ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు—నైజీరియా
నైజీరియా, ఆఫ్రికా యొక్క పశ్చిమ పీఠభూమి ఉన్న వంపులోకి చొచ్చుకొని ఉంది. గినియా సింధుశాఖాప్రాంతమందు, అది భూమధ్యరేఖకు ఉత్తరాన ఉంది మరి దానిలో 8 కోట్ల 80 లక్షల జనాబా ఉన్నారు.a
గత రెండు సేవా సంవత్సరాలుగా, వాచ్‌టవర్ సంస్థ యొక్క నైజీరియా బ్రాంచి, యౌవనస్థులపై ప్రత్యేక అవధానాన్ని నిలిపింది. నైజీరియానందు 1992లో సువార్త ప్రకటించడం ప్రారంభించిన వారిలో 80 శాతం మంది 10 నుండి 20 సంవత్సరాల వయస్సుగల వారేనని యెహోవాసాక్షుల సంఘాలలో జరుపబడిన సర్వే చూపింది. ఆ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్న వారిలో, 63 శాతం మంది ఆ వయస్సువారే.
యౌవనస్థులు పయనీరుసేవ చేయడానికి ముందుకు వస్తున్నారు
అనేకమంది యౌవనస్థులు పూర్తికాల ప్రకటన పనిలో పయినీర్లుగా ప్రవేశిస్తున్నారు. హన్నా అనే పేరుగల ఒక పయినీర్ యిలా చెబుతుంది: “నేను పాఠశాల చదువు ముగించబోతుండగా, పయినీర్ సేవాపాఠశాలకు హాజరైన వారిని నేను దర్శించాను, అక్కడ నేను యిద్దరు పెద్ద వయస్సుగల సహోదరీలను కలిశాను. నాలోనేనిలా ఆలోచించాను, ‘వారిద్దరు పయినీర్సేవ చేయగల్గితే, నేనెందుకు చేయలేను?’
“కావున నేను పాఠశాల చదువు ముగించిన తర్వాత, నేనొక పయినీర్నయ్యాను. మూడు నెలల తర్వాత, జూజూ ఆరాధికురాలైన, 26 సంవత్సరాల జోసిఫైన్ను నేను కలిశాను. ఆమె యిలా అన్నది: ‘యెహోవా సాక్షులైన మీరు చెడ్డ ప్రజలు. మీరు క్రిస్టమస్ జరుపుకోరు లేక తాయెత్తులను ఉపయోగించరు.’ నన్ను ఆమెతో కలిసి బైబిలు పఠించనిస్తే, మేము వాటిని ఎందుకు ఆచరించమో ఆమె తెలుసుకోగలదని నేను జవాబిచ్చాను. నన్ను మళ్లీ రమ్మని ఆమె ఆహ్వానించింది. ఆమె త్వరలో కూటాలకు హాజరవ్వడం ప్రారంభించింది తన జీవితంలో అనేక మార్పులు చేసుకుంది. డిశంబరు 1990లో ఆమె బాప్తిస్మం తీసుకుంది. ఆగస్టు 1991 నుండి జోసిఫైన్ పయినీర్‌గా ఉంది. ఆమె గత సంవత్సరం పయినీర్ సేవాపాఠశాలకు హాజరైనప్పుడు, ఆమె తన తోటి విద్యార్థులకు నన్ను తన ఆత్మీయ తల్లిగా పరిచయం చేసింది!”
వీడియో మరియు రాజ్యమందిరం
సొసైటీ యొక్క వీడియో రికార్డింగులలో ఒకటి, ఒక చిన్న సంఘం తమ రాజ్యమందిరం కొరకు స్థలాన్ని పొందడానికి సహాయం చేసింది. స్థలం కొనాలని, నలుగురు సహోదరులు ఆ ప్రాంతపు సాంప్రదాయక పరిపాలకుడైన ఒనోజీని కలిశారు. ఆయన 20,000 నయేరాలకు [1,025, అమెరికా డాలర్లు] ఒక స్థలాన్ని యిస్తానని అన్నాడు. ఆ పనికి మద్దతునివ్వడానికి కేవలం 17 మంది ప్రచారకులు మాత్రమే ఉన్నారు గనుక ఆ సంఘం అంత డబ్బును చెల్లించలేకపోయింది. తను వేరొక స్థలాన్ని గురించి ఆలోచిస్తానని ఒనోజీ చెప్పాడు.
కొన్ని నెలల తర్వాత, సంఘ పెద్దల్లో ఒకరు ఒనోజీ గృహాన్ని దర్శించాడు. ఒనోజీ తన పట్టాభిషేకం యొక్క వీడియో రికార్డింగును చూస్తున్నాడు. ఆ పెద్ద యిలా చెప్పాడు: “మీరు చూడాలని నేను యిష్టపడే ఒక వీడియో నావద్ద ఉంది. దాని పేరు జెహోవాస్ విట్నెసెస్—ద ఆర్గనైజేషన్ బిహైండ్ ది నేమ్.”
తర్వాత, ఆ వీడియోను గురించి ఒనోజీ ఏమి భావిస్తున్నాడో ఆ పెద్ద అడిగాడు. “నేను ఆ చిత్రాన్ని ఐదుసార్లు చూశానని,” ఒనోజీ చెప్పాడు. ఒనోజీ వీడియోలో చూచిన రాజ్యమందిరాలను ఆ పెద్ద ఒనోజీకి గుర్తు చేసి, ప్రాంతీయ సంఘం కూడా అటువంటి దాన్నే ఒకదాన్ని నిర్మించేందుకు యిష్టపడుతుందని వివరించాడు. తమ సంఘం ప్రస్తుతం కలిగివున్న చిన్న ప్లాటుకు ప్రక్కగా ఉన్న స్థలంలో కొంత భాగాన్ని కొనవచ్చునేమోనని ఆ పెద్ద అడిగాడు. దానికి ఒనోజీ యిలా జవాబిచ్చాడు: “గత రాత్రి వీడియో చూసిన తర్వాత, నేను కూడా అదే విషయాన్ని గూర్చి ఆలోచించాను.” వెంటనే, అతను సంఘ స్థలానికి ప్రక్కగా ఉన్న ప్రాంతంలో 6 మీటర్ల ప్లాటును కొలిచి యిచ్చాడు. “ఇది మీ కొరకే, పొడవుచొప్పున, మీకు ఎంత కావాలో మీరు అంత తీసుకోవచ్చు. డాక్యుమెంటులు సిద్ధం చేయండి, నేను వాటిపై సంతకం పెడతాను,” అని అతను అన్నాడు.
[అధస్సూచీలు]
a అదనపు సమాచారం కొరకు, 1994 క్యాలెండర్ ఆఫ్ జెహోవాస్ విట్నెసెస్ చూడండి.
[9వ పేజీలోని బాక్సు]
దేశ గణాంక వివరాలు
1993 సేవా సంవత్సరం
సాక్ష్యమిస్తున్నవారి శిఖరాగ్ర సంఖ్య: 1,74,582
నిష్పత్తి: 1 సాక్షికి 507
జ్ఞాపకార్థ దినానికి హాజరైనవారి సంఖ్య: 4,73,245
సగటు పయినీర్ ప్రచారకులు: 19,777
సగటు బైబిలు పఠనాలు: 2,42,028
బాప్తిస్మము తీసుకున్నవారి సంఖ్య: 8,888
సంఘాల సంఖ్య: 3,289
బ్రాంచి కార్యాలయం: బెనిన్ పట్టణం, ఇడో రాష్ట్రం