కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 4/15 పేజీలు 20-25
  • ‘కొలిమి కాలునట్లు కాలు’ దినము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘కొలిమి కాలునట్లు కాలు’ దినము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా క్రూరమైన దేవుడా?
  • “సూర్యుడు” ప్రకాశిస్తాడు
  • గొప్ప విద్యాకార్యక్రమం
  • యెహోవా దినమును ఎవరు తప్పించుకొంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • మలాకీ పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • మహా భయంకరమైన యెహోవా దినం సమీపించింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మీరు ఏలీయావలె నమ్మకంగా ఉంటారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 4/15 పేజీలు 20-25

‘కొలిమి కాలునట్లు కాలు’ దినము

“ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును”—మలాకీ 4:1.

1. మలాకీ 4:1 సంబంధంగా ఏ ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి?

ఈ అంత్యదినములలో, యెహోవా తన జ్ఞాపకార్థ గ్రంథంలో తమ పేర్లను వ్రాసేందుకు ఎన్నుకున్నవారు ధన్యులు. అయితే ఆ ఆధిక్యతను అందుకునేందుకు అర్హత పొందనివారి విషయమేమిటి? వారు పాలకులైనా, సామాన్య ప్రజలైనా, దేవుని రాజ్యాన్ని ప్రకటించేవారిని మరియు వారి సమాచారాన్ని ఏవగింపుతో చూస్తే వారు ఏమి అనుభవిస్తారు? లెక్క ఒప్పజెప్పే దినాన్ని గూర్చి మలాకీ మాట్లాడుతున్నాడు. నాలుగవ అధ్యాయం ఒకటవ వచనంలో ఇలా వ్రాసివుంది: “ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండ, రాబోవుదినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.”

2. యెహోవా తీర్పును గూర్చి ఎలాంటి స్పష్టమైన వివరణను యెహెజ్కేలు ఇచ్చాడు?

2 ఇతర ప్రవక్తలు కూడా, జనాంగాలకు యెహోవా తీర్పు తీర్చడాన్ని కొలిమికి గల విపరీతమైన వేడితో పోలుస్తున్నారు. యెహెజ్కేలు 22:19-22, మతభ్రష్ట క్రైస్తవమత సామ్రాజ్యపు విభాగాలకు దేవుడు తీర్పుతీర్చడానికి ఎంత సరిగ్గా అన్వయిస్తుందో కదా! అక్కడ ఇలా ఉంది: “కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా—మీరందరును మష్టువంటివారైతిరి. నేను మిమ్మును . . . పోగుచేసెదను, ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగుచేసి కొలమిలో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపముచేతను రౌద్రముచేతను మిమ్మును పోగుచేసి అక్కడ మిమ్మును కరిగింతును. మిమ్మును పోగుచేసి నా కోపాగ్నిని మీమీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు. కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవుదురు, అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీమీద కుమ్మరించితినని మీరు తెలిసికొందురు.”

3, 4. (ఎ) మత నాయకులు వేషధారణపూరితమైన ఏ మాటలను చెప్పుకున్నారు? (బి) హీనమైన మతం యొక్క చరిత్రేమిటి?

3 నిజంగా ఓ శక్తివంతమైన ఉపమానమే! యెహోవా నామమును ఉపయోగించేందుకు నిరాకరించిన, ఆ పరిశుద్ధ నామమును దూషించిన మతనాయకులు, లెక్కఒప్పజెప్పాల్సిన దినాన్ని ఎదుర్కోవాలి. అహంకారంతో, తామూ తమ రాజకీయ సంబంధాలు భూమిపై దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాయని లేక కనీసం ఆ రాజ్యం కొరకు ఈ భూమిని సరైనదానిగా చేస్తామని వారు చెప్పుకుంటున్నారు.

4 అయితే, ఘోరమైన యుద్ధాలను జరిగించడంలో మతభ్రష్ట క్రైస్తవమత సామ్రాజ్యం రాజకీయ పాలకులతో చేతులు కలిపింది. మధ్యయుగ కాలంలోని మతయుద్ధాలు, స్పెయిన్‌ మతన్యాయసభలు బలవంతంగా మతమార్పిడి చేయడాన్ని గూర్చి, 17వ శతాబ్దంలో ఐరోపాలోని విశేష జనాన్ని నాశనం చేసిన ముప్పై సంవత్సరాల యుద్ధం మరియు స్పెయిన్‌నందు కాథోలిక్కు చర్చీలు దృఢంగా ఉండేలా చేసేందుకు జరిగించబడిన 1930వ పడిలో స్పెయిన్‌ అంతర్గత యుద్ధం గూర్చి చరిత్ర నమోదు చేసింది. మన శతాబ్దంలో, అందరికీ ఒకే న్యాయం అంటే తమ మతానికి చెందినవారినీ అలాగే ఇతర మతాలవారినీ తేడాలేకుండా చంపిన రెండు ప్రపంచ యుద్ధాలలో అధిక రక్తం చిందించబడింది. ఇటీవల, ఐర్లాండ్‌నందు కాథోలిక్కులూ ప్రొటెస్టెంట్ల మధ్య, ఇండియాలో మత గుంపుల మధ్య మరియు మునుపటి యుగోస్లావియాలోని మత గుంపుల మధ్య మరణకరమైన పోరాటం జరిగింది. నమ్మకమైన వేలకొలది యెహోవాసాక్షుల హతసాక్షుల యొక్క రక్తపు మరకలతో మత చరిత్ర పుటలు నిండివున్నాయి.—ప్రకటన 6:9, 10.

5. అబద్ధ మతానికి ఏ తీర్పు వేచివుంది?

5 దాని మద్దతుదార్లతో సహా ప్రపంచ అబద్ధ మత సామ్రాజ్యమైన మహాబబులోనుపై రాబోతున్న యెహోవా తీర్పును మనం ఎంతో మెచ్చుకోగలము. ఈ తీర్పు ప్రకటన 18:21, 24 నందు వర్ణించబడింది: “బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి—ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును. ప్రవక్తలయొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింపబడినవారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను.”

6. (ఎ) కొయ్యకాలువలె ఎవరు తయారౌతారు మరియు ఎందుకు? (బి) యెహోవాకు భయపడేవారికి ఏ హామి ఉంది?

6 ఇంతలో నీతికి శత్రువులైన వారందరూ మరియు వారికి మద్దతునిచ్చేవారు ‘కొయ్యకాలువలె కావాలి.’ యెహోవా దినం వారి మధ్య కొలమికాలునట్లు కాలును. “వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండ . . . కాల్చివేయును.” లెక్క ఒప్పజెప్పవల్సిన ఆ దినమందు, వారి వేర్లు లేక ఈ పిల్లలపై పర్యవేక్షణగల తలిదండ్రులను గూర్చి యెహోవా నిర్ధారణ చేసే దాని ఆధారంగా చంటి పిల్లలు లేక చిగుర్లతో వ్యవహరించడం జరుగుతుంది. తమ దుష్ట విధానాన్ని శాశ్వతంగా నిలుపుకునేందుకు దుష్ట తలిదండ్రులకు సంతానం ఉండదు. దేవుని రాజ్య వాగ్దానాల్లో విశ్వాసముంచేవారు మాత్రం కదిలించబడరు. కనుక హెబ్రీయులు 12:28, 29 ఇలా ఉద్బోధిస్తోంది: “అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగి యుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.”

యెహోవా క్రూరమైన దేవుడా?

7. యెహోవా ప్రేమ తన తీర్పులోకి ఎలా ప్రవేశిస్తుంది?

7 దాని అర్థం యెహోవా క్రూరుడు, పగతీర్చుకునే దేవుడనా? ఎంతకీకాదు! మొదటి యోహాను 4:8 నందు అపొస్తలుడు, మూల సూత్రాన్ని ఇలా పేర్కొంటున్నాడు: “దేవుడు ప్రేమాస్వరూపి.” అప్పుడు, 16వ వచనమందు ఆయన ఇలా చెబుతూ దాన్ని నొక్కి తెలిపాడు: “దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు; ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.” మానవజాతి ఎడల ప్రేమవల్లనే యెహోవా ఈ భూమి మీది దుష్టత్వాన్ని పూర్తిగా తీసివేయాలని సంకల్పించాడు. మన ప్రేమపూర్ణుడు, దయామయుడైన దేవుడు ఇలా ప్రకటిస్తున్నాడు: “నా జీవముతోడు దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును. కాబట్టి . . . మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు?”—యెహెజ్కేలు 33:11.

8. యోహాను ప్రేమను ఎలా నొక్కితెలిపాడు అయినా తనను తాను ఉరిమెడువాడు అని ఎలా చూపించుకున్నాడు?

8 ఇతర మూడు సువార్త రచయితల కంటే కూడా సూత్రానుసార ప్రేమయైన అగాపేను యోహాను తరచూ సూచించాడు, అయినా మార్కు 3:17 యోహానునే ‘ఉరిమెడువాడని’ వర్ణించింది. యెహోవానుండి కలిగిన ప్రేరణవల్లనే ఈ ఉరిమెడు వాడు, బైబిలునందలి చివరి పుస్తకమైన ప్రకటనలోని ప్రకటన సమాచారాన్ని వ్రాశాడు. అది న్యాయాన్ని కూడా చేకూర్చే దేవునిగా యెహోవాను చిత్రీకరిస్తుంది. ఈ పుస్తకం, “దేవుని కోపమను ద్రాక్షలు,” “దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలు” మరియు “సర్వాధికారియైన దేవుని తీక్షణమైన ఉగ్రత” వంటి తీర్పు మాటలతో నిండివుంది.—ప్రకటన 14:19; 16:1; 19:15.

9. యెహోవా తీర్పును గూర్చి యేసు ఏ మాటలను చెప్పాడు మరియు ఆయన ప్రవచనాలు ఎలా నెరవేరాయి?

9 “అదృశ్యదేవుని స్వరూపి”యైన మన ప్రభువైన యేసుక్రీస్తు భూమిమీద ఉన్నప్పుడు యెహోవా తీర్పులను గూర్చి ధైర్యంగా ప్రకటించాడు. (కొలొస్సయులు 1:15) ఉదాహరణకు, తన కాలంలోని మత వేషధారులకు విరుద్ధంగా సూటిగా ప్రకటించిన మత్తయి 23 నందు ఏడు శ్రమలున్నాయి. ఆ ఖండిత తీర్పును ఆయన ఈ మాటలతో ముగించాడు: “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది.” ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత జనరల్‌ టైటస్‌ క్రింది రోమా సైన్యం ద్వారా తీర్పుతీర్చబడింది. అది భయంకరమైన దినం, మానవ అనుభవంలోకెల్లా—అతి భయాన్ని కలిగించే దినం—యెహోవా దినం త్వరలోనే విరుచుకు పడబోతోంది.

“సూర్యుడు” ప్రకాశిస్తాడు

10. “నీతి సూర్యుడు” దేవుని ప్రజలకు ఎలా ఆనందాన్ని తీసుకురాగలడు?

10 తన దినం నుండి తప్పించుకుని బయటపడేవారు ఉంటారని యెహోవా తెలియజేస్తున్నాడు. మలాకీ 4:2 నందు ఆయన వీరిని ఇలా సూచించాడు: “నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును.” ఆ నీతి సూర్యుడు ఎవరో కాదు యేసుక్రీస్తే. ఆయన “లోకమునకు” ఆత్మీయ “వెలుగై” ఉన్నాడు. (యోహాను 8:12) ఆయన ఎలా ప్రకాశిస్తాడు? తన స్వస్థతా రెక్కలతో ఆయన ఎగురుతాడు—మొదటిగా, నేడు కూడా మనం అనుభవించే ఆత్మీయ స్వస్థత మరియు రాబోయే క్రొత్తలోకంలో అన్ని జనాంగాల్లోని ప్రజలను శారీరకంగా స్వస్థపర్చడం. (మత్తయి 4:23; ప్రకటన 22:1, 2) సూచనార్థకంగా, మలాకీ చెప్పినట్లుగా, స్వస్థపర్చబడినవారు అప్పుడే కొట్టంలోంచి విడిచిపెట్టిన “క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.” మానవ పరిపూర్ణతను పొందే ఉత్తరాపేక్షతో పునరుత్ధానమయ్యే వారు కూడా ఎంతటి ఆనందాన్ని పొందుతారో కదా!

11, 12. (ఎ) దుష్టుల కొరకు ఎలాంటి పరిణామం ఎదురుచూస్తోంది? (బి) దేవుని ప్రజలు ఎలా ‘దుర్మార్గులను అణుగద్రొక్కుదురు?’

11 అయితే, దుష్టుల విషయమేమిటి? మలాకీ 4:3 నందు ఇలా ఉంది: “నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదములక్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” తనను ప్రేమించేవారిని కాపాడడమేకాకుండ, మన యుద్ధశూరుడైన దేవుడు క్రూరులైన శత్రువులను తీసివేసి, నాశనంచేయడం ద్వారా భూమిని శుభ్రంచేస్తాడు. సాతానును, అతని దయ్యాలను నిర్బంధించడం జరుగుతుంది.—కీర్తన 145:20; ప్రకటన 20:1-3.

12 దుష్టులను నాశనం చేయడంలో దేవుని ప్రజలు ఏ భాగాన్నీ వహించరు. మరి అప్పుడు వారు “దుర్మార్గులను” ఎలా “అణగద్రొక్కుదురు?” గొప్ప విజయోత్సాహంలో పాల్గొనడం ద్వారా వారు దీన్ని సూచనార్థకంగా చేస్తారు. నిర్గమకాండము 15:1-21, అలాంటి ఉత్సవాన్ని వర్ణిస్తోంది. అది ఫరో మరియు అతని పెద్ద గుంపు ఎర్ర సముద్రం వద్ద నాశనమైన తర్వాత వచ్చింది. “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఆ దినమున జనులీలాగు నందురు—ఇదిగో . . . మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము” అనే దేవుని వాగ్దానంతో సంబంధం కలిగి విజయోత్సాహానికి ముందు, యెషయా 23:3-9 నెరవేర్పుగా, “దుష్టుల” నిర్మూలనం జరుగుతుందని. ఈ సంతోషములో ప్రతీకారమేగానీ లేక దుర్బుద్ధిగానీ లేదు కాని, అది యెహోవా నామము పరిశుద్ధపర్చబడడం మరియు ఐక్యమైన మానవజాతి శాంతియుతంగా నివసించేందుకు శుభ్రపర్చిన భూమిని చూడడంవల్ల కలిగిన ఆనందమే.

గొప్ప విద్యాకార్యక్రమం

13. “క్రొత్త భూమిలో” ఏ విద్యా కార్యక్రమం జరుగుతుంది?

13 మలాకీ 4:4 నందు యూదులు “మోషే . . . ధర్మశాస్త్రమును . . . జ్ఞాపకము చేసి”కోవల్సిందిగా ఉద్బోధించబడ్డారు. కనుక నేడు, గలతీయులు 6:2 నందు పేర్కొనబడినట్లుగా “క్రీస్తు నియమమును” మనం అనుసరించాల్సిన అవసరముంది. దీని ఆధారంగా, అర్మగిద్దోనును తప్పించుకున్నవారు మరింత బోధను పొందుతారన్న దానిలో ఏ సందేహమూ లేదు మరియు పునరుత్థాన సమయంలో తెరవబడే ప్రకటన 20:12 నందలి “గ్రంథములయందు” ఇవి వ్రాయబడగలవు. ‘క్రొత్తభూమిలోని’ జీవితవిధానాన్ని అనుసరించేందుకు పునరుత్థానం పొందినవారు విద్యను పొందుతూ ఉండడం ఎంత మహనీయమైన దినంగా ఉంటుందో కదా!—ప్రకటన 21:1.

14, 15. (ఎ) ఆధునిక దిన ఏలీయా ఎలా గుర్తించబడతాడు? (బి) ఏలీయా తరగతి ఏ బాధ్యతలను నెరవేరుస్తుంది?

14 యెహోవా సూచించిన విద్యా కార్యక్రమంలో అది ఒక పొడిగింపు, దాని గురించి మలాకీ 4:5 ఇలా చెబుతోంది: “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.” ఈ ఆధునిక దిన ఏలీయా ఎవరు? మత్తయి 16:27, 28 నందు చూపించబడినట్లు, ఆయన “తన రాజ్యముతో” రావడాన్ని సూచిస్తూ యేసు ఇలా చెప్పాడు: “మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.” ఆరు దినముల తర్వాత, పేతురు, యాకోబు మరియు యోహానులతో ఉన్నప్పుడు ఆయన “వారియెదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.” ఈ దర్శనంలో ఆయన ఒక్కడే ఉన్నాడా? లేదు, ఎందుకంటే “ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి.”—మత్తయి 17:2, 3.

15 దాని భావమేమిటి? తీర్పు తీర్చేందుకు వచ్చే సమయంలో ప్రవచించబడిన గొప్ప మోషేగా, యేసు సూచించబడ్డాడు. (ద్వితీయోపదేశకాండము 18:18, 19; అపొస్తలుల కార్యములు 3:19-23) యెహోవా భయంకరమైన మహా దినం రాకముందే ఈ రాజ్య సువార్తను భూమియంతటా ప్రకటించే ప్రాముఖ్యమైన పనిని సాధించేందుకు ఆయన ఆధునిక దిన ఏలీయాతో సహవసిస్తాడు. ఈ “ఏలీయా” పనిని వివరిస్తూ మలాకీ 4:6 ఇలా చెబుతోంది: “నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.” యజమానుడైన యేసు తన ఆస్తిపై నియమించిన భూమ్మీది అభిషక్త క్రైస్తవుల నమ్మకమైనవాడును బుద్ధిమంతుడైన దాసునిగా “ఏలీయా” గుర్తించబడుతున్నాడు. దీనిలో విశ్వాస గృహానికి “తగినవేళ” అవసరమైన ఆత్మీయ ‘ఆహారమును’ అందించడం కూడా ఇమిడి ఉంటుంది.—మత్తయి 24:45, 46.

16. ఏలీయా తరగతి చేసిన పనివల్ల ఏ ఆనందమయ ప్రతిఫలాలు వచ్చాయి?

16 నేడు ప్రపంచవ్యాప్తంగా అలా ఆహారమందించే సంతోషకరమైన ఫలితాలను చూస్తున్నాము. ప్రతి సంచిక 120 భాషల్లో 1,61,00,000 పత్రికలు 97 భాషలందు ఏకకాలంలో ప్రచురించబడుతున్న కావలికోట పత్రిక “రాజ్య సువార్తతో” భూమిని ముంచెత్తుతోంది. (మత్తయి 24:14) ఇతర ప్రచురణలు యెహోవాసాక్షులు ప్రకటించే మరియు బోధించే వివిధ రంగాలందు ఎన్నో భాషల్లోని ఇతర ప్రచురణలు ఉపయోగించబడుతున్నాయి. “ఆత్మ విషయమైన దీనులైనవారికి” సమృద్ధిగా ఆహారాన్ని అందించేందుకు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడైన దాసుడు అంటే ఏలీయా తరగతి మెలుకువగా ఉంది. (మత్తయి 5:3) అంతేకాకుండ, ఈ రాజ్య నిరీక్షణను అంగీకరించి మరియు దాని ప్రకారం నడుచుకునేవారు అద్భుతమైన లోకవ్యాప్తంగా ఐక్యపర్చబడతారు. దానిలో “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు” వచ్చే గొప్ప సమూహము కూడా ఇమిడివుంది. (ప్రకటన 7:9) యెహోవా అవసరమనుకున్నంత వరకూ ఈ పని సాధించబడిన తర్వాత, భయంకరమైన మరియు మహా దినం నాడు అంతం వస్తుంది.

17. యెహోవా భయంకరమైన దినం ఎప్పుడు విరుచుకుపడుతుంది?

17 ఆ భయంకరమైన దినం మన మీదికి ఎప్పుడు విరుచుకుపడుతుంది? అపొస్తలుడైన పౌలు ఇలా జవాబిస్తున్నాడు: “రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. లోకులు—నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని [బహుశ, ప్రత్యేకమైన విధంలో] చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.”—1 థెస్సలొనీకయులు 5:2, 3.

18, 19. (ఎ) “శాంతిభద్రత” ఎలా ప్రకటించబడుతున్నాయి? (బి) యెహోవా ప్రజలు ఉపశమనాన్ని ఎప్పుడు కనుగొంటారు?

18 ఈ ప్రవచనంలోని “వారు” ఎవరు? వారు, ఈ దౌర్జన్య పూరితమైన లోకపు పలుభాగాలతో ఒక ఐక్య నూతనలోక విధానాన్ని నిర్మిస్తామని చెప్పుకునే రాజకీయ నాయకులే. తాము సాధించామని వేటిని గురించి గొప్పగా చెప్పుకుంటారో ఆ నానాజాతి సమితి మరియు ఐక్యరాజ్య సమితి విఫలమయ్యాయి. యెహోవా ప్రవక్త ముందుగా చెప్పిన ప్రకారంగా వారు ఇప్పుడు కూడా “సమాధానములేని సమయమున—సమాధానము సమాధానమని” చెప్పుదురు.—యిర్మీయా 6:14; 8:11 14:13-16.

19 ఈ మధ్య కాలంలో, దైవరహితమైన ఈ లోకం నుండి వచ్చే ఒత్తిళ్ళు, శ్రమలను యెహోవా ప్రజలు సహిస్తారు. అయితే త్వరలోనే 2 థెస్సలొనీకయులు 1:7, 8 నందు పేర్కొన్నట్లుగా వారు “ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు” వారు ఉపశమనాన్ని కనుగొంటారు.

20. (ఎ) జెఫన్యా మరియు హబక్కూకులు “కొలిమివలె కాలు దినము” గూర్చి ఏమని ప్రవచించారు? (బి) ఈ ప్రవచనాలు ఏ సలహానూ ప్రోత్సాహాన్ని ఇస్తాయి?

20 అది ఎంత త్వరగా వస్తుంది? మనలో అనేకులం ఎంతో కాలంగా వేచివున్నాము. ఇంతలో జెఫన్యా 2:2, 3 నందున్న ‘యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన [యెహోవా] ఉగ్రత దినమున మీరు దాచబడుదురు’ అన్న పిలుపుకు, తప్పించుకున్న వినయులనేకులు అనుకూలంగా జవాబిస్తున్నారు. తర్వాత, జెఫన్యా 3:8 నందు ఈ ఉద్బోధ ఉంది: “యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా—నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగుచేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్ని చేత భూమియంతయు కాలిపోవును.” అంతం సమీపించింది! యెహోవాకు ఆ దినమూ సమయమూ తెలుసు, మరి తన కాలపట్టికను ఆయన మార్చడు. మనం ఓపికతో సహిద్దాము. “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.” (హబక్కూకు 2:3) భయంకరమైన యెహోవా దినం త్వరగా సమీపిస్తోంది. జ్ఞాపకముంచుకోండి, ఆ దినం అతి సమీపంలో ఉంది!

పునఃసమీక్ష ద్వారా:

◻ పరిపాలకులూ పరిపాలించబడేవారు యెహోవా భయంకరమైన దినంలో ఏమి అనుభవిస్తారు?

◻ యెహోవా ఎలాంటి దేవుడు?

◻ దేవుని ప్రజలకు ఇవ్వబడే ఎలాంటి విద్య గూర్చి వర్ణించడం జరిగింది?

◻ అంతం సమీపించే దృష్ట్యా దేవుని ప్రవక్తలు మనలను ఎలా ఉద్బోధిస్తున్నారు?

[21వ పేజీలోని చిత్రం]

స్పానిష్‌ విచారణ సమయంలో కాథోలిక్‌ మతంలోకి మారాలని అనేకులు బలవంతం చేయబడ్డారు

[క్రెడిట్‌ లైను]

The Complete Encyclopedia of Illustration/J. G. Heck

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి