు,” NW] ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి.”—1 దినవృత్తాంతములు 29:3-9; 2 దినవృత్తాంతములు 5:1.
మన కాలంలో “స్వచ్ఛందార్పణలు”
మన కాలంలో స్వచ్ఛందార్పణలు ఇవ్వడమనే ఆనందంలో మనం ఏవిధంగా భాగం వహించగలం? ఈ సమయంలో లోకంలో జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యమైన పని రాజ్య ప్రకటన మరియు శిష్యులను తయారుచేయడమే. (మత్తయి 24:14; 28:19, 20; అపొస్తలుల కార్యములు 1:8) రాజ్యం యొక్క భూసంబంధ విషయాలను తన సాక్షులకు అప్పగించడం సరియని యెహోవా భావించాడు.—యెషయా 43:10.
నేడు యెహోవాసాక్షులు చేస్తున్న పనికొరకు డబ్బు అవసరమన్నది స్పష్టమౌతుంది. రాజ్యమందిరాలను, అసెంబ్లీ హాళ్లను, బ్రాంచి కార్యాలయాలను, ఫ్యాక్టరీలను, బేతేలు గృహాలను నిర్మించి వాటిని నిర్వహించడానికి డబ్బు అవసరం. బైబిళ్లను, బైబిలు ఆధారిత ప్రచురణలను అనేక భాషలలో ప్రచురించి పంచిపెట్టడంలో కూడా ఖర్చులు ఇమిడి ఉన్నాయి. అలాంటి సంస్థాగత ఖర్చులకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది? పూర్తిగా స్వచ్ఛందంగా ఇవ్వబడిన విరాళాల ద్వారానే!
విరాళాలలో ఎక్కువ భాగం—యేసు గమనించిన విధవరాలి వంటి—తగుమాత్రపు ఆదాయం ఉన్నవారి నుండే వస్తున్నాయి. యెహోవాను ఘనపరచడమనే ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని వారు తమ “సామర్థ్యము కొలది” తగుమాత్రపు మొత్తాలనే కాక కొన్నిసార్లు “సామర్థ్యముకంటె ఎక్కువగా” కూడా ఇస్తున్నారు.—2 కొరింథీయులు 8:3, 4.
“సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” అని అపొస్తలుడైన పౌలు కొరింథులోని క్రైస్తవులకు తెలియజేశాడు. (2 కొరింథీయులు 9:7) ఉత్సాహంగా ఇవ్వడానికి మంచి ప్రణాళిక అవసరం. పౌలు కొరింథీయులకు ఇలా చెప్పాడు: “నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.” (1 కొరింథీయులు 16:2) అదే విధంగా, వ్యక్తిగతంగా, స్వచ్ఛందంగా, నేడు రాజ్య పని అభివృద్ధికి విరాళాలు ఇవ్వాలనుకొనేవారు అందుకు తమ ఆదాయంలోనుండి కొంత ప్రక్కకు పెట్టవచ్చు.
యెహోవాను ఘనపర్చేవారిని ఆయన ఆశీర్వదిస్తాడు
వస్తుసమృద్ధి దానంతటదే ఆథ్యాత్మిక సమృద్ధికి నడిపించక పోయినప్పటికీ, మన సమయం, సామర్థ్యం, వస్తు సంపదలనే విలువైన వాటిని యెహోవాను ఘనపర్చడానికి ఔదార్యంతో ఉపయోగించడం గొప్ప ఆశీర్వాదాలను తెస్తుంది. ఎందుకంటే సమస్తమును ఎవరికి చెందుతాయో ఆ దేవుడు ఇలా హామీ ఇస్తున్నాడు: “ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును.”—సామెతలు 11:25.
రాజైన దావీదు మరణించిన తరువాత, ఆయన కుమారుడైన సొలొమోను తన తండ్రి సమకూర్చిన స్వచ్ఛంద విరాళాలను యెహోవా నడిపించినట్లుగా ఆ మహోన్నత ఆలయాన్ని కట్టడానికి ఉపయోగించాడు. సొలొమోను దేవుని ఆరాధనలో నమ్మకస్థునిగా ఉన్నంతకాలము, “ఇశ్రాయేలువారేమి యూదావారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును . . . నిర్భయంగా నివసించుచుండిరి.” (1 రాజులు 4:25) ఇశ్రాయేలీయులు ‘తమ విలువైన వాటితో యెహోవాను ఘనపర్చినంతకాలం’ కొట్లు నింపబడి ఉన్నాయి, ద్రాక్షాగానుగలు పొర్లిపారినవి.
తరువాత, ప్రవక్తయైన మలాకీ ద్వారా యెహోవా ఇలా చెప్పాడు: “దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మలాకీ 3:10) యెహోవా సేవకులు నేడు ఆనందిస్తున్న ఆత్మీయ సమృద్ధి దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడనటానికి రుజువుగావుంది.
రాజ్యాసక్తులను పెంపొందింపజేయడానికి మనం మన వంతు చేసినప్పుడు యెహోవా తప్పనిసరిగా సంతోషిస్తాడు. (హెబ్రీయులు 13:15, 16) మరి మనం ‘రాజ్యమును నీతిని మొదట వెదికినట్లయితే’ ఆయన మనల్ని సంరక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. (మత్తయి 6:33) గొప్ప హృదయానందంతో, మనం ‘మన విలువైన వాటితో యెహోవాను ఘనపరుద్దాము.’
[28, 29వ పేజీలోని బాక్సు]
ప్రపంచవ్యాప్త పనికి కొంతమంది స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చే పద్దతులు
“సొసైటీ యొక్క ప్రపంచవ్యాప్త పనికొరకు చందాలు—మత్తయి 24:14” అని వ్రాయబడిన చందా పెట్టెలలో వేయడానికి అనేకమంది కొంత డబ్బును ప్రక్కకు తీసిపెడతారు లేదా తమ బడ్జెట్టులో దాన్ని చేరుస్తారు. ప్రతినెలా సంఘాలు ఈ మొత్తాలను న్యూయార్క్ బ్రూక్లిన్‌లో ఉన్న ప్రపంచ ప్రధాన కార్యాలయానికి లేదా స్థానిక బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి.
డబ్బు రూపకమైన స్వచ్ఛంద విరాళాలను నేరుగా Watch Tower Bible and Tract Society of India, H-58, Old Khandala Road, Lonavla, 410 401, Pune Dist, Mah.,కి లేదా మీ దేశంలో ఉన్న సొసైటి కార్యాలయానికి కూడా పంపించవచ్చు. ఆభరణాలను ఇతర విలువైన వాటిని సహితం విరాళంగా ఇవ్వవచ్చు. ఈ విరాళాలతో పాటు అది కచ్చితంగా ఒక బహుమతియని తెలియజేసే క్లుప్తమైన లేఖను కూడా పంపాలి.
షరతుపై విరాళమిచ్చే ఏర్పాటు వ్యక్తిగత అవసరం కలిగినప్పుడు దాతకు ఆ విరాళం తిరిగి ఇచ్చే ప్రత్యేక ఏర్పాటుతో వాచ్‌టవర్ సొసైటికీ విరాళం ఇవ్వవచ్చు. మరింత సమాచారం కొరకు దయచేసి పైన పేర్కొనబడిన చిరునామాలోని సంస్థను సంప్రదించండి.
పథకం వేసి ఇవ్వడం
నేరుగా డబ్బు రూపంలో కానుకలు ఇవ్వడం మరియు షరతు మీద ఆధారపడి ఇచ్చే విరాళాలే కాక, ప్రపంచవ్యాప్త రాజ్యసేవ ప్రయోజనార్ధం ఇచ్చేందుకు వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిలో:
భీమా: జీవిత భీమా పాలసీకి లేదా ఉద్యోగవిరమణ/పింఛను పథకం యొక్క లబ్దిదారుగా వాచ్‌టవర్ సొసైటీ పేరును సూచించవచ్చు. అలాంటి ఏర్పాట్లేవైనా ఉంటే సొసైటీకి తెలియజేయాలి.
బ్యాంకు ఖాతాలు: బ్యాంకు ఖాతాలను, డిపాజిట్ సర్టిఫికెట్లను లేదా వ్యక్తిగత ఉద్యోగవిరమణ ఖాతాలను స్థానిక బ్యాంకు నియమాలను అనుసరించి వాచ్‌టవర్ సొసైటీ ట్రస్టు కొరకు లేదా మరణానంతరం వాటిని ఆ సొసైటీకే చెల్లించే ఏర్పాటును చేయవచ్చు. అలాంటి ఏ ఏర్పాట్లనైనా సొసైటీకి తెలియజేయాలి.
స్టాక్‌లు మరియు బాండ్లు: పూర్తిగా ఒక బహుమతిగా లేదా ఆదాయాన్ని ఎప్పుడూ దాతకు చెల్లించే ఏర్పాటుతో స్టాక్‌లను మరియు బాండ్లను వాచ్‌టవర్ సొసైటీకి విరాళంగా ఇవ్వవచ్చు.
ఇళ్లస్థలాలు: పూర్తిగా ఒక బహుమతిగా లేక ఆమె/అతడు జీవించినంత కాలం తానుండే ఆ స్థలంలో నివసించే ఏర్పాటుతో పూర్తిగా అమ్మదగిన ఇళ్లస్థలాలను వాచ్‌టవర్ సొసైటీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇలాంటివాటికి సంబంధించిన పత్రాలను వ్రాయకముందు సొసైటీని సంప్రదించాలి.
వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును చట్టబద్ధంగా వాచ్‌టవర్ సొసైటీ పేర వీలునామా వ్రాయవచ్చు, లేక ఒక ట్రస్టు ఏర్పాటుయొక్క లబ్దిదారుగా సొసైటీ పేరు వ్రాయవచ్చు. ఒక మత సంస్థకు లాభం సమకూర్చే ట్రస్టుకు పన్నులు చెల్లించే విషయంలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను ఇవ్వవచ్చు. వీలునామా లేదా ట్రస్టు ఏర్పాటుకు సంబంధించిన ఒక కాపీని సొసైటీకి పంపాలి.
ఎవరైనా పథకం వేసుకొని ఇచ్చే ఈ ఏర్పాట్లలో వేటిలోనైనా ఆసక్తి కలిగియుంటే పైన చెప్పబడిన పట్టికలోని చిరునామాకు లేదా ఈ ఏర్పాట్లలో వేటికైనా సంబంధించిన తగిన పత్రాల కాపీని సంస్థకు పంపించాలి. లేదా మీ దేశంలో పనిచేస్తున్న సొసైటీ కార్యాలయాన్ని సంప్రదించాలి.