కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 7/1 పేజీలు 7-9
  • నిజమైన స్వాతంత్ర్యము—ఏ మూలమునుండి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిజమైన స్వాతంత్ర్యము—ఏ మూలమునుండి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్వాతంత్ర్యము దుర్వినియోగపరచబడెను
  • అబద్ధ మతమునకు దాసత్వము
  • స్వతంత్రులేగాని జవాబుదారులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • స్వాతంత్ర్యమునిచ్చు దేవుని నూతన లోకమునుగూర్చి ఎలుగెత్తిచాటుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • మానవుని “నూతనలోక క్రమము” సమీపించినదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • మత స్వాతంత్ర్యం మీకు ఏ భావాన్ని కలిగివుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 7/1 పేజీలు 7-9

నిజమైన స్వాతంత్ర్యము—ఏ మూలమునుండి?

“మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు. . . . ఓ, యెహోవా నన్ను సరిదిద్దుము.”—యిర్మీయా 10:23, 24. (NW)

1, 2. అనేకమంది ప్రజలు స్వాతంత్ర్యము నెట్లు దృష్టింతురు, అయితే దేనినికూడా విచారించుట అవసరము?

ఇందుకు సందేహము లేదు, మీరు నిజమైన స్వాతంత్ర్యమును గుణగ్రహింతురు. మీ స్వంత అభిప్రాయాలను వ్యక్తపరచుటకు స్వేచ్ఛను, ఎక్కడ మరియు ఎట్లు జీవించాలో నిర్ణయించుకొనుటకు స్వేచ్ఛను మీరు కోరుకుంటారు. మీరుచేయు పనిని, ఆహారమును, సంగీతమును, స్నేహితులను ఎంపికచేసికొనుటను మీరు కోరుకుంటారు. చిన్న, పెద్ద ఇలా అనేక విషయాలలో మీరు ఇష్టపడేవి ఉంటాయి. ఎంపికచేసికొనుటకు ఎంతమాత్రము లేక అసలే స్వేచ్ఛలేకుండానే నిరంకుశ పాలకులకు బానిసలుగా ఉండాలని ఏ సాధారణ వ్యక్తియు కోరుకొనడు.

2 అయినను, నీవును ఆలాగే ఇతరులును నిజమైన స్వాతంత్ర్యము నుండి ప్రయోజనముల ననుభవించగల లోకమును సహితము కోరుకొనవా? ప్రతివారి జీవనమునకు సంపూర్ణ నిశ్చయత ఉండులాగున స్వాతంత్ర్యమును పరిరక్షించు లోకమును నీవు కోరుకొనవా? మరియు సాధ్యమైనట్లయిన భయము, నేరము, ఆకలి, దారిద్ర్యము, కాలుష్యము, రోగము మరియు యుద్ధములేని లోకమును సహితము నీవు కోరుకొనవా? నిశ్చయముగా అటువంటి స్వాతంత్ర్యములు ఎంతగానో కోరదగినవి.

3. స్వాతంత్ర్యమును మనమెందుకు విలువైనదిగా ఎంచుదుము?

3 మానవులమైన మనము స్వాతంత్ర్యమును గూర్చి ఎందుకంత దృఢముగా భావింతుము? బైబిలు చెప్పునదేమనగా, “ప్రభువుయొక్క [యెహోవా NW] ఆత్మ యెక్కడనుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.” (2 కొరింథీయులు 3:17) కావున యెహోవా స్వాతంత్ర్యమునకు దేవుడైయున్నాడు. మరియు ఆయన మనలను తన ‘స్వరూపమందు మరియు పోలిక చొప్పున’ సృష్టించినందున, మనము స్వాతంత్ర్యమును గుణగ్రహించి దానినుండి ప్రయోజనము పొందులాగున ఆయన మనకు స్వేచ్ఛాచిత్తమును అనుగ్రహించాడు.—ఆదికాండము 1:26.

స్వాతంత్ర్యము దుర్వినియోగపరచబడెను

4, 5. చరిత్రయంతటిలో స్వాతంత్ర్యము ఎట్లు దుర్వినియోగ పరచబడెను?

4 చరిత్రయంతటిలో ఇతరులు స్వేచ్ఛాచిత్తమును దుర్వినియోగపరచి నందున లక్షలాదిమంది ప్రజలు బానిసలుగా చేయబడిరి, హింసించబడిరి, లేక చంపబడిరి. దాదాపు 3,500 సంవత్సరముల క్రితము, “ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవచేయించుకొనిరి. . . . కఠినసేవ చేయించి వారి ప్రాణములు విసిగించిరి” అని బైబిలు వివరించుచున్నది. (నిర్గమకాండము 1:13, 14) ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా తెల్పునదేమనగా సా.శ.పూ. నాల్గవ శతాబ్దములో ఏథెన్సు మరియు ఇతర గ్రీకు నగరములలో స్వేచ్ఛా ప్రజానీకములో ఒకరికి నలుగురు చొప్పున బానిసలే ఎక్కువగా ఉండిరని చెప్పుచున్నది. ఈ గ్రంథమూలమే ఇంకనూ ఇట్లనుచున్నది: “రోమాలో బానిసకు అసలు ఏ హక్కు ఉండేదికాదు. అతి చిన్న తప్పిదమునకు సహితము అతడు చంపబడేవాడు.” కాంప్టన్స్‌ ఎన్‌సైక్లోపీడియా వ్రాయునదేమనగా, “రోమాలో బానిసలైన శ్రామికులే దేశమునకు పునాదిగా ఉండేవారు. . . . బానిసలు తరచు సంకెళ్లతో పొలాల్లో పనిచేసేవారు. రాత్రులందు వారందరిని కలిపి బంధించి పెద్దపెద్ద చెరసాలల్లో వేసేవారు. ఇవి సగం భూమిలోకి ఉండేవి.” ఒకప్పుడు అనేకమంది బానిసలు స్వేచ్ఛగా ఉండినవారే గనుక, వారి నలిగిన జీవితాల దుఃఖమును ఊహించుము.

5 అనేక శతాబ్దములు, క్రీస్తుమత సామ్రాజ్యము కౄరమైన బానిసల వ్యాపారమందు పాల్గొనెను. ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇట్లు చెప్పుచున్నది: “1500 మరియు 1800 శతాబ్దముల మధ్య కాలములో, యూరోపియన్లు ఆఫ్రికానుండి ఒక కోటిమంది నల్లజాతి బానిసలను నౌకలద్వారా పశ్చిమార్థ గోళమునకు తీసికొనిపోయిరి.” ఈ 20వ శతాబ్దములో, నాజీ రాజకీయ బంధీ శిబిరాలలో ప్రభుత్వ విధానముగా లక్షలాదిమంది బంధీలు పనిచేయలేక అలానే మరణించునంత కఠినముగా పనిచేయించబడిరి లేక చంపబడిరి. అలా బలియైన వారిలో అనేకమంది యెహోవాసాక్షులును కలరు ఎందుకనగా వారు హత్యాధోరణిగల నాజీ పరిపాలనకు మద్దతునిచ్చుటకు నిరాకరించారు.

అబద్ధ మతమునకు దాసత్వము

6. ప్రాచీన కనానులో అబద్ధమతమెట్లు ప్రజలను బానిసలనుగా చేసెను?

6 అబద్ధమతమునకు హత్తుకొనియుండుట ఫలితముగా వచ్చు దాసత్వమూ కలదు. ఉదాహరణకు, ప్రాచీన కనానులో మోలెకుకు పిల్లలు బలియర్పింపబడేవారు. ఈ అబద్ధ దేవతయొక్క పెద్ద విగ్రహము లోపలిభాగంలో ఎర్రగా కాలుచున్న ఒక కొలిమియుండేదని చెప్పబడింది. బారుగా చాపబడియున్న ఆ విగ్రహపు చేతులమీదుగా క్రిందనున్న అగ్నిలోకి జారునట్లు సజీవులైన పిల్లలను విసిరేవారు. కొంతమంది ఇశ్రాయేలీయులు సహితము ఈ అబద్ధ ఆరాధనను అభ్యసించేవారు. వారు ‘ఆయన ఆజ్ఞాపింపని మరియు ఆయనకు తోచని ఆ హేయకృత్యమును అనగా వారు తమ కుమారులను కుమార్తెలను మోలెకు అగ్నిలో దహించిరి’ అని దేవుడు చెప్పుచున్నాడు. (యిర్మీయా 32:35) మోలెకు తన ఆరాధికులకు ఏ ప్రయోజనములు తెచ్చెను? ఆ కనాను జనాంగములు మరియు మోలెకు ఆరాధన ఈనాడు ఎక్కడ? వారందరు అంతరించిపోయారు. అది అబద్ధ ఆరాధన, ఆ ఆరాధన సత్యములపై కాక అబద్ధములపై ఆధారపడియుండెను.—యెషయా 60:12.

7. ఏ నీచాతినీచమైన అభ్యాసము ఎజ్‌టెక్‌ మతములో భాగమైయుండెను?

7 శతాబ్దముల పూర్వము మధ్య అమెరికాలో, ఎజ్‌టెక్‌ ప్రజలు అబద్ధ మతమునకు దాసులైరి. వారికి వ్యక్తిగత దేవుళ్లుండిరి, ప్రకృతి శక్తులను దేవతలుగా ఆరాధించుట జరిగేది, ప్రతిదిన జీవితములోని వివిధ కార్యములకు ప్రతిదానికి ఒక దేవుడుండెను, మొక్కలకు వాటి దేవుళ్లుండెను, చివరకు ఆత్మహత్యలకు సహితము ఒక దేవుడుండెను. ది ఎన్షెంట్‌ సన్‌ కింగ్‌డమ్స్‌ ఆఫ్‌ ది అమెరికాస్‌ అను పుస్తకము ఇలా వివరించుచున్నది: “ఇచ్చుటకు సాధ్యమైనన్ని మానవ గుండెలనిచ్చి, అదృశ్య శక్తులను తృప్తిపరచి, వాటిని శాంతపరచగల్గుటకు ఎజ్‌టెక్‌ ప్రజల మెక్సికో ప్రభుత్వము పూర్తిస్థాయిలో వ్యవస్థీకరించబడెను. రక్తము ఆ దేవతల పానీయమై యుండెను. దేవతలకు బలియర్పించుటకు తగిన చెరసాల బంధీలను సేకరించుటకు, అక్కడ ఎల్లప్పుడు అవిశ్రాంతముగా చిన్నచిన్న పోరాటములు జరుగుచుండేవి.” 1486లో ఒక పెద్ద సూచ్యగ్ర (Pyramid) ఆలయమును ప్రతిష్ఠించినప్పుడు, ‘రాతిబల్లపై బలి యర్పింపబడుటకు వేలాదిమంది బంధీలు వరుసలలో ఉంచబడిరి. వారి గుండెలు కోసి, సూర్యదేవుని శాంతపరచుటకు వాటిని సూర్యునివైపు కొద్దిసేపు ఎత్తిపట్టుకొనుట జరిగింది.’ ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇట్లనుచున్నది: “ఆరాధికులు కొన్నిసార్లు బలిచేయబడిన వ్యక్తి శరీరభాగములను భక్షించేవారు.” అయినను, ఆ క్రియలు ఎజ్‌టెక్‌ ప్రజల సామ్రాజ్యమునుగాని, వారి అబద్ధమతమును గాని కాపాడలేకపోయినవి.

8. ఎజ్‌టెక్‌ల మధ్య జరిగిన దానికంటె ఎంతో యెక్కువైన ఆధునిక సంహారమునుగూర్చి టూర్‌గైడ్‌ ఏమిచెప్పాడు?

8 సందర్శకులు ఒకసారి ఒక వస్తుప్రదర్శన శాలను సందర్శించుచుండగా అక్కడ ఎజ్‌టెక్‌ ప్రజల పూజార్లు ఒక యౌవనస్థుని గుండెను కోయుటను చూపించు ఒక చిత్రాన్ని ప్రదర్శనకు ఉంచారు. ఆ ప్రదర్శిత చిత్రాన్ని టూర్‌గైడ్‌ వివరించినప్పుడు, ఆ గుంపులో ఒకరు పెద్దగా నిట్టూర్చారు. అప్పుడు ఆ గైడు ఏమన్నాడంటే, “అన్య దేవతలకు యౌవనస్థులను బలియిచ్చే ఎజ్‌టెక్‌ ప్రజల అభ్యాసము మీకు కలతను కల్గించియుంటుంది. కానీ, ఈ 20వ శతాబ్దములో యుద్ధదేవతకు లక్షలాదిమంది యౌవనస్థులు బలిచేయబడ్డారు. అది ఏమైనా బాగున్నదా?” ఒకే మతానికి చెందిన ప్రజలు తరచు వ్యతిరేకులై పరస్పరము చంపుకొనుచున్నను అన్నిదేశాల మతనాయకులు యుద్ధంలో జయం సాధించాలని ప్రార్థిస్తారు మరియు సైన్యాలను ఆశీర్వదిస్తారనుట వాస్తవమే.—1 యోహాను 3:10-12; 4:8, 20, 21; 5:3.

9. చరిత్రలో మరిదేనికంటెనూ ఏ అభ్యాసము పసిపిల్లల ప్రాణములను తీసివేయుచున్నది?

9 మోలెకుకు, ఎజ్‌టెక్‌ ప్రజల దేవతలకు లేక యుద్ధమునకు పిల్లలను బలిచేయుటకంటె గర్భస్రావముల మూలముగా జన్మించని శిశువులను చంపుట బహువిస్తారముగా ఉన్నది. ప్రపంచవ్యాప్తముగా ఏటా దాదాపు 4 లేక 5 కోట్లమంది శిశువులు ఇలా సంహరించబడుచున్నారు. కేవలము గత మూడేండ్లలో గర్భస్రావము చేయబడిన వారి సంఖ్య ఈ శతాబ్దమందలి యుద్ధములన్నింటిలో చంపబడిన 10 కోట్లమందికంటె ఎక్కువగా ఉన్నది. 12 సంవత్సరముల నాజీ పరిపాలనలో హతమార్చబడిన ప్రజలందరికంటె ప్రతిసంవత్సరము, ఎన్నోరెట్లమంది శిశువులు గర్భస్రావములద్వారా సంహరించబడుచున్నారు. మోలెకు లేక ఎజ్‌టెక్‌ దేవతలకు బలియివ్వబడిన వారికంటె వేలరెట్ల శిశువులు ఇటీవలి శతాబ్దములలో గర్భస్రావముద్వారా సంహరింపబడిరి. అయినను గర్భస్రావము చేయించుకొనిన, లేక వాటిని జరిగించు అనేకులు (అందరూ కాకపోయిననూ) తమకు ఒక మతమున్నదని చెప్పుకొనువారే.

10. మరియే విధముగా ప్రజలు అబద్ధమతమునకు దాసులగుచున్నారు?

10 అబద్ధమతము వేరేవిధములుగా కూడా ప్రజలను బానిసలనుగా చేయుచున్నది. ఉదాహరణకు, చనిపోయిన వ్యక్తులు ఆత్మీయ లోకములో బ్రతికే ఉన్నారని అనేకమంది ప్రజలు నమ్ముదురు. అటువంటి అబద్ధ నమ్మకమువలన కలుగు ఒక ఫలితమేమనగా, భయము మరియు పూర్వికులనుండి అనుకున్న ప్రయోజనములు పొందుటకు వారిని పూజించుటయై యున్నది. ఇది ప్రజలను మాంత్రికులకు, కర్ణపిశాచి గలవారికి మరియు చనిపోయిన వారిని శాంతపరచుటకు బ్రతికియున్నవారికి సహాయము చేయగలరని నమ్మి వెళ్లు మతనాయకులకు బానిసలుగా చేయుచున్నది. అటువంటి బానిసత్వమునుండి బయటపడు మార్గమేదైనా కలదాయను ప్రశ్నను అడుగుట సరియే.—ద్వితీయోపదేశకాండము 18:10-12; ప్రసంగి 9:5, 10. (w92 4/1)

[9, 10వ పేజీలోని చిత్రాలు]

ఇతరులను బానిసలనుగా చేయుటకు చరిత్రయంతటిలో కొందరు తమ స్వేచ్ఛాచిత్తమును దుర్వినియోగపరచిరి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి