మీరు బైబిలును విలువైనదిగా ఎంచుతారా?
ఓ 200 సంవత్సరాలకు పూర్వం, మేరీ జోన్స్ లాన్ఫియన్షెల్లో జన్మించింది. అది అట్లాంటిక్ సముద్ర తీరానికి సమీపంలో ఓ మారుమూలలో ఉన్న వెల్ష్ గ్రామం. ఆమె తలిదండ్రులు నిరు పేద నేతపనివారు—ఓ బైబిలును కూడా కొనుక్కోలేని స్థితి వారిది. అయితే వారు, బైబిలు కథలనూ, తమకు జ్ఞాపకమున్నంత మేరకు లేఖనాలను వల్లిస్తూ తమ బిడ్డ మనస్సులో దేవుని మేరకు లేఖనాలను వల్లిస్తూ తమ బిడ్డ మనస్సులో దేవుని యెడల ప్రేమను నాటారు. మేరీ తరచూ తమ పొరుగువారి వెల్ష్ బైబిలును చదివేది. అంతేకాకుండా తనకుగాను ఓ బైబిలును కొనుక్కోవాలన్న నిశ్చయంతో తనకు వీలున్నంత మేరకు కొంత డబ్బును దాచుకోవడం ప్రారంభించింది.
మేరీ 16 ఏళ్ల వయస్సున్నప్పుడు, అంటే 1800 సంవత్సరంలో, 40 కిలోమీటర్ల దూరంలో బాలా అనే ఓ చిన్న పట్టణంలో వెల్ష్ బైబిళ్లు అమ్మకానికున్నాయని ఆమె విన్నది. అక్కడికి నడిచి వెళ్లాలని ధైర్యంతో తీర్మానించుకుంది. చెప్పులు లేకుండానే గుట్టలగుండా ఆమె నడిచి వెళ్లింది. అయితే ఆమె అక్కడికి చేరేలోపు ప్రతులన్ని అప్పటికే అమ్ముడుపోయాయి. అంతేకాకుండా తాను దాచుకున్న డబ్బు చాలా తక్కువని మేరీ తెలుసుకుంది.
స్థానిక పాస్టరు మేరీ జ్ఞానానికీ, బైబిలుపైన ఆమెకున్న ప్రేమకు చలించిపోయాడు. అన్ని ప్రయత్నాల తర్వాత ఆమె నిరుత్సాహంతో కార్చిన కన్నీటిని చూసి, యిలా చెబుతూ తన స్వంత ప్రతిని దయాపూర్వకంగా యిచ్చాడు: “దాన్ని జాగ్రత్తగా చదువు. దాన్ని శ్రద్ధగా పఠించు, పరిశుద్ధ మాటలను నీ జ్ఞాపికలో దాచుకో, దాని బోధకు అనుగుణంగా నడుచుకో.”
ఈ కథ, కమిటీ ఆఫ్ రిలీజియస్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ లండన్‌లో తర్వాత చెప్పడం జరిగింది. అక్కడ, బైబిలు అనువాదాలను వెల్ష్ ప్రజలకే కాకుండా ప్రపంచమంతటికీ అందించాలనే తీర్మానం చేయబడింది. ఈ మామూలు ప్రారంభం నుండి, 19వ శతాబ్దమందలి అనేక బైబిలు సంస్థల్లో మొదటిది ప్రారంభమైంది. ఆ తర్వాత, అధిక వేగంతో బైబిలు యొక్క విదేశీ భాషా ప్రతులు కనిపించనారంభించాయి.
ఈనాడు, 1884లో వాచ్‌టవర్ బైబిలు అండ్ ట్రాక్ట్ సొసైటి సంస్థీకరించబడి, బైబిలునూ బైబిలు పఠించడానికి సహాయపడే ప్రచురణలనూ 200 కంటే ఎక్కువ భాషలలో అచ్చువేస్తోంది. ఆధునిక భాషలోకి అనువదించబడిన న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్ ప్రతులను ప్రపంచవ్యాప్తంగా, 7 కోట్ల 20 లక్షలకుపైగా అది అందించింది. హెబ్రీ గ్రీకు మూల భాషల నుండి అనువదించబడిన న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ యిప్పుడు, భాగాలుగా గానీ లేక మొత్తంగా గానీ 18 భాషల్లో అందుబాటులో ఉంది, అంతే కాదు యింకా 12 భాషల్లోకి అనువదించబడుతోంది.
బైబిలు అందరికి అందుబాటులో ఉన్న ఈ తరుణంలో మీరు దాన్ని ఎలా దృష్టిస్తారు? మీరు బైబిలును విలువైనదిగా ఎంచుతారా? మీరు అమూల్యమైనదిగా ఎంచి, చదివే ఓ ప్రతి మీకుందా?
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
ది స్టోరీ ఆఫ్ మేరీ జోన్స్ అండ్ హర్ బైబిల్ అనే పుస్తకం నుండి