“కదిలే, కదిలించే” పర్వతం
ఐర్లాండ్‌కు పశ్చిమాన, చుట్టు ప్రక్కల పర్వతాల నుండి క్రోపాట్రిక్ యొక్క సాటిలేని కోణాకారం ప్రధానంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం, జూలై నెల చివరి ఆదివారం నాడు, సుమారు 30,000 మంది పిన్నలూ పెద్దలందరూ వార్షిక తీర్థయాత్రా సమయంలో దాని శిఖరంపైకి (765 మీటర్లు) ఎక్కినప్పుడు, పర్వత శిఖరం కదులుతున్నట్లుగా కనిపిస్తుంది.
ఆ దినాన, ఇరుకుగాను గతుకులతోనూ ఉన్న దారిపైన మరియు ప్రమాదకర స్థలాలగుండా తీర్థయాత్రికులు ఎక్కడం దిగడం చేస్తారు. వాస్తవానికి, చివరిన ఆరోహణం (సుమారు 300 మీటర్లు) చాలా నిట్రంగా ఉంటుంది అంతేకాకుండ రాళ్లన్ని ఇంచుమించు వదులుగా ఉంటాయి, దానివల్ల ఆరోహణం అపాయకరంగానూ అలాగే అలసటగానూ ఉంటుంది.
కొందరు వట్టికాళ్లతోనే పైకెక్కుతారు మరియు కొద్దిమంది తమ మోకాళ్లపై కొంతదూరం ఎక్కుతారు. గతంలో, తీర్థయాత్ర రాత్రి చీకట్లో ప్రారంభమయ్యేది.
అంతమందికి క్రోపాట్రిక్ ఎందుకు ఎంతో ప్రాముఖ్యమైన అనుభవం?
ఎంతోకాలంగా తీర్థయాత్రా స్థలంగా స్థాపించబడింది
సా.శ. అయిదవ శతాబ్దపు తొలి భాగంలో రోమన్ కాథోలిక్ చర్చి, పాట్రిక్‌ను ఓ మిషనరీ బిషప్పుగా ఐర్లాండ్‌కు పంపించింది. అతని ముఖ్య ధ్యేయం ఐరిష్ ప్రజలను క్రైస్తవత్వానికి మరల్చడము తన ప్రచారం ప్రజల మధ్య తాను పనిచేసిన సంవత్సరాల్లో అక్కడ కాథోలిక్ చర్చి స్థాపించాడనే ఘనతను పాట్రిక్ పొందాడు.
అతని పని అతనిని ఈ దేశంలోని అనేక స్థలాలకు తీసుకువెళ్లింది. వాటిలో ఒకటి ఐర్లాండ్‌కు పశ్చిమ భాగం, కొన్ని ఆధారాల ప్రకారం ఇప్పుడు అతని పేరుతోనే పిలువబడుతున్న పర్వత శిఖరంపై ఆయన 40 రాత్రింబగళ్లూ గడిపాడు—క్రోపాట్రిక్ (అర్థం “పాట్రిక్ కొండ”) అక్కడ తాను అనుకున్నది ఫలించాలని అతను ఉపవాసాలుండి ప్రార్థనలు చేశాడు.
సంవత్సరాలు గడిచేకొలది ఆయన అద్భుతకృత్యాలను గూర్చి అనేక కథలు ప్రారంభమయ్యాయి. ఒక ప్రసిద్ధి చెందిన కథేమిటంటే, ఆ పర్వతంమీద ఉన్నప్పుడు, పాట్రిక్ ఐర్లాండ్‌నుండి పాములన్నింటినీ నిషేధించాడు.
దాని శిఖరంపై అతను ఒక చిన్న చర్చిని కట్టించాడని పారంపర్యం నొక్కివక్కాణిస్తోంది. ఆ నిర్మాణం కూలిపోయి చాలా కాలమైనప్పటికీ, మొదటి పునాది ఇప్పటికీ ఉంది మరియు ఆ ప్రాంతము అలాగే ఆ పర్వతం సంవత్సరాలుగా తీర్థయాత్ర స్థలంగా ఉంది.
తీర్థయాత్ర యొక్క ముఖ్య విషయాలు
వయస్సు మళ్లినవారికి లేక పర్వతాలు ఎక్కే అలవాటు లేనివారికి, క్షేమంగా అయిదు కిలోమీటర్లు పైకి ఎక్కి దిగగల్గడమే ఓ మహా సిద్ధి.
వాటిలోని ప్రాముఖ్యమైన స్థలాల్లో, గాయాలకు క్రమంగా చికిత్స చేసేందుకు అత్యవసర గుంపులు సంసిద్ధంగా ఉంటాయి.
దారిలో తీర్థయాత్రికులు చేసే వివిధ ప్రాయశ్చిత్త అర్చనలు మూడు స్థానాలు లేక ప్రాంతాలున్నాయి. ఎక్కడం ప్రారంభంలోనే ఇవన్నీ నోటీసు బోర్డుపైన పూర్తిగా వివరించబడివుంటాయి.—బాక్స్ చూడండి.
వారు ఎందుకు ఎక్కుతారు?
ఈ కఠినమైన తీర్థయాత్రను ఎందుకు అంతమంది చేస్తున్నారు? ఎక్కేటప్పుడు కొందరెందుకు మరి విపరీతధోరణిని అవలంబిస్తుంటారు?
తీర్థయాత్రల సమయంలో ప్రార్థించడం ద్వారా, వ్యక్తిగత ప్రయోజనాల కొరకైన వారి విన్నపాలను వినే అవకాశం ఎక్కువగా ఉంటుందని కొందరు నమ్ముతున్నారు. ఇతరులు ఏదో తప్పిదానికి క్షమాపణను పొందేందుకు చేస్తారు. మరితరులకు, కృతజ్ఞతలు చెల్లించేందుకు అది ఒక మార్గము. కచ్చితంగా, అనేకులు దాని సంఘీభావం దృష్ట్యా వెళుతుంటారు. అది ‘సంఘ స్ఫూర్తి మరియు సాంఘిక ప్రేమను వ్యక్తపర్చే’ ఒక విధానమని ఒక అధికారి చెప్పారు. క్రోపాట్రిక్‌ను ఎక్కడం “సెయింట్ పాట్రిక్ అడుగుజాడల్లో నడవడము మరియు విశ్వాసవిషయంలో అతనికి తామెంత రుణపడివున్నామన్న విషయాన్ని గుర్తించడమని” కూడా ఆయన చెప్పాడు. ఎక్కడం “ఒక విధమైన ప్రాయశ్చిత్తము ఎందుకంటే అందులో ఇమిడివున్న శారీరక ప్రయాసం నిజంగా ప్రాయశ్చిత్త అర్పణే. మెల్లిగా పైకి ఎక్కడం దీర్ఘకాల పశ్చాత్తాప చర్యగా ఉంటుంది.”
ఒక వ్యక్తి తాను 25 సార్లు ఎక్కానని గర్వంగా చెప్పుకున్నాడు! “కొంత ప్రాయశ్చిత్తం చేసేందుకే” అతను ఎక్కాడని చెప్పాడు. మరొక వ్యక్తి, “ఏ యాతనా లేకపోతే ఏ లాభమూలేదు.”
అది అవసరం కాకపోయినప్పటికీ, అనేకులు పర్వతాన్ని వట్టికాళ్లతో ఎక్కుతారు. ఎందుకు? మొదటి కారణంగా, ఆ నేల “పరిశుద్ధమైంది” అని వారు పరిగణిస్తారు అందుకని తమ చెప్పులను తీసేస్తారు. రెండవదిగా, ‘కొంత ప్రాయశ్చిత్తాన్ని చేయాలన్న’ ఉద్దేశానికి హత్తుకుని ఉంటారు. కొందరు ఆ ప్రాంతాలవద్ద తమ మోకాళ్లతో వివిధ ప్రాయశ్చిత్త క్రియలను ఎందుకు చేస్తారో కూడా ఇది వివరిస్తుంది.
సృష్టికర్తను మెచ్చుకునేందుకు కదలింపబడడం
ప్రత్యేక దినమందు ఎక్కే తీర్థయాత్రికుల మత భావాల్లో ఎవరైనా భాగంవహించకపోతే అప్పుడేమిటి? మంచి వాతావరణమూ గట్టి బూట్లతో ఆ పర్వతాన్ని ఎప్పుడైనా ఎక్కవచ్చు. తీర్థయాత్రికుల గుంపు, పైకి వెళుతున్న దినాన మేము ఎక్కలేదు. తరచూ విశ్రమించేందుకు మేము ఆగినప్పుడు, అలా ఎక్కడాన్ని గూర్చి మరియు అది అనేకులపై చూపించిన ప్రభావాన్ని గూర్చి మేము ఆలోచించాము. వేలాది మంది తీర్థయాత్రికులు కష్టంతో కూడిన దీన్ని ఎక్కడమూ మరియు ప్రాయశ్చిత్త అర్చనలను చేయడాన్ని మేము ఊహించుకున్నప్పుడు ‘దేవుడు దీన్నే కోరుతున్నాడా? మరలా మరలా ప్రార్థనలను వల్లిస్తూ, కొన్ని స్మారకాల చుట్టూ నడవడం లేక వాటిపైకి ఎక్కే ఆచరణలు ఎవరినైనా దేవునికి సమీపస్తుణ్ణి చేస్తాయా?’ మత్తయి 6:6, 7లోని పదేపదే పలికే ప్రార్థనల విషయంలో యేసు సలహా ఏమిటి?
కచ్చితంగా, మతపరమైన అనుభవాన్ని పొందేందుకు మేము పర్వతంపైకి ఎక్కలేదు. అయినా, మన సృష్టికర్తకు మరింత సమీపించినట్లు అనిపించింది ఎందుకంటే ఎక్కడున్న పర్వతాలైనా భూమి అద్భుతాల్లో ఒక భాగంగా ఆయన సృష్టిని మేము మెచ్చుకోగలిగాము. దాని శిఖరం నుండి అంతులేని అందమైన ప్రకృతి దృశ్యాన్ని మేము చూడగలిగాము, అంతేకాకుండ భూమి అట్లాంటిక్ మహా సముద్రాన్ని ఎక్కడ కలిసింది అన్న దాన్ని కూడా చూడగలిగాము. మా క్రిందనున్న అఖాతంలో ఒక ప్రక్కనున్న మిరుమిట్లుగొలిపే చిన్న దీవులు, మరో ప్రక్క మిట్టపల్లాలూ మరియు బంజరు పర్వత ప్రాంతాలకు ఎంతో భిన్నంగా ఉన్నాయి.
మూడు మజిలీలను గూర్చి మనం అనుకున్నాము. యేసు మాటలే మా మదిలో మెదిలాయి, ఆయన తన నిజమైన అనుచరులతో ఇలా అన్నాడు: “మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు.”—మత్తయి 6:7.
పెద్ద పెద్ద ఆచార కర్మల్లో వేవేలమంది ప్రజలను చుట్టిన పారంపర్యాచారాల్లో ఈ పర్వతం ఒక భాగమైందని మేము గ్రహించాము. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని అపొస్తలుడైన యోహాను చెప్పిన స్వేచ్ఛకు ఇది ఎలా భిన్నంగా ఉందన్న విషయాన్ని మేము పరిశీలించాము.—1 యోహాను 5:3.
క్రోపాట్రిక్ ఎక్కడంతో సహా, మేము మా యాత్రను బాగా ఆనందించాము. మానవజాతియంతా బైబిలుకు విరుద్ధమైన పారంపర్య ఆచారం నుండి విడిపించబడి మరియు ప్రేమపూర్వకమైన సృష్టికర్తను “ఆత్మతోను సత్యముతోను ఆరాధించే” సమయం కొరకు ఎదురుచూసేందుకు మేము కదలించబడ్డాము.—యోహాను 4:24.
[27వ పేజీలోని బాక్సు]
తీర్థయాత్రల ముఖ్య విషయాలు
సెయింట్ పాట్రిక్ దినమందు లేక ఎనిమిది రోజుల పండుగవారంలో లేక జూన్, జూలై, ఆగస్టు మరియు సెప్టెంబరు నెలలో పర్వతంపైకి ఎక్కి, మన పోపు ఉద్దేశాలు నెరవేరేందుకు ప్రార్థనా స్థలం లోపలగానీ లేక వెలుపల గానీ ప్రార్థించే ప్రతి తీర్థయాత్రికుడు, విన్నవించుకుంటానని మరియు పరిశుద్ధ బల్లలో పాలుపంచుకుంటానన్న షరతుమీద పాపాలకు తాను పొందే శిక్షనుండి విముక్తుడు కాగలడు.
పారంపర్య సంబంధిత మజిలీలు
మూడు “మజిలీలు” ఉన్నాయి (1) ఏటవాలు పర్వతం క్రింద లేక ల్యాక్ట్ బెనాన్ వద్ద (2) శిఖరంపై (3) పర్వతం ప్రక్కనున్న [పట్టణం] లెకాన్‌వే నుండి కొంత దూరంలోనున్న రాలిగ్ మౌరె.
మొదటి మజిలీ - ల్యాక్ట్ బెనాన్
తీర్థయాత్రికుడు ఏడుసార్లు ప్రభువు ప్రార్థన, 7 సార్లు మరియ స్తుతులూ ఒక సూక్తిని చెబుతూ రాళ్ల గుట్ట చుట్టూ 7 సార్లు ప్రదక్షణ చేస్తాడు
రెండవ మజిలీ - శిఖరం
(ఎ) తీర్థయాత్రికుడు మోకాళ్లూని 7 సార్లు ప్రభువు ప్రార్థనలనూ 7 సార్లు మరియ స్తుతులను మరియు 1 సూక్తిని వల్లిస్తాడు
(బి) ప్రార్థనాలయం వద్ద పోపు ఉద్దేశాల కొరకు తీర్థయాత్రికుడు ప్రార్థిస్తాడు
(సి) తీర్థయాత్రికుడు 15 సార్లు ప్రభువు ప్రార్థన, మరి 15 సార్లు మరియ స్తుతి ఓ సూక్తిని చెబుతూ 15 సార్లు ప్రార్థనాలయం చుట్టూ ప్రదక్షణ చేస్తాడు
(డి) ల్యాబా ఫోరిగ్ [పాట్రిక్ శయ్య] చుట్టూ 7 సార్లు ప్రభువు ప్రార్థన, 7 సార్లు మరియ స్తుతి మరియు ఒక సూక్తిని చెబుతూ 7 సార్లు ప్రదక్షణ చేశాడు.
3వ మజిలీ - రాలిగ్ మ్వారే
ప్రతి రాళ్ల గుట్ట వద్ద [అక్కడ మూడు గుట్టలున్నాయి] 7 సార్లు ప్రభువు ప్రార్థననూ, 7 సార్లు మరియ స్తుతిని మరియు ఒక సూక్తిని చెబుతూ ప్రతి దాని చుట్టూ తీర్థయాత్రికుడు 7 సార్లు నడుస్తాడు. మరియు చివరికి ప్రార్థిస్తూ పూర్తి రాలిగ్ మ్వారే చుట్టు 7 సార్లు తిరుగుతాడు.