కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 5/15 పేజీలు 4-6
  • బైబిలు—చదవాల్సిన ఓ పుస్తకం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు—చదవాల్సిన ఓ పుస్తకం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అది మన్నిందనడంలో ఆశ్చర్యంలేదు!
  • బైబిలు చదివే అలవాటు
  • దాన్ని క్రమంగా చదవండి
  • ప్రతిదినం బైబిలు చదవడం నుండి ప్రయోజనం పొందుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • బైబిలు చదవడం—ప్రయోజనకరం, ఆహ్లాదకరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • దేవుని వాక్యంలో ఆనందించండి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • చదవడం మీద శ్రద్ధ వహించండి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 5/15 పేజీలు 4-6

బైబిలు—చదవాల్సిన ఓ పుస్తకం

ఒకరు బైబిలు గూర్చి మాట్లాడుతున్నప్పుడు దాన్ని పొగడడానికి మాటలు సరిపోవు అనేది వాస్తవం. చరిత్రంతటిలో అది అతి విస్తృతంగా పంచిపెట్టబడిన పుస్తకం. బైబిలు అతి పురాతనమైన, ఎక్కువగా అనువదించబడిన, ఎక్కువగా సూచించబడిన, ఎక్కువ ప్రభావవంతమైన, ఎక్కువ గౌరవాన్ని పొందిన గ్రంథం. బహుశ అది అతి వివాదాస్పదమైంది కూడా. అంతేకాకుండా అది అనేక నిషేధాలనూ కాల్చివేతలనూ విపరీతమైన వ్యతిరేకతను తట్టుకుని నిలబడ్డ పుస్తకం. అయితే, విషాదకరంగా, బైబిలుకు యిక అన్వయించలేని ఓ విషయం ఉంది. ప్రపంచంలో ఎక్కువగా పఠించబడే పుస్తకంగా అది యిక ఏమాత్రంలేదు అనడం నమ్మశక్యంగా ఉండదు.

ప్రజలు తమ యిళ్లల్లో ఎక్కడో ఓ చోట బైబిలును కల్గి ఉండవచ్చు గానీ, వాస్తవంగా దాన్ని చదవడం కొరకు కొంత సమయాన్ని కేటాయించడానికి వారు చాలా పని తొందరలో ఉన్నామని అనేకమంది భావిస్తారు. ఒకప్పుడు చదవడం ప్రఖ్యాత వినోదంగా ఉండేది. అయితే, యిప్పుడు మాత్రం, అనేకులు తమ ఖాళీ సమయాన్ని దూరదర్శినిని చూడ్డానికి లేక వేరే ఏదైనా చేయడానికి మొగ్గు చూపుతుంటారు. యింకా చదివేవారు తరచూ తేలికగా, సులభంగా ఉండే దానిని చదవడానికి సాధారణంగా యిష్టపడుతుంటారు. బైబిలు చదవాలంటే ఏకాగ్రత అవసరం. మరి అనేకులు తాము చదువుతున్న దానిపైన లోతైన ఏకాగ్రతను ఎంతమాత్రం చూపడం లేదు.

అయితే, బైబిలు యింత కాలం నిలిచింది మన పుస్తకాల అరల్లో విడిచిపెట్టబడడానికి కాదు. దాన్ని చదవడానికి మంచి కారణాలున్నాయి. దాని గూర్చి కొన్ని వాస్తవాలను గమనించండి.

అది మన్నిందనడంలో ఆశ్చర్యంలేదు!

“బైబిలు” అనే పదం, “చిన్న పుస్తకాలు” అనే భావమున్న గ్రీకు పదం బిబ్లియా నుండి వచ్చింది. బైబిలు అనేక పుస్తకాలతో తయారైందన్న విషయాన్ని అది మనకు జ్ఞాపకం చేస్తుంది—కొన్ని అంత చిన్నవేంకాదు. అవి పదహారు వందల సంవత్సరాల కాల నిడివిలో రాయబడ్డాయి. రచయితలు మనుష్యులైనప్పటికి, వారొక ఉన్నత మూలం ద్వారా ప్రేరేపించబడ్డారు. ఓ బైబిలు రచయిత యిలా అన్నారు: “ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదుగాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.” (2 పేతురు 1:21) లేఖనాధార ప్రవచనం విషయంలో ఏది నిజమో మిగిలిన బైబిలు విషయంలో కూడా అదే నిజమౌతుంది. ఈ దైవ ప్రేరేపిత “చిన్న పుస్తకాలు” యెహోవా దేవుని ఉన్నత ఆలోచనలతో నిండి ఉన్నాయి. (యెషయా 55:9) బైబిలు యింతకాలం మన్నుతూ వచ్చిందనడంలో ఆశ్చర్యంలేదు!

దేవుని సేవకులకు, బైబిలు ఎల్లప్పుడూ ప్రాముఖ్యమై పుస్తకంగా ఉంటూ వచ్చింది. బైబిలు రచయితలలో ఒకడైన అపొస్తలుడైన పౌలుతో వారు ఏకీభవిస్తారు. ఆయన యిలా అన్నాడు: “దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకు, . . . ప్రయోజనకరమై యున్నది.” (2 తిమోతి 3:16) దానికనుగుణంగా ఈనాడు యెహోవా సాక్షుల విశ్వాసానికి బైబిలే ఆధారం. అది వారి సిద్ధాంతాలను నిర్ణయించి వారి ప్రవర్తనను నడిపిస్తుంది. దేవుని వాక్యంలోని కొంతభాగాన్ని ప్రతి దినం చదవమనీ, దానిలోని విషయాలపై మెప్పుదలతో ధ్యానించమని వారు యితరులకు హృదయపూర్వకంగా సిఫార్సు చేస్తారు.—కీర్తన 1:1-3.

బైబిలు చదివే అలవాటు

గతంలో, లేఖనాలను చదివే అలవాటు ప్రయోజనకరంగా ఉండేది. ఇశ్రాయేలీయుల రాజులు, యిప్పుడు బైబిలులో ప్రాముఖ్యభాగమైన అప్పటి ధర్మశాస్త్ర ప్రతిని తమ కొరకు తామే రాసుకోవాలని ఆజ్ఞాపించబడ్డారు. అంతేకాకుండా దేవుని చిత్తాన్ని తమకు ఎడతెగకుండా జ్ఞాపకం చేసేటట్లు దాన్ని ప్రతిదినం చదవాలి. (ద్వితీయోపదేశకాండము 17:18-20) దీన్ని చేయడంలో విఫలం కావడం అనేక రాజుల పతనానికి దారితీసింది.

లేఖనాలను చదవడంలోని విలువ వృద్ధ ప్రవక్తయైన దానియేలు విషయంలో ఉదహరించబడుతుంది. తన కాలంలో ఉన్న బైబిలు భాగాలను చదవడం వల్ల దానియేలు బబులోనులో చెరపట్టబడి ఉన్నప్పుడు, యిర్మీయా రాసిన ముఖ్యమైన ప్రవచనం నెరవేరబోతోందని ‘గ్రంథములవలన గ్రహించాడు.’—దానియేలు 9:2.

యేసు పుట్టిన సమయంలో “నీతిమంతుడును, భక్తిపరుడునైన” సుమెయోను, క్రీస్తు లేక మెస్సీయా కాబోయేవాన్ని చూడడానికి నమ్మకంతో నిరీక్షిస్తూ ఉండేవాడు. క్రీస్తును చూడకుండా సమెయోను మరణించడని అతనికి వాగ్దానం చేయబడింది. బాల యేసును తన చేతుల్లో ఎత్తుకున్నప్పుడు సమెయోను యెషయా ప్రవవచాన్ని సూచించడం, అతను అప్పటికే తనకాలంలో రాయబడిన బైబిలు పుస్తకాలను ఎంత శ్రద్ధగా చదివేవాడో చూపుతోంది.—లూకా 2:25-32; యెషయా 42:6.

బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటిస్తున్నప్పుడు మెస్సీయ కొరకు ‘ప్రజలు కనిపెట్టుచుండిరి.’ ఇది దేన్ని సూచిస్తుంది? లేఖనాల్లో రాయబడిన మెస్సీయ ప్రవచనాలతో చాలా మంది యూదులకు పరిచయం ఉందని అది సూచిస్తోంది. (లూకా 3:15) ఇది ఆసక్తికరంగా ఉంది, కారణం ఆ రోజుల్లో పుస్తకాలు అంత సులభంగా దొరికేవి కావు. బైబిలు పుస్తకాల ప్రతులు ఎంతో శ్రద్ధ ప్రయాసం అవసరమైన చేవ్రాత ద్వారా తయారు చేయబడేవి, అంతేకాదు ఈ కారణంగా అవి చాలా ఖరీదైనవిగా, పొందడానికి కష్టంగా ఉండేవి. మరి వాటిలోని విషయాలను ప్రజలు ఎలా తెలుసుకోగల్గేవారు?

అనేక సందర్భాల్లో, బహిరంగ పఠనాల ద్వారా తెలుసుకునేవారు. ఉదాహరణకు, కొన్ని నిర్ణీత సమయాల్లో, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. కూడుకున్న ఇశ్రాయేలీయులకు చదివి వినిపించాలని మోషే ఆజ్ఞాపించాడు. (ద్వితీయోపదేశకాండము 31:10-13) సా.శ. మొదటి శతాబ్ద కాలంలో, బైబిలు పుస్తకాలు బహిరంగంగా చదవడం బహుళవ్యాప్తంగా ఉండేది. శిష్యుడైన యాకోబు యిలా పేర్కొన్నాడు: “ఏలయనగా, సమాజమందిరములో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలన మునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారు.”—అపొస్తలుల కార్యములు 15:21.

నేడు, స్వంత బైబిలును కల్గివుండడం సులభమే. కనీసం ఈ “చిన్న పుస్తకాల్లో” కొన్ని, ప్రపంచ జనాభాలోని 98 శాతం భాషల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, తమకు బైబిలు ఏమి చెబుతోందన్న విషయంలో అనేకులకు ఆసక్తి లేకపోవడం విషాదకరం. ఇది వైజ్ఞానిక యుగమే కావచ్చు కానీ, దేవుని వాక్యమైన బైబిలు ఇప్పటికీ, “ఉపదేశించుటకు” ఎంతో . . . “ప్రయోజనకరమై యున్నది.” అది నైతిక విషయాలపైన, మానవ సంబంధాలపైన, అనేక యితర విషయాలపైన మంచి సలహాలను అందిస్తుంది. దీనికి మించి, శాంతియుత భవిష్యత్తుకు బైబిలు కచ్చితమైన ఏకైక నిరీక్షణనిస్తుంది.

దాన్ని క్రమంగా చదవండి

కావున బైబిలును క్రమంగా చదవమని ప్రోత్సహించడాన్ని యెహోవాసాక్షులు తమ పనిలో ప్రథమ భాగంగా చేసుకున్నారు. బ్రూక్లిన్‌, న్యూయార్క్‌లో ఉన్న ప్రపంచ ప్రధాన కార్యాలయంలోని ఫ్యాక్టరీ భవనంపై పెద్ద అక్షరాల్లో ఈ ఉద్బోధ దర్శనమిస్తుంది: “దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలును ప్రతిదినం చదవండి.” ఆ దారిన నడిచే లక్షలాదిమంది ఈ మాటలను చూశారు. అంతేకాక అనేకులు వాటిని లక్ష్యపెట్టారని ఆశిస్తున్నాము.

ప్రపంచవ్యాప్తంగా 73,000 వేల యెహోవాసాక్షుల సంఘాలు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను ప్రతివారం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఒకటి బైబిలు నుండి ఎన్నుకోబడిన ఒక భాగాన్ని బహిరంగంగా చదవడం కూడా ఉంటుంది. అక్కడ హాజరైనవారందరూ తమతమ యిళ్లలో ఏకాంతంగా చదువుకోడానికి బైబిలునుండి కొన్ని అధ్యాయాలు నియమించబడివుంటాయి. ఈ పట్టిక ప్రకారం చదివేవారు చివరికి పూర్తి బైబిలును చదువుతారు.

ఈ పాఠశాలలో ఉపయోగించే పాఠ్య పుస్తకాల్లో ఒకదానికి అనుగుణంగా ఈ ఏర్పాటు ఉంది. థియోక్రాటిక్‌ మినిస్ట్రీ స్కూల్‌ గైడ్‌ బుక్‌ యిలా చెబుతోంది: “మీ వ్యక్తిగత పఠన క్రమంలో బైబిలును చదవటం కూడ ఇమిడివుండాలి. దాన్ని మొదటినుండి చివరివరకూ చదవటంలో ఎంతో విలువుంది. . . . అయినప్పటికీ సమాచారాన్ని చదివామనిపించుకోవటమే మీ గమ్యం కాకుండ, జ్ఞాపకముంచుకోవాలన్న దృక్పథంతో దాన్ని పూర్తి దృక్కోణాన్ని పొందే ప్రయత్నంతో చదివాలి. అది చెప్పే విషయాలను ధ్యానించడానికి సమయాన్ని వినియోగించండి.”

యెహోవాసాక్షులు ప్రచురించిన యితర ప్రచురణలు కూడా బైబిలును అలాగే చదవడానికి ప్రోత్సాహిస్తుంటాయి. ఉదాహరణకు, ఈ పత్రికతో పాటు ప్రచురించబడుతున్న తేజరిల్లు!లో (ఇంగ్లీష్‌) యౌవనులకు యిలాంటి ఓ ప్రోత్సాహం కనిపించింది: “మీరు బైబిలును . . . పూర్తిగా చదివారా? అవును, బైబిలు ఓ పెద్ద పుస్తకమే. అయితే దాన్ని చిన్న భాగాలుగా విభజించి ఎందుకు చదవకూడదు? . . . ‘ఘనులైన’ బెరయలోని వారు ‘ప్రతి దినమును లేఖనములు జాగ్రత్తగా పరిశోధించిరి.’ (అపొస్తలుల కార్యములు 17:11) ప్రతి రోజు కేవలం 15 నిమిషాలు చదివే కార్యక్రమాన్ని మీరు అవలంభిస్తే, . . . మీరు ఒక్క సంవత్సరంలో బైబిలు మొత్తాన్ని చదవగలరు.” అవును. ప్రాచీన కాలమందలి దేవుని సేవకుల్లా, ఆధునిక దిన క్రైస్తవులు లేఖనాలతో మంచి పరిచయం కల్గివుండాలని యెహోవాసాక్షులు భావిస్తారు.

ఈ దృక్పథంతో సాక్షులు, ఆధునిక పద్ధతిలో బహిరంగంగా బైబిలు చదవడాన్ని ప్రోత్సాహించారు. అనేక భాషల్లో పూర్తి బైబిలును చదివిన కేసెట్టు రికార్డులను వారు తయారు చేశారు. బైబిలు చదవడానికున్న అవాంతారాలను అధిగమించడానికి అనేకులకు యిది సహాయం చేసింది. కొందరు ఈ రికార్డులను యింట్లో పనిచేస్తున్నప్పుడో, కారు నడుపుతున్నప్పుడో లేక అనేక యితర విషయాలను చేస్తున్నప్పుడో వింటారు. నిశ్శబ్దంగా కూర్చుని, చదవబడుతున్న భాగాన్ని మీ స్వంత బైబిల్లో అనుసరించడం ఆహ్లాదకరమైన అనుభవం.

ఇప్పటికే మీరు బైబిలు ప్రతి రోజు చదవకపోయినట్లయితే, దాన్ని చదవడం అలవాటుగా ఎందుకు చేసుకోకూడదు? దానికి ప్రతి రోజు ఎక్కువ సమయాన్ని తీసుకోనవసరంలేదు. అయితే ప్రయోజనాలు గొప్పగా ఉంటాయి. ఎందుకంటే, లేఖనాలను అన్వయించడం, మీరు జ్ఞానయుక్తంగా నడుచుకుని ఆశీర్వాదాలుగల ఆత్మీయ జీవనాన్ని జీవించడానికి సహాయపడుతుంది. చాలాకాలం క్రితం, ఇశ్రాయేలీయుల నాయకుడైన యెహోషువకు యివ్వబడ్డ ఆజ్ఞకు అనుగుణంగా మీరు నడిచినవారవుతారు: “ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.”—యెహోషువ 1:8.

విధేయులైన మానవజాతికి యెహోవా ప్రేమపూర్వక ఉద్ధేశాన్ని బైబిలులోని పుటలు బయల్పరుస్తున్నాయి. ఆయన ప్రేరేపిత వాక్యపు సరైన జ్ఞానం, నిజమైన సంతోషాన్ని, అంతులేని ఆశీర్వాదాలున్న అద్భుతమైన నూతన లోకంలోని పరదైసులో నిత్యజీవితపు నిరీక్షణనిస్తుంది. (లూకా 23:43; 2 పేతురు 3:13) మీరు బైబిలును చదివి, పఠించి, దాని అద్భుతమైన జీవితాన్ని అందుకోవడానికి మీకున్న అవకాశాన్ని చేజిక్కించుకుంటారని ఆశిస్తున్నాము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి