కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 4/15 పేజీ 29
  • మొజాంబిక్‌నందు “ఉప్పు అమ్మకం”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మొజాంబిక్‌నందు “ఉప్పు అమ్మకం”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 4/15 పేజీ 29

మొజాబిక్‌నందు “ఉప్పు అమ్మకం”

మొజాంబిక్‌ రాష్ట్ర సమితి సభ్యుడైన ఫ్రాన్సెస్కో కొయానా “పునఃవిద్యా క్యాంపుల్లో” పది సంవత్సరాలు గడిపాడు. ఆయన తన అనుభవాన్ని ఇలా చెబుతున్నాడు: “మేము ఇక్కడ కొంత కాలం ఉంటామని నాకు తెలుసు, కనుక నేను క్రమపయినీరు సేవను కొనసాగించవచ్చా అని నేను ప్రాంతీయ కాపరిని అడిగాను. అందుకు నేను గంటలను చేరుకోవల్సి ఉంటుందని చెప్పాడు. అయితే, సుమారు క్యాంపులో ఉన్న వారందరూ యెహోవాసాక్షులే గనుక బహిరంగ ప్రకటనకు సరైన సమయాన్ని ఎలా కేటాయించగలవు అని ఆయన అడిగాడు. అందుకు నేను, ప్రకటించడానికి ప్రజలను కనుగొనేందుకు 47 కిలోమీటర్ల దూరంలోని ఓ పట్టణమైన మిలాంజ్‌కు వెళతానని నేను చెప్పాను.

“మేము క్యాంపును విడిచి వెళ్లేందుకు మాకు అధికారిక అనుమతి లేకపోయినప్పటికీ, ఈ నియమం కచ్చితంగా అమలుపర్చబడలేదు. పొదలోకి వెళ్లి మోకాళ్లూని, ప్రాంతీయ ప్రజలకు ప్రకటించేందుకు ఒక దారిని చూపించమని ప్రార్థించడం జ్ఞాపకముంది. యెహోవా వెంటనే సమాధానమిచ్చాడు.

“సైకిలున్న ఒక వ్యక్తిని నేను కలిసి, అతనితో ఒక ఒప్పందాన్ని చేశాను. వర్షాకాలానికి ముందు నేను అతని భూమిని సేద్యం చేసి ఇస్తే, తన సైకిలును ఇవ్వడం ద్వారా నా కూలీని చెల్లించేందుకు అంగీకరించాడు. కనుక నేను ప్రతి రోజు ఉదయం అతని పొలాన్ని సేద్యం చేయడంలో గడిపాను. నేను ఆ సైకిలును పొందాను ఎందుకంటే యెహోవా ఈ ఏర్పాటును ఆశీర్వదించాడు.

“దాని మూలంగా, ఓ పెద్ద పట్టణమైన మిలాంజ్‌ను నేను చేరుకున్నాను మరియు ఈ ఫలభరితమైన ప్రాంతంలో నా పయినీరింగ్‌ ప్రభావవంతంగా సాగింది. మా పని నిర్బంధంలో ఉంది కనుక, ప్రజలకు సత్యాన్ని పరిచయం చేసేందుకు ఒక యోజనను చేయవల్సివచ్చింది. నా చొక్కాలో పుస్తకాలూ పత్రికలను పెట్టుకుని, ఒక సంచిలో ఉప్పు తీసుకుని ఉప్పు అమ్మే వ్యాపారం మొదలుపెట్టాను. దాన్ని 5 మెటికైస్‌కు అమ్మకుండా, 15 మెటికైస్‌కు అమ్మేవాణ్ణి. (అది చాలా చౌకైతే ప్రజలు దానంతటినీ కొనేసుకుంటారు, మరి ప్రకటించేందుకు నా దగ్గిర కొంచెం ఉప్పుకూడా మిగలదు!) నా సంభాషణ ఇలా ఉండేది:

“‘నమస్కారం! నేను ఈ రోజు ఉప్పు అమ్ముతున్నాను.’

“‘ఎంత?’

“‘పదిహేను మెటికైస్‌.’

“‘వద్దు వద్దు. ఎంత ఖరీదో!’

“‘అవును, దీనికి ఖరీదెక్కువేనని నేను ఒప్పుకుంటున్నాను. అయితే అది చాలా ఖరీదని మీరు ఇప్పుడనుకుంటే, కొంత కాలం ఆగండి భవిష్యత్తులో అది మరింత ఖరీదెక్కువౌతుంది. ఇది బైబిలులో ప్రవచించబడిందని మీకు తెలుసా?’

“‘నేనెప్పుడూ నా బైబిలు చదువ లేదు.’

“‘అవును, అందులో ఉంది. మీ బైబిలును తీసుకురండి, అది నేను మీకు చూపిస్తాను.’

‘దానితో బైబిలునుండి సంభాషణ ప్రారంభమౌతుంది, అలా నాది నా చొక్కాలోనే ఉంటుంది. క్లిష్టమైన పరిస్థితులూ మరియు ఆహార కొరతల విషయంలో ప్రకటన 6వ అధ్యాయాన్ని సూచించేవాణ్ణి. అనుకూల ప్రతిస్పందన ఉందని నాకు అనిపిస్తే, నిత్యజీవమునకు నడుపు సత్యము లేదా నిన్ను సంతోషపర్చు సువార్త పుస్తకాలను తీసి బైబిలు పఠనాన్ని ప్రారంభించేవాణ్ణి.

“ఫలితంగా మిలాంజ్‌నందు 15 మంది ఆసక్తిగలవారి గుంపును నేను ప్రారంభించగలిగాను. అయితే త్వరలోనే అధికారులకు మా పనిని గూర్చి తెలిసిపోయింది. ఒకరోజు నేను బైబిలు పఠనాన్ని చేస్తుండగా, పోలీసులు విరుచుకుపడి మమ్మల్ని అరెస్టుచేశారు. ఆ కుటుంబంలోని చిన్న పిల్లలతో సహా అందరం స్థానిక చెరసాలకు కొనిపోబడ్డాము. అక్కడ ఒక నెల ఉన్న తర్వాత, అందరం మరలా శిబిరానికి పంపించబడ్డాము.”

ఈ అనుభవాలు మన సహోదరుల ఆసక్తిని తగ్గించలేదు. దానికి భిన్నంగా, క్యాంపుల్లో ఉన్న వేలకొలది సహోదరులతో సహా ఫ్రాన్సెస్కో మరియు అతని కుటుంబం, ఇప్పుడు మొజాంబిక్‌నందలి స్వేచ్ఛా పరిస్థితుల్లో ఆరాధిస్తున్నారు మరియు ప్రకటిస్తున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి