‘కేవలం ఒక్క పుట అంధకారాన్ని ఓ నక్షత్రంలా పటాపంచలు చేయగలదు’
నేడు, పరిశుద్ధ లేఖనాల అనువాదాలు దాదాపు విశ్వవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అయితే, బైబిలు విషయమైన పోరాటం తరచు జీవన్మరణ పోరాటంలా ఉండేది.
ఫిఫ్టీన్త్ సెంచరీ బైబిల్స్ అనే పుస్తకంలో, వెన్డల్ ప్రైమ్ యిలా రాశారు: “ముద్రణను కనుగొన్న ముఫ్పై సంవత్సరాల తర్వాత భిన్న మతాలను కనుగొని శిక్షించే రోమన్ కాథోలిక్ న్యాయసభ స్పెయిన్ నందు, పూర్తి విజయంతో పనిచేయసాగింది. ఆ దేశంలో శిక్షించబడిన 3,42,000 మంది వ్యక్తుల్లో 32,000 మంది సజీవంగా దహించబడ్డారు. బైబిలును చదవడమూ దాన్ని కల్గివుండడమే వారిని హతసాక్షుల జ్వాలల్లోకి తెచ్చింది. ఇటలీలో అటు ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో కూడా ఈ నాశన ప్రతినిధి అంతే ఉద్ధృతంగా పనిచేసింది. ఈ న్యాయసభనుండి సహాయం పొందిన ఆర్చి బిషప్పులు, బైబిలుకూ దాని చదువరులకూ దహించే అగ్నిలా ఉండిరి. నీరో, కొందరు క్రైస్తవులను మంటలో వేస్తూ గోనెల్లో చుడుతూ తారుతో కప్పుతూ తన అత్యాచారాల సన్నివేశానికి దీపాలుగా ఉపయోగిస్తూ వారిని లోకమునకు వెలుగుగా వెలిగించాడు. అయితే ఐరోపా పట్టణాల వీధులు బైబిళ్లను కాల్చే దీపోత్సవంతో వెలిగాయి. బైబిలు పాఠకులను బలహీనపర్చబడగలరు, కొరడాలతో కొట్టబడగలరు. హింసించబడగలరు, అంగచ్ఛేదము చేయబడగలరు. భ్రష్టులుగా వెలివేయబడగలరు. కానీ బైబిలు అలా కాదు. దానిలోని ఒక్క పుట ఉన్నా అది ఈ అంధకారపు నలుపును ఓ నక్షత్రంలా పటాపంచలు చేస్తుంది.”—ఇటాలిక్కులు మావి.
రచయిత ఫ్రెమ్ వివరించింది యిక్కడ చూపబడిన బైబిలు పుట విషయంలో అక్షరాలా జరిగింది. అది ఆశ్వాసాంత గద్యపుట, అంటే అనువాదకుని గుర్తుస్తూ లభించిన మాటలుగల ఆ పుస్తకం చివరి పుట. ఆ పుటపై భాగమందలి రెండు సమాంతర వరుసల్లో అపోకలిప్స్ లేక ప్రకటనలోని తుది వచనాలను కల్గివుంది.
ఈ పుస్తకం విషయంలో ది కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ది బైబిల్ యిలా పేర్కొంటోంది: “బొనిఫాసియో ఫెరెర్ చేసిన కాటలన్ భాషా బైబిలు అనువాదం వాలిన్సియాలో 1478 నందు ముద్రించబడింది: అందుబాటులో ఉన్న ప్రతులన్నిటినీ న్యాయసభ 1500 లోగా నాశనం చేసింది. అయితే ఓ పుట హిస్పానిక్ సొసైటి ఆఫ్ అమెరికా గ్రంథాలయంలో యింకా ఉంది.”—ఇటాలిక్కులు మావి.
పెన్డెన్ ఫ్రెమ్ యింకా యిలా పేర్కొన్నారు: “భయభ్రాంతులైన మతనాయకులు బైబిళ్లను కాల్చివేయడమే స్వీకరించదగ్గ మార్గమని తలంచారు. ఈ పరిశుద్ధ హోమాలు మరింత తరచుగా, బ్రహ్మాండంగా సాగివుండేవి. అయితే యిక బైబిళ్లు లేకపోవడం వల్ల అలా జరగలేదు. బైబిళ్లను వెతకడంలో అధికారులు ఎంతో ఉద్ధృతంగా పనిచేయడం వల్లనే కాల్చడానికి బైబిళ్లు యిక మిగలలేదు.” సామాన్య ప్రజలకు ఉద్దేశించిన బైబిళ్లను మట్టుబెట్టె అలాంటి తీవ్ర ప్రయత్నాలు కొనసాగినప్పటికీ, అనేక ప్రతులు ఆ నాశనాన్ని తప్పించుకున్నాయి. ఫ్రెమ్ యిలా చెప్పారు: “దేశ బహిష్కారం అనుభవించిన వ్యక్తులు వాటిని తమతో కూడా తీసుకుని వెళ్లడం ద్వారా, లేక కృంగుదల సమయంలోనూ అపాయకర సమయంలోనూ అమూల్య రాళ్లను లేక అమూల్య లోహాలను దాచుకున్నట్టు దాచుకోవడం వల్ల బైబిళ్లు కాపాడబడ్డాయి.”
దేవుని ప్రవక్తయైన యెషయా యిలా రాశాడు: “సర్వశరీరులు గడ్డియై యున్నారు . . . గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును; మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.” (యెషయా 40:6, 8) శతాబ్దాలుగా, బైబిలును ప్రేమించే అనేకమంది, అలాగే అనేక ధైర్యశాలులైన అనువాదకులూ దేవుని వాక్యం కొరకు తమను తాము అపాయానికి గురిచేసుకుని, ఎంతో బాధను అనుభవించారు. అయినా, కేవలం మానవ ప్రయత్నం మాత్రమే దాన్ని కాపాడగలిగేదికాదు. దాన్ని కాపాడినందుకుగాను బైబిలు రచయితయైన యెహోవాకు మనం కృతజ్ఞతలు తెల్పుకుందాము.
[7వ పేజీలోని చిత్రసౌజన్యం]
Courtesy of The Hispanic Society of America, New York