దేవునికి భయపడేవారితో కలిసి సమావేశమగుట
“అంతటా ప్రజలు భయం నుండి స్వాతంత్ర్యం పొందడం కొరకు ఎదురు చూస్తారు—దౌర్జన్యాన్ని గూర్చిన భయం, నిరుద్యోగాన్ని గూర్చిన భయం, తీవ్రమైన అస్వస్థతను గూర్చిన భయం. మనం కూడా అదే నిరీక్షణను పంచుకుంటాము. . . . అయితే మరి భయాన్ని ఎలా పెంపొందింప జేసుకోవాలనే దాన్ని గూర్చి మనం ఎందుకు చర్చిస్తున్నాము?” జూన్ 1994 నుండి ప్రారంభమైన “దైవ భయము” జిల్లా సమావేశాలలోని ప్రతిదానిలో ముఖ్యాంశ ప్రసంగీకుని ద్వారా ఆ ఉత్తేజకరమైన ప్రశ్న వేయబడింది.
మొదట ఉత్తర అమెరికాలో, తర్వాత ఐరోపా, మధ్య అమెరికా, దక్షిణమెరికా, ఆఫ్రికా, ఆసియా మరియు సముద్ర ద్వీపాల యందలి హాజరైన లక్షలాదిమంది అలాంటి భయాన్ని పెంపొందింప జేసుకోడాన్ని నేర్చుకోడానికి ఆసక్తి కలిగివుండిరి. ఎందుకు? యెహోవా దేవుడు తన ప్రజలకు యిచ్చే ఆశీర్వాదాలను పంచుకోవడం, మనం దైవ భయము కలిగివుండడంపైనే ఆధారపడి వుంటుంది. దైవ భయాన్ని గూర్చి నేర్చుకోడానికే సమావేశానికి హాజరైన వారు కలిసివచ్చారు, మూడు దినాల కార్యక్రమంలో, వారు ఈ అత్యవసరమైన క్రైస్తవ లక్షణాన్ని గూర్చి ఎంతో నేర్చుకున్నారు.
‘దేవునికి భయపడి ఆయన కట్టడల ననుసరించండి’
ప్రసంగి 12:13 ఆధారంగా, సమావేశం యొక్క మొదటి దినపు ముఖ్యాంశం అది. దేవునికి భయపడడమంటే ఏమిటి? కార్యక్రమంలోని మొదటి భాగంలో, యెహోవా యెడల భయం మరియు లోతైన గౌరవం, అలాగే ఆయనను అప్రీతి పరుస్తామనే సంపూర్ణ భీతి దైవ భయాన్ని ప్రతిబింబిస్తాయని సమావేశాధ్యక్షుడు వివరించాడు. అలాంటి దైవ భయం రోగగ్రస్తమైంది కాదు; అది ఆరోగ్యకరమైనది, సరైనది.
ఈ ఆరోగ్యకరమైన భయం మనకు ఎలా ప్రయోజనకరం కాగలదు? “అలసిపోయి, ఆగిపోవద్దు” అనే తర్వాతి ప్రసంగం, దేవుని ఆజ్ఞలకు సంతోషంగా లోబడడానికి దైవ భయము మనల్ని పురికొల్పుతుందని వివరించింది. అలాంటి భయం మనల్ని దేవుని యెడల మరియు పొరుగువారి యెడల ప్రేమతోపాటు, ఆత్మీయ శక్తితో నింపుతుంది. అవును, నిత్యజీవం కొరకైన పరుగులో మనం వెనుకబడిపోవడాన్ని నివారించడానికి దైవ భయం మనకు సహాయం చేయగలదు.
కార్యక్రమంలో తర్వాత, దైవ భయం మనల్ని బలపర్చగలదనేదానికి సజీవ నిదర్శనాన్నిచ్చే ఇంటర్‌వ్యూలు ఉన్నాయి. దేవుని యెడల భక్తితో కూడిన భయం వారికి బాధ, కష్టం లేక హింస వున్నప్పటికీ పరిచర్యలో కొనసాగడానికి ఎలా ప్రభావితం చేసిందో, కష్టతరమైన వ్యక్తిగత శ్రమల సమయంలో కూడా సహించుకోడానికి ఎలా సహాయం చేసిందో ఇంటర్‌వ్యూ చేయబడినవారు చెప్పారు.
అయితే, కొంతమంది ప్రజలకు దైవ భయం వుంటుంది, కొందరికి వుండదు ఎందుకు? “దైవ భయాన్ని పెంపొందించుకొని, దాని నుండి ప్రయోజనం పొందుట” అనే ప్రసంగంలో, దేవునికి భయపడే హృదయాన్ని తన ప్రజలకు యిస్తానని యెహోవా యిర్మీయా 32:37-39 నందు వాగ్దానం చేశాడని ముఖ్యాంశ ప్రసంగీకుడు వివరించాడు. యెహోవా మన హృదయాల్లో దైవ భయాన్ని నాటుతాడు. ఎలా? తన పరిశుద్ధాత్మ ద్వారా, తన ప్రేరేపిత వాక్యమైన బైబిలు ద్వారా. అయితే, స్పష్టంగా, మనం దేవుని వాక్యాన్ని పఠించడానికి, ఆయన చేసిన పుష్కలమైన ఆత్మీయ ఏర్పాట్ల నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి తీవ్ర ప్రయత్నం చేయాలి. వీటిలో, ఆయనకు భయపడడాన్ని నేర్చుకోడానికి మనకు సహాయం చేసే మన సమావేశాలు, సంఘ కూటాలు కూడా చేరివున్నాయి.
యెహోవా యందు, ఆయన వాక్యమందు నమ్మకముంచండి అనే హెచ్చరికతో మధ్యాహ్న కార్యక్రమం ప్రారంభమయ్యింది. దాని తర్వాత, క్రైస్తవులుగా మన జీవితాలను రాజ్యము ప్రభావితం చేయవలసిన ప్రాథమిక విధానాల గురించిన చర్చ కొనసాగింది.
ఆ తర్వాత, సమావేశంలో అందజేయబడిన మూడు గోష్టులలో మొదటిది జరిగింది. “దైవ నియమాలకు లోబడునట్లు దైవ భయము మనల్ని పురికొల్పుతుంది” అన్నది ఈ గోష్ఠి యొక్క మూలాంశం, యిది కుటుంబంపై శ్రద్ధ కనపర్చింది. ఇవ్వబడిన లేఖనాధారమైన, ఆచరణయోగ్యమైన ఉపదేశం యొక్క నమూనా క్రింద యివ్వబడింది.
▫ భర్తల కొరకు: ఒక వ్యక్తి తన భార్యను తన స్వంత శరీరం వలె ప్రేమించడానికి దైవ భయము అతన్ని ప్రేరేపించాలి. (ఎఫెసీయులు 5:28, 29) ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తన స్వంత శరీరాన్ని గాయపర్చుకోడు, తన స్నేహితుల యెదుట తనను తాను హీనపర్చుకోడు, లేక తన స్వంత బలహీనతల గురించి వృథా ప్రసంగం చేయడు. కాబట్టి అలాగే, అతడు తనకు తాను యిచ్చుకునే మర్యాద మరియు గౌరవంతో తన భార్యను చూడాలి.
▫ భార్యల కొరకు: యేసుకున్న దైవ భయం ఆయన ‘ఎల్లప్పుడు దేవున్ని ప్రీతిపర్చడానికి’ అతన్ని పురికొల్పింది. (యోహాను 8:29) ఇది, తమ భర్తలతో వ్యవహరించేటప్పుడు భార్యలు అనుకరించ వలసిన మంచి స్ఫూర్తి.
▫ తల్లిదండ్రుల కొరకు: తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను గంభీరంగా తీసుకోవడం ద్వారా, తమ పిల్లలను యెహోవా నుండి పొందిన స్వాస్థ్యంగా దృష్టించడం ద్వారా క్రైస్తవ తల్లిదండ్రులు దైవ భయాన్ని చూపించవచ్చు. (కీర్తన 127:3) తమ పిల్లలు నిజమైన క్రైస్తవులయ్యేలా వారిని పెంచడం తల్లిదండ్రుల ప్రాథమిక గమ్యమైయుండాలి.
▫ పిల్లల కొరకు: “ప్రభువునందు తల్లిదండ్రులకు” విధేయత చూపించాలని యెహోవా పిల్లలకు ఉపదేశిస్తున్నాడు. (ఎఫెసీయులు 6:1) గనుక, తల్లిదండ్రులకు లోబడడమంటే దేవునికి లోబడడమే.
ఆనాటి ముగింపు ప్రసంగం మనల్ని కదిలిస్తుంది, ఎందుకంటే మనం మరణమందు మన ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు మనమందరం అనుభవించే లోతైన భావాలను గూర్చి అది చర్చించింది. అయితే, ప్రసంగంలో దాదాపు సగం తర్వాత ఒక ఆశ్చర్యకరమైనది జరిగింది. మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే . . . అనే క్రొత్త బ్రోషూర్ విడుదలను ప్రకటించడం ద్వారా ప్రసంగీకుడు ప్రేక్షకులను ఆనందపర్చాడు. పూర్తి రంగులతో 32 పేజీలు గల ఈ ప్రచురణ, ప్రియమైన వారి మరణం ద్వారా ఏర్పడే భావాలను, మనోవిచారాలను అర్థం చేసుకుని, బాధపడేవారికి వాటితో వ్యవహరించేందుకు సహాయం చేయగల ఎంతో సమాచారాన్ని తెలియజేస్తుంది. శోకతప్తుడైన వ్యక్తితో ఏం మాట్లాడాలో మీకు ఎప్పుడైనా తెలియలేదా? బాధపడే వారికి మనం ఎలా సహాయం చేయగలమో ఈ బ్రోషూరు యొక్క ఒక విభాగం చర్చించింది. ప్రసంగీకుడు చెబుతున్నది వింటుండగా ప్రేక్షకులలోని అనేకులు ఈ క్రొత్త బ్రోషూరు నుండి ప్రయోజనం పొందగల వారిని గురించి ఆలోచిస్తుండిరి.
‘దైవ భయము, భక్తి కలిగి ప్రీతికరమైన సేవచేయండి’
హెబ్రీయులు 12:28పై ఆధారపడిన రెండవ దినపు మూలాంశమదే. ఉదయ కార్యక్రమ సమయంలో, “యెహోవా భయమందు నడుచుకొనే సంఘాలు” అనే రెండవ గోష్ఠి ఉంది. మొదటి భాగం కూటాలకు హాజరు కావడాన్ని గూర్చి వ్యవహరించింది. మనం కూటాలకు హాజరు కావడం దేవుని యెడల, ఆయన ఆత్మీయ ఏర్పాట్ల యెడల మనకుగల గౌరవాన్ని చూపిస్తుంది. కూటాలకు హాజరు కావడం ద్వారా, మనం ఆయన నామానికి భయపడుతున్నామని, ఆయన చిత్తాన్ని అన్వర్తించుకోడానికి మనం ఆసక్తి కలిగివున్నామని చూపిస్తాము. (హెబ్రీయులు 10:24, 25) సంఘమంతా యెహోవా భయమందు నడవడానికి ప్రతివ్యక్తీ మంచి ప్రవర్తన కలిగివుండడంలో తన వంతును నిర్వర్తించాలని రెండవ ప్రసంగీకుడు వివరించాడు. క్రైస్తవులందరికివున్న ఆధిక్యత మరియు బాధ్యత గురించి అంటే, విడిచిపెట్టకుండా చేయవలసిన సువార్త ప్రకటన గురించి చివరి ప్రసంగీకుడు ప్రసంగించాడు. ప్రకటించడంలో మనం ఎంతవరకు కొనసాగుతాము? యెహోవా చాలని చెప్పేవరకు కొనసాగుతాము.—యెషయా 6:11.
ఇప్పుడు ఈ పత్రిక యొక్క పఠన శీర్షికలలో వున్న, “యెహోవాను గూర్చిన ఆనందమే మీ ఆశ్రయదుర్గం” అనేది తరువాతి ప్రసంగం యొక్క మూలాంశం. (నెహెమ్యా 8:10 NW) యెహోవా ప్రజలు ఎందుకు ఆనందంగా వుంటారు? ప్రసంగీకుడు అనేక కారణాలు చూపించాడు. ఒక అత్యంత విశేషమైన కారణం ఏమిటంటే, దేవునితో సన్నిహిత సంబంధం మనల్ని భూమిపైనున్న అత్యంత ఆనందకరమైన ప్రజలనుగా చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, యేసు యొద్దకు యెహోవా ఆకర్షించిన ప్రజలలో ఒకరముగా వుండే ఆధిక్యత మనకుందని ప్రసంగీకుడు సమావేశానికి హాజరైన వారికి గుర్తు చేశాడు. (యోహాను 6:44) ఆనందించడానికి ఎంతటి బలమైన కారణం!
ప్రతి సమావేశం యొక్క ఉన్నతాంశం బాప్తిస్మం, దానికి “దైవ భయం” సమావేశాలు కూడా మినహాయింపు కావు. “యెహోవాయందలి భయముతో సమర్పణ, బాప్తిస్మము” అనే ప్రసంగంలో ప్రసంగీకుడు, బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులందరి వ్యక్తిగత బాధ్యతలు నాలుగు భాగాలు గలవని యిలా వివరించాడు: (1) దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోడానికి సహాయం చేసే ప్రచురణల ద్వారా దాన్ని మనం పఠించి, అన్వయించుకోవాలి; (2) మనం ప్రార్థించాలి; (3) సంఘ కూటాలలో మనం మన తోటి విశ్వాసులతో సహవసించాలి; (4) మనం యెహోవా నామానికి, ఆయన రాజ్యానికి సాక్ష్యమివ్వాలి.
శనివారం మధ్యాహ్న కార్యక్రమం “యెహోవా ఎడబాయని ప్రజలు” అనే పురికొల్పునిచ్చే అంశంతో ప్రారంభమైంది. ముఫ్ఫై ఐదు శతాబ్దాల క్రితం, ఇశ్రాయేలు జనాంగం కష్ట సమయాలను ఎదుర్కొన్నప్పుడు, యెహోవా యిలా చెబుతూ మోషే ద్వారా ఒక ప్రమాణాన్ని యిచ్చాడు: “నీ దేవుడైన యెహోవా . . . నిన్ను విడువడు నిన్నెడబాయడు.” (ద్వితీయోపదేశకాండము 31:6) ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించి దాన్ని స్వాధీనపర్చుకొన్నప్పుడు వారిని కాపాడడం ద్వారా యెహోవా ఆ ప్రమాణాన్ని నెరవేర్చాడు. నేడు, కష్టతరమైన శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు, మనం ఆయనకు సన్నిహితంగా ఉండి ఆయన వాక్యం యిచ్చే ఉపదేశాన్ని అనుసరిస్తే, యెహోవా మనల్ని విడిచిపెట్టడని మనం కూడా పూర్తి నమ్మకం కలిగివుండవచ్చు.
బైబిలు చదవడంలో మీరు ఎలా ఆనందాన్ని పొందవచ్చు? “దేవుని వాక్యమగు, పరిశుద్ధ బైబిలును ప్రతిదినం చదవండి” అనే ప్రసంగంలో, విమర్శించి తెలుసుకొనే బుద్ధితో చదవాలని, యిలాంటి ప్రశ్నలు వేసుకోవాలని ప్రసంగీకుడు సూచించాడు: యెహోవా లక్షణాలు మరియు మార్గాల గురించి ఈ వృత్తాంతం నాకు ఏమి నేర్పుతుంది? ఈ విషయాల్లో నేను ఎక్కువగా యెహోవాను పోలి ఎలా వుండగలను? బైబిలును ఈ విధంగా చదవడం ఆనందకరమైన, ప్రతిఫలదాయకమైన అనుభవం.
తర్వాత, కార్యక్రమం యొక్క మూడవ గోష్ఠియైన “యెహోవాకు భయపడే వారికి సహాయపడే ఏర్పాట్లు” అనేదానిపై శ్రద్ధ నిల్పింది. నేడు యెహోవా తన సేవకుల కొరకు అద్భుతాలు చేయకపోయినప్పటికీ, ఆయనకు భయపడేవారికి ఆయన తప్పక సహాయం చేస్తాడు. (2 పేతురు 2:9) ఈ కష్టతరమైన సమయాల్లో మనకు సహాయం చేసేందుకు యెహోవా యిచ్చే నాలుగు ఏర్పాట్లను ఈ గోష్ఠి పరిశీలించింది: (1) యెహోవా తన ఆత్మ ద్వారా, మనం మన స్వంత శక్తికి మించిన పనులు చేయడానికి మనల్ని బలపరుస్తాడు. (2) తన వాక్యం ద్వారా, ఆయన మనకు ఉపదేశాన్ని, నడిపింపును యిస్తాడు. (3) విమోచన ద్వారా ఆయన మనకు మంచి మనస్సాక్షినిస్తాడు. (4) పెద్దలుతో సహా తన సంస్థ ద్వారా, ఆయన మనకు నడిపింపును, భద్రతను యిస్తాడు. (లూకా 11:12, 13; ఎఫెసీయులు 1:7; 2 తిమోతి 3:16, 17; హెబ్రీయులు 13:17) ఈ ఏర్పాట్ల నుండి పూర్తి ప్రయోజనం పొందడం ద్వారా, మనం సహించుకొన గల్గుతాము తత్ఫలితంగా యెహోవా అనుగ్రహాన్ని పొందుతాము.
శనివారం మధ్యాహ్నం చివరి ప్రసంగం మలాకీ ప్రవచనంపై ఆధారపడిన “మహా భయంకరమైన యెహోవా దినము సమీపించింది” అనే పేరుగలది. సా.శ. 70లో యెరూషలేముపై తీర్పు తీర్చబడినప్పటిలా, గడిచిన చరిత్రలో కూడా మహా భయంకరమైన దినాలు వున్నాయి. కాని, ‘దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన’ చేయబడే యెహోవా యొక్క రాబోయే దినము మానవ అనుభవమంతటిలో అత్యంత భయంకరమైన దినము. (2 థెస్సలొనీకయులు 1:6-8) అది ఎంత త్వరలో వస్తుంది? ప్రసంగీకుడు యిలా చెప్పాడు: “అంతం సమీపించింది! ఆ దినము, ఘడియ యెహోవాకు తెలుసు. ఆయన తన కాలపట్టికను మార్చడు. మనం సహనంతో ఎదురుచూడమని కోరబడ్డాము.”
అప్పుడే రెండు రోజులు గడచిపోయాయంటే నమ్మడం కష్టంగా వుంది. చివరి దిన కార్యక్రమమెలా వుంటుంది?
“దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి”
మూడవ దిన మూలాంశం ప్రకటన 14:7పై ఆధారపడింది. ఉదయకాల కార్యక్రమంలో, యెహోవా సాక్షులను యితర అన్ని మత సంబంధ సంస్థల నుండి వేరుచేసే సిద్ధాంతపరమైన కొన్ని బోధల యొక్క ప్రసంగాల పరంపర ఉన్నత పర్చింది.
“నీతిమంతుల పునరుత్థానం ఉంటుంది” అనే ప్రసంగంలో, ప్రసంగీకుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న లేవదీసాడు: “ఆ వెయ్యి సంవత్సరాల తీర్పు దినంలో, సాతాను విధానపు ఈ చివరి సంవత్సరాలందు విశ్వాసంగా వుండి మరణించిన వారు ఎప్పుడు పునరుత్థానం చేయబడతారు?” సమాధానం? ప్రసంగీకుడు యిలా వివరించాడు: “బైబిలు చెప్పడం లేదు, అయితే, మన దినంలో మరణించేవారు, అర్మగిద్దోనును తప్పించుకున్న గొప్ప సమూహంలోని వారితోపాటు తీర్పు దినమంతటిలో జరుగనైయున్న విస్తారమైన విద్యాపనిలో భాగం వహించడానికి ముందుగా పునరుత్థానం చేయబడతారనడం కారణ సహితంగాలేదా? అవును, వాస్తవంగా కారణసహితంగానే ఉంది!” తప్పించుకొనే వారుంటారా? తప్పకుండా వుంటారు. దీన్ని గురించి మనల్ని ధైర్యపర్చే బైబిలు బోధలు, ఉదాహరణలు “మహాశ్రమల నుండి సజీవముగా రక్షింపబడుట” అనే తర్వాతి ప్రసంగంలో స్పష్టంగా వివరించబడ్డాయి.
లెక్కలేనన్ని లక్షలాదిమందికి భూపరదైసుపై నిత్యజీవం మరియు క్రీస్తుతోపాటు ఆయన రాజ్యంలో పరిపాలించే పరిమిత సంఖ్యకు పరలోక అమర్త్యమైన జీవితం అనే రెండు గమ్యాలను బైబిలు అందజేస్తుందని యెహోవాసాక్షులు ఎప్పుడో అర్థం చేసుకున్నారు. “చిన్నమందా భయపడకుడి” అనే ప్రసంగంలో పరలోక నిరీక్షణ గురించి చర్చించబడింది. (లూకా 12:32) ప్రస్తుత లోక పరిస్థితి దృష్ట్యా చిన్నమంద భయపడకుండా వుండాలి; వారిలో ప్రతి ఒక్కరు అంతం వరకు సహించాలి. (లూకా 21:19) ప్రసంగీకుడు యిలా చెప్పాడు: “వారి నిర్భీతి గొప్ప సమూహపు వారిని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. భూమిపై మునుపెన్నడు లేనంత అత్యంత గొప్ప కష్టతరమైన కాలంలో విడిపింపబడడానికి వారు నిరీక్షిస్తుండగా వారు కూడా నిర్భీతితో కూడిన దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి.”
ఉదయకాల కార్యక్రమ ముగింపు సమయంలో, మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు అనే బైబిలు నాటకాన్ని ప్రేక్షకులు ఆనందంతో తిలకించారు. యెహోషువ మరియు ప్రవక్తయైన ఏలియా కాలంలో, ఇశ్రాయేలీయులు ఒక నిర్ణయం తీసుకోవలసి వుండిరి. ఒక ఎంపిక చేసుకోవలసి యుండెను. ఏలియా యిలా చెప్పాడు: “యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడి.” (1 రాజులు 18:21) నేడు కూడా, మానవజాతి ఒక నిర్ణయం తీసుకోవలసి వుంది. రెండు భిన్నమైన అభిప్రాయాల మధ్య తడబడడానికి యిది సమయంకాదు. సరైన ఎంపిక ఏది? పురాతనకాలం నాటి యెహోషువ చేసినదే. ఆయనిలా చెప్పాడు: “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.”—యెహోషువ 24:15.
హఠాత్తుగా, అది ఆదివారం సాయంత్రం అయిపోయినట్లుంది, అప్పుడు అది “సత్యదేవునికి ఇప్పుడే ఎందుకు భయపడాలి” అనే బహిరంగ ప్రసంగానికి సమయం. ప్రకటన 14:6, 7 నందు మానవజాతి అంతా యిలా కోరబడ్డారు: “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి.” ఇప్పుడే దేవునికి భయపడడం ఎందుకు అత్యవసరం? ఎందుకంటే, లేఖనం యిలా కొనసాగుతున్నది: “ఆయన తీర్పుతీర్చు గడియ” వచ్చింది. ఇప్పుడు దేవుని పరలోక రాజ్యానికి రాజుగా నియమించబడిన తన కుమారుని ద్వారా, ప్రస్తుత అపరిశుభ్రమైన, తిరుగుబాటు చేసే విధానానికి యెహోవా ముగింపు తెస్తాడు. దేవునికి భయపడేవారికి ఉపశమనం కలిగించడానికి, అలాగే మన భూగృహాన్ని కాపాడి భద్రపరచడానికి యిది మాత్రమే మార్గమని ప్రసంగీకుడు వివరించాడు. ఇవి ఈ విధానపు ముగింపు దినాలు గనుక, సత్యదేవునికి మనం ఇప్పుడే భయపడడం అత్యవసరము!
ఆ వారానికి వున్న కావలికోట పాఠం యొక్క సమీక్ష తర్వాత చివరి ప్రసంగీకుడు వేదిక మీదికి వచ్చాడు. సమావేశ కార్యక్రమం ఫలితంగా, సమావేశానికి హాజరైనవారు దైవ భయాన్ని పూర్తిగా గ్రహించారని ఆయన వివరించాడు. దేవునికి భయపడే వారికి లభించే అనేక ప్రయోజనాల గురించి ఆయన నొక్కిచెప్పాడు. దైవిక బోధచే ఐక్యమగుట అనే క్రొత్త వీడియో విడుదలను ప్రసంగీకుడు ప్రకటించాడు. అది 1993-94లో జరిగిన “దైవిక బోధ” అంతర్జాతీయ సమావేశాల విశేషమైన అంశాలను ఉన్నతపరుస్తుంది. ప్రసంగం ముగింపుకొస్తుండగా, ‘వచ్చే సంవత్సరం మనం దేని కొరకు ఎదురుచూడగలం?’ అని అనేకులు ఆశ్చర్యపోయారు. అనేక ప్రాంతాలలో మూడు రోజుల జిల్లా సమావేశాలు జరుగుతాయని మనం ఎదురుచూడవచ్చు.
ముగింపులో, ప్రసంగీకుడు “అప్పుడు, యెహోవాయందు భయభక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను” అని వున్న మలాకీ 3:16ను సూచించాడు. సమావేశానికి హాజరైనవారు, యెహోవా నామాన్ని గూర్చి తలంచి, ఆయనను దైవ భయముతో సేవించడానికి స్పష్టమైన దృఢనిశ్చయం చేసుకుని వెళ్లారు.
[24వ పేజీలోని చిత్రం]
బాప్తిస్మం తీసుకునే సభ్యులు దైవ భయాన్ని వ్యక్తపర్చడంలో కొనసాగవలసిన అవసరత ఉంది
[25వ పేజీలోని చిత్రం]
”మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు” అనే నాటకం యెహోవాను సేవించడాన్ని గూర్చి నిర్ణయాత్మకంగా వుండవలసిన అవసరత వుందని శ్రోతలను ప్రభావితం చేసింది
[26వ పేజీలోని చిత్రం]
“మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే . . . ” అనే క్రొత్త బ్రోషూరును అందుకోడానికి సమావేశానికి హాజరైనవారు ఆనందించారు