కావలికోట మరియు తేజరిల్లు!—సత్యాన్ని తెల్పే సమయోచిత పత్రికలు
“యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.”—కీర్తన 31:5.
1, 2. (ఎ) కావలికోటలో చదివిన ఒక విషయాన్ని గురించి ఒక సహోదరి ఎలా భావించింది? (బి) మన పత్రికల గురించి ఏ ప్రశ్నలు వేయబడ్డాయి?
ఒక క్రైస్తవ సహోదరి ఇలా వ్రాసింది: “ది వాచ్‌టవర్‌లోని ‘యూ కెన్ ఫైండ్ కంఫర్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిస్ట్రెస్’a అనే శీర్షికలోని అద్భుతమైన సమాచారం కొరకు మీకు చాలా కృతజ్ఞతలు. మీరు వివరించిన అనేక విషయాలవంటి భావనలనే నేను అనుభవించ వలసివచ్చింది; ఈ శీర్షిక సూటిగా నాకే వ్రాసినట్లుంది. నేను దాన్ని మొదటిసారి చదివినప్పుడు, నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. నేనెలా భావిస్తున్నానో ఇంకొకరికి తెలుసని గ్రహించటం అద్భుతంగా ఉంది! యెహోవా సాక్షుల్లో ఒకరినైనందుకు నేను చాలా కృతజ్ఞత కలిగివున్నాను. ఇపుడు మన ఆత్మలకు ఓదార్పును, సమీప భవిష్యత్తులో పరదైసు నందు నిత్యజీవాన్ని గూర్చిన వాగ్దానాలను మనం మరెక్కడ కనుగొనగలం! కృతజ్ఞతలు. లక్షలసార్లు మీకు కృతజ్ఞతలు.”
2 మీరెప్పుడైనా అలా భావించారా? కావలికోట లేక దాని సహ పత్రికయైన తేజరిల్లు!లో ఏ విషయమైనా ప్రాముఖ్యంగా మీ కొరకే వ్రాయబడినట్లు ఎప్పుడైనా అనిపించిందా? ప్రజల హృదయాలను చూరగొనే ఏది మన పత్రికల్లో వుంది? అవి కలిగివున్న జీవాన్ని రక్షించే సమాచారం నుండి ఇతరులు మేలు పొందేలా మనమెలా వారికి సహాయం చేయవచ్చు?—1 తిమోతి 4:16.
సత్యాన్ని చాటిచెప్పే పత్రికలు
3. కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలు ఏ మంచి కారణాన్నిబట్టి అనేకమంది పాఠకుల హృదయాలను స్పర్శించాయి?
3 యెహోవా “సత్య దేవుడు.” (కీర్తన 31:5) ఆయన వాక్యమైన బైబిలు సత్యాన్ని తెల్పే పుస్తకము. (యోహాను 17:17) యథార్థ హృదయం గల ప్రజలు సత్యానికి ప్రతిస్పందిస్తారు. (యోహాను 4:23, 24ను పోల్చండి.) కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలు లక్షలాదిమంది పాఠకుల హృదయాలను స్పర్శించాయంటే దానికి ఒక కారణం అవి యథార్థత, సత్యం కల్గియున్న పత్రికలు కావడమే. వాస్తవానికి, బైబిలు సత్యానికి యథార్థత చూపించుట అనే అంశం మీదనే కావలికోట ప్రచురింపబడటం ప్రారంభమయ్యింది.
4, 5. (ఎ) సి.టి. రసెల్ ది వాచ్‌టవర్‌ను ప్రచురించటానికి ఏ పరిస్థితులు దారితీశాయి? (బి) “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసు”నిచే కావలికోట పత్రిక ఎలా ఉపయోగింపబడుతున్నది?
4 న్యూయార్క్ నందలి రోచెస్టర్కు చెందిన నెల్సన్ హెచ్. బార్బర్‌తో చార్లెస్ టి. రసెల్ 1876లో కలిసి పనిచేయడం మొదలుపెట్టాడు. బార్బర్ యొక్క హెరాల్డ్ ఆఫ్ ది మార్నింగ్ అనే మతసంబంధమైన పత్రిక ముద్రణను పునరుద్ధరించటానికి రస్సెల్ డబ్బు ఏర్పాటు చేశాడు, కాగా దానికి బార్బర్ ముఖ్య సంపాదకుడు, రసెల్ ఉపసంపాదకుడు. అయితే, ఒక సంవత్సరంన్నర తరువాత, హెరాల్డ్ యొక్క 1878 ఆగష్టు సంచికలో, క్రీస్తు మరణ విమోచనా విలువను అంగీకరించని శీర్షికను బార్బర్ వ్రాసాడు. బార్బర్కంటే దాదాపు 30 సంవత్సరాలు చిన్నవాడైన రసెల్, ఆ తరువాతి సంచికలోనే విమోచనా క్రయధనాన్ని సమర్థిస్తూ ఒక శీర్షిక వ్రాయడం ద్వారా ప్రతిస్పందించి, “దేవుని వాక్యములోని అత్యంత ప్రాముఖ్యమైన బోధలలో ఒకటని” ఆయన దాన్ని సూచించాడు. (మత్తయి 20:28) బార్బర్‌తో లేఖనాధారంగా తర్కించాలని అనేక ప్రయత్నాలు చేసిన తరువాత చివరికి రసెల్, హెరాల్డ్‌తో అన్ని సంబంధాలు వదులుకోవటానికి నిర్ణయించుకున్నాడు. ఆ పత్రిక యొక్క 1879 జూన్ సంచికతో మొదలుకొని, రసెల్ పేరు ఉపసంపాదకునిగా అందులో కనిపించలేదు. ఒక నెల తరువాత, 27 సంవత్సరాల రసెల్ జాయన్స్ వాచ్‌టవర్ అండ్ హెరాల్డ్ ఆఫ్ క్రైస్ట్స్ ప్రసెన్స్ను (అది ఇప్పుడు కావలికోట యెహోవా రాజ్యమును ప్రకటించుచున్నది అని పిలువబడుతుంది) ముద్రించడం మొదలు పెట్టాడు, అది మొదటి నుండి విమోచన క్రయధనం వంటి లేఖనాధార సత్యాన్ని సమర్థించింది.
5 గత 114 సంవత్సరాలుగా, కావలికోట నిపుణతగల ఒక న్యాయవాదిలా, బైబిలు సత్యాన్ని, సిద్ధాంతాన్ని రక్షించేదానిగా తనను తాను స్థాపించుకుంది. అది ఈ ప్రక్రియలో, మెచ్చుకొనే లక్షలాదిమంది పాఠకుల విశ్వాసాన్ని చూరగొన్నది. అది ఇప్పటికీ, విమోచన క్రయధనాన్ని శక్తివంతంగా సమర్థిస్తుంది. (ఉదాహరణకు, సెప్టెంబరు 15, 1992 పేజీలు 3-7, ఆంగ్ల సంచికను చూడండి.) స్థాపించబడిన యెహోవా రాజ్యాన్ని ప్రకటించడంలో, “తగిన వేళ” ఆత్మీయాహారాన్ని సిద్ధం చేయడంలో “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని”కి, అతని పరిపాలక సభకు అది ముఖ్య ఉపకరణంగా కొనసాగుతుంది.—మత్తయి 24:14, 45.
6, 7. ది గోల్డెన్ ఏజ్ యొక్క తెలియజేయబడిన ఉద్దేశమేమిటి, ఆలోచనాపరులైన ప్రజలు దాని వర్తమానానికి ప్రతిస్పందించారని ఏది చూపిస్తున్నది?
6 మరి తేజరిల్లు! పత్రిక విషయమేమిటి? ప్రారంభం నుండి, తేజరిల్లు! కూడా సత్యాన్ని చాటి చెప్పింది. మునుపు ది గోల్డెన్ ఏజ్ అని పిలువబడిన ఈ పత్రిక ప్రజలకు పంచిపెట్టడం కొరకు తయారు చేయబడింది. దాని ఉద్దేశం గురించి దాని మొదటి సంచిక అయిన అక్టోబరు 1, 1919 ఇలా తెలియజేసింది: “దైవిక జ్ఞానపు వెలుగులో ఈనాటి గొప్ప అసాధారణ ఘటనల నిజమైన భావాన్ని వివరించి, ఆలోచించేవారికి నిర్వివాద సాక్ష్యాధారంగా నిరూపించి, మానవజాతిని గొప్పగా ఆశీర్వదించే సమయం దగ్గరలోనే ఉందని ఒప్పింప చేయడమే దాని ఉద్దేశం.” ది గోల్డెన్ ఏజ్ వర్తమానానికి ఆలోచనాపరులైన ప్రజలు ప్రతిస్పందించారు. అనేక సంవత్సరాలు, కావలికోట కంటే కూడా దాని అందింపు సంఖ్య ఎంతో ఎక్కువగా ఉండింది.b
7 అయితే, కావలికోట మరియు తేజరిల్లు!ల విజ్ఞాపన సిద్ధాంతపరమైన సత్యాన్ని ప్రచురించి, ప్రపంచ పరిస్థితుల ప్రవచనార్థక ప్రాధాన్యతను వివరించడమనే వాస్తవాన్ని మించిపోతుంది. ప్రత్యేకంగా గత ఒకటి రెండు దశాబ్దాల్లో, మన పత్రికలు మరో కారణాన్నిబట్టి కూడా ప్రజల హృదయాలను చూరగొన్నాయి.
ప్రజల జీవితాలను స్పర్శించే సమయోచిత శీర్షికలు
8. సంఘంలోవున్న ఏ ప్రభావాలకు లొంగిపోవద్దని తన పాఠకులను కోరుతూ యూదా ఏ లిఖిత సవరింపును చేశాడు?
8 యేసుక్రీస్తు మరణించి, పునరుత్థానమైన దాదాపు 30 సంవత్సరాల తరువాత, బైబిలు రచయితయైన యూదా ఒక సవాలుపూర్వకమైన పరిస్థితి నెదుర్కొన్నాడు. అవినీతిపరులైన, పశు ప్రవృత్తిగల మనుష్యులు క్రైస్తవుల మధ్య ప్రవేశించారు. అభిషక్త క్రైస్తవులు సాధారణరీతిలో పొందబోయే రక్షణను గూర్చిన సిద్ధాంతపరమైన విషయాన్ని గురించి యూదా తన తోటి క్రైస్తవులకు వ్రాయాలనుకున్నాడు. కాని పరిశుద్ధాత్మచే నడిపింపబడి, సంఘంలోని కలుషిత ప్రభావాలకు లొంగిపోకుండా ఉండమని తన పాఠకులను కోరడం అవసరమని ఆయన తెలుసుకున్నాడు. (యూదా 3, 4, 19-23) పరిస్థితికి తగినట్లు సరిచేసుకుని, తన క్రైస్తవ సహోదరుల అవసరతలకు తగినట్లు యూదా సమయోచిత ఉపదేశాన్ని ఇచ్చాడు.
9. మన పత్రికలకు సమయోచిత శీర్షికలను అందజేయడంలో ఏమి ఇమిడి ఉంది?
9 ఆలాగే, మన పత్రికల కొరకు సమయోచిత శీర్షికలను సిద్ధంచేయడం ఒక సవాలుతో కూడిన బాధ్యత. కాలం మారినట్లే, ప్రజలు కూడా మారతారు, ఒకటి లేక రెండు దశాబ్దాల క్రితం వారి అవసరతలు, ఆసక్తులు ఏమైయుండెనో ఇప్పుడవి అలాలేవు. ఒక ప్రయాణ కాపరి ఇటీవలనే ఇలా అభిప్రాయపడ్డాడు: “నేను 1950వ దశకంలో సాక్షినైనప్పుడు, ప్రజలతో బైబిలు పఠనం చేయడంలో మేము ముఖ్యంగా త్రిత్వం, నరకాగ్ని, ఆత్మ వంటి సిద్ధాంతపరమైన బోధలను గురించే వారికి బోధించేవారము. కాని ఇప్పుడు, ప్రజల జీవితాల్లో అనేక సమస్యలు, కష్టాలు ఉన్నాయి గనుక, ఎలా జీవించాలో మనం వారికి నేర్పించాలి.” ఎందుకలా?
10. మానవ సంబంధాలు 1914 నుండి క్రమంగా పతనమై పోతున్నాయంటే మనమెందుకు ఆశ్చర్యపోకూడదు?
10 “అంత్యదినముల”ను గురించి బైబిలు ఇలా ప్రవచించింది: “దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.” (2 తిమోతి 3:1, 13) కాబట్టి, అంత్యకాలం 1914లో ప్రారంభమైనప్పటి నుండి మానవ సంబంధాలు క్రమంగా పతనమైపోతున్నాయంటే మనం ఆశ్చర్యపోకూడదు. మునుపెన్నటికన్నా చాలా తక్కువ సమయం ఉన్న సాతాను, పూర్వంకన్నా ఇప్పుడు ఎక్కువగా మానవ సమాజం మీద తన ఉగ్రతను చూపిస్తున్నాడు. (ప్రకటన 12:9, 12) ఫలితంగా, కేవలం 30 లేక 40 సంవత్సరాల క్రితంవున్న నైతిక, కుటుంబ విలువలకు ఇప్పుడున్నవాటికి చాలా తేడా ఉంది. సామాన్యంగా ప్రజలు మునుపటి దశాబ్దాల్లోలా మతపరమైన ఆసక్తి కలిగిలేరు. దౌర్జన్యం ఎంతగా పెరిగిపోయిందంటే, 20 లేక 30 సంవత్సరాల క్రితం తాము వినని ముందు జాగ్రత్త చర్యలను ప్రజలు యిప్పుడు తీసుకుంటున్నారు.—మత్తయి 24:12.
11. (ఎ) ప్రజల మనస్సులలో ఏవిధమైన అంశాలు ఉన్నాయి, అట్టి అవసరాలకు తగినట్లు నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ఎలా ప్రతిస్పందించింది? (బి) మీ జీవితాన్ని స్పర్శించిన కావలికోట లేక తేజరిల్లు!లోని ఒక శీర్షికను ఉదహరించండి.
11 కాబట్టి, మానసిక, సామాజిక, కుటుంబ విషయాలు అనేకమంది ప్రజల మనస్సుల్లో ఉంటున్నాయనుటకు ఆశ్చర్యపోవలసిన పనిలేదు. కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల్లో, ప్రజల వాస్తవావసరతలతో వ్యవహరించి, నిజంగా వారి జీవితాలను స్పర్శించిన సమయోచిత శీర్షికలను ప్రచురించడం ద్వారా నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ధైర్యంగా ప్రతిస్పందించింది. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.
12. (ఎ) కావలికోట కొరకు 1980లో తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాలకు సంబంధించిన శీర్షికలు ఎందుకు సిద్ధం చేయబడ్డాయి? (బి) తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాలపై వచ్చిన శీర్షికల యెడల ఒక సహోదరి ఎలా మెప్పును తెలియజేసింది?
12 కుటుంబ సమస్యలు. తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాల సంఖ్య వేగంగా పెరిగినట్లు ప్రపంచవ్యాప్త నివేదికలు చూపించినప్పుడు, “వన్-పేరెంట్ ఫామిలీస్—కోపింగ్ విత్ ది ప్రోబ్లమ్స్” వంటి ముఖ్యాంశంగల క్రొత్త శీర్షికలతో ది వాచ్‌టవర్ సెప్టెంబరు 15, 1980 సంచిక సిద్ధం చేయబడింది. ఆ శీర్షికలు రెండు విధాల సంకల్పం గలవి: (1) తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న వారు ఎదుర్కొనే ప్రత్యేకమైన సమస్యలను అధిగమించడంలో సహాయం చేయడం, (2) తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాలను వాస్తవంగా “పరామర్శించుచు,” వారి యెడల “సహోదర ప్రేమను” చూపగలుగునట్లు ఇతరులు వారి గురించి బాగా తెలుసుకొని ఉండేలా సహాయ పడటం. (1 పేతురు 3:8; యాకోబు 1:27) అనేకమంది పాఠకులు శీర్షికలను మెచ్చుకొంటూ వ్రాశారు. ఒక తల్లి ఇలా వ్రాసింది: “నేను మొదటిపేజీ చూసినప్పుడు నిజంగా నా కన్నీళ్లు వచ్చాయి, నేను పత్రిక తెరిచి సమాచారం చదివినప్పుడు, అవసరమైన సమయంలో అలాంటి సమాచారాన్ని అందజేసి నందుకు నా హృదయం యెహోవా యెడల కృతజ్ఞతతో పొంగి పోయింది.”
13. అవేక్!లో 1981లో మానసిక కృంగుదలకు సంబంధించిన లోతైన ఏ చర్చ ప్రచురించబడింది, దానిని గూర్చి ఒక పాఠకుడు ఏమి చెప్పాడు?
13 మానసిక సమస్యలు. కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలు 1960వ దశాబ్దం నుండి మానసిక కృంగుదల అనే విషయాన్ని చర్చించాయి. (1 థెస్సలొనీకయులు 5:14) అయితే సెప్టెంబరు 8, 1981 అవేక్! సంచికలో “యు కేన్ ఫైట్ డిప్రెషన్!” అనే శీర్షిక పరంపరలో ఈ విషయాన్ని ఒక క్రొత్త, క్రియాత్మక దృక్పథంతో పరిశీలించారు. ప్రపంచం నలుమూలల నుండి మెప్పుతో కూడిన ఉత్తరాలు వాచ్‌టవర్ సంస్థకి ప్రవాహంలా వచ్చిపడ్డాయి. ఒక సహోదరి ఇలా వ్రాసింది: “నా హృదయంలోని భావాలను కాగితంపై నేనెలా వ్యక్తం చేయ గలను? నాకు 24 సంవత్సరాలు, గత పది సంవత్సరాల నుండి నేను అనేక సార్లు మానసిక కృంగుదలతో బాధపడ్డాను. కాని ఇప్పుడు నేను యెహోవాకు సన్నిహితమైనట్లు భావిస్తున్నాను, ఆయన దుఃఖపడేవారి అవసరతలకు తగినట్లు ఈ ప్రేమపూర్వకమైన శీర్షికలతో ప్రత్యుత్తరమిచ్చినందుకు నేను కృతజ్ఞత కలిగివున్నాను. అదే మీకు చెప్పాలనుకున్నాను.”
14, 15. (ఎ) మన పత్రికలలో కామవాంఛతో పిల్లల్ని పాడుచేయుట అనే అంశం ఎలా వ్యవహరింపబడింది? (బి) ఆస్ట్రేలియాలోని ఒక జాకీని ఏ పత్రిక శీర్షికలు ముగ్ధుణ్ణి చేశాయి?
14 సామాజిక సమస్యలు. “అంత్య దినములలో” మనుష్యులు “స్వార్థప్రియులు . . . అనురాగరహితులు . . . అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు”గా ఉంటారని బైబిలు ముందే తెలియజేసింది. (2 తిమోతి 3:1-3) కాబట్టి, ఈనాడు కామవాంఛతో పిల్లల్ని పాడుచేయడం పెరిగిపోయిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అక్టోబరు 1, 1983 ది వాచ్‌టవర్‌లో “హెల్ప్ ఫర్ ది విక్టిమ్స్ ఆఫ్ ఇన్సెస్ట్” అనే శీర్షికలో ఈ విషయాన్ని సూటిగా వివరించారు. ఎనిమిది సంవత్సరాల తరువాత, “హీలింగ్ ది వూండ్స్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్” అనే కవరు శీర్షికల పరంపరలో అక్టోబరు 8, 1991 అవేక్! బాధితులకు ఆదరణ, నిరీక్షణ ఇవ్వటానికి, అలాగే వారికి మంచి సహాయాన్నిచ్చేలా ఇతరులకు తెలియజేయటానికి జాగ్రత్తగా సిద్ధం చేయబడ్డాయి. ఈ శీర్షికల పరంపర మన పత్రికల చరిత్రలోనే అత్యంత గొప్ప పాఠక ప్రతిస్పందనను రేకెత్తించింది. ఒక పాఠకుడు ఇలా వ్రాశాడు: “నేను కోలుకోవడానికి గొప్ప ప్రభావం చూపింది ఈ శీర్షికలలోని ఓదార్పునిచ్చే భావాలు, లేఖన ఉదాహరణలే. యెహోవా నా గురించి ఎంతమాత్రం తక్కువగా భావించడన్నది తెలుసుకోవటం నాకు చెప్పలేనంత ఉపశమనాన్ని కలుగజేసింది. నేను ఒంటరి వాడిని కాదని తెలుసుకోవడం కూడా అంతే ఉపశమనాన్నిచ్చింది.”
15 ఆస్ట్రేలియా నందలి మెల్బోర్న్లోని ఒక జాకీ గుర్రపు పందాల వాతావరణం గురించి తన అసహ్యతను వ్యక్తపరుస్తూ ఎంతో దూరంలో సిడ్నీలోవున్న వాచ్‌టవర్ సంస్థకు ఫోన్ చేశాడు. ఆయన “రేప్—ఎ వుమెన్స్ నైట్మేర్” అనే అంశంపైనున్న మార్చి 8, 1993 అవేక్! పత్రికను చూశానని, అంత విలువైన పత్రిక ఉందని నమ్మకలేకపోతున్నానని చెప్పాడు. ఆయన దాదాపు 30 నిమిషాలపాటు ప్రశ్నలు అడిగి, వాటికి ఇవ్వబడిన సమాధానాలు విని ఎంతో ఆనందించాడు.
16. మన పత్రికల యెడల మీరు ఏ యే విధాలుగా మీ మెప్పును ప్రదర్శించవచ్చు?
16 మీ విషయమేమిటి? కావలికోట లేక తేజరిల్లు! పత్రికలలో ప్రచురించబడిన ఏదైనా ప్రత్యేకమైన శీర్షిక మీ జీవితాన్ని స్పర్శించిందా? అలా అయితే, మీరు నిస్సందేహంగా మా పత్రికల యెడల కృతజ్ఞతాభావం కలిగి ఉంటారు. మీరు మీ మెప్పును ఎలా ప్రదర్శించగలరు? మీకైమీరు ప్రతి సంచికను చదవడం ద్వారా మీరు అలా చేయవచ్చు. మీకు సాధ్యమైనంత మేరకు ఈ అమూల్యమైన పత్రికలను ఇతరులకు పంచిపెట్టడంలో కూడా మీరు భాగం వహించవచ్చు. ఇదెలా చేయవచ్చు?
వాటిని ఇతరులతో పంచుకోండి!
17. పత్రికల అందింపును విస్తృతపర్చడానికి సంఘాలు ఏమి చేయవచ్చు?
17 మొదటగా, ప్రతి సంఘము చేయగలిగింది ఒకటుంది. ఇన్ఫార్మాంట్ (ఇప్పుడు మన రాజ్య పరిచర్య) అక్టోబరు 1952 సంచిక ఇలా తెలియజేసింది: “పత్రికలను పంచిపెట్టే అత్యంత ప్రభావవంతమైన మూలం ఇంటింటికి, అంగడంగడికి వాటిని అందజేయడం. కాబట్టి, పత్రికలదిన కార్యక్రమంలో పత్రికలను పంచిపెట్టే ఈ పద్ధతులను క్రమభాగంగా ఉంచమని సంస్థ సిఫారసు చేస్తుంది.” ఆ సలహా ఈనాడు కూడా విలువైనదే. క్రమంగా పత్రికాదినాన్ని, ముఖ్యంగా పత్రికలతో సాక్ష్యమిచ్చుటకు ఒక దినాన్ని కేటాయించుటకు సంఘాలు పట్టిక వేసుకోవచ్చు. చాలా సంఘాలకు, ప్రత్యేకమైన శనివారాలు నిస్సందేహంగా మంచి సమయాలుగా ఉంటాయి. అవును, ఇంటింటికి, అంగడంగడికి, వీధుల్లో, మ్యాగజైన్ రూట్లలో పత్రికలతో సాక్ష్యమివ్వటానికి ప్రతి సంఘము ప్రత్యేకమైన దినాలను లేక సాయంత్రాలను కేటాయించాలి. అంతేగాక, పత్రికలను పంచిపెట్టే పనిని ఎక్కువచేయునట్లు సహాయం చేయుటకు రాజ్య ప్రచారకులైన మీరేమి చేయగలరు?
18, 19. (ఎ) కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల యెడల ఆసక్తి కలిగివుండటం పత్రికలను అందజేయటానికి మీకెలా సహాయం చేస్తుంది? (బి) పత్రికలను అందజేసేటప్పుడు క్లుప్తమైన, సూటియైన అందింపు యొక్క ప్రయోజనమేమిటి? (సి) ప్రజల ఇళ్లలోనికి పత్రికలు వెళ్లేలా చేయడం యొక్క విలువను ఏది చూపిస్తుంది?
18 “కావలికోట” మరియు “తేజరిల్లు!” పత్రికల యెడల ఆసక్తి కలిగివుండడం మొదటి మెట్టు. ముందే పత్రికలను చదవండి. మీరు ప్రతి శీర్షికను చదివేటప్పుడు, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి ‘ఈ శీర్షిక ఎవరికి ఆసక్తికరంగా ఉంటుంది?’ ఆ శీర్షిక యందు ఆసక్తిని రేకెత్తించటానికి మీరేం చెబితే బాగుంటుందో కొన్ని మాటలు ఆలోచించండి. క్రమంగా ఉండే మ్యాగజైన్ దినానికి మద్దతు నివ్వడంతోపాటు, ఇతరులతో అనగా ప్రయాణించేటప్పుడు, సరుకులు కొనేటప్పుడు, తోటి పనివారితో, పొరుగువారితో, తోటి విద్యార్థులతో లేక ఉపాధ్యాయులతో వాటిని పంచుకోటానికి వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనుటకు కొన్ని కాపీలు మీతోపాటు ఎందుకు ఉంచుకోకూడదు?
19 మీ అందింపును సరళంగా ఉంచుకోవడం అనేది రెండవ సలహా. డిశంబరు 1, 1956 వాచ్‌టవర్ ఇలా తెలియజేసింది: “పత్రికలను అందజేసేటప్పుడు క్లుప్తంగా, అంశానికి తగినట్టు సూటిగా చెప్పడం శ్రేష్ఠం. చాలా కాపీలు అందజేయాలన్నది మన ఉద్దేశం. ‘మాట్లాడటం’ వాటంతటవే చేస్తాయి.” ఒక శీర్షికలో నుండి ఒక ఆలోచనను ఎన్నుకుని, దాన్ని కొద్ది మాటల్లో పెట్టి, పత్రికలను అందజేయడం ప్రభావవంతంగా ఉన్నట్లు కొంతమంది ప్రచారకులు కనుగొన్నారు. ఒకసారి పత్రికలు వారి ఇంటిలోకి ప్రవేశించిన తరువాత, మీవద్ద వాటిని తీసుకున్న వ్యక్తితోనేకాక ఇంటిలోని ఇతరులతో కూడా ఆ పత్రికలు “మాట్లాడవచ్చు.” ఐర్లాండులో, తన తండ్రి ఒక సాక్షి వద్ద నుండి తెచ్చిన సెప్టెంబరు 1, 1991 ది వాచ్‌టవర్‌ను ఒక యౌవన విశ్వవిద్యాలయ విద్యార్థి చదివింది. “సంభాషణ” అనే అంశంపై ఉన్న శీర్షిక, మరితర అంశాలపైవున్న శీర్షికలు ఆమెకు ఆసక్తి కలిగించాయి. పత్రికలు చదివిన వెంటనే, టెలిఫోను బుక్‌లో నంబరు చూసి సాక్షులకు ఫోను చేసింది. త్వరలోనే ఒక బైబిలు పఠనం మొదలయ్యింది, 1993 జూలైలో జరిగిన “దైవిక బోధ” జిల్లా సమావేశంలో ఆ యౌవనస్థురాలు బాప్తిస్మం తీసుకుంది. కాబట్టి తప్పకుండా, ప్రజలతో అవి “మాట్లాడ” గలిగేలా వారి ఇళ్లలోకి పత్రికలు వెళ్లేలా మనం చూద్దాం! ఒక ప్రయాణ కాపరి మరో సుళువైన సలహాను యిలా ఇచ్చాడు: “పత్రికలను మీ పుస్తకాల సంచిలో నుండి బయటికి తీయండి.” వాస్తవానికి, మీరు చెప్పేది గృహస్థునికి ఆసక్తి కలిగించకపోతే, కవరు మీది ఆకర్షణీయమైన చిత్రం మీరు పత్రికను అందజేయుటకు సహాయం చేయవచ్చు.
20, 21. (ఎ) పత్రిక అందింపులో పాల్గొనేటప్పుడు మనమెలా పరిస్థితులకు తగినట్లు ఉండగలము? (బి) ప్రతి నెల ఎక్కువ పత్రికలను అందజేయటానికి మీరేమి చేస్తారు?
20 మూడవ సలహా ఏమిటంటే, పరిస్థితులకు తగినట్లు మారే విధంగా ఉండండి. (1 కొరింథీయులు 9:19-23 పోల్చండి.) కొన్ని చిన్న అందింపులను సిద్ధంచేసుకోండి. పురుషులకు తగినట్లుండేది ఒకటి, స్త్రీలకు తగినట్లుండేది ఒకటి, అలా శీర్షికలను మనస్సులో ఉంచుకోండి. యౌవనస్థులకు “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . ” శీర్షికను చూపించవచ్చు. పత్రిక అందింపులో పాల్గొనేటప్పుడు కూడా మీరు పరిస్థితులకు తగినట్లు మారే విధంగా ఉండండి. పత్రిక అందింపు దినానే కాక, సాయంకాలం సాక్ష్యమివ్వడం కూడా ఇంటింటి సేవలో పత్రికలను అందజేయుటకు అద్భుతమైన అవకాశాన్నిస్తుంది.
21 నాలుగవ సలహా ఏమిటంటే, వ్యక్తిగత గమ్యాలను ఏర్పర్చుకోండి. ఏప్రిల్ 1984 మన రాజ్య పరిచర్యలో వచ్చిన “పత్రికలు జీవానికి మార్గాన్ని చూపిస్తాయి,” అనే శీర్షిక ఇలా తెలియజేసింది: “ఒక సలహా ఏమిటంటే, ఉదాహరణకు ప్రచారకులు వారి పరిస్థితులను బట్టి నెలకు 10 పత్రికలు అందజేసే గురిని కలిగివుండవచ్చు; పయినీర్లైతే 90 పత్రికలు అందజేయుటకు ప్రయత్నించవచ్చు. కొంతమంది ప్రచారకులు నెలకు ఎక్కువ పత్రికలను అందజేయగలిగివుండవచ్చు కాబట్టి వారు ఎక్కువ వ్యక్తిగత గురిని కలిగివుండవచ్చు. అయితే, ఆరోగ్యం సరిలేకపోవడంవల్ల, ప్రాంతాన్ని బట్టి, లేక ఇతర మంచి కారణాలను బట్టి, ఇతరుల లక్ష్యాలు తక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ, వారు యెహోవాకు చేస్తున్న సేవ విలువైనదే. (మత్తయి 13:23; లూకా 21:3, 4) ప్రాముఖ్యమైన విషయమేమిటంటే, వ్యక్తిగత గురిని కలిగి ఉండడమే.”
22. సత్యం యొక్క మన సమయోచిత పత్రికల కొరకు యెహోవాకు మనం కృతజ్ఞులమై ఉన్నామని ఏవిధంగా చూపించవచ్చు?
22 ఈ సమయోచిత పత్రికలను మనకు అందజేయుటకు “సత్య దేవుడైన” యెహోవా, నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని తరగతిని, దాని పరిపాలక సభను వాడుకుంటున్నందుకు మనమెంత కృతజ్ఞత కలిగివున్నాము! (కీర్తన 31:5) యెహోవా ఇష్టపడినంత వరకు ఈ పత్రికలు ప్రజల నిజమైన అవసరతలతో వ్యవహరించుటలో కొనసాగుతాయి. అవి యెహోవా ఉన్నత నైతిక ప్రమాణాలను సమర్థిస్తూనే ఉంటాయి. అవి సరైన సిద్ధాంతాన్ని బలపర్చుటకు వెనుకాడవు. దేవుని రాజ్య పరిపాలన జరుగుతున్న మరియు పెరుగుతున్న సంఖ్యలో యెహోవా నిజ ఆరాధికులచే మునుపెన్నటికన్నా ఇప్పుడు దేవుని చిత్తం భూమిపై ఎక్కువగా నెరవేరుతున్న సమయంగా మన దినాలను గుర్తిస్తున్న ప్రవచన నెరవేర్పువైపు దృష్టిని కేంద్రీకరించుటకు అవి గట్టి ప్రయత్నం చేస్తాయి. (మత్తయి 6:10; ప్రకటన 11:15) కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలలో మనకెంత అమూల్యమైన సంపద ఉంది! ప్రజల జీవితాలను స్పర్శించి, రాజ్య సత్యాలను ప్రకటించే ఈ ప్రాముఖ్యమైన పత్రికలను దీన హృదయులకు అందజేయుటకు మనం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము.
[అధస్సూచీలు]
a జూలై 15, 1992, 19-22 పేజీలు.
b అనేక సంవత్సరాల వరకు కావలికోట ప్రాముఖ్యంగా అభిషక్త క్రైస్తవుల పత్రికగా దృష్టించబడేది. అయితే, 1935 మొదలుకొని, భూమిపై నిత్యజీవాన్ని పొందే నిరీక్షణ గల “గొప్పసమూహాన్ని” కావలికోట తీసుకుని, చదువమని ప్రోత్సహించుటకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. (ప్రకటన 7:9) కొన్ని సంవత్సరాల తరువాత, అనగా 1940లో, కావలికోట వీధుల్లో ప్రజలకు క్రమంగా అందజేయబడేది. దాని తరువాత, దాని అందింపు సంఖ్య వేగంగా పెరిగిపోయింది.
మీ జవాబేమిటి?
◻ కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలు సత్యాన్ని తెల్పే పత్రికలని ఏమి చూపించుచున్నది?
◻ కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలు ప్రజల జీవితాలను ఎలా స్పర్శించాయి?
◻ పత్రికల అందింపును ఎక్కువ చేయుటకు సంఘాలు ఏమి చేయవచ్చు?
◻ పత్రికలను ఎక్కువగా అందజేయుటకు ఏ సలహాలు మీకు సహాయం చేయగలవు?
[22వ పేజీలోని బాక్సు]
ప్రజల జీవితాలను స్పర్శించిన కొన్ని శీర్షికలు
కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలలో ప్రచురించ బడిన కొన్ని ప్రత్యేకమైన శీర్షికల యెడల మెప్పును వ్యక్తపర్చటానికి సంవత్సరాలుగా అనేకమంది పాఠకులు వ్రాశారు. మా పాఠకులను ప్రభావితం చేసిన అనేక అంశాలలో కేవలం కొన్నిటిని ఈ క్రింద ఇస్తున్నాము. ఈ శీర్షికలు లేక మరితర శీర్షికలు మీ జీవితాన్ని మార్చివేశాయా?
కావలికోట
“ఆక్సెప్ట్ గాడ్స్ హెల్ప్ టు ఓవర్‌కమ్ సీక్రెట్ ఫాల్ట్స్” (ఏప్రిల్ 15, 1985)
“వృద్ధ తలిదండ్రుల యెడల దైవిక విధేయతను చూపించటం” (కావలికోట, డిశంబరు 1, 1987)
“సంకల్పముతో కూడిన విద్య” (కావలికోట, ఫిబ్రవరి 1, 1993)
తేజరిల్లు!
“యు కెన్ ఫైట్ డిప్రెషన్!” (సెప్టెంబరు 8, 1981)
“వెన్ సంవన్ యు లవ్ డైస్ . . .” (ఏప్రిల్ 22, 1985)
“ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్!” (అక్టోబరు 8, 1993)
[23వ పేజీలోని చిత్రం]
కెనడాలో—పత్రికలతో ఇంటింటా ప్రకటించడం
[24వ పేజీలోని చిత్రం]
మ్యాన్మార్లో—జీవానికి మార్గం చూపే పత్రికలను అందజేయడం