కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 1/1 పేజీలు 26-27
  • ‘యెహోవాయందు విశ్వాసముంచే’ యౌవనస్థులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘యెహోవాయందు విశ్వాసముంచే’ యౌవనస్థులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • సత్యముతో దేవుడ్ని ఆరాధించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ‘బాలుర నోటి నుండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 1/1 పేజీలు 26-27

‘యెహోవాయందు విశ్వాసముంచే’ యౌవనస్థులు

యౌవనస్థులు సౌందర్యంపైనగాని, వృద్ధులు జ్ఞానంపైనగాని గుత్తాధిపత్యం కలిగిలేరు. (సామెతలు 11:22; ప్రసంగి 10:1 పోల్చండి.) బదులుగా యెహోవా యందు విశ్వాసముంచి, “నీవే నా దేవుడవు” అని హృదయపూర్తిగా చెప్పేవారే నిత్య సౌందర్యం, అసలైన జ్ఞానం గలవారు.—కీర్తన 31:14; సామెతలు 9:10; 16:31.

ప్రపంచవ్యాప్తంగా సౌందర్యవంతులైన యౌవనస్థులు, వృద్ధులు కూడా ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చెందుతున్నారు, వారు దేవున్ని సేవిస్తూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం ద్వారా తమ జ్ఞానాన్ని చూపిస్తున్నారు. ఉదాహరణకు, ఎనిమిది సంవత్సరాల జబ్రీనా విషయమే ఆలోచించండి.

జబ్రీనా జర్మనీలో నివసిస్తుంది, ఆమె రెండవ తరగతి చదువుకుంటుంది. పాఠశాలకు హాజరౌతున్నవారిలో ఆమె మొదటి యెహోవా సాక్షి. విచారకరమైన విషయమేమంటే, తమకు ఇష్టమైన పుస్తకాన్ని తరగతికి తీసుకురమ్మని ఉపాధ్యాయురాలు విద్యార్థులకు చెప్పేంత వరకు ఆమె తన తోటివారితో అవమానింపబడింది. జబ్రీనా మై బుక్‌ ఆఫ్‌ బైబిల్‌ స్టోరీస్‌ను తీసుకురావటానికి నిర్ణయించుకుంది. ముందు రోజు రాత్రి ఆమె భయపడుతున్నప్పటికీ బాగా సిద్ధపడింది. తరగతిలో 26 మంది విద్యార్థులున్నారు కాబట్టి తనకు ఎక్కువ సమయం లభించదని ఆమెకు తెలుసు. అయినప్పటికీ ఎవరూ తనను మధ్యలో ఆపకుండా ఉండేలా చూసుకోవాలని నిర్ణయించుకుంది, యెహోవా తనకు సహాయం చేస్తాడని కూడా కచ్చితంగా విశ్వసించింది. నిర్ణయింపబడిన దినాన, ఎవరెవరు పుస్తకాలు తెచ్చారు, ఎవరు మొదట చూపటానికి ఇష్టపడతారు అని ఉపాధ్యాయురాలు అడిగింది. ఆశ్చర్యకరమైన విధంగా, కేవలం జబ్రీనా మాత్రమే తెచ్చింది. ఆమె తరగతి యెదుట నిలబడి మాట్లాడటం, చదవటం, పుస్తకంలో నుండి చిత్రాలు చూపించటం, అంతా బైబిలు ఆధారితమైనదని వివరించడం మొదలు పెట్టింది. చివరలో ఆమె ఇలా అడిగింది: “ఈ పుస్తకాన్ని తీసుకోవడానికి ఎవరు ఇష్టపడతారు?” ఆమె ఉపాధ్యాయురాలికి ఒక పుస్తకాన్ని ఇచ్చింది, తరువాతి కొద్ది రోజుల్లో తన తోటి విద్యార్థుల్లో కొంతమందికి ఇంకా పది పుస్తకాలు ఇచ్చింది. ఆమె చెప్పింది విని ఉపాధ్యాయురాలు, “ఇటువంటిది నేనెప్పుడూ చూడలేదు” అని మాత్రమే అన్నది. ఆమె జబ్రీనా చేసినపనికి ఉన్నత శ్రేణి మార్కులిచ్చింది.

వాస్తవానికి, చాలామంది యౌవన సాక్షులు పాఠశాలలో సువార్త ప్రకటించే సంతోషదాయకమైన ప్రచారకులుగా ఉన్నారు. మరో ఉదాహరణ, మెక్సికోలోని 11 సంవత్సరాల ప్రచారకు రాలైన ఎరెకా. ఆమెకు పసితనం నుండే యెహోవాను ప్రేమించడం నేర్పబడింది. ఆమె పాఠశాల విద్య కూడా ఉత్తమంగా ఉంది. ఎయిడ్స్‌, పొగాకు, మద్యం వంటి వాటికి అలవాటు పడటం అనే విషయంపై వ్యాసం సిద్ధం చేసే ఒక పని ఆమెకివ్వబడింది. ఆమె తేజరిల్లు! పత్రికను ఉపయోగించి బాగా సిద్ధం చేసి ఉత్తమ మార్కులను పొందింది. ఆమె ఉపాధ్యాయురాలు ఈ సమాచారం నీకు ఎక్కడిదని అడిగింది, ఆ విషయాలపై శీర్షికలున్న పత్రికలు ఆమెకివ్వబడ్డాయి. తరువాత, మొత్తం తరగతితో ఆ విషయాలను చర్చించటానికి ఉపాధ్యాయురాలు ఈ పత్రికలను ఉపయోగించింది. ఎరెకా ప్రవర్తననుబట్టి, ఆమె తన ఉపాధ్యాయుల యెడల చూపించే గౌరవాన్నిబట్టి, ఆమె పొందే ఉన్నత శ్రేణులనుబట్టి, ఆమె బహుమానాలు, యోగ్యతాపత్రాలు, కొంత డబ్బు ఇచ్చే స్కాలర్‌షిప్పులు పొందటానికి అర్హురాలయ్యింది. అయినప్పటికీ, యెహోవాసాక్షులలో ఒకరిగా గుర్తింపబడటం, బైబిలు సాహిత్యాన్ని అందజేయగల్గడం, దేవుని నామాన్ని ఉన్నతపర్చగల్గడం తాను సాధించిన అత్యంత గొప్ప విజయాలని ఆమె భావిస్తుంది.

తరువాత న్యూజీల్యాండ్‌లో నివసిస్తున్న పది సంవత్సరాల బాలుడైన షానెన్‌ ఉన్నాడు. ఆయనకు కేవలం ఒక కన్నే ఉంది; అతడు పసివానిగా ఉన్నప్పుడే క్యాన్సరు వల్ల రెండో కన్ను పోయింది. అతడు ఏడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని తల్లి యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం మొదలుపెట్టింది. అయితే ఆమె తన బైబిలు పాఠాలు మొదలుపెట్టిన కొంతకాలానికే, వివాహం చేసుకోకుండానే ఒక వ్యక్తితో జీవించటం ప్రారంభించి, తన పఠనాలు మానుకోవటానికి నిర్ణయించుకుంది. షానెన్‌ మాత్రం తన బైబిలు పఠనం కొనసాగాలని అర్థించాడు. ఆ కోరిక మన్నించబడింది. సాక్షి ఆలాగే క్రమంగా వస్తూవుండడంతో, మెల్లిగా కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు బైబిలును పఠించి, ఆత్మీయాభివృద్ధి చెందారు. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న తరువాత, షానెన్‌ తల్లి మరియు అతని మారుతండ్రి బాప్తిస్మం తీసుకున్నారు.

ఒకరోజు షానెన్‌, ప్రయాణ కాపరి భార్య కలిసి ప్రాంతీయ సేవ చేస్తున్నారు. ఒక గృహస్థుడు షానోన్‌ను ఇలా అడిగాడు: “నీ కంటికి ఏమయ్యింది?” అతనిలా జవాబిచ్చాడు: “ఆ కంటికి క్యాన్సరు వచ్చింది, అందుకే దాన్ని తీసివేయవలసి వచ్చింది, త్వరలోనే యెహోవా పరదైసులో నాకు క్రొత్త కంటిని ఇవ్వబోతున్నాడు, మీకు అది చెప్పటానికే మేమిక్కడికి వచ్చాము.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి